దేశీయ ఆకాశ్‌-ఎన్‌జీ క్షిపణి పరీక్ష విజయవంతం | DRDO Performs Successful India's Akash NG Missile Test In Odisha, DRDO Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Akash NG Missile Test: దేశీయ ఆకాశ్‌-ఎన్‌జీ క్షిపణి పరీక్ష విజయవంతం

Published Fri, Jan 12 2024 6:22 PM | Last Updated on Fri, Jan 12 2024 6:53 PM

DRDO Performs Akash NG Missile Test Successful In Odisha - Sakshi

దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్‌-ఎన్‌జీ( న్యూ జెనరేషన్‌)  క్షిపణి పరీక్ష విజయవంతం అయినట్లు భారత్‌ రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్‌డీఓ) ప్రకటించింది. ఒడిశాలోని చాందిపూర్‌ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్‌)లో శుక్రవారం ఉదయం 10. 30 గంటలకు తక్కువ ఎత్తులో ఉన్న మానవరహిత వేగవంతమైన లక్ష్యాన్ని చేధించే ఆకాశ్‌-ఎన్‌జీ మిసైల్‌ పరీక్ష విజయవంతం అయిందని పేర్కొంది.

ఇకపై ఈ క్షిపణిని భారత సైన్యం, వాయుసేన ఉపయోగించుకోనుందని తెలిపింది. ఆకాశ్‌-ఎన్‌జీ క్షిపణ వ్యవస్థ అత్యాధునిక, హైస్పీడ్‌తో వైమానిక దాడులను అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది.  ఈ క్షిపణి పరిధి దాదాపు 80 కిలో మీటర్లు. ఆకాశ్‌ క్షిపణి ప్రయోగ పరీక్ష విజయవంతమైనట్లు డీఆర్‌డీఓ ‘ఎక్స్‌’(ట్విటర్‌)లో పేర్కొంది.

పూర్తిస్థాయి ఆయుధ వ్యవస్థ విజయవంతమైన పనితీరును భారత్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఈ క్షిపణ దేశియంగా అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్, లాంచర్, మల్టీ-ఫంక్షన్ రాడార్‌, కమాండ్ కంట్రోల్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థతో కూడిన క్షిపణి అని రక్షణ శాఖ పేర్కొంది.

చదవండి: Ram Mandir: ‘నా సోదరులు కన్న కల నిజమైంది!’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement