Anil Chauhan
-
పాక్ సైన్యంతో ప్రమాదమే: సీడీఎస్
న్యూఢిల్లీ: పొరుగుదేశం పాకిస్తాన్ ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నప్పటికీ, ఆ దేశ ఆర్మీతో మనకు ప్రమాదంఎప్పటిలాగానే ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ వ్యాఖ్యానించారు. పాక్ సైనిక సామర్థ్యం చెక్కు చెదరలేదని చెప్పారు. అయితే సరిహద్దులను, ముఖ్యంగా వివాదాస్పద ఉత్తర సరిహద్దులను కాపాడుకోగల సత్తా మన సైన్యానికి ఉందని శనివారం ఇండియా టుడే కాంక్లేవ్‌లో చెప్పారు. ‘చైనా బలపడుతుండటం, ఆ దేశంతో తెగని సరిహద్దు వివాదం మనకు తక్షణ సవాలుగా మారింది. చైనా, పాక్ మనకు బద్ధ శత్రువులు. పైగా వీరివద్ద అణ్వాయుధాలున్నాయి. యుద్ధ రీతుల్లో ఎప్పటికప్పుడు అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మన ఆర్మీకి ఇదే అతి పెద్ద సవాల్‌గా మారింది. కొత్త ఆయుధ వ్యవస్థలను సమకూర్చుకోవడం, సాంకేతికతను అందిపుచ్చుకోవడం, వ్యూహాలు, ప్రతివ్యూహాలను రచించుకోవడం వంటివి కొనసాగుతున్నాయి’’ అని జనరల్ చౌహాన్ చెప్పారు. -
శత్రువుల పాలిట ‘ప్రచండ’మే
సాక్షి, న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అధునాతన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్(ఎల్సీహెచ్) ప్రచండ్ భారత వైమానిక దళంలో చేరింది. సోమవారం రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ వైమానికస్థావరంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సమక్షంలో 4 లైట్ కంబాట్ హెలికాప్టర్లను వైమానిక దళంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రచండ్లో రాజ్‌నాథ్ కొద్దిసేపు ప్రయాణించారు. పర్వతప్రాంతాల్లో, ఎడారి వంటి ప్రతికూల వాతావరణంలో పగలూ, రాత్రి శత్రువులపై దాడి చేయగలగడం ప్రచండ్ ప్రత్యేకత. గగనతలంలోని లక్ష్యాలను గగనతలం నుంచే చేధించగల క్షిపణులను, ట్యాంక్ విధ్వంసక మిస్సైళ్లను, 20 ఎంఎం తుపాకులనూ వీటిలో అమర్చవచ్చు. నిమిషానికి 750 తూటాలను పేల్చగల సత్తా వీటి సొంతం. పర్వతప్రాంతాల్లోని శత్రు సైన్యంపై, ట్యాంక్‌లు, బంకర్లు, డ్రోన్లపై ఇవి సులభంగా దాడిచేయగలవని ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు. 22 ఏళ్ల క్రితం భారత్ కన్న కల ఇప్పుడు నెరవేరిందని రాజ్‌నాథ్ అన్నారు. 1999లో పాకిస్తాన్‌తో కార్గిల్ యుద్ధకాలంలో పర్వతప్రాంతాల్లో తేలికపాటి పోరాట హెలికాప్టర్ల ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి చేసిన పరిశోధన ఫలితమే ప్రచండ్ రూపంలో వచ్చిందన్నారు. ఇంకొన్ని ప్రత్యేకతలు ఈ హెలికాప్టర్లు గరిష్ట సంఖ్యలో ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రిని మోసుకెళ్లగలవు. గాలిలో ఎక్కువసేపు ఉండటానికి సరిపడా ఇంథనాన్ని నింపొచ్చు. ఎడారుల్లో, మంచుమయమైన హిమాలయ పర్వతాల్లోనూ పోరాడగలవు. ట్విన్ ఇంజన్లు ఉన్న ఈ హెలికాప్టర్ బరువు 5.8 టన్నులు. శత్రువుకు కనపడని రంగులో, తక్కువ శబ్దం చేస్తూ, రాడార్‌కు, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లకు చిక్కకుండా వెళ్లగలవు. హెలికాప్లర్లను అడవులు, పట్టణ ప్రాంతాలలో ఉగ్రవ్యతిరేక ఆపరేషన్లలోనూ మొహరించవచ్చు. ఇక సైనిక వెర్షన్లో 96 హెలికాప్టర్లను తీసుకోవాలని ఆర్మీ భావిస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీడీఎస్‌గా జనరల్ చౌహాన్ బాధ్యతలు
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత సీనియర్ కమాండర్, ఈస్టర్న్ ఆర్మీ మాజీ కమాండర్ జనరల్ చౌహాన్ కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అయ్యారు. దేశ మొట్టమొదటి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ 9 నెలల క్రితం తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన స్థానం జనరల్ చౌహాన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. దేశం ముందున్న భవిష్యత్ భద్రతా సవాళ్లకు త్రివిధ దళాలను సన్నద్ధం చేయడం, ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన థియేటర్ ప్లాన్‌ను అమలు చేయడం జనరల్ అనిల్ చౌహాన్ ప్రధాన లక్ష్యాలు. ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ మిలటరీ ఎఫైర్స్కు సెక్రటరీగాను ఆయన వ్యవహరిస్తారు. సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో డ్రాగన్ దేశంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో చైనా వ్యవహారాల్లో నిపుణుడిగా పేరున్న జనరల్ చౌహాన్‌ను అత్యున్నత హోదాలో కేంద్రం నియమించడం గమనార్హం. ‘భారత సైనిక బలగాల్లో అత్యున్నత హోదాను చేపట్టినందుకు గర్వంగా ఉంది. త్రివిధ దళాలు నాపై ఉంచిన అంచనాలను అందుకునేందుకు నా వంతు కృషి చేస్తాను. అన్ని సవాళ్లను, ఇబ్బందులను కలిసికట్టుగా ఎదుర్కొంటాం’ అని ఈ సందర్భంగా జనరల్ చౌహాన్ అన్నారు. రైజినా హిల్స్‌లోని సౌత్ బ్లాక్ వద్ద జరిగిన కార్యక్రమంలో జనరల్ చౌహాన్ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. 1961లో జన్మించిన జనరల్ చౌహాన్ 1981లో భారత సైన్యంలోని 11 గూర్ఖా రైఫిల్స్‌లో చేరారు. -
బిపిన్ రావత్ తర్వాత సీడీఎస్‌గా అనీల్ చౌహాన్
సాక్షి, న్యూఢిల్లీ: జనరల్ బిపిన్ రావత్ మరణానంతరం సుమారు 9 నెలల తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. బిపిన్ రావత్ తర్వాత సీడీఎస్‌గా లెఫ్టినెట్ జనరల్ అనిల్ చౌహాన్(రిటైర్ట్) పేరును ప్రకటించింది. లెఫ్టినెంట్ జనరల్ చౌహాన్ 2021, మే నెలలో తూర్పు కమాండ్ చీఫ్‌గా విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ చేశారు. సైన్యంలో పలు ఉన్నత పదవులను నిర్వర్తించారు చౌహాన్. జమ్ముకశ్మీర్, ఈశాన్య ప్రాంతాల్లో ఉగ్రకార్యకలాపాలను నిలువరించటంలో విస్తృత అనుభవం ఉంది. త్రివిద దళాలను ఏకతాటిపైకి తేవాలనే ఉద్దేశంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ను ఏర్పాటు చేసింది కేంద్రం. దేశ తొలి సీడీఎస్‌గా జనరల్ బిపిన్ రావత్ 2020, జనవరిలో బాధ్యతలు చేపట్టారు. అయితే.. 2021 డిసెంబర్లో తమిళనాడులో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మిలిటరీ హెలికాప్టర్లో వెళుతుండగా ప్రమాదం జరిగి రావత్, ఆయన భార్య ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటు మరో 11 మంది మరణించారు. అప్పటి నుంచి సీడీఎస్ పోస్ట్ ఖాళీగానే ఉంది. దాదాపు 9 నెలల తర్వాత కొత్త సీడీఎస్‌ను నియమించింది కేంద్రం. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగ్విజయ్ సింగ్? -
శివసేన నాయకుడిపై కాల్పులు
శివసేన నాయకుడు అనిల్ చౌహాన్‌పై కాల్పులు జరిగాయి. వెంటనే ఆయనను భక్తివేదాంత ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఉదయమే ఆయనపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఉత్తర ముంబైలోని కశ్మీరియా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనిల్ చౌహాన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దుండగులు ఎవరు, ఆయనపై ఎందుకు కాల్పులు జరిపారన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. దీనిపై తమకు ఫిర్యాదు అందిందని, నిందితులను గుర్తించి పట్టుకునేందుకు గాలింపు మొదలుపెట్టామని ముంబై పోలీసు అధికారి అవినాష్ అంబురే తెలిపారు. -
బడా కార్ల దొంగ బుక్కయ్యాడు
గువాహటి: కార్లకు అతడంటే హడల్.. అదేంటని అనుకుంటున్నారా.. ఒంటరిగా కారు కనిపించిందో చిటుక్కున అతడు మాయం చేస్తాడు. అదేదో అతడు ఉండే చోట కాదు.. మొత్తం దేశ వ్యాప్తంగా ఇదే తంతు. బిజినెస్మెన్ చిత్రంలో సూర్యభాయ్ (మహేశ్‌బాబు) నెట్ వర్క్ మాదిరిగా ఈ కార్ల దొంగకు దేశమంతటా పెద్ద నెట్వర్క్ ఉంది. ఇప్పుడా కార్ల గజదొంగ పోలీసుల చేతికి చిక్కాడు. వివరాల్లోకి వెళితే... దేశ వ్యాప్తంగా పలు కార్ల దొంగతనాలకు పాల్పడుతున్న అనిల్ చవాన్‌ను గువాహటి పోలీసులు శుక్రవారం అజారాలో అరెస్టు చేశారు. అతడి కీలక అనుచరుడు మమూద్ చౌదరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే, అతడి కోసం తీవ్రంగా గాలింపులు జరుపుతున్న ముంబయి, న్యూఢిల్లీ, మేఘాలయ పోలీసులకు సమాచారం అందించారు. అరెస్టుతోపాటు అనిల్ చవాన్ నుంచి తుపాకీ, ఐదు రౌండ్ల బుల్లెట్లు, వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న ఆటోమోబైల్ దొంగతనాలు, ముఖ్యంగా కార్ల దొంగతనాల్లో అనిల్‌ది అందె వేసిన చేయి అని, దేశవ్యాప్తంగా అతడు చాలా ప్రభావం కలిగినవాడని తెలిపారు. ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నామని చెప్పారు.