8 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించిన మిస్సైల్
న్యూఢిల్లీ : భారత్ మరో క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఏయిర్ మెస్సైల్(క్యూఆర్ఎస్ఏఎమ్)ను ఉపయోగించి వాహనాన్ని ధ్వంసం చేసింది. శుక్రవారం ఒరిస్సాలోని బాలాషోర్ తీర ప్రాంతంనుంచి ప్రయోగాన్ని చేపట్టింది. నిన్న మధ్యాహ్నం 3.50 గంటల ప్రాంతంలో చంఢీపుర్ ఐటీఆర్నుంచి క్షిపణిని గాల్లోకి ప్రయోగించగా ఎనిమిది సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 25-30 కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాలను ఇది ఛేదించగలదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 13 సెకన్ల నిడివి కలిగిన వీడియోలో క్షిపణి ప్రయోగించిన వెంటనే దట్టమైన పొగతో గాల్లోకి దూసుకుపోతున్న దృశ్యాలు ఉన్నాయి. ( సైనికులతో ఉన్నప్పుడే నాకు నిజమైన దీపావళి )
కాగా, భారత నౌకాదళం గత నెలలో తూర్పు నౌకాదళ పరిధిలో బంగాళాఖాతంలో క్షిపణి సామర్ధ్య యుద్ధనౌక ఐఎన్ఎస్ కోరా నుంచి నౌకా విధ్వంసక క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. అది గరిష్ట దూరంలోని తన లక్ష్యాన్ని సమర్ధవంతంగా ఛేదించింది. క్షిపణి ఢీకొట్టడంతో నౌక ధ్వంసమైంది. ఈ క్షిపణి ప్రయోగానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను నేవీ వర్గాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.