భువనేశ్వర్: భారత్ సోమవారం అభ్యాస్–హైస్పీడ్ ఎక్స్‌పాండబుల్ ఏరియల్ టార్గెట్(హీట్) అనే డ్రోన్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్‌రేంజ్‌లో ఈ పరీక్షను భారత రక్షణరంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) సోమవారం నిర్వహించింది. ఆటోపైలట్ వ్యవస్థ సాయంతో అభ్యాస్ ముందుకు దూసుకెళుతుంది. ఇందులో చిన్న గ్యాస్ టర్బైన్ ఇంజిన్లతో పాటు దేశీయంగా అభివృద్ధి చేసిన ఎంఈఎంఎస్ నేవిగేషన్ వ్యవస్థను డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు వినియోగించారు. ఈ ప్రయోగంలో అభ్యాస్ నిర్దేశిత ప్రమాణాలన్నింటిని అందుకుందని డీఆర్‌డీవో వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment