form
-
సెలబ్రిటీల రూపంలో గణనాథులు.. పుష్ప వినాయకుడిని చూశారా? (ఫోటోలు)
-
వ్యాపారులు, వృత్తి నిపుణులకు.. ఫారం 3
ఒక్క మాటలో చెప్పాలంటే ఫారం 1,2 .. జీతం మీద ఆదాయం వచ్చిన వారే వేయాలి. మిగిలిన ఫారాలు ఏవి కూడా వేతన జీవులకు వర్తించవు. ఈ ఫారం–3, అలాగే ఇక నుంచి వచ్చే ఫారాలు వ్యాపారం లేదా వృత్తి మీద ఆదాయం ఉన్న వారికే వర్తిస్తాయి. ఫారం–3ని వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు వాడాలి.ఇది చాలా పెద్ద ఫారం అని చెప్పవచ్చు. నిడివిపరంగా అనడం లేదు.. ఇవ్వాల్సిన వివరాలు ఎక్కువ..సంఖ్య ఎక్కువ.వ్యక్తులు, హిందు ఉమ్మడి కుటుంబాలు వేయొచ్చు.ముఖ్యమైన రూలు ఏమిటంటే వ్యాపారం / లేదా వృత్తి మీద ఆదాయం ఉన్నవారు మాత్రమే ఫారం–3ని వేయాలి.ఆదాయపు పన్ను చట్టప్రకారం వ్యాపారానికొక రకమైన ఫారం, వృత్తి నిపుణులకొక రకమైన ఫారం లేదు. అందరికీ ఒకే ఫారం.‘వ్యాపారం’ అనే పదానికి నిర్వచనంలోనే ఎన్నో వాటితో పాటు ‘వృత్తి’ని కలిపారు.వ్యక్తులు/కుటుంబాలకు ట్యాక్స్ ఆడిట్ వర్తించినా, వర్తించకపోయినా ఈ ఫారం వేయాలి.ఈ రిటర్నులో ఇంటి మీద ఆదాయం, జీతం, పెన్షన్, వ్యాపారం/వృత్తి మీద ఆదాయం, ఇతర ఆదాయాలు, మూలధన లాభాలు.. అంటే చట్టంలో పొందుపర్చిన అన్నీ.. అంటే ఐదు శీర్షికల్లో ఏర్పడ్డ ఆదాయం ఉన్నవారు వేయొచ్చు.భాగస్వామ్యం నుంచి పారితోíÙకం వచ్చే వారు వేయొచ్చు.దీన్ని ‘మాస్టర్ ఫారం’ అని అనొచ్చు. ఎందుకంటే, వ్యక్తి లేదా ఉమ్మడి కుటుంబం ప్రతి ఆదాయం.. ఇండియాలో వచ్చినది కావొచ్చు విదేశాల నుంచి వచ్చినది కావొచ్చు.. ‘సర్వం’ ఇందులో కవర్ అవుతుంది.అంతే కాకుండా, ఆదాయం కానివి.. ఉదాహరణకు, అడ్వాన్సులకు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వాలి.ఆ ఆర్థిక సంవత్సరంలో జరిగిన పెద్ద లావాదేవీలు, ఇండియాలో గానీ విదేశాల్లో గానీ జరిగినవి ఇవ్వాలి.అలాగే, మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ల వివరాలు ఇవ్వాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ల వల్ల ఆదాయం ఏర్పడకపోయినా వివరాలు ఇవ్వాలి. ఉదాహరణగా ఒక ఇంటి కోసం భారీ మొత్తాన్ని అడ్వాన్సుగా ఇచ్చారు. ఇలాంటి వ్యవహారాలన్నింటిని కూడా పొందుపర్చాలి.కొంత నిర్దేశించిన టర్నోవరు దాటిన వారే అకౌంట్స్ బుక్స్ రాయాలి. కానీ మా సలహా ఏమిటంటే.. వ్యాపారం/వృత్తి ఉన్నవారు అకౌంట్స్ రాయండి. వ్యవహారం జరిగినప్పుడు స్పష్టంగా సమగ్రంగా అన్నీ ఒక చోట పర్మనెంట్ బుక్‌లో రాసుకోండి. వివరణ రాయండి.ఇలా రాసి ఉంచడం మీకు కాస్తంత శ్రమ కావచ్చు కానీ, తర్వాత రోజుల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఫారం నింపడానికి / దాఖలు చేయడానికి అవసరమైతే వృత్తి నిపుణుల సర్వీసులు తీసుకోండి.- కె.సీహెచ్, ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, - కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులుఇవి చదవండి: రూ. 27 లక్షల కోట్లకు గృహ రుణాలు.. -
