missile technology
-
'అజేయమైన' సైన్యాన్ని నిర్మిస్తా: కిమ్ ప్రతిజ్ఞ
Kim Jong Un vows to build 'invincible' military: నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్యాంగ్యాంగ్లో మంగళవారం జరిగిన డిఫెన్స్ ఎగ్జిబిషన్ షోలో పాల్గొన్న ఆయన 'అజేయమైన' సైన్యాన్ని నిర్మిస్తానంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కిమ్ మాట్లాడుతూ.. పొరుగుదేశమైన దక్షిణ కొరియాతో మేము ఎలాంటి శత్రుత్వాన్ని కోరుకోవడం లేదు. ఆయుధ సామాగ్రిని కేవలం ఆత్మరక్షణ కోసమే సమకూర్చుకుంటున్నాం. ఎవరితోనూ యుద్ధాలు చేయడానికి కాదు. మేము ఎవరితోనూ యుద్ధం కోరుకోవడం లేదు. అదే సమయంలో దేశ సార్వభౌమత్వ రక్షణ కోసం ప్రత్యర్థుల్లో భయాన్ని పెంచడంపై మాట్లాడతామని కిమ్ అన్నారు. చదవండి: (తీవ్ర సంక్షోభంలో శ్రీలంక.. కిలో పాలపొడి రూ.1,195) కొరియా ద్వీపకల్పంలో అస్థిరతకు అమెరికానే కారణమన్న కిమ్.. తన దేశం యొక్క అతి ముఖ్యమైన లక్ష్యం ఎవరూ సవాలు చేయలేని సైనిక సామర్థ్యాన్ని కలిగి ఉండటమే అని చెప్పారు. ఉత్తర కొరియా చర్యలపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా ఆ దేశం మాత్రం తన అణ్వాయుధాలను అంతకంతకూ పెంచుకుంటూ వెళ్తోంది. మరీ ముఖ్యంగా ఇటీవలే ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణులను, క్రూయిజ్ మిస్సైళ్లను ప్రయోగించడం గమనార్హం. -
రష్యాతో భారీ డీల్‌కు రంగం సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : రష్యాతో రక్షణ ఒప్పందాలపై అమెరికా ఆంక్షలు విధించినా ఆ దేశం నుంచి ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ మిసైళ్ల కొనుగోలుకు భారత్ చొరవ చూపుతోంది. రూ 30,000 కోట్లతో రష్యా నుంచి క్షిపణి వ్యవస్థను ఆధునీకరించే దిశగా అడుగులు వేస్తోంది. అమెరికా ఆంక్షలు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినా రష్యా నుంచి క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయాలనే నిర్ణయంపై భారత్ ముందుకెళుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు అమెరికా ఆంక్షలతో ఒకప్పుడు అగ్రరాజ్యానికి మిత్ర దేశాలైన టర్కీ, ఖతార్, సౌదీఅరేబియాలకు ఎస్-400 మిసైళ్ల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం నెలకొంది. ఇక భారత్, చైనాలు మాత్రమే ఎస్-400 ఎయిర్ మిసైళ్ల కస్టమర్లుగా రష్యా భావిస్తోంది. 350 కిమీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ మిసైల్స్ పలు శ్రేణుల్లో అందుబాటులో ఉంటాయి. మరోవైపు ఎస్-400పై రష్యాతో చైనా కూడా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే మేథో సంపత్తి హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ చైనా రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా వెపన్ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేసుకుంటుందనే ఆందోళనతో ఈ ఒప్పందంపై రష్యా వెనుకాడుతోంది. -
పాకిస్తాన్ చేతికి అపూర్వ ఆయుధం..!
సాక్షి, న్యూఢిల్లీ : అపూర్వ ఆయుధం పాకిస్తాన్ చేతికి అందింది. అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన మిస్సైల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను చైనా పాకిస్తాన్‌కు అమ్మినట్లు రిపోర్టులు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి దక్షిణ చైనా మార్నింగ్ పోస్టు ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే, మిస్సైల్ ట్రాకింగ్ సిస్టమ్ కోసం పాకిస్తాన్ చైనాకు ఎంత చెల్లించిందన్న దానిపై స్పష్టత లేదు. పాకిస్తాన్ క్షిపణి అభివృద్ధికి చైనా అత్యాధునిక సాంకేతికతను ఇవ్వనున్నట్లు చైనా పత్రిక తన కథనంలో రాసుకొచ్చింది. ఎంచుకున్న లక్ష్యాన్ని కచ్చితంగా తునాతునకలు చేసే సాంకేతికతను బ్రహ్మోస్ క్షిపణి అందుకుందని భారత రక్షణ శాఖ చేసిన ప్రకటన అనంతరం పాక్ - చైనాల మధ్య ఈ డీల్ కుదరడం గమనార్హం. బ్రహ్మోస్ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన క్రూయిజ్ మిస్సైల్. దీన్ని రష్యా-భారత్‌లు ఉమ్మడిగా అభివృద్ధి చేశాయి. భూమి, వాయు, జల మార్గాల్లో ఎక్కడి నుంచైనా అతి సులువుగా బ్రహ్మోస్‌ను ప్రయోగించొచ్చు. కాగా, పాకిస్తాన్‌కు ఇచ్చిన సాంకేతికత అసాధారణమైనది చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్(సీఎఎస్) పేర్కొంది. కాగా, అత్యాధునిక ఆయుధాలను చైనా నుంచి పొందడం పాకిస్తాన్‌కు కొత్తేమీ కాదు. గతంలో యుద్ధనౌకలు, యుద్ధవిమానాలు, షార్ట్ రేంజ్ మిస్సైల్స్‌ను చైనా నుంచి పాకిస్తాన్ అందుకుంది. -
ఉత్తరకొరియాకు సాయం చేసిన రష్యా!
ప్యాంగ్యాంగ్/వాషింగ్టన్: ఖండాతర క్షిపణి సామర్ధ్యం కోసం ఉత్తరకొరియా ఎంతగా పరితపించి పోయిందో అందరికీ తెలుసు. అమెరికాపై కాలు దువ్వుతూ త్వరలోనే ఖండాతర క్షిపణి సామర్ధ్యం సాధిస్తామని ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ పలుమార్లు స్పష్టం చేశారు. అదే థ్యేయంతో ఈ నెల 4వ తేదీన జరిపిన ఖండాంతర క్షిపణి పరీక్షలో విజయం సాధించారు. దీంతో ఒక్కసారిగా అమెరికా షాక్‌కు గురైంది. అయితే, ఖండాంతర క్షిపణి సామర్ధ్యాన్ని ఉత్తరకొరియా సొంతగా సాధించలేదనే అనుమానం వ్యక్తమవుతోంది. అమెరికా వినాశనం కోరి రష్యాయే ఆ టెక్నాలజీని ఉత్తరకొరియాకు రహస్యంగా అందించిందనే వార్తలు ఇప్పుడు ఇంటర్నెట్లో సంచలనంగా మారాయి. ఇందుకు అమెరికాకు చెందిన ఓ ఆయుధాల నిపుణుడు మిచెల్ ఇల్లేమాన్ చేసిన వ్యాఖ్యలే కారణం. ఉత్తరకొరియా పరీక్షించిన క్షిపణి ఇల్లేమాన్ అది రష్యా క్షిపణి టెక్నాలజీని పోలి ఉందని అంటున్నారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో సోవియెట్ క్షిపణులను తాను పరిశీలించానని, చాలా కాలం తర్వాత అదే విధమైన క్షిపణిని ఉత్తరకొరియా ప్రయోగించిందని ఆయన అన్నారు. దీంతో రష్యాకు చెందిన శాస్త్రవేత్తలే ఈ మిసైల్ తయారీకి సహకరించారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇందుకు ఉదాహరణగా ఓ ఘటనను ప్రస్తావిస్తూ.. 1962లో ఉత్తరకొరియా వెళ్లేందుకు రష్యాకు చెందిన 60 మంది శాస్త్రవేత్తలు ప్రయత్నించారని, డబ్బులు తీసుకుని మిసైల్ టెక్నాలజీని ఉత్తరకొరియాకు అందించాలని వారు భావించినట్లు చెప్పారు. సరిహద్దు దాటేందుకు కుటుంబాలతో సహా సిద్ధమవుతుండగా వారిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయని తెలిపారు. అనంతరం రష్యాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఉత్తరకొరియాకు ఈ టెక్నాలజీని అందించడంతో ఈ క్షిపణులు సాధ్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు.