పృథ్వీ-2, ధనుష్ క్షిపణుల పరీక్షలు సక్సెస్ | Prithvi-2, Dhanush missile tests Success | Sakshi
Sakshi News home page

పృథ్వీ-2, ధనుష్ క్షిపణుల పరీక్షలు సక్సెస్

Published Sat, Nov 15 2014 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

Prithvi-2, Dhanush missile tests Success

బాలాసోర్(ఒడిశా): అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న పృథ్వీ-2, ధనుష్  క్షిపణులను భారత సైన్యం మరోసారి విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వీటిని సాధారణ పరీక్షల్లో భాగంగా శుక్రవారం ఒడిశా తీరంలో వేర్వేరుగా ప్రయోగించారు. ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణుల పరీక్షలు విజయవంతం కావడంతో భారత బలగాల రక్షణ సన్నద్ధత బలోపేతమైంది.

పృథ్వీ-2ను చాందీపూర్ దగ్గర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లోని మొబైల్ లాంచర్ నుంచి ఉదయం 10.45 గంటలకు ప్రయోగించారు. వెయ్యి కిలోల పేలుడు పదార్థాలు మోసుకెళ్లే ఈ క్షిపణి 350 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. పృథ్వీకి నేవీ వెర్షన్ అయిన ధనుష్‌ను రాత్రి 7.40కు బంగాళాఖాతంలో ఓ నౌకపై నుంచి ప్రయోగించి, లక్ష్యాన్ని ఛేదించారు. వెయ్యి కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లే ధనుష్ కూడా 350 కి.మీ దూరంలోని లక్ష్యాలను చేదిస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement