BrahMos
-
డైరెక్ట్ హిట్ : భారత వాయుసేన సంతోషం
న్యూఢిల్లీ: రష్యా సహకారంతో భారత్ అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి అన్ని వెర్షన్లు ఆశించిన రీతిలో సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు.. భారత వాయుసేన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ మిస్సైల్ ను పరీక్షించింది. బంగాళాఖాతం సముద్రంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఈ క్షిపణి కచ్చితత్వంతో తాకిందని భారత వాయుసేన వెల్లడించింది. ‘‘డైరెక్ట్ హిట్’’.. అంటూ సంతోషం వ్యక్తం చేసింది. తాజా పరీక్షలో ఉపయోగించిన బ్రహ్మోస్ క్షిపణి రేంజిని మరింత వృద్ధి చేశారు. రేంజ్ పొడిగించిన తర్వాత బ్రహ్మోస్ ను పరీక్షించడం ఇదే తొలిసారి. గతంలో బ్రహ్మోస్ క్షిపణి రేంజి 290 కిలోమీటర్లు కాగా, దాన్ని 350 కిమీకి పెంచారు. తాజా ప్రయోగం ద్వారా సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి భూతల, సముద్రతల లక్ష్యాలను గురితప్పకుండా ఛేదించగలిగే సామర్ధ్యాన్ని భారత వాయుసేన సముపార్జించుకున్నట్లయ్యింది. కిందటి నెలలో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ నావికాదళ వెర్షన్ ను విజయవంతంగా పరీక్షించడం తెలిసిందే. The Extended Range version of Brahmos air launched missile was successfully fired from a Su-30 MkI aircraft today. The successful firing was the first ever for the air launched version from a Su-30 MkI & the missile met all the laid down parameters while hitting the target. pic.twitter.com/WZk8zZkWKX — Indian Air Force (@IAF_MCC) May 12, 2022 -
బ్రహ్మోస్ మరింత శక్తివంతం
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ కొత్త వెర్షన్‌ను భారత్ అభివృద్ధి చేస్తోంది. వాయుమార్గాన ప్రయోగించే ఈ కొత్త వెర్షన్ బ్రహ్మోస్ 800 కిలోమీటర్లు ప్రయాణం చేసి లక్ష్యాన్ని ఛేదించగలదని అంచనా. ఇప్పటివరకు దీని పరిధి దాదాపు 300 కిలోమీటర్లుంది. బ్రహ్మోస్ రేంజ్ ఎప్పటికప్పుడు వృద్ధి చేస్తూ వస్తున్నారని, సాఫ్ట్‌వేర్‌లో చిన్న మార్పుతో రేంజ్‌ను 500 కిలోమీటర్లు పెంచవచ్చని, తాజాగా దీని టార్గెట్ రేంజ్‌ను 800కిలోమీటర్లకు చేరనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీన్ని సు– 30 ఎంకేఐ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి ప్రయోగిస్తారు. ప్రస్తుతం భారత వాయుసేన వద్ద బ్రహ్మోస్ మిస్సైల్ అమర్చిన సు–30 విమానాలు 40 ఉన్నాయి. -
ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ క్షిపణులు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల ఎగుమతికి సంబంధించి తొలి ఆర్డర్ ఫిలిప్పీన్స్ నుంచి వచ్చింది. దాదాపు రూ. 2,780 కోట్ల కాంట్రాక్ట్‌ను బ్రహ్మోస్ ఏరోస్పేస్‌కు ఫిలిప్పీన్స్ ఇచ్చిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. క్షిపణులతోపాటు మూడు బ్యాటరీలు, క్షిపణుల నిల్వ, వాటిని ఎలా ప్రయోగించాలనే అంశాలపై ఫిలిప్పీన్స్ సైనిక సిబ్బందికి శిక్షణ, తదితర వివరాలను ఈ ఒప్పందంలో పొందుపరిచారు. ఒప్పందంలో భాగంగా యాంటీ–షిప్ వేరియంట్ క్షిపణులను సరఫరాచేస్తారు. -
సరిహద్దుల్లో క్షిపణుల మోహరింపు
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, చైనాలు ఆధునిక ఆయుధ వ్యవస్థలను సిద్ధం చేస్తున్నాయి. 2 వేల కి.మీల వరకు లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను, భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణులను జిన్జియాంగ్, టిబెట్ ప్రాంతాల్లో చైనా మోహరించింది. ప్రతిగా బ్రహ్మోస్, నిర్భయ్, భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగల ఆకాశ్ క్షిపణులను భారత్ సిద్ధం చేసింది. బ్రహ్మోస్‌ది 500 కి.మీల రేంజ్ కాగా, నిర్భయ్‌ది 800 కి.మీ.ల రేంజ్. 40 కి.మీ.ల దూరంలోని శత్రు లక్ష్యాలను ఆకాశ్ ఛేదించగలదు. చైనా తన ఆయుధ వ్యవస్థలను ఆక్రమిత అక్సాయ్ చిన్ ప్రాంతంలోనే కాకుండా, వాస్తవాధీన రేఖ వెంట కస్ఘర్, హోటన్, లాసా, నింగ్చి.. తదితర ప్రాంతాల్లోనూ మోహరించింది. ఆకాశం నుంచి ఆకాశంలో ఉన్న లక్ష్యాలను, ఆకాశం నుంచి భూమిపైన ఉన్న లక్ష్యాలను ఛేదించగల అత్యంత శక్తివంత బ్రహ్మోస్ క్షిపణి 300 కి.మీ.ల వార్‌హెడ్‌ను మోసుకుని వెళ్లగలదు. టిబెట్, జిన్‌జియాంగ్‌ల్లోని చైనా వైమానిక స్థావరాలను బ్రహ్మోస్ క్షిపణి లక్ష్యంగా చేసుకోగలదు. లద్దాఖ్ ప్రాంతంలో ఈ క్షిపణులను అవసరమైనంత సంఖ్యలో భారత్ సిద్ధంగా ఉంచింది. ఎస్‌యూ30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి దీన్ని ప్రయోగించవచ్చు. హిందూ మహా సముద్రంలోని కార్ నికోబార్ ద్వీపంలో ఉన్న భారత వైమానిక కేంద్రం నుంచి కూడా దీన్ని ప్రయోగించే వీలుంది. కార్‌నికోబార్‌లోని వైమానిక కేంద్రం నుంచి బ్రహ్మోస్, నిర్భయ్ క్షిపణులను ప్రయోగించి మలక్కా జలసంధి నుంచి లేదా సుందా జలసంధి నుంచి వచ్చే చైనా యుద్ధ నౌకలను సమర్ధంగా ఎదుర్కోవచ్చు. ప్రస్తుతం భారత్ వద్ద నిర్భయ్ క్షిపణుల సంఖ్య పరిమితంగా ఉంది. నిర్భయ్ క్షిపణి భూమిపై నుంచి భూమిపై ఉన్న లక్ష్యాలను మాత్రమే ఛేదించగలదు. లద్దాఖ్ ప్రాంతంలో ఆకాశ్ క్షిపణులను కూడా అవసరమైన సంఖ్యలో భారత్ మోహరించింది. భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను చేధించే ఈ క్షిపణి వాస్తవాధీన రేఖ దాటి వచ్చే చైనా విమానాలను లక్ష్యంగా చేసుకోగలదు. ఆకాశ్ క్షిపణిలోని రాడార్ ఏకకాలంలో 64 లక్ష్యాలను గుర్తించగలదు. అందులో 12 లక్ష్యాలపై దాడి చేయగలదు. ఆకాశంలోనే శత్రుదేశ యుద్ధవిమానాలు, క్రూయిజ్ మిస్సైల్స్, బాలిస్టిక్ మిస్సైల్స్‌ను కూల్చివేయగలదు. ఈ మధ్యకాలంలో అక్సాయ్‌చిన్ ప్రాంతంలో చైనా వైమానిక దళ విమానాల కార్యకలాపాలు కొంత తగ్గాయి కానీ, కారాకోరం పాస్ దగ్గరలోని దౌలత్‌బేగ్ ఓల్డీ ప్రాంతంలో పెరిగాయి. రూ. 2,290 కోట్లతో రక్షణ కొనుగోళ్లు డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్‌ను ఆవిష్కరించిన రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ దళాల కోసం రూ. 2,290 కోట్ల విలువైన ఆయుధాలు, ఇతర సాయుధ వ్యవస్థల కొనుగోలు ప్రతిపాదనకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో అమెరికా నుంచి కొనుగోలు చేసే 72 వేల ఎస్ఐజీ సావర్ తుపాకులు ఉన్నాయి. ఆర్మీ కోసం వీటిని రూ. 780 కోట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రక్షణ శాఖకు చెందిన అత్యున్నత నిర్ణయ మండలి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సోమవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అధ్యక్షతన సమావేశమై ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ రూ. 2,290 కోట్లలో రూ. 970 కోట్లతో నౌకాదళం, వైమానిక దళం కోసం ‘స్మార్ట్ ఎయిర్‌ఫీల్డ్ వెపన్(ఎస్ఏఏడబ్ల్యూ)’ వ్యవస్థలను కొనుగోలు చేయనున్నారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ క్షేత్రస్థాయి దళాల మధ్య అడ్డంకులు లేని సమాచార పంపిణీ కోసం రూ. 540 కోట్లతో హెచ్ఎఫ్ రేడియో సెట్స్‌ను సమకూర్చాలని నిర్ణయించారు. భారత్‌ను అంతర్జాతీయ మిలటరీ వ్యవస్థల తయారీ కేంద్రంగా మార్చడం, సాయుధ సామగ్రిని సమకూర్చుకోవడంలో అనవసర జాప్యాలను నివారించడం, అత్యవసర కొనుగోలు నిర్ణయాలను త్రివిధ దళాలే సులభమైన విధానం ద్వారా తీసుకునే అవకాశం కల్పించడం.. లక్ష్యాలుగా ‘డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్(డీఏపీ)’ని రాజ్‌నాథ్ ఆవిష్కరించారు. ఈ కొత్త విధానం ప్రకారం, భారత్‌లో ఉత్పత్తి చేసే సంస్థలకు డిఫెన్స్ కొనుగోళ్లలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆధునిక సమాచార సాంకేతికతల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలైన డీఆర్డీఓ, డీపీఎస్‌యూలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని డీఏపీని రూపొందించామని రాజ్‌నాథ్ చెప్పారు. -
బ్రహ్మోస్ క్షిపణికి చైనా సవాల్..!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్, రష్యాలు ప్రతిష్టాత్మకంగా రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణిని ఎదుర్కొనే సామర్థ్యం చైనా తయారు చేసిన హెచ్డీ-1 క్రూయిజ్ క్షిపణికి ఉందని ఆ దేశానికి చెందిన మైనింగ్ కంపెనీ ‘గ్వాంగ్డాంగ్ హోంగ్డా బ్లాస్టింగ్’ వెల్లడించింది. ఎయిర్ షో చైనా-2018 కార్యక్రమంలో సదరు కంపెనీ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం.. అక్టోబర్‌లో టెస్టింగ్ పూర్తి చేసుకున్న హెచ్డీ-1 క్షిపణి 2.2 నుంచి 3.5 మాక్ నెంబర్ వేగంతో దూసుకెళ్లి 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. 2,200 కిలోల బరువుతో.. సముద్ర మట్టానికి అత్యల్పంగా 5-10 మీటర్ల ఎత్తులో, అత్యధికంగా 15 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించగలుగుతుంది. అయిదు నిముషాల్లోనే సిద్ధం.. అయిదు నిముషాల్లో హెచ్డీ-1ను సిద్ధం చేయొచ్చని గ్లోబల్ టైమ్స్ ప్రచురించింది. ఒకే ఒక బటన్‌ను నొక్కడం వల్ల దీనిని ఆపరేట్ చేయవచ్చని తెలిపింది. భూ ఉపరితలం, సముద్ర తలం నుంచి దీనిని ప్రయోగించవచ్చు. భూమిపై, సముద్రంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. ఒక లాంచ్ వెహికల్‌పై 6 హెచ్డీ-1 మిస్సైల్స్ లోడ్ చేయవచ్చు. ఒక చోటు నుంచి మరో చోటుకు వీటిని తరలించడం చాలా సులభం. ఇక.. హెచ్డీ-1 క్షిపణికి వేరియంట్‌గా హెచ్డీ-1ఏ ను కూడా చైనా ఆవిష్కరించింది. హెచ్డీ-1ఏను ఫైటర్ జెట్లు, బాంబర్ల ద్వారా గాల్లో నుంచి కూడా లాంచ్ చేయొచ్చు. మన బ్రహ్మోస్.. బ్రహ్మోస్ మధ్య స్థాయి సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ఇది గాలి కన్నా దాదాపు మూడు రెట్ల వేగంతో ప్రయాణించి లక్ష్యాల్ని ఛేదిస్తుంది. గాలి, నీరు, భూ ఉపరితలం నుంచి ప్రయోగించచ్చు. మాక్ నెంబర్ 2.8 నుంచి 3 వేగంతో ప్రయాణించి 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. 400 కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం బ్రహ్మోస్ ఛేదించగలుగుతుంది. ఇటీవల దీనిలో వేగాన్ని పెంచారు. మాక్ నెంబర్ 5 వరకు బ్రహ్మోస్ ప్రయాణించగలదు. దాదాపు 2,500 నుంచి 3000 కిలోల బరువు మోయగలవు. వీటికి 8.4 మీటర్ల పొడవుతో 200 నుంచి 300 కిలోల వార్‌హెడ్ ఉంటుంది. సముద్ర లక్ష్యాల్ని ఛేదించి యుద్ధ నౌకల్ని చీల్చి చెండాడే క్షిపణుల్లో మనబ్రహ్మోసే ఇప్పటివరకు శక్తిమంతమైనది కావడం విశేషం. 2006లో బ్రహ్మోస్ భారత రక్షణ రంగంలోకి అడుగు పెట్టింది. భారత ఆర్మీ, వైమానిక రంగాలకు సేవలందిస్తోంది. ఓ విశ్లేషకుడి అభిప్రాయం.. బీజింగ్‌కు చెందిన మిలటరీ విశ్లేషకుడు వీ డాంగ్జూ.. హెచ్డీ-1పై తన అభిప్రాయాలు వెల్లడించారు. హెచ్డీ-1 క్షిపణి బ్రహ్మోస్ వెర్షన్లను అధిగమించిందని అన్నారు. ఇది యుద్ధ రంగంలోకి దిగితే శత్రువుల యుద్ధ విమానాలు నేలకూలక తప్పదని అన్నారు. -
మహారాష్ట్రలో ఐఎస్ఐ ఏజెంట్ అరెస్ట్..!
-
బ్రహ్మోస్ రహస్యాలు పాక్‌కు లీక్ : డీఆర్డీఓ ఉద్యోగి అరెస్ట్
ముంబై : బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేశాడనే అనుమానంతో డీఆర్డీఓలో పనిచేసే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఆర్డీఓ ఉద్యోగి నుంచి అనుమానాస్పద మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు అతడిని ప్రశ్నిస్తున్నారు. స్ధానిక పోలీసుల సహకారంతో యూపీ ఏటీఎస్, మిలిటరీ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో నాగ్‌పూర్‌లో అదుపులోకి తీసకున్న వ్యక్తిని నిషాంత్ అగర్వాల్‌గా గుర్తించారు. నిషాంత్ అగర్వాల్ గత నాలుగేళ్లుగా నాగపూర్‌కు సమీపంలోని బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. పాక్ సంస్ధలతో బ్రహ్మోస్ క్షిపణి గురించిన నిర్ధిష్ట సమాచారం, సాంకేతిక డేటాను అగర్వాల్ పంచుకున్నట్టు అనుమానిస్తున్నారు. బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ మిసైల్‌గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. -
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
-
బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం
-
పాకిస్తాన్ చేతికి అపూర్వ ఆయుధం..!
సాక్షి, న్యూఢిల్లీ : అపూర్వ ఆయుధం పాకిస్తాన్ చేతికి అందింది. అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన మిస్సైల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను చైనా పాకిస్తాన్‌కు అమ్మినట్లు రిపోర్టులు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి దక్షిణ చైనా మార్నింగ్ పోస్టు ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే, మిస్సైల్ ట్రాకింగ్ సిస్టమ్ కోసం పాకిస్తాన్ చైనాకు ఎంత చెల్లించిందన్న దానిపై స్పష్టత లేదు. పాకిస్తాన్ క్షిపణి అభివృద్ధికి చైనా అత్యాధునిక సాంకేతికతను ఇవ్వనున్నట్లు చైనా పత్రిక తన కథనంలో రాసుకొచ్చింది. ఎంచుకున్న లక్ష్యాన్ని కచ్చితంగా తునాతునకలు చేసే సాంకేతికతను బ్రహ్మోస్ క్షిపణి అందుకుందని భారత రక్షణ శాఖ చేసిన ప్రకటన అనంతరం పాక్ - చైనాల మధ్య ఈ డీల్ కుదరడం గమనార్హం. బ్రహ్మోస్ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన క్రూయిజ్ మిస్సైల్. దీన్ని రష్యా-భారత్‌లు ఉమ్మడిగా అభివృద్ధి చేశాయి. భూమి, వాయు, జల మార్గాల్లో ఎక్కడి నుంచైనా అతి సులువుగా బ్రహ్మోస్‌ను ప్రయోగించొచ్చు. కాగా, పాకిస్తాన్‌కు ఇచ్చిన సాంకేతికత అసాధారణమైనది చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్(సీఎఎస్) పేర్కొంది. కాగా, అత్యాధునిక ఆయుధాలను చైనా నుంచి పొందడం పాకిస్తాన్‌కు కొత్తేమీ కాదు. గతంలో యుద్ధనౌకలు, యుద్ధవిమానాలు, షార్ట్ రేంజ్ మిస్సైల్స్‌ను చైనా నుంచి పాకిస్తాన్ అందుకుంది. -
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
పోఖ్రాన్: రాజస్థాన్‌లోని పోఖ్రాన్ క్షిపణి కేంద్రం నుంచి బ్రహ్మోస్ సూపర్‌సానిక్ క్రూయిజ్ క్షిపణిని గురువారం విజయవంతంగా పరీక్షించారు. సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి చివరిసారిగా 2017 నవంబర్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానం సుఖోయి -30 ఎంకేఐ నుంచి పరీక్షించారు. గత సంవత్సరం దుబాయ్ ఎయిర్ షోలో కూడా బ్రహ్మోస్ ప్రదర్శన జరిగింది. పలు దేశాల సైనికాధికారులు కూడా వీటిని కొనేందుకు చాలా ఆసక్తి చూయించారు. బ్రహ్మోస్ గురించి కొన్ని వాస్తవాలు - బ్రహ్మోస్ ఒక మాధ్యమ శ్రేణి రామ్‌జెట్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. - భూమి, గాలి మరియు సముద్రం నుండి దీనిని ప్రయోగించవచ్చు. - ఇది భారతదేశ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ), రష్యన్ ఫెడరేషన్ ఎన్పీఓ మాషినోస్రోయేనియాల ఉమ్మడి వెంచర్. - బ్రహ్మోస్ అనే పదం భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది(Brahmaputra) మొదటి నాలుగు అక్షరాలు, రష్యాలోని మాస్కోవా నది(Moskva) పేరులోని మొదటి మూడు అక్షరాలన నుంచి వచ్చింది. - గతంలో బ్రహ్మోస్ 2.8 నుంచి 3.0 మాక్‌ల వేగంతో ప్రయాణించేది. ఇప్పుడు దీని వేగం 5.0 మాక్‌లకు అప్‌గ్రేడ్ చేశారు. (మాక్ = 1234.8 కిలోమీటర్/అవర్)ఇది మాక్ - ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణి. - ఇది 2006 నుంచి సేవలందింస్తోంది. -
వహ్వా...బ్రహ్మోస్!
దేశాన్ని శత్రు దుర్భేద్యంగా మలిచే కృషిలో మేలిమలుపుగా భావించే కీలక ఘట్టం బుధవారం ఆవిష్కృతమైంది. మన వాయుసేనకు అందించబోయే సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను శాస్త్రవేత్తలు తొలిసారి విజయవంతంగా ప్రయో గించారు. సుఖోయ్ యుద్ధ విమానంతో అనుసంధానించిన ఈ క్షిపణి ప్రయోగించిందే తడవుగా ధ్వనిని మించి మూడు రెట్ల వేగంతో దూసుకుపోయి బంగా ళాఖాతంలోని లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చేసిన కృషిని స్మరించుకోవాలి. శాస్త్రవేత్తగా పనిచేస్తున్నప్పుడు మన దేశ రక్షణకు పటిష్టమైన క్షిపణి వ్యవస్థ అవసరమని పాలకులను ఒప్పించింది ఆయనే. 1998లో రష్యాతో బ్రహ్మోస్ క్షిపణులపై ఒడంబడిక కుదరడంలో ఆయన పోషించిన పాత్ర మరువలేనిది. మన బ్రహ్మపుత్ర, రష్యాలోని మోస్క్వా నదుల పేర్లు అనుసంధానించి ఈ ప్రాజెక్టుకు ‘బ్రహ్మోస్’ అని పేరుపెట్టారు. ఇప్పటికే బ్రహ్మోస్ మన సైనిక, నావికా దళాల అస్త్ర తూణీరంలో చేరింది. వాస్తవానికి వాయుసేనకు సైతం 2012కల్లా దీన్ని అందించాలని మొదట్లో అనుకున్నారు. అయితే అందులోని సాధకబాధకలు తక్కువేమీ కాదు. క్షిపణిని మోసుకెళ్లడానికి అనువుగా సుఖోయ్ యుద్ధ విమానాలను తీర్చిదిద్దడం ఒక సవాలు. అదే సమ యంలో అటు క్షిపణి బరువు కూడా తగ్గాలి. మన శాస్త్రవేత్తలు ఈ రెండూ సాధించగలిగారు. సుఖోయ్ యుద్ధ విమానానికి అవసరమైన మార్పుల్ని వాటిని సరఫరా చేసిన రష్యా రక్షణ రంగ సంస్థ సాంకేతిక తోడ్పాటు అవసరం లేకుండానే నాసిక్‌లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) శాస్త్రవేత్తలు సవ రించారు. అలాగే సైనిక, నావికాదళాల అమ్ములపొదిలో ఉన్న బ్రహ్మోస్ క్షిపణుల బరువు 3,000 కిలోలుంటే, సుఖోయ్‌కి అమర్చింది 2,500 కిలోలు మించలేదు. బ్రహ్మోస్ క్షిపణిని సుఖోయ్ యుద్ధ విమానం అవలీలగా మోసుకెళ్లడం, అది లక్ష్యాన్ని ఛేదించడం వెనక ఇంతటి విస్తృతమైన కృషి ఉంది. ఇది ఇంతటితో అయిపోలేదు. ఒక్క సుఖోయ్ మాత్రమే కాదు... వాయుసేన వద్ద ఉన్న మిగ్–29 యుద్ధ విమానాలకూ, నావికాదళం వినియోగించే మిగ్–29కె యుద్ధ విమానా లకూ, భవిష్యత్తులో మనకు సమకూరబోయే రాఫెల్ జెట్ విమానాలకు సైతం బ్రహ్మోస్ క్షిపణులు అమర్చడానికి మన శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. అంతే కాదు... ప్రస్తుత బ్రహ్మోస్ లక్షిత దూరం 290 కిలోమీటర్లనూ 450 కిలోమీటర్లకు పెంచేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. అసలు మూడు బ్రహ్మోస్ క్షిపణులు మోసుకెళ్లగలిగే రీతిలో సుఖోయ్ యుద్ధ విమానాలను రూపొందించాలన్నది శాస్త్రవేత్తల ఆలోచన. సుఖోయ్ రెక్కలవద్ద చెరొకటి, మధ్యలో ఒకటి ఈ క్షిపణులు అమర్చవచ్చునని, అదే జరిగితే యుద్ధ విమానం ఒకసారి గాల్లోకి లేచాక మూడు లక్ష్యాలను దెబ్బతీసే సామర్ధ్యాన్ని సంత రించుకుంటుందని భావించారు. అయితే వివిధ అధ్యయనాల తర్వాత ఆ స్థాయి మార్పులు సాంకేతికంగా క్షేమకరం కాదని, అటు ఆర్ధికంగా కూడా పెనుభార మవుతుందని తేల్చారు. అందుకే ఆ యోచనను విరమించుకుని ఒకసారి ఒక క్షిపణిని తీసుకెళ్లేలా రూపకల్పన చేశారు. నిరుడు సుఖోయ్‌కు బ్రహ్మోస్ క్షిపణిని అమర్చి తొలిసారి వినువీధికి పంపారు. ఇప్పుడు దాన్ని ప్రయోగించి చూశారు. అటు సుఖోయ్ యుద్ధ విమానమూ, ఇటు బ్రహ్మోస్ క్షిపణి సామాన్యమైనవి కాదు. శత్రువు తేరుకుని స్పందించేలోపునే దాడి చేసి వెనక్కు రాగల సామర్ధ్యం సుఖోయ్‌ల సొంతం. క్షిపణుల్ని అల్లంత దూరాన ఉండగానే పసిగట్టి వాటిపై ఎదురుదాడి చేయగల నౌకలు చాలా దేశాలకున్నాయి. కానీ బ్రహ్మోస్ క్షిపణి ముందు వాటి ఆటలు సాగవు. అవి దాడికి దిగేలోపే ఆ నౌకలను బ్రహ్మోస్ భగ్గున మండించి మసి చేస్తుంది. లోతైన బంకర్లలో దాగిన విధ్వంసక ఆయుధ సామగ్రి, అణ్వాయుధాలు, జీవ ఆయుధాల గిడ్డంగులను సైతం కనిపెట్టి ధ్వంసం చేయడం బ్రహ్మోస్ క్షిపణి ప్రత్యేకత. ప్రపంచంలోని ఏ యుద్ధ నౌకలోనూ బ్రహ్మోస్ వేగాన్ని అధిగమించగల క్షిపణులు లేవు. అమెరికా తోమహక్, హర్పూన్ క్షిపణుల కంటే కూడా బ్రహ్మోస్ మేలైనది. ఎంతటి సంక్లిష్ట మార్గంలోనైనా వెళ్లగలగడం, పరిసరాల్లో ఎలాంటి విధ్వంసం సృష్టించకుండా కేవలం నిర్దేశించిన లక్ష్యాన్ని మాత్రమే దెబ్బతీయడం బ్రహ్మోస్ విశిష్టత. బ్రహ్మోస్ క్షిపణì కేవలం స్వీయ రక్షణకు మాత్రమే కాదు.... దాన్ని వేరే దేశాలకు విక్రయించడం కూడా భారత్–రష్యాల మధ్య కుదిరిన ఒడంబడికలోని కీలకాంశం. ఆ క్షిపణుల రూపకల్పన, అభివృద్ధి, ఉత్పత్తి, మార్కెటింగ్ చేయాలన్నది ఆ ఒడంబడిక సారాంశం. బ్రహ్మోస్ క్షిపణులను దక్షిణాఫ్రికా, వియత్నాం, యూఏఈలకు విక్రయించడంపై ఇప్పటికే అంగీకారం కుదిరింది. వాణిజ్యపరంగా కూడా ఇది లాభసాటి కావడం శుభ పరిణామం. 1990 నాటి గల్ఫ్ యుద్ధం సమ యంలో క్రూయిజ్ క్షిపణుల అవసరం అందరికీ తెలిసివచ్చింది. ఈ క్షిపణుల కోసం ఎవరిపైనో ఆధారపడే పరిస్థితి ఉండరాదని డాక్టర్ అబ్దుల్ కలామ్ మొదట్నించీ పట్టుబట్టారు. అందుకే సొంతంగా అభివృద్ధి చేసుకోవడానికి, ఉత్పత్తి చేసు కోవడానికి అనువుగా రష్యాతో కలిసి సంయుక్త రంగంలో బ్రహ్మోస్ ప్రాజెక్టును ప్రారంభించారు. రక్షణ రంగంలో పటిష్టంగా ఉన్నప్పుడే శత్రు దేశాలు దాడికి జంకుతాయి. నిజానికి ఆ విషయంలో చాలా దేశాలకన్నా మన దేశం ఇంకా వెన కబడే ఉంది. రక్షణ కొనుగోళ్లకు సంబంధించి ప్రయత్నాలు సాగించినప్పుడల్లా కుంభకోణాల కథనాలు గుప్పుమనడం మన దేశంలో రివాజుగా మారింది. బోఫోర్స్ శతఘ్నుల కుంభకోణం, బరాక్ క్షిపణుల స్కాం మొదలుకొని అన్నిటి విషయంలోనూ ఇదే వరస. అందుకే రక్షణ రంగంలో స్వావలంబన సాధించి సాధ్యమైనంతవరకూ దిగుమతులపై ఆధారపడకుండా చూసుకోగలగాలి. అలా చూస్తే మన బ్రహ్మోస్ విజయవంతమైన ప్రాజెక్టు . ఇది మరిన్ని రక్షణ రంగ ప్రాజె క్టులకు స్ఫూర్తిగా నిలుస్తుందని, మన దేశాన్ని ఆ రంగంలో అగ్రగామిగా నిలుపు తుందని ఆశించాలి. -
దక్షిణ చైనా సముద్రంలో భారతీయ మిస్సైల్
న్యూఢిల్లీ: దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదే అంటున్న చైనాకు భారత్ షాకిచ్చింది. దక్షిణ చైనా సముద్రంపై భారతీయ క్షిపణులు చైనాకు సవాలుగా మారనున్నాయి. వాస్తవానికి దక్షిణ చైనా సముద్రంపై బ్రూనై, మలేసియా, ఇండోనేసియా, ఫిలిప్పైన్స్, వియత్నాంలకు కూడా అధికారాలు ఉన్నాయి. అయితే చైనా మిగిలిన దేశాలను బెదిరిస్తూ సముద్రం మొత్తం తమ కిందకే వస్తుందని వాదిస్తోంది. దక్షిణ చైనా సముద్ర తీరం కలిగిన వియత్నాంతో భారత్‌కు ఎప్పటినుంచో స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసేలా వియత్నాంకు ఓడలపై నుంచి ప్రయోగించే అత్యధిక శక్తిమంతమైన మిస్సైల్ బ్రహ్మోస్‌ను అందించింది. కొన్నేళ్లుగా భారత్-వియత్నాంల మధ్య ఈ మిస్సైల్ అమ్మకానికి చర్చలు జరుగుతూ వచ్చాయి. చైనా భారత్‌పై కవ్వింపు చర్యలకు దిగుతుండటంతో ప్రభుత్వం ఈ మిస్సైల్స్‌ను వియత్నాంకు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత నేవీ వద్ద ఉన్న అత్యంత శక్తిమంతమైన మిస్సైల్ బ్రహ్మోసే. ధ్వని వేగం కంటే రెండున్నర రెట్లు అధిక వేగంతో ప్రయాణించగల సామర్ధ్యం దీని సొంత. దీన్ని ఓడల నుంచి సులువుగా ప్రయోగించొచ్చు. ప్రపంచ దేశాల వద్ద ఉన్న ఈ తరహా మిస్సైల్స్‌లో బ్రహ్మోసే అత్యాధునికం. భారత్ నుంచి తొలి విడతగా అందాల్సిన బ్రహ్మోస్ మిస్సైల్స్ తమ వద్దకు చేరుకున్నట్లు వియత్నాం అధికారి ఒకరు తెలిపారు. అయితే, బ్రహ్మోస్ క్షిపణుల అమ్మకంపై భారత్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. -
చైనాను కలవర పెడుతున్న బ్రహ్మోస్
-
రాజన్నకు కల్యాణశోభ
వేములవాడ అర్బన్ : శ్రీరాజరాజేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యూరుు. ఉదయం 8.15కు ఈవో దూస రాజేశ్వర్, ఏఈవోలు గౌరినాథ్, ఉమారాణి ఉత్సవాలను ప్రారంభించారు. అర్చకులకు దేవస్థానం పక్షాన వర్ని- దీక్షా వస్త్రాలు అందించారు. శివభగత్పుణ్యాహవచనము, పంచగవ్య మిశ్రణ ము, దీక్షాధారణము, రుత్విక్ వరణము, మంటప ప్రతిష్ఠ, నవగ్రహ ప్రతిష్ఠ, గౌరీ షోడశ మాతృకా ప్రతిష్ఠ, అంకురార్పణము, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము తదితర కార్యక్రమాలు నిర్వహిం చారు. స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్యశర్మ సారథ్యంలో అర్చక బృందం కల్యాణ మండపంలో భేరీ పూజ, దేవతాహ్వానము పూజలు చేపట్టారు. నేడు ఆదిదేవుల కల్యాణం రాజన్న ఆలయంలో ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే శివకల్యాణోత్సవం ఆది వారం జరగనుంది. ఉదయం 10.20కు అభిజిత్ లగ్న ముహూర్తమున పార్వతీరాజరాజేశ్వర స్వామి వారల కల్యాణం ఘనంగా నిర్వహిం చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యూరుు. సాయంత్రం 4 గంటలకు శివపురాణ ప్రవచనము, 5 గంటలకు ప్రధాన హోమము సప్తపది, లాజాహోమము, ఔపాసనము, బలిహరణము అనంతరం రాత్రి 8 గంటల కు పెద్ద సేవపై ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. శివకల్యాణోత్సవాన్ని తిలకించేందుకు ఇప్పటికే 50 వేలకు పైగా భక్తులు చేరుకున్నారు. నగరపంచాయతీ పక్షాన పట్టువస్త్రాలు రాజన్న పెళ్లికి స్థానిక నగరపంచాయతీ పక్షాన పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు చైర్పర్సన్ నామాల ఉమ-లక్ష్మీరాజం, వైస్‌చైర్మన్ ప్రతాప రామకృష్ణ, కమిషనర్ శ్రీహరి తెలిపారు. ఉదయం 9 గంటలకు కార్యాలయం నుంచి ఊరేగింపుగా రాజన్న ఆలయానికి చేరుకుని స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తామన్నారు. రాజన్న సేవలో ఉన్నత విద్యామండలి చైర్మన్ వేములవాడ అర్బన్ : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి పీఆర్వో విభాగం సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్న పాపిరెడ్డి కుటుంబసభ్యులు రాజన్నకు కోడె మొక్కు చెల్లించుకున్నారు. ఈవో దూస రాజేశ్వర్, ఏఈవో గౌరినాథ్, పీఆర్వో తిరుపతిరావు, ఏపీఆర్వో చంద్రశేఖర్, అర్చకులు పాల్గొన్నారు. -
రాజన్నకు కల్యాణశోభ