Prithvi-2
-
పృథ్వీ-2 పరీక్ష విజయవంతం
బాలాసోర్(ఒడిశా): భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ(డీఆర్డీవో) స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన పృథ్వీ-2 అణ్వస్త్ర క్షిపణి మరోసారి సత్తా చాటింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ వద్ద గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి గురువారం ఉదయం 9:20 గంటలకు పృథ్వీ-2 క్షిపణిని సైన్యం విజయవంతంగా పరీక్షించింది. -
పృథ్వీ-2, ధనుష్ క్షిపణుల పరీక్షలు సక్సెస్
బాలాసోర్(ఒడిశా): అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న పృథ్వీ-2, ధనుష్ క్షిపణులను భారత సైన్యం మరోసారి విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వీటిని సాధారణ పరీక్షల్లో భాగంగా శుక్రవారం ఒడిశా తీరంలో వేర్వేరుగా ప్రయోగించారు. ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణుల పరీక్షలు విజయవంతం కావడంతో భారత బలగాల రక్షణ సన్నద్ధత బలోపేతమైంది. పృథ్వీ-2ను చాందీపూర్ దగ్గర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లోని మొబైల్ లాంచర్ నుంచి ఉదయం 10.45 గంటలకు ప్రయోగించారు. వెయ్యి కిలోల పేలుడు పదార్థాలు మోసుకెళ్లే ఈ క్షిపణి 350 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. పృథ్వీకి నేవీ వెర్షన్ అయిన ధనుష్‌ను రాత్రి 7.40కు బంగాళాఖాతంలో ఓ నౌకపై నుంచి ప్రయోగించి, లక్ష్యాన్ని ఛేదించారు. వెయ్యి కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లే ధనుష్ కూడా 350 కి.మీ దూరంలోని లక్ష్యాలను చేదిస్తుంది. -
అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న పృథ్వి-2 క్షిపణి పరీక్ష విజయవంతం
భూతలం నుంచి భూతలం మీదకు ప్రయోగించగల అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న క్షిపణి పృథ్వి-2ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిషాలోని ఓ సైనిక స్థావరం నుంచి దీన్ని వరుసగా రెండు నెలల్లో మూడోసారి విజయవంతంగా పరీక్షించినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ బాలిస్టిక్ క్షిపణి రేంజి 350 కిలోమీటర్లు. దీన్ని బాలాసోర్ జిల్లాలోని చాందీపూర్ టెస్టురేంజి నుంచి ప్రయోగించారు. ప్రయోగం నూటికి నూరుశాతం విజయవంతం అయ్యిందని ప్రధాన లక్ష్యాలన్నింటినీ ఇది చేరిందని టెస్టు రేంజి డైరెక్టర్ ఎంవీకేవీ ప్రసాద్ తెలిపారు. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్.ఎఫ్.సి.) ఈ పరీక్షను నిర్వహించిందన్నారు. ఇంతకుముందు అక్టోబర్ 7, 8 తేదీలలో కూడా ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. పూర్తిగా భారత్‌లోనే తయారైన వాటిలో ఇది మొట్టమొదటి బాలిస్టిక్ క్షిపణి. ఇది 500 కిలోల బరువున్న అణు వార్హెడ్లను మోసుకెళ్లగలదు. 483 సెకండ్లలోనే 43.5 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్తుంది. ఇది రాడార్ల కంటిని తప్పించుకుని మరీ వెళ్లి, లక్ష్యాలను కొద్ది మీటర్ల కచ్చితత్వంతో ఛేదించగలదు. -
పృథ్వి-2 క్షిపణి ప్రయోగం విజయవంతం
గగనతలంలో భారత్ తన సామర్థ్యాన్ని మరోమారు సగర్వంగా నిరూపించుకుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన, అణు సామర్థ్యం కలిగిన పృథ్వి-2 క్షిపణిని ఒడిసాలోని ఓ సైనిక స్థావరం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. భూమి మీద నుంచి భూమ్మీద ఉండే లక్ష్యాల మీదకు సంధించగలిగే ఈ బాలిస్టిక్ క్షిపణిని సోమవారం తెల్లవారుజామున ప్రయోగించారు. ఈ క్షిపణి సామర్థ్యం 350 కిలోమీటర్లు. భువనేశ్వర్‌కు 230 కిలోమీటర్ల దూరంలోని బాలాసోర్ జిల్లాలో గల చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజి నుంచి దీన్ని ప్రయోగించారు. భారత సైనిక దళాలు తమ సాధారణ విన్యాసాల్లో భాగంగానే దీన్ని ప్రయోగించినట్లు అధికారులు చెబుతున్నారు. సరిహద్దుల్లో పదే పదే ఉద్రిక్తతలు నెలకొంటుండటంతో, తమ సామర్థ్యాన్ని అంతర్జాతీయ యవనికపై మరో్మారు ప్రదర్శించి తీరాలన్న నిర్ణయానికే భారత్ వచ్చినట్లుందని, అందుకే మరోమారు అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న పృథ్విని ప్రయోగించినట్లు భావిస్తున్నారు.