న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణుల ఎగుమతికి సంబంధించి తొలి ఆర్డర్ ఫిలిప్పీన్స్ నుంచి వచ్చింది. దాదాపు రూ. 2,780 కోట్ల కాంట్రాక్ట్‌ను బ్రహ్మోస్ ఏరోస్పేస్‌కు ఫిలిప్పీన్స్ ఇచ్చిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. క్షిపణులతోపాటు మూడు బ్యాటరీలు, క్షిపణుల నిల్వ, వాటిని ఎలా ప్రయోగించాలనే అంశాలపై ఫిలిప్పీన్స్ సైనిక సిబ్బందికి శిక్షణ, తదితర వివరాలను ఈ ఒప్పందంలో పొందుపరిచారు. ఒప్పందంలో భాగంగా యాంటీ–షిప్ వేరియంట్ క్షిపణులను సరఫరాచేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment