గగనతలంలో భారత్ తన సామర్థ్యాన్ని మరోమారు సగర్వంగా నిరూపించుకుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన, అణు సామర్థ్యం కలిగిన పృథ్వి-2 క్షిపణిని ఒడిసాలోని ఓ సైనిక స్థావరం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. భూమి మీద నుంచి భూమ్మీద ఉండే లక్ష్యాల మీదకు సంధించగలిగే ఈ బాలిస్టిక్ క్షిపణిని సోమవారం తెల్లవారుజామున ప్రయోగించారు.
ఈ క్షిపణి సామర్థ్యం 350 కిలోమీటర్లు. భువనేశ్వర్కు 230 కిలోమీటర్ల దూరంలోని బాలాసోర్ జిల్లాలో గల చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజి నుంచి దీన్ని ప్రయోగించారు. భారత సైనిక దళాలు తమ సాధారణ విన్యాసాల్లో భాగంగానే దీన్ని ప్రయోగించినట్లు అధికారులు చెబుతున్నారు.
సరిహద్దుల్లో పదే పదే ఉద్రిక్తతలు నెలకొంటుండటంతో, తమ సామర్థ్యాన్ని అంతర్జాతీయ యవనికపై మరో్మారు ప్రదర్శించి తీరాలన్న నిర్ణయానికే భారత్ వచ్చినట్లుందని, అందుకే మరోమారు అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న పృథ్విని ప్రయోగించినట్లు భావిస్తున్నారు.
పృథ్వి-2 క్షిపణి ప్రయోగం విజయవంతం
Published Mon, Aug 12 2013 10:24 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM
Advertisement