బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షిస్తున్న భారత్ (పాత ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ : అపూర్వ ఆయుధం పాకిస్తాన్ చేతికి అందింది. అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన మిస్సైల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను చైనా పాకిస్తాన్‌కు అమ్మినట్లు రిపోర్టులు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి దక్షిణ చైనా మార్నింగ్ పోస్టు ఓ కథనాన్ని ప్రచురించింది.
అయితే, మిస్సైల్ ట్రాకింగ్ సిస్టమ్ కోసం పాకిస్తాన్ చైనాకు ఎంత చెల్లించిందన్న దానిపై స్పష్టత లేదు. పాకిస్తాన్ క్షిపణి అభివృద్ధికి చైనా అత్యాధునిక సాంకేతికతను ఇవ్వనున్నట్లు చైనా పత్రిక తన కథనంలో రాసుకొచ్చింది. ఎంచుకున్న లక్ష్యాన్ని కచ్చితంగా తునాతునకలు చేసే సాంకేతికతను బ్రహ్మోస్ క్షిపణి అందుకుందని భారత రక్షణ శాఖ చేసిన ప్రకటన అనంతరం పాక్ - చైనాల మధ్య ఈ డీల్ కుదరడం గమనార్హం.
బ్రహ్మోస్ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన క్రూయిజ్ మిస్సైల్. దీన్ని రష్యా-భారత్‌లు ఉమ్మడిగా అభివృద్ధి చేశాయి. భూమి, వాయు, జల మార్గాల్లో ఎక్కడి నుంచైనా అతి సులువుగా బ్రహ్మోస్‌ను ప్రయోగించొచ్చు. కాగా, పాకిస్తాన్‌కు ఇచ్చిన సాంకేతికత అసాధారణమైనది చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్(సీఎఎస్) పేర్కొంది. కాగా, అత్యాధునిక ఆయుధాలను చైనా నుంచి పొందడం పాకిస్తాన్‌కు కొత్తేమీ కాదు. గతంలో యుద్ధనౌకలు, యుద్ధవిమానాలు, షార్ట్ రేంజ్ మిస్సైల్స్‌ను చైనా నుంచి పాకిస్తాన్ అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment