ముంబై: లాక్‌డౌన్ సమయంలో వలసకూలీలను ఆదుకోవడానికి ఎంతోమంది ముందుకు వచ్చారు అందులో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఒకరు.. కష్టం అనే మాట వినిపిస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు సోనూసూద్. ఇక వలస కూలీలు, కార్మికులను వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట సోనూసూద్ దేవుడుగా నిలిచాడు. సినిమాల్లో విలన్ అయినప్పటికీ అందరి దృష్టిలో ఇప్పుడు రియల్ హీరోగా మారాడు. దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన, విన్నాగాని సోనూసూద్ పేరే వినిపిస్తుంది.కరోనా పరిస్థితుల కారణంగా ఫిలిప్పీన్స్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరో సారి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ విమానం ఈ రోజు(శుక్రవారం) మనీలా నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకోనుంది. (సోనూ సూద్ దాతృత్వం: మరో విమానం)
విదేశీ బాలలకు సోనూసూద్ సాయం
కాలేయం మార్పిడి చికిత్స కోసం ఫిలిప్పీన్స్ నుంచి న్యూఢిల్లీకి రావాల్సిన 39 మంది చిన్నారుల ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రముఖ నటుడు సోనూసూద్ వెల్లడించారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఈ పిల్లలందరూ 1–5 ఏళ్ల వారే. వీరంతా బైలరీ అట్రీసియా అనే కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. వీరికి న్యూఢిల్లీలో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ప్రయాణం కుదరడం లేదన్న సంగతి సోను దృష్టికి వచ్చింది. దీంతో స్పందించిన ఆయన.. వచ్చే రెండ్రోజుల్లో వీరిని ఢిల్లీకి తీసుకువస్తామని, వీరి విలువైన ప్రాణాలు కాపాడాల్సి ఉందని ట్వీట్ చేశారు. (నువ్వు చాలా అదృష్టవంతుడివి.. బుక్స్ ఇస్తాను)
Let’s save these precious lives.
— sonu sood (@SonuSood) August 13, 2020
Will get them to India in the next two days.
Lining up for these 39 angels.
Pack their bags. ✈️ https://t.co/oY700MN4B2
Comments
Please login to add a commentAdd a comment