Agni 5
-
Srinath Ravichandran: స్పేస్ టెక్ స్టార్టప్ - అంతరిక్షంలో అగ్ని సంతకం!
ఏరో స్పేస్ టెక్నాలజీ అనగానే విదేశాల వైపు చూసే ఎంతోమందికి మన సత్తా చూపించిన స్టార్టప్‌లలో ‘అగ్నికుల్ కాస్మోస్’ ఒకటి. ఆకాశమంత కలతో బయలుదేరిన ‘అగ్నికుల్’ అమ్ముల పొదిలో దివ్యాస్త్రం అగ్నిబాణ్.. ‘అగ్నికుల్’ అంటే భారత అంతరిక్ష రంగంలో ఆత్మనిర్భర్ విజయగాథ. ఐఐటీ–మద్రాస్ కేంద్రంగా పని చేస్తున్న ‘అగ్నికుల్ కాస్మోస్’ త్రీడీ ప్రింటెట్ రాకెట్ ఇంజిన్‌ను తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రశంసలు అందుకుంది. స్నేహితుడు మోహిన్, ప్రొఫెసర్ చక్రవర్తిలతో కలిసి 2017లో ‘అగ్నికుల్’ను లాంచ్ చేశాడు శ్రీనాథ్ రవిచంద్రన్. మన దేశంలోని ఫస్ట్ ప్రైవేట్ స్మాల్ శాటిలైట్ రాకెట్ ‘అగ్నిబాణ్’ను నిర్మించింది అగ్నికుల్. 30 కిలోల నుండి 300 కిలోల బరువు ఉన్న పేలోడ్‌ను తక్కువ భూకక్ష్యలోకి (సుమారు ఏడువందల కిలోమీటర్ల ఎత్తు) తీసుకువెళ్లే సామర్థ్యం దీని సొంతం. 2020లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)తో ఒప్పందం కుదర్చుకున్న తొలి భారతీయ కంపెనీగా ప్రత్యేకత సాధించింది అగ్నికుల్. ఒప్పందం ద్వారా ‘అగ్నిబాణ్’ నిర్మాణంలో ‘ఇస్రో’ సహాయ, సహకారాలను తీసుకుంది. ప్లగ్–అండ్–ప్లే ఇంజిన్ కాన్ఫిగరేషన్ సామర్థ్యం ఉన్న అగ్నిబాణ్, మిషన్ అవసరాలకు ఖచ్చితంగా సరిపోయేలా కాన్ఫిగర్ చేయగలదు. ప్రతి క్లయింట్‌కు సంబంధించిన ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా కాన్ఫిగర్ చేయవచ్చు. 3డీ సాంకేతికతతో రూపొందించిన ఈ రాకెట్ ఉపగ్రహ ప్రయోగాల ఖర్చును తగ్గిస్తుంది. మొదట్లో వారానికి కనీసం రెండు రాకెట్ ఇంజిన్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఆ తరువాత నాలుగు ఇంజిన్లకు విస్తరించింది అగ్నికుల్. ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్లింది. ‘మోర్ యాక్సెసబుల్ అండ్ అఫర్డబుల్’ లక్ష్యంతో బయలు దేరిన శ్రీనాథ్ రవిచంద్రన్, మోయిన్‌లు మరిన్ని లక్ష్యాలు నిర్దేశించుకోవడానికి రెడీ అవుతున్నారు. "శ్రీహరి కోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈరోజు లాంచ్ చేయాల్సిన ‘అగ్నిబాణ్’ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది." ఆత్మవిశ్వాసమే అద్భుత శక్తి.. 2017లో ‘అగ్నికుల్’తో శ్రీనాథ్ రవిచంద్రన్, మోయిన్‌లు ప్రయాణం మొదలు పెట్టినప్పుడు ఇన్వెస్టర్ల నుంచి విశ్లేషకుల వరకు ‘మన దేశంలో ఇది సాధ్యమా? ఈ కుర్రాళ్ల వల్ల అవుతుందా’ అనే అనుమాన నీడ ఉండేది. అయితే శ్రీనాథ్, మోహిన్లు ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఆత్మవిశ్వాసం అనే అద్భుతశక్తితో ముందుకు కదిలారు. నాలుగు వందల వరకు పిచ్ మీటింగ్‌లు నిర్వహించిన తరువాతే ఫస్ట్ రౌండ్ ఫండింగ్ 2018లో వచ్చింది. అనుమాన నీడ వెనక్కి వెళ్లి ‘అగ్నికుల్’ పేరు ప్రపంచానికి పరిచయం కావడానికి ఎంతోకాలం పట్టలేదు. మన దేశంలో స్పేస్ టెక్ స్టార్టప్‌ల విజయాన్ని దృష్టిలో పెట్టుకొని ‘ఏరోస్పేస్ డిగ్రీలు చేయడానికి చాలామంది విదేశాలకు వెళ్లాలనుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక్కడే ఉండాలనుకుంటున్నారు’ అంటున్నాడు ‘అగ్నికుల్’ కో–ఫౌండర్, సీయివో శ్రీనాథ్ రవిచంద్రన్. — శ్రీనాథ్ రవిచంద్రన్, ‘అగ్నికుల్ కో–ఫౌండర్, సీయివో. -
తోకచుక్కగా భ్రమించారు.. చివరకు అగ్ని-5గా తేల్చారు!
న్యూఢిల్లీ: భారత్‌లో పలు ప్రాంతాల్లో గురువారం ఆకాశంలో మిరుమిట్లు గొలిపే కాంతి దర్శనమిచ్చింది. వేగంగా కదులుతున్న ఈ వెలుగు రేఖను చూసి తోకచుక్క కావొచ్చని జనం భావించారు. కొందరు అంతరిక్షం నుంచి జారిపడిన గ్రహశిలగా భ్రమించారు. మరికొందరు ఫ్లయింగ్ సాసరని బల్లగుద్ది మరీ చెప్పారు. ఈ ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. చివరికి అది మన ఖండాంతర అణు క్షిపణి అగ్ని–5 అని అధికారులు స్పష్టం చేసి ఊహాగానాలకు తెర దించారు! దాన్ని ఒడిశా తీరం నుంచి గురువారం విజయవంతంగా ప్రయోగించడం తెలిసిందే. ఈ క్షిపణి పొడవు 17 మీటర్లు. 1.5 టన్నుల వార్హెడ్లను మోసుకెళ్లగలదు. అగ్ని–1, అగ్ని–2, అగ్ని–3, అగ్ని–4 మిస్సైళ్ల పరిధి 700 కిలోమీటర్ల నుంచి 3,5000 కిలోమీటర్లు కాగా, మూడు దశల సాలిడ్ రాకెట్ ఇంజన్‌తో కూడిన అగ్ని–5 పరిధి ఏకంగా 5,000 కిలోమీటర్లు కావడం గమనార్హం. 5,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదని సైనిక వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఇప్పటిదాకా ఇదే అత్యధిక లాంగ్–రేంజ్ మిస్సైల్ కావడం విశేషం. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగిస్తారు. చైనా ఉత్తర ప్రాంతంతో సహా మొత్తం ఆసియా ఈ క్షిపణి పరిధిలోకి వస్తుంది. ఐరోపా ఖండంలోని కొన్ని ప్రాంతాలు సైతం అగ్ని–5 స్ట్రైకింగ్ రేంజ్లో ఉన్నాయి. క్షిపణి ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతమైందని అధికార వర్గాలు తెలియజేశాయి. అగ్ని–5 త్వరలోనే భారత సైన్యంలో ప్రవేశపెట్టనున్నారు. -
అగ్ని-5 ప్రయోగం విజయవంతం.. 5,500 కిమీ లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం
భువనేశ్వర్: అగ్ని-5 అణు బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. డమ్మీ వార్‌హెడ్స్‌తో అగ్ని-5 క్షిపణులను ప్రయోగించారు. 5,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈ మిసైల్స్ ఛేదించగలవు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి అత్యంత కీలకమైన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత శాస్త్రవేత్తలు మరో మైలురాయిని చేరుకున్నట్లయింది. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సరిహద్దులో చైనా బలగాలలతో ఘర్షణ జరిగిన కొద్ది రోజులకే అగ్ని-5 ప్రయోగం జరగడం గమనార్హం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ మిసైల్స్.. సుదూర లక్ష్యాలను ఛేదించగలవు. ఈ ప్రయోగంపై చైనా గతంలో అభ్యతరం కూడా తెలిపింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని సాకుగా చూపింది. భారత్ మాత్రం యథావిధిగా ప్రయోగాన్ని విజయవంతంగా ముగించింది. చదవండి: గతం గతహా.. వాళ్లతో నన్ను పోల్చకండి.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు -
త్వరలో మిలిటరీకి అగ్ని–5
న్యూఢిల్లీ: ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ అగ్ని–5ను ప్రవేశపెట్టేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్షిపణులతో చైనా వ్యాప్తంగా లక్ష్యాలను ఛేదించవచ్చు. 5 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని కూడా ఛేదించగలిగే ఈ అగ్ని–5.. అణ్వస్త్రాలను కూడా మోసుకెళ్లగలిగే సామర్థ్యం కలిగి ఉంది. మిలిటరీలోని స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్ఎఫ్సీ) విభాగంలో ఈ క్షిపణిని ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. చైనాలోని బీజింగ్, షాంఘై, గువాంగ్జో వంటి నగరాలను సైతం లక్ష్యంగా చేసుకుని దాడులు చేయగలదు. గత నెలలో ఒడిశాలోని సముద్రతీర ప్రాంతంలో అగ్ని–5ని విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. ఈ క్షిపణిని ప్రవేశపెట్టే ముందు వచ్చే కొన్ని వారాల్లో పలు పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కీలకమైన ప్రాజెక్టు తుది దశకు చేరుకుందని క్షిపణి రూపకల్పనలో పాలుపంచుకున్న ఓ అధికారి పేర్కొన్నారు. అగ్ని శ్రేణిలో అగ్ని–5 చాలా సాంకేతికత పరంగా చాలా ముందు వరుసలో ఉందని, అణ్వస్త్రాలను మోసుకెళ్లడంలో బాగా అభివృద్ధి చెందిందని వివరించారు. ‘మొదటి బ్యాచ్ అగ్ని–5 క్షిపణులను ఎస్ఎఫ్సీ విభాగానికి త్వరలోనే అందించనున్నాం’అని ఆయన వెల్లడించారు. పొరుగు దేశాల నుంచి రక్షణ పరమైన ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో అగ్ని–5ను ప్రవేశపెట్టనుండటం గుర్తించదగిన విశేషం. ఖండాంతర క్షిపణులను అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్, ఉత్తర కొరియా వంటి దేశాలు మాత్రమే కలిగి ఉన్నాయి. అగ్ని–5 క్షిపణిని 2012 ఏప్రిల్ 19న తొలిసారిగా పరీక్షించగా, రెండోసారి 2013 సెప్టెంబర్ 15న, మూడోసారి 2015 జనవరి 31న, నాలుగోసారి 2016 డిసెంబర్ 26న పరీక్షించారు. ఐదోసారి ఈ ఏడాది జనవరి 18న పరీక్షించగా, అన్నింట్లో అగ్ని–5 విజయం సాధించింది. దేశ రక్షణ విషయంలో మరింత ముందుకు సాగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కీలకమైన ప్రాజెక్టులను రూపొందిస్తోంది. -
అగ్ని5కి ఆఖరి టెస్ట్.. ఇక చైనాకు చెక్!
-
అగ్ని -5 క్షిపణి పరీక్ష విజయవంతం
-
అగ్ని5కి ఆఖరి టెస్ట్.. ఇక చైనాకు చెక్!
భువనేశ్వర్: స్వదేశీ పరిజ్ఞానంతో డిఫెన్స్ రిసెర్స్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) రూపొందించిన అగ్ని-5 ఖండాంతర క్షిపణిని మరోసారి విజయవంతంగా పరీక్షించారు. ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌లో గల కలామ్ ఐల్యాండ్ నుంచి సోమవారం ఉదయం శాస్త్రవేత్తలు ఈ క్షిపణిని పరీక్షించారు. ఈ అగ్ని-5 క్షిపణి 5వేల నుంచి ఆరు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇంకా చెప్పాలంటే ఉత్తర చైనాలోని ఏప్రాంతాన్నైనా అగ్ని-5లక్ష్యంగా చేసుకోగలదు. ఉపరితలం నుంచి ఉపరితలానికి దాదాపు 1500 కిలోల అణ్వస్త్రాలను ఒకేసారి మోసుకెళ్లగలుగుతుంది. ఈ క్షిపణికి పరీక్ష జరపడం ఇది నాలుగోసారి. గతంలో జరిపిన మూడు పరీక్షలు విజయవంతమయ్యాయి. తాజాగా జరిపిన పరీక్ష కూడా విజయవంతం కావడంతో ఇక సైన్యం చేతిలోకి క్షిపణి వెళ్లనుంది. మూడంచెల స్టేజ్ ఉండే అగ్ని-5.. 17 మీటర్ల పొడవు, 50 టన్నుల బరువు కలిగి ఉంటుంది. 5వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను పక్కాగా ఛేదించగలదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ క్షిపణిని రూపొందించారు. అయితే దీని రేంజ్ 8వేల కిలోమీటర్లకు పైగా ఉంటుందనేది అనధికారిక సమాచారం. ఇప్పటికే భారత అమ్ములపొదిలో అగ్ని-1(700 కిలోమీటర్లు), అగ్ని-2(2వేల కిలోమీటర్లు), అగ్ని-3(2500 కిలోమీటర్లు), అగ్ని-4(3500 కిలోమీటర్ల లక్ష్య ఛేదన) క్షిపణులు ఉన్నాయి. ఈ పరీక్ష విజయవంతమైనందున రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ డీఆర్డీవోకు అభినందనలు తెలిపారు. అగ్ని-5 కొన్ని అంశాలు 1. 5,500 నుంచి 5,800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తుత్తునీయలు చేయగల ఖండాంతర క్షిపణి అగ్ని-5 2. దేశీయంగా సిద్ధం చేస్తున్న క్షిపణుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ క్షిపణిని డీఆర్డీవో రూపొందించి పర్యవేక్షిస్తోంది. 3.అగ్ని 5కు అణు సామర్థ్యం ఉంది. 1,500 కేజీల పేలుడు పదార్థాలను ఒకేసారి తీసుకెళ్లగలుగుతుంది 4. అగ్ని క్షిపణుల వరుసలో ఇది ఐదో తరంది. ఇప్పటికే భారత అమ్ములపొదిలో అగ్ని 1, 2, 3,4 ఉన్నాయి 5.అగ్ని 5 పూర్తి స్థాయి సామర్థ్యంతో విజయం సాధిస్తే సుదూరంలోని శత్రువులను ఈ క్షిపణిచే తుదముట్టించే అవకాశం ఉంటుంది. 6.అగ్ని 5 క్షిపణిని 2012, 2013, 2015లో పరీక్షించారు 7.నేడు ఒడిశాలోని వీలర్ ఐలాండ్‌లో జరిగిన పరీక్షే ఇక ఆఖరిది. 8.తాజా పరీక్ష విజయవంతం అయితే, దీనిని వ్యూహాత్మక బలగాలు తొలుత ఉపయోగించి అనంతరం మిలటరీకి అప్పగిస్తారు. -
మరోసారి అగ్ని-5 క్షిపణి ప్రయోగం