![DRDO successfully tests RudraM-II missile](/styles/webp/s3/article_images/2024/05/30/rudra.jpg.webp?itok=WiDBDvxS)
న్యూఢిల్లీ: ఆకాశంలో నుంచి భూమి పైనున్న లక్ష్యాలపైకి ప్రయోగించే రుద్ర ఎం–2 మిస్సైల్‌ను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరం నుంచి ఎస్‌యూ–30 ఫైటర్ జెట్ ద్వారా ప్రయోగించిన రుద్ర నిర్దేశించిన అన్ని లక్ష్యాలను అందుకుందని రక్షణమంత్రిత్వ శాఖ వెల్లడించింది. రుద్ర ఎం–2 మిస్సైల్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.
డీఆర్‌డీఓకు చెందిన పలు లాబోరేటరీలు రూపొందించిన సాంకేతికతలను ఇందులో వాడారు. నేలపై ఉన్న పలురకాల శత్రు లక్ష్యాలను చేధించేందుకు రుద్ర క్షిపణిని అభివృద్ధి చేశారు. రుద్ర ఎం–2ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్‌డీఓ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభినందించారు. రుద్ర ఎం–2 క్షిపణి పరీక్ష విజయవంతం కావడం భారత సాయుధబలగాల బలాన్ని రెట్టింపు చేస్తుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment