చార్భుజనాథ్‌ ఊరేగింపుపై రాళ్ల దాడి.. ఒకరు మృతి! | Sakshi
Sakshi News home page

Rajasthan: చార్భుజనాథ్‌ ఊరేగింపుపై రాళ్ల దాడి.. ఒకరు మృతి!

Published Wed, Mar 20 2024 11:46 AM

Tension After Stone Pelting on the Procession of Lord Charbhuja Nath - Sakshi

రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో జరిగిన చార్భుజనాథ్ ఊరేగింపుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనతో ఇక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఒక వర్గానికి చెందినవారు ఈ రాళ్లదాడికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిత్తోర్‌గఢ్ జిల్లాలోని రష్మీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహూనా గ్రామంలో దశమి సందర్భంగా చార్భుజనాథ్‌ ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపు పట్టణంలోని ప్రధాన మార్కెట్‌ సమీపంలోకి రాగానే ఏదో ఒక విషయమై వాగ్వాదం జరిగి రాళ్లదాడి చోటచేసుకుంది. ఈ ఘటనలో శ్యామ్ చిపా అనే వ్యక్తి మృతి చెందాడు. నవీన్ జైన్ అనే మరో వ్యక్తి గాయపడినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement