‘ఎయిర్‌ క్యావల్రీ’ ప్రయోగం | Indian Army tests Air Cavalry | Sakshi
Sakshi News home page

‘ఎయిర్‌ క్యావల్రీ’ ప్రయోగం

Published Mon, May 14 2018 5:15 AM | Last Updated on Mon, May 14 2018 5:15 AM

Indian Army tests Air Cavalry - Sakshi

జైపూర్‌: శత్రుసైన్యంపై మరింత వ్యూహాత్మకంగా దాడి చేసేందుకు భారత ఆర్మీ ‘ఎయిర్‌ క్యావల్రీ’ అనే నూతన విధానాన్ని ఇటీవల పరీక్షించింది. భూమిపై ఉన్న శత్రువులను కనిపెట్టి వారిపై దాడి చేసేందుకు వియత్నాం యుద్ధం సమయంలో అమెరికా ఈ విధానాన్ని ఉపయోగించింది. భవిష్యత్తు కాలానికి అను గుణంగా రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడం కోసం భారత సైన్యం ఎయిర్‌ క్యావల్రీ విధానాన్ని రాజస్తాన్‌లోని ఎడారి ప్రాంతంలో  ఈ పరీక్ష జరిపింది. ‘విజయ్‌ ప్రహార్‌’ పేరుతో భారత సైన్యం నైరుతి విభాగం ఈ కొత్త పద్ధతిని ప్రయోగాత్మకంగా పరిశీలించిందని రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్‌ కల్నల్‌ మనీశ్‌ ఓజా చెప్పారు. ఈ విధానంలో భూమిపై ఉన్న యుద్ధ ట్యాంకులు, దళాలతో సమన్వయం చేసుకుంటూ హెలికాప్టర్లు శత్రు సైన్యం, శిబిరాలపై దాడులు చేస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement