chandipur
-
దేశీయ ఆకాశ్-ఎన్జీ క్షిపణి పరీక్ష విజయవంతం
దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్-ఎన్జీ( న్యూ జెనరేషన్) క్షిపణి పరీక్ష విజయవంతం అయినట్లు భారత్ రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్డీఓ) ప్రకటించింది. ఒడిశాలోని చాందిపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్)లో శుక్రవారం ఉదయం 10. 30 గంటలకు తక్కువ ఎత్తులో ఉన్న మానవరహిత వేగవంతమైన లక్ష్యాన్ని చేధించే ఆకాశ్-ఎన్జీ మిసైల్ పరీక్ష విజయవంతం అయిందని పేర్కొంది. ఇకపై ఈ క్షిపణిని భారత సైన్యం, వాయుసేన ఉపయోగించుకోనుందని తెలిపింది. ఆకాశ్-ఎన్జీ క్షిపణ వ్యవస్థ అత్యాధునిక, హైస్పీడ్‌తో వైమానిక దాడులను అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ క్షిపణి పరిధి దాదాపు 80 కిలో మీటర్లు. ఆకాశ్ క్షిపణి ప్రయోగ పరీక్ష విజయవంతమైనట్లు డీఆర్డీఓ ‘ఎక్స్’(ట్విటర్)లో పేర్కొంది. Next Generation Akash missile successfully flight tested from ITR , Chandipur off the coast of Odisha today at 10:30hrs against a high speed unmanned aerial target at very low altitude. @DefenceMinIndia @SpokespersonMoD pic.twitter.com/ShRNi4dfAj — DRDO (@DRDO_India) January 12, 2024 పూర్తిస్థాయి ఆయుధ వ్యవస్థ విజయవంతమైన పనితీరును భారత్ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఈ క్షిపణ దేశియంగా అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్, లాంచర్, మల్టీ-ఫంక్షన్ రాడార్, కమాండ్ కంట్రోల్, కమ్యూనికేషన్ వ్యవస్థతో కూడిన క్షిపణి అని రక్షణ శాఖ పేర్కొంది. చదవండి: Ram Mandir: ‘నా సోదరులు కన్న కల నిజమైంది!’ -
డీఆర్డీవో, ఐటీఆర్ చాందీపూర్‌లో అప్రెంటిస్ ఖాళీలు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న డీఆర్డీవో–ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరాఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 116 ► ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు–50, డిప్లొమా(టెక్నీషియన్) అప్రెంటిస్‌లు–40, ట్రేడ్ అప్రెంటిస్‌లు–26. ► గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు: విభాగాలు: కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీబీఏ, బీకాం, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. ► డిప్లొమా(టెక్నీషియన్) అప్రెంటిస్‌లు: విభాగాలు: కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్,సివిల్,సినిమాటోగ్రఫీ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ► ట్రేడ్ అప్రెంటిస్‌లు: ట్రేడులు: కంప్యూటర్ నెట్వర్కింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్ తదితరాలు.అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. ► 2019, 2020, 2021లో అర్హత కోర్సు ఉత్తీర్ణులైన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ► ఎంపిక విధానం: సంబంధిత అర్హత పరీక్షలో సాధించిన మార్కులు/ఆన్లైన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 01.11.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.11.2021 ► వెబ్సైట్: www.drdo.gov.in -
విజయవంతంగా ‘అభ్యాస్’
భువనేశ్వర్: భారత్ సోమవారం అభ్యాస్–హైస్పీడ్ ఎక్స్‌పాండబుల్ ఏరియల్ టార్గెట్(హీట్) అనే డ్రోన్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్‌రేంజ్‌లో ఈ పరీక్షను భారత రక్షణరంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) సోమవారం నిర్వహించింది. ఆటోపైలట్ వ్యవస్థ సాయంతో అభ్యాస్ ముందుకు దూసుకెళుతుంది. ఇందులో చిన్న గ్యాస్ టర్బైన్ ఇంజిన్లతో పాటు దేశీయంగా అభివృద్ధి చేసిన ఎంఈఎంఎస్ నేవిగేషన్ వ్యవస్థను డీఆర్డీవో శాస్త్రవేత్తలు వినియోగించారు. ఈ ప్రయోగంలో అభ్యాస్ నిర్దేశిత ప్రమాణాలన్నింటిని అందుకుందని డీఆర్డీవో వర్గాలు తెలిపాయి. -
చండీపూర్‌కు అరుదైన ఘనత
బాలాసోర్(ఒడిశా): చండీపూర్‌లోని క్షిపణి ప్రయోగకేంద్రం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇక్కడి బీచ్‌లో దేశంలోనే మొట్టమొదటి ఆయుధ ప్రదర్శనశాల ఏర్పాటైంది. భారత నావికా దళం, వైమానిక దళాలు వినియోగించిన ప్రముఖ ఆయుధ వ్యవస్థలను ప్రజల సందర్శనార్థం ఇందులో ఉంచారు. డిఫెన్స్ రీసెర్చి, డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) డాక్టర్ ఎస్. క్రిస్టొఫర్ మంగళవారం దీనిని ప్రారంభించారు. మొత్తం 14 రకాల ఆయుధాలను ప్రస్తుతం ప్రదర్శిస్తున్నామని, భవిష్యత్తులో మరికొన్ని ఇందులో ఉంచనున్నట్టు తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడటానికి సైన్యం ఎలాంటి ఆయుధాలను, ఆయుధ వ్యవస్థలను వాడుతుందనే విషయంలో ప్రజలకు అవగాహన కల్పించటానికి ఇది ఉపయోగపడుతుందని క్రిస్టొఫర్ తెలిపారు. మనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని చాటి చెప్పటానికి.. ముఖ్యంగా యువతలో స్ఫూర్తి నింపేందుకు కృషి చేస్తున్నామన్నారు. చండీపూర్‌లో సైన్యం వినియోగించే ట్యాంకులు, క్షిపణులు, ఫీల్డ్‌గన్స్, మోర్టార్లు తదితరాలను పరీక్షిస్తుంటారు. ఈ ప్రదర్శనలో 1971 వ సంవత్సరంలో పాక్‌తో జరిగిన యుద్ధంలో కీలక పాత్ర పోషించిన వైజయంత ట్యాంక్ ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు దేశం బంకర్లను, సైన్యాన్ని నిలువరించటం ఈ ట్యాంక్ దీని ప్రత్యేకత. దీనితో పాటు డబ్ల్యూఎం-18 రకం రాకెట్ లాంఛర్, 105 మిమీ ఫీల్డ్‌గన్, 122 మిమీ బీఎం-21 రాకెట్ లాంఛర్, 57 మిమీ యాంటీ ట్యాంక్ గన్, 40 ఎంఎం లైట్గన్ తదితరాలను కూడా ప్రదర్శనలో ఉంచారు. -
క్విక్ రియాక్షన్ క్షిపణి ప్రయోగం విజయవంతం
భువనేశ్వర్(ఒడిశా): భూతలం నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించిన అధునాతన క్షిపణ ప్రయోగం విజయవంతమైంది. ఒడిశా తీరం చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి క్విక్ రియాక్షన్ క్షిపణిని సోమవారం ఉదయం 11 గంటలకు డీఆర్డీవో నిపుణులు ప్రయోగించారు. నిర్దేశిత లక్ష్యాన్ని క్షిపణి చేరుకోవటంతో ప్రయోగం విజయవంతమైందని అధికారులు ప్రకటించారు. దీనికి 20-30 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్ధ్యముందని తెలిపారు. ఈ అధునాతన క్షిపణిని ప్రయోగించి చూడటం ఇది రెండోసారి. జూన్ 4వ తేదీన మొదటిసారి ప్రయోగించి చూశారు. -
క్షిపణి ప్రయోగం విజయవంతం
బాలాసోర్: భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణిని గురువారం భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఇజ్రాయెల్-భారత్ కలిసి తయారుచేసిన ఈ మిస్సైల్ ను ఒడిశాలోని చాందీపూర్ ప్రయోగ కేంద్రం నుంచి పరీక్షించారు. ఉదయం 8.15 నిమిషాలకు ఇంట్రిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి క్షిపణి ప్రయోగం చేసినట్లు డీఆర్డీవో అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో మానవరహిత వాహనం 'బాన్షీ' టార్గెట్ గా మిస్సైల్ ను ప్రయోగించారు. మిస్పైల్ లోని మల్టీ ఫంక్షనల్ సర్వైలెన్స్ అండ్ త్రెట్ అలర్ట్ రాడార్ (ఎమ్ఎఫ్ఎస్టీఏఆర్) టెక్నాలజీ ద్వారా టార్గెట్ లక్ష్యంగా ప్రయాణిస్తుందని, అలానే 'బాన్షీ'ని ఛేదించినట్లు వివరించారు. ఇదే టెక్నాలజీతో మీడియం, లాంగ్ రేంజ్ లలో ఏడాదికి 100కు పైగా మిస్సైల్స్ ను ఉత్పత్తి చేసేందుకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో ప్లాంటును నెలకొల్పినట్లు చెప్పారు. గతంలో ఇదేకోవకు చెందిన లాంగ్ రేంజ్ ఎయిర్ మిసైళ్లను కోల్ కతా తీరంలో భారత నేవీ పరీక్షించింది. మీడియం రేంజ్ మిస్సైళ్లు 50-70 కిలోమీటర్ల దూరంలో గల టార్గెట్లను ఛేదిస్తాయి. ప్రస్తుతం నడుస్తున్న ట్రయల్ రన్స్ పూర్తయిన తర్వాత మిగతా ఇవి కూడా భారత అమ్ములపొదిలోకి చేరుతాయి. కాగా, ప్రయోగసమయంలో చుట్టుపక్కల ప్రాంతాలవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మత్య్సకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మీడియం రేంజ్ మిస్సైల్ ప్రయోగం విజయవంతంకావడంపై రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారీకర్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీవో, మిస్సైల్ తయారీలో సాయంచేసిన సంస్థలకు ఆయన ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. I congratulate @DRDO_India & Industry teams for the successful flight test of MRSAM (Medium Range Surface to Air Missile) weapon system. — Manohar Parrikar (@manoharparrikar) 30 June 2016 -
అమ్మాయిల దుస్తులు బిగుతుగా ఉన్నాయని..
ఔట్‌డోర్ గేమ్స్‌లో అమ్మాయిల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించాలనుకున్నారు.. ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాత ఉపద్రవం తలెత్తుతుందేమోనని భయపడి ఆ మ్యాచ్‌ను రద్దు చేశారు. అయితే ఉపద్రవమంటే తుఫానో, సునామీనో కాదు.. ఆ మ్యాచ్‌లో మహిళా క్రీడాకారిణుల కోసం సిద్ధం చేసిన దుస్తులు బిగుతుగా ఉండటం! తాలిబన్ పాలనను, ఐఎస్ దుశ్యర్యల్ని తలపించేలా పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. మల్దా జిల్లాలోని చండీపూర్‌లో స్థానిక క్లబ్ గోల్డెన్ జూబ్లీ(50 ఏళ్ల) వేడుకల్లో భాగంగా కోల్‌కతా, ఉత్తర బెంగాల్ మహిళా ఫుట్‌బాల్ జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించాలనుకున్నారు. తీరా మ్యాచ్ ప్రారంభానికి ముందు రోజు అమ్మాయిల దుస్తులు బిగుతుగా ఉన్నాయని, వాటిని ధరించి ఆడితే పురుషుల్ని రెచ్చగొట్టినట్టవుతుందని నిర్వాహకులు ఏకంగా మ్యాచ్ నే రద్దు చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ వ్యవహారంపై క్రీడాభిమానులు మండిపడుతున్నారు. 'నిర్వాహకుల తీరు ఆక్షేపణీయం. వాళ్లని అలాగే వదిలేస్తే సానియా మీర్జా కాళ్ల నిండుగా ప్యాంటు ధరించి టెన్నిస్ ఆడాలని డిమాండ్ చేసేలా ఉన్నారు' అని భారత ఫుట్‌బాల్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహించిన మాజీ క్రీడాకారుడొకరు వ్యాఖ్యానించారు. కొన్ని రాజకీయ పక్షాలు సైతం దీనిపై నిరసనను తెలపగా, అధికార తృణమూల్ కాంగ్రెస్ మంత్రి సావిత్రి మిశ్రా మాత్రం దుస్తుల కారణంగా మ్యాచ్ రద్దును సమర్థించారు. మత ఘర్షణలు తలెత్తే అవకాశం ఉన్నందునే మ్యాచ్ నిలిచిపోయిందని బ్లాక్ డెవలప్మెట్ అధికారులు చెప్పారు. మతపరంగా తనపై చర్యలు తీసుకుంటామని కొందరు వ్యక్తులు హెచ్చరించడంవల్లే మ్యాచ్‌ను రద్దుచేసినట్లు ప్రధాన నిర్వాహకుడు రేజా రజీర్ పేర్కొన్నారు. -
అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న పృథ్వి-2 క్షిపణి పరీక్ష విజయవంతం
భూతలం నుంచి భూతలం మీదకు ప్రయోగించగల అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న క్షిపణి పృథ్వి-2ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిషాలోని ఓ సైనిక స్థావరం నుంచి దీన్ని వరుసగా రెండు నెలల్లో మూడోసారి విజయవంతంగా పరీక్షించినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ బాలిస్టిక్ క్షిపణి రేంజి 350 కిలోమీటర్లు. దీన్ని బాలాసోర్ జిల్లాలోని చాందీపూర్ టెస్టురేంజి నుంచి ప్రయోగించారు. ప్రయోగం నూటికి నూరుశాతం విజయవంతం అయ్యిందని ప్రధాన లక్ష్యాలన్నింటినీ ఇది చేరిందని టెస్టు రేంజి డైరెక్టర్ ఎంవీకేవీ ప్రసాద్ తెలిపారు. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్.ఎఫ్.సి.) ఈ పరీక్షను నిర్వహించిందన్నారు. ఇంతకుముందు అక్టోబర్ 7, 8 తేదీలలో కూడా ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. పూర్తిగా భారత్‌లోనే తయారైన వాటిలో ఇది మొట్టమొదటి బాలిస్టిక్ క్షిపణి. ఇది 500 కిలోల బరువున్న అణు వార్హెడ్లను మోసుకెళ్లగలదు. 483 సెకండ్లలోనే 43.5 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్తుంది. ఇది రాడార్ల కంటిని తప్పించుకుని మరీ వెళ్లి, లక్ష్యాలను కొద్ది మీటర్ల కచ్చితత్వంతో ఛేదించగలదు. -
పృథ్వి-2 క్షిపణి ప్రయోగం విజయవంతం
గగనతలంలో భారత్ తన సామర్థ్యాన్ని మరోమారు సగర్వంగా నిరూపించుకుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన, అణు సామర్థ్యం కలిగిన పృథ్వి-2 క్షిపణిని ఒడిసాలోని ఓ సైనిక స్థావరం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. భూమి మీద నుంచి భూమ్మీద ఉండే లక్ష్యాల మీదకు సంధించగలిగే ఈ బాలిస్టిక్ క్షిపణిని సోమవారం తెల్లవారుజామున ప్రయోగించారు. ఈ క్షిపణి సామర్థ్యం 350 కిలోమీటర్లు. భువనేశ్వర్‌కు 230 కిలోమీటర్ల దూరంలోని బాలాసోర్ జిల్లాలో గల చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజి నుంచి దీన్ని ప్రయోగించారు. భారత సైనిక దళాలు తమ సాధారణ విన్యాసాల్లో భాగంగానే దీన్ని ప్రయోగించినట్లు అధికారులు చెబుతున్నారు. సరిహద్దుల్లో పదే పదే ఉద్రిక్తతలు నెలకొంటుండటంతో, తమ సామర్థ్యాన్ని అంతర్జాతీయ యవనికపై మరో్మారు ప్రదర్శించి తీరాలన్న నిర్ణయానికే భారత్ వచ్చినట్లుందని, అందుకే మరోమారు అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న పృథ్విని ప్రయోగించినట్లు భావిస్తున్నారు.