సియోల్: ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగం జరిపింది. ఆ దేశం మంగళవారం ఉదయం సముద్రంపైకి స్వల్ప శ్రేణి క్షిపణి ప్రయోగ పరీక్ష నిర్వహించిందని దక్షిణ కొరియా తెలిపింది. తాజా పరిణామంతో, దక్షిణ కొరియాతో చర్చలకు సిద్ధమంటూ ఇటీవలే ప్రకటించుకున్న ఉ.కొరియా చిత్తశుద్ధిపై పొరుగుదేశాలు అనుమానాలను వ్యక్తం చేశాయి. ఉ.కొరియా దుందుడుకు చర్య నేపథ్యంలో ద.కొరియా జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశం జరిపింది.
చదవండి: (పాక్ 12 ఉగ్ర సంస్థలకు నిలయం)
పొరుగుదేశం చర్యను తీవ్రంగా ఖండించింది. ఉ.కొరియా బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగించినట్లు భావిస్తున్నామని జపాన్ ప్రధాని యోషిహిడే సుగా అన్నారు. ఉ.కొరియా క్షిపణి ప్రయోగంతో అమెరికా ప్రజలకు ఎటువంటి తక్షణ ముప్పులేదని అమెరికా ఇండో–పసిఫిక్ కమాండ్ పేర్కొంది. బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించకుండా భద్రతామండలి ఆంక్షలు విధించినప్పటికీ ఉ.కొరియా 6 నెలల క్రితం కూడా క్రూయిజ్ మిస్సైళ్లను ప్రయోగించింది.
చదవండి: (డ్రాగన్ దుశ్చర్య.. 55 గుర్రాలపై భారతీయ భూభాగంలోకి..)
Comments
Please login to add a commentAdd a comment