అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న పృథ్వి-2 క్షిపణి పరీక్ష విజయవంతం | India successfully tests nuclear capable prithvi-2 missile | Sakshi
Sakshi News home page

అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న పృథ్వి-2 క్షిపణి పరీక్ష విజయవంతం

Published Tue, Dec 3 2013 11:44 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM

India successfully tests nuclear capable prithvi-2 missile

భూతలం నుంచి భూతలం మీదకు ప్రయోగించగల అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న క్షిపణి పృథ్వి-2ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిషాలోని ఓ సైనిక స్థావరం నుంచి దీన్ని వరుసగా రెండు నెలల్లో మూడోసారి విజయవంతంగా పరీక్షించినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ బాలిస్టిక్ క్షిపణి రేంజి 350 కిలోమీటర్లు. దీన్ని బాలాసోర్ జిల్లాలోని చాందీపూర్ టెస్టురేంజి నుంచి ప్రయోగించారు.

ప్రయోగం నూటికి నూరుశాతం విజయవంతం అయ్యిందని ప్రధాన లక్ష్యాలన్నింటినీ ఇది చేరిందని టెస్టు రేంజి డైరెక్టర్ ఎంవీకేవీ ప్రసాద్ తెలిపారు. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్.ఎఫ్.సి.) ఈ పరీక్షను నిర్వహించిందన్నారు. ఇంతకుముందు అక్టోబర్ 7, 8 తేదీలలో కూడా ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. పూర్తిగా భారత్లోనే తయారైన వాటిలో ఇది మొట్టమొదటి బాలిస్టిక్ క్షిపణి. ఇది 500 కిలోల బరువున్న అణు వార్హెడ్లను మోసుకెళ్లగలదు. 483 సెకండ్లలోనే 43.5 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్తుంది. ఇది రాడార్ల కంటిని తప్పించుకుని మరీ వెళ్లి, లక్ష్యాలను కొద్ది మీటర్ల కచ్చితత్వంతో ఛేదించగలదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement