భూతలం నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించిన అధునాతన క్షిపణ ప్రయోగం విజయవంతమైంది.
భువనేశ్వర్(ఒడిశా): భూతలం నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించిన అధునాతన క్షిపణ ప్రయోగం విజయవంతమైంది. ఒడిశా తీరం చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి క్విక్ రియాక‌్షన్ క్షిపణిని సోమవారం ఉదయం 11 గంటలకు డీఆర్‌డీవో నిపుణులు ప్రయోగించారు.
నిర్దేశిత లక్ష్యాన్ని క్షిపణి చేరుకోవటంతో ప్రయోగం విజయవంతమైందని అధికారులు ప్రకటించారు. దీనికి 20-30 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్ధ్యముందని తెలిపారు. ఈ అధునాతన క్షిపణిని ప్రయోగించి చూడటం ఇది రెండోసారి. జూన్ 4వ తేదీన మొదటిసారి ప్రయోగించి చూశారు.