అమెరికా క్షిపణి ప్రయోగం సక్సెస్‌ | US Conducts First Cruise Missile Test | Sakshi
Sakshi News home page

అమెరికా క్షిపణి ప్రయోగం సక్సెస్‌

Published Wed, Aug 21 2019 9:10 AM | Last Updated on Wed, Aug 21 2019 9:12 AM

US Conducts First Cruise Missile Test - Sakshi

వాషింగ్టన్‌/మాస్కో: మధ్యశ్రేణి క్రూయిజ్‌ క్షిపణిని అగ్రరాజ్యం అమెరికా విజయవంతంగా ప్రయోగించింది. అణు సామర్ధ్యమున్న ఆయుధాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించిన కొద్ది వారాల్లోనే అమెరికా ఈ ప్రయోగం చేపట్టడం గమనార్హం. లాస్‌ఏంజెలెస్‌ సమీపంలోని సాన్‌ నికొలస్‌ దీవిలో ఆదివారం ఈ ప్రయోగం చేపట్టినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది.

భూమిపై నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించిందని పేర్కొంది. అయితే, ఈ క్షిపణిలో అణ్వాయుధాలు లేవని పేర్కొంది. అమెరికా చర్యపై రష్యా, చైనా మండిపడ్డాయి. అమెరికా చర్య ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారి తీస్తుందని విమర్శించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement