
ఉత్తర కొరియా దూకుడు.. మరి ట్రంప్ స్పందన!
సియోల్: ఉత్తర కొరియా తన దూకుడు కొనసాగిస్తోంది. ఆదివారం మరోసారి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలను నిర్వహించింది. ఉదయం 7:55 గంటలకు ఉత్తర ప్యోంగాన్ ప్రావిన్స్లోని బాంగ్యోన్ ఎయిర్‌బేస్ నుంచి ఉత్తర కొరియా క్షిపణి పరీక్షను నిర్వహించిందని దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పరీక్షించిన క్షిపణి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో జపాన్ సముద్రంలో పడిందని ఉత్తర కొరియా రక్షణ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే.. ఇది ఏ తరహాకు చెందిన క్షిపణి అనే విషయం తెలియాల్సి ఉందన్నారు.
ఒబామా అయినా ట్రంప్ అయినా తమ విధానం మారదని.. తన క్షిపణి పరీక్షలతో ఉత్తర కొరియా స్పష్టం చేసింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి కావడంతో.. ట్రంప్ స్పందనను తెలుసుకునేందుకే ఈ పరీక్షలు నిర్వహించిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.