ట్రంప్ వేటు.. ఇరాన్ క్షిపణి పరీక్ష!
దుబాయ్: తాము ఓ కొత్త అణు క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు ఇరాన్ స్పష్టం చేసింది. అయితే, అణు ఒప్పందాన్ని మాత్రం ఉల్లంఘించలేదని చెప్పింది. ఏడు ఇస్లామిక్ దేశాలకు చెందిన ముస్లింలపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న ఈ సమయంలోనే ఇరాన్ క్షిపణి పరీక్షలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ పరీక్షకు సంబంధించిన వివరాలు ఇరాన్ మంత్రి హోసెయిన్ దెహ్‌గాన్ చెబుతూ తాము పరీక్ష నిర్వహించింది వాస్తవమేనని, అయితే, అణు కార్యక్రమానికి సంబంధించిన నిబంధనలుగానీ ఉల్లంఘించడంగానీ, ఐక్యరాజ్యసమితి జాతీయ భద్రాతా మండలి తీర్మాణానికి వ్యతిరేకంగాగానీ చేయలేదని స్పష్టం చేశారు. ఇరాన్ ఆదివారం 1,010కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణిని పరీక్షించినట్లు అమెరికా అధికారులు అన్నారు. ఆ క్షిపణి లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత పేలిందని కూడా తెలిపారు.