ఇటీవల కాలంలో ఉత్తర కొరియా మిసైల్ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడూ తాజాగా మిసైల్ ప్రయోగ స్థావరంలోనే గ్రీన్ హౌస్ ఫామ్‌కి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పూర్వ రియోనిఫో వైమానికి స్థావరంలో ఈ గ్రీన్‌హౌస్ ఫాంని ప్రారంభించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ప్రారంభోత్సవానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హాజరయ్యారు. ఇది ఉత్తర కొరియాలో అతిపెద్ద కూరగాయాల ఫాంలో ఒకటిగా పేరుగాంచనుంది.
దీన్ని ఉత్తర కొరియాలో ప్రభలంగా ఉన్న ఆహార కొరత సమస్యలను పరిష్కరించడానికి ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ఫామ్ హౌస్ నిర్మించిన ప్రాంతంలోనే 2019, 2021 వరసగా కెఎన్ 25, కెఎన్ 23 వంటి స్వల్స బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను నిర్వహించింది. ఈ ఫాం హౌస్‌ని ఉత్తర కొరియాలో ప్రధాన సెలవు దినమైన పాలకుల వర్కర్స్ పార్టీ స్థాపన వార్షికోత్సవం రోజున ప్రారంభించింది. ఉత్తరకొరియా ప్రజల కోసం గత డిసెంబర్‌లోనే ఈ ఫామ్‌ను ఆటోమెటెడ్‌గా మార్చే ప్రాజెక్టుని ప్రారంభించింది.
ఈ వ్యవసాయ క్షేత్రంలో సుమారు 280 హెక్టారుల విస్తీర్ణంలో 850కి పైగా గ్రీన్‌హౌస్ ఫామ్‌లు ఉన్నాయి. అంతేగాదు ఈ ఫాం హౌస్‌ని కొద్దినెలల్లోనే పూర్తి చేసినందుకు కార్మికులను, సైనికులను కిమ్ ప్రశంసించారు. అంతేగాదు ఇలాంటి మరిన్ని ఫామ్ హౌస్‌లను అభివృద్ధి చేయాలని శాస్త్రీయ పద్ధతుల్లో కూరగాయలను ఉత్పత్తి చేయాలని ఆదేశించారు. ఒకపక్క దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా నౌకదళ విన్యాసాలు చేశాయన్న అక్కసుతో మిసైల్ దూకుడుతో కవ్వింపు చర్యలకు దిగింది. మరోవైపు దేశ ప్రజల ఆహార కొరత సమస్యను పరిష్కరించే దిశగా వైమానిక ప్రయోగా స్థావరాల్లోనే ఫామ్ హౌస్‌లను ఏర్పాటు చేసి ఆశ్చర్యపరించింది. ఏదైనా కిమ్‌కే చెల్లింది.
(చదవండి: ఐరాసలో రష్యాకు భారత్ షాక్.. కీలక ఓటింగ్‌లోనూ భారీ షాక్ ఇస్తుందా?)
Comments
Please login to add a commentAdd a comment