స్వదేశీ పరిజ్ఞానంతో డిఫెన్స్ రిసెర్స్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) రూపొందించిన అగ్ని-5 ఖండాంతర క్షిపణిని మరోసారి విజయవంతంగా పరీక్షించారు. ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌లో గల కలామ్ ఐల్యాండ్ నుంచి సోమవారం ఉదయం శాస్త్రవేత్తలు ఈ క్షిపణిని పరీక్షించారు. ఈ అగ్ని-5 క్షిపణి 5వేల నుంచి ఆరు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇంకా చెప్పాలంటే ఉత్తర చైనాలోని ఏప్రాంతాన్నైనా అగ్ని-5లక్ష్యంగా చేసుకోగలదు. ఉపరితలం నుంచి ఉపరితలానికి దాదాపు 1500 కిలోల అణ్వస్త్రాలను ఒకేసారి మోసుకెళ్లగలుగుతుంది.
Published Mon, Dec 26 2016 7:33 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
Advertisement