సీడీఎస్‌ జనరల్‌ చౌహాన్‌ పదవీ కాలం పొడిగింపు | Centre extends tenure of CDS Gen Anil Chauhan up to May 2026 | Sakshi
Sakshi News home page

సీడీఎస్‌ జనరల్‌ చౌహాన్‌ పదవీ కాలం పొడిగింపు

Sep 25 2025 5:49 AM | Updated on Sep 25 2025 5:49 AM

Centre extends tenure of CDS Gen Anil Chauhan up to May 2026

8 నెలలు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం 

న్యూఢిల్లీ: చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ పదవీ కాలాన్ని కేంద్రం ప్రభుత్వం ఎనిమిది నెలలు కొనసాగించింది. ఆయన ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉండగా, వచ్చే ఏడాది మే 30వ తేదీ దాకా పొడిగించినట్లు అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి.  

సీడీఎస్‌ చీఫ్‌తోపాటు డిపార్టుమెంట్‌ ఆఫ్‌ మిలటరీ అఫైర్స్‌ కార్యదర్శిగా జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ పదవీ కాలాన్ని 8 నెలలపాటు పొడిగించడానికి ప్రభుత్వం అంగీరించినట్లు రక్షణ శాఖ తెలియజేసింది. వచ్చే ఏడాది మే 30 లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ఆయన ఈ పదవిలో కొనసాగుతారని స్పష్టంచేసింది. జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ 2022 సెప్టెంబర్‌ 30 నుంచి సీడీఎస్‌గా సేవలందిస్తున్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement