Abhyas
-
విజయవంతంగా ‘అభ్యాస్’
భువనేశ్వర్: భారత్ సోమవారం అభ్యాస్–హైస్పీడ్ ఎక్స్‌పాండబుల్ ఏరియల్ టార్గెట్(హీట్) అనే డ్రోన్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్‌రేంజ్‌లో ఈ పరీక్షను భారత రక్షణరంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) సోమవారం నిర్వహించింది. ఆటోపైలట్ వ్యవస్థ సాయంతో అభ్యాస్ ముందుకు దూసుకెళుతుంది. ఇందులో చిన్న గ్యాస్ టర్బైన్ ఇంజిన్లతో పాటు దేశీయంగా అభివృద్ధి చేసిన ఎంఈఎంఎస్ నేవిగేషన్ వ్యవస్థను డీఆర్డీవో శాస్త్రవేత్తలు వినియోగించారు. ఈ ప్రయోగంలో అభ్యాస్ నిర్దేశిత ప్రమాణాలన్నింటిని అందుకుందని డీఆర్డీవో వర్గాలు తెలిపాయి. -
టెక్నోత్లాన్‌కు ‘అభ్యాస్’ విద్యార్థుల ఎంపిక
మిర్యాలగూడ : పట్టణంలోని అభ్యాస్ టెక్నో స్నూల్ విద్యార్థులు ఐఐటీ గౌహతి వారు నిర్వహించిన టెక్నోత్లాన్ ప్రోగ్రామ్‌కు ఎంపికైనట్లుగా అభ్యాస్ స్కూల్ చైర్మన్ వంగాల పుష్పలతా నిరంజన్‌రెడ్డి తెలిపారు. పాఠశాలకు చెందిన సౌషిత్, కార్తీక్‌లు జిల్లా ఫస్ట్ ర్యాంకు, తెలంగాణా రీజియన్‌లో మూడో ర్యాంకు సాధించినట్లు తెలిపారు. వీరికి ఐఐటీ గౌహతి వారు గోల్డ్‌మెడల్స్, సర్టిఫికెట్లు అందజేస్తారని, వీరితో పాటు మరో ఆరుగురు విద్యార్థులకు సిల్వర్ మెడల్, సర్టిఫికెట్లు అందజేస్తారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.