జైపూర్: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో ప్రధాన నాయకుడిగా ఉన్న రాకేశ్ టికాయత్ కారుపై దాడి గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలు పగులగొట్టి బీభత్సం సృష్టించారు. ఆయన కారుతో పాటు మరికొన్ని కారులపై దాడి చేశారు. అయితే ఈ దాడిని బీజేపీ దుండగుల దాడిగా టికాయత్ ఆరోపించారు. రాజస్థాన్ అల్వార్ జిల్లా టాటర్పూర్ గ్రామంలో జరిగిన రైతుల ఆందోళనలో టికాయత్ పాల్గొన్నారు. అక్కడి నుంచి బన్సూర్ తిరుగు ప్రయాణం కాగా ఈ ఘటన జరిగింది.
తమ కార్లపై దాడి జరిగిందని భారత్ కిసాన్ యూనియన్ (బీకేయూ) రాకేశ్ టికాయత్ వీడియో సోషల్ మీడియాలో విడుదల చేశారు. బీజేపీ గూండాలు దాడి చేశారని ఆరోపణలు చేశారు. ఈ ఘటనతో ప్రజాస్వామ్యం మరణించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడికి నిరసనగా రైతులు ఢిల్లీ-ఘాజీపూర్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. బన్సూర్‌కు ప్రయాణిస్తున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం రైతు ఉద్యమం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలనే డిమాండ్‌తో మే నెలలో పార్లమెంట్ ముట్టడి చేపడతామని 40 రైతు సంఘాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
राजस्थान के अलवर जिले के ततारपुर चौराहा, बानसूर रोड़ पर भाजपा के गुंडों द्वारा जानलेवा पर हमला किए गए, लोकतंत्र के हत्या की तस्वीरें pic.twitter.com/aBN9ej7AXS
— Rakesh Tikait (@RakeshTikaitBKU) April 2, 2021
Comments
Please login to add a commentAdd a comment