TS: పథకం ఏదైనా ఒకటే దరఖాస్తు!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు సభల్లో ప్రజలు సమర్పించాల్సిన దరఖాస్తు ఫారాన్ని ప్రభుత్వ వర్గాలు సిద్ధం చేశాయి. అభయహస్తం పేరుతో రూపొందించిన ఈ ఉమ్మడి దరఖాస్తును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం విడుదల చేయనున్నట్లు సమాచారం. రెండు విభాగాలుగా ఉండే ఈ దరఖాస్తు ఫారంలో వ్యక్తిగత వివరాలతోపాటు ప్రభుత్వ పథకాల లబ్ధికి అవసరమయ్యే వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. మొదటి విభాగంలో దరఖాస్తుదారుని పేరు (ఇంటి యజమాని), లింగం, కులం, పుట్టిన తేదీ (ఆధార్ ప్రకారం), ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, వృత్తి, కుటుంబ సభ్యుల వివరాలతోపాటు చిరునామా, రేషన్‌కార్డు నంబర్ ఇవ్వాలి. అలాగే దరఖాస్తుదారుని ఫొటోను కూడా జత చేయాలి. రెండో విభాగంలో ఏ పథకం కింద లబ్ధి పొందాలనుకుంటున్నారో ఆ పథకానికి సంబంధించిన సమాచారం ఇవ్వాలి. దరఖాస్తు ఫారాలన్నీ బుధవారం రాత్రికల్లా గ్రామాలు, వార్డులకు చేరతాయని, వీలును బట్టి బుధవారం లేదంటే గురువారం నుంచి జరిగే సభలకు వచ్చే సరికి వాటిని దరఖాస్తుదారులు పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దరఖాస్తుతోపాటు ఆధార్ జిరాక్స్, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ జతపరచాలి. దరఖాస్తులో పేర్కొన్న వివరాలన్నీ నిజమేనని ధ్రువీకరిస్తూ సంతకం చేయాలి. ప్రతిపాదిత లబ్ధిదారులకు సంబంధిత అధికారులు దరఖాస్తును స్వీకరించినట్లు రశీదు అందించాలి. ఏ పథకం కోసం ఏయే వివరాలివ్వాలంటే... ► మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం కావాలంటే అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. రూ. 500 గ్యాస్ సిలిండర్ కోసం గ్యాస్ కనెక్షన్ నంబర్, సరఫరా చేస్తున్న కంపెనీ, సంవత్సరానికి వినియోగించే సిలెండర్ల సంఖ్యను పేర్కొనాలి. ► రైతు భరోసా పథకం కోసమైతే సాగు రైతా లేక కౌలు రైతో పేర్కొనాలి. సాగు రైతు అయితే దరఖాస్తులో పట్టాదారు పాస్‌బుక్ నంబర్ ఇవ్వాలి. కౌలు రైతు అయితే కౌలు చేస్తున్న భూమి వివరాలు సమర్పించాలి. వ్యవసాయ కూలీలైతే ఉపాధి హామీ కార్డు నంబర్ రాయాల్సి ఉంటుంది. ► ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లులేని వారు ఇంటి నిర్మాణ ఆర్థిక సాయం కోసం అని రాసి ఉన్న చోట టిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు 250 గజాల ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేయాలనుకుంటే అమరవీరుడి పేరు, అమరుడైన సంవత్సరం, ఎఫ్ఐఆర్ నంబర్, డెత్ సరి్టఫికెటనంబర్ సమర్పించాలి. ఉద్యమకారులైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సందర్భంగా అయిన కేసు తేదీ, సంఖ్య, జైలుకు వెళ్లి ఉంటే వాటి వివరాలను పేర్కొనాలి. ► గృహ జ్యోతి కింద నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందేందుకు విద్యుత్ మీటర్ కనెక్షన్ నంబర్ ఇవ్వాలి. ► చేయూత పథకం కింద నెలకు రూ. 4 వేల పింఛన్ కోసమైతే ఏ కేటగిరీ (వృద్ధాప్య, గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కారి్మకుల జీవన భృతి, ఒంటరి మహిళ జీవన భృతి, వితంతు, చేనేత కారి్మకులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఫైలేరియా బాధితులు, బీడీ టేకేదారు జీవన భృతి)లో పింఛన్ అడుగుతున్నారో టిక్ చేయాల్సి ఉంటుంది. దివ్యాంగుల రూ. 6 వేల పింఛన్ కోసమైతే సదరం సర్టిఫికెట్ నంబర్‌ను పేర్కొనాల్సి ఉంటుంది. -
బజరంగ్ దళ్ ఎప్పుడు, ఎలా ఆవిర్భవించింది? కాంగ్రెస్‌తో దీనికి కనెక్షన్ ఏమిటి?
బజరంగ్ దళ్ మరోమారు చర్చల్లోకి వచ్చింది. హరియాణాలోని నూహ్(మేవాత్)లో జరిగిన హింసాకాండ నిందితుడు బిట్టూ బజరంగీ, ఉరఫ్ రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తాను బజరంగ్దళ్ నేతనని స్వయంగా బిట్టూ ప్రకటించుకున్నాడు. అయితే విశ్వహిందూ పరిషత్ బిట్టూకు, బజరంగ్‌దళ్‌కు ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. కాగా బజరంగ్ దళ్పేరు చర్చల్లోకి రావడం ఇదేమీ మొదటిసారి కాదు. బజరంగ్ దళ్ ఎలా ఏర్పాటయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం. ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ అనంతరం అది జూలై 1984..‘ఆపరేషన్ బ్లూ స్టార్’ ముగిసి నెల రోజులు పూర్తయింది. అయినా పంజాబ్‌లో హిందువులపై తరచూ హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంతలో అయోధ్యలోని రామజన్మభూమికి విముక్తి కల్పించేందుకు విశ్వహిందూ పరిషత్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి గోరఖ్‌నాథ్ మఠం అధిపతి మహంత్ వైద్యనాథ్ నేతృత్వం వహించగా, కాంగ్రెస్ నేత దౌ దయాల్ ఖన్నా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1984 సెప్టెంబరులో ఈ కమిటీ బీహార్‌లోని సీతామర్హి నుండి అయోధ్య వరకు 400 కిలోమీటర్ల యాత్రను ప్రారంభించింది. సరయూ ఒడ్డున భారీ కార్యక్రమం యాత్రలో ఊరేగింపునకు ముందు ఒక ట్రక్కులో రాముడు, సీత విగ్రహాలు ఏర్పాటు చేశారు. వెనుకనున్న వాహనాల్లో సాధువులు, వేలాది మంది ప్రజలు ఉన్నారు. 1984, అక్టోబర్ 6న యాత్ర అయోధ్యలోని సరయూ నదిపైగల వంతెన వద్ద ముగిసింది. అక్టోబరు 7న సరయూ ఒడ్డున ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 60 వేల మంది పాల్గొన్నారని సీనియర్ జర్నలిస్ట్ వినయ్ సీతాపతి తన పుస్తకంలో రాశారు. రామజన్మ భూమి కోసం పాటుపడేవారికే ఓటు ఆరోజు జరిగిన కార్యక్రమంలో వేదికపై ఒక పెద్ద చిత్రం ఏర్పాటు చేశారు. అందులో నిరాయుధ సాధువుల ఎదుట కత్తులు పట్టుకున్న ముస్లింలు నిలబడి ఉన్నట్లు చూపించారు. ఆ కార్యక్రమానికి హాజరైనవారు జాతీయ సమైక్యత, సమగ్రత కోసం ముస్లింలు ఈ వివాదాస్పద భూమిని హిందువులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎలాంటి గందరగోళం ఏర్పడకూడదని అటల్ బిహారీ వాజ్‌పేయి అభ్యర్థించారని సీతాపతి తన పుస్తకంలో రాశారు. ఈ భూమిని, మిగిలిన రెండు పవిత్ర స్థలాలను (కాశీ, మధుర) విముక్తి చేయడానికి ఎవరు ప్రయత్నించినా వచ్చే ఎన్నికల్లో హిందువులు వారికే ఓటు వేయాలని కార్యక్రమంలో తీర్మానించారు. వానరసేన స్ఫూర్తిగా బజరంగ్ దళ్ 1984, అక్టోబర్ 8న విశ్వహిందూ పరిషత్ వానరసేన స్ఫూర్తిగా బజరంగ్ దళ్ ఏర్పాటును ప్రకటించింది. వానరసేన సీతామాతను రక్షించడంలో రామునికి సహాయపడింది. బజరంగ్ దళ్ ఉద్దేశ్యం బాబ్రీ మసీదు నుండి రామ జన్మభూమిని కాపాడటం. ఆ తరువాత కొన్నేళ్లకు రామజన్మభూమి ఉద్యమానికి బజరంగ్ దళ్ ప్రధాన భూమికగా మారింది. 1992 డిసెంబరు 6న భజరంగ్ దళ్ నేతృత్వంలో కరసేవకులు అయోధ్యలోని వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేశారు. ఆ తర్వాత బజరంగ్‌దళ్‌పై ప్రభుత్వం నిషేధం విధించింది. వీహెచ్‌పీ వెబ్సైట్లో.. విశ్వహిందూ పరిషత్ వెబ్సైట్లో ఇచ్చిన సమాచారం ప్రకారం బజరంగ్ దళ్ ఎవరిపైననో నిరసన వ్యక్తం చేసేందుకు ఆవిర్భవించలేదు. హిందువులను సవాలు చేసే సంఘ వ్యతిరేక శక్తుల నుండి రక్షణకే ఏర్పాటయ్యింది. ఆ సమయంలో శ్రీరామ జన్మభూమి ఉద్యమంలో చురుకుగా పాల్గొనే స్థానిక యువకులకే బజరంగ్ దళ్ బాధ్యతలు అప్పగించారు. తరువాతి కాలంలో దేశం నలుమూలల నుంచి యువకులు ఈ సంస్థలో చేరారు. 1993లో తొలిసారిగా బజరంగ్ దళ్ అఖిల-భారత సంస్థాగత రూపం నిర్ణయించారు. అన్ని రాష్ట్రాలలో బజరంగ్ దళ్ శాఖలు ఏర్పాటయ్యాయి. ఇది కూడా చదవండి: కృష్ణజన్మభూమి కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. -
భార్యకు సన్‌ఫ్లవర్ అంటే ఇష్టమని.. దిమ్మతిరిగే గిఫ్ట్ ఇచ్చిన భర్త!
వివాహ వార్షికోత్సవ సమయాన జీవిత భాగస్వాములు పరస్పరం బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. వీటి విలువ ఎంత ఉన్నా అవి వారికి అపురూపమైనవిగానే కనిపిస్తాయి. కాగా ఇటీవల ఒక వ్యక్తి తమ 50 వివాహవార్షికోత్సవం సందర్భంగా తన భార్యపై తనకు ఉన్న అమితమైన ప్రేమను వినూత్న రీతిలో వ్యక్తం చేశాడు. 80 ఎకరాల్లో 12 లక్షలకుపైగా సన్ఫ్లవర్లు అమెరికాకు చెందిన రైతు లీ విల్సన్ తన భార్య రెనీకి అసాధారణమైన కానుకను అందించాడు. డబ్ల్యుఎఫ్ఎక్స్జీ టీవీ తెలిపిన వివరాల ప్రకారం లీ విల్సన్ తమ వివాహం జరిగి 50 ఏళ్ల పూర్తయిన సందర్భంగా తన భార్య రెనీకి కానుకగా అందించేందుకు లెక్కకుమించిన సన్‌ఫ్లవర్స్ పూయించారు. ఇది విన్న వెంటనే ఎవరైనా దీనిలో గొప్పదనం ఏముందని అనుకంటారు. అయితే అతనికి ఉన్న 80 ఎకరాల్లో 12 లక్షలకుపైగా సన్ఫ్లవర్లను పూయించారు. తన భార్యకు సన్‌ఫ్లవర్ అంటే ఎంతో ఇష్టమని తెలుసుకున్న ఆయన భార్య కోసం ఈ విధంగా చేశారు. తన భార్యకు పెళ్లి రోజు సన్‌ఫ్లవర్ బొకే ఇచ్చే బదులు ఏకంగా 80 ఎకరాల సన్‌ఫ్లవర్ తోటనే కానుకగా అందించారు. లీ తన కుమారుని సాయంతో మే నెలలో విధంగా సన్‌ఫ్లవర్స్ పూయించడం మొదలుపెట్టారు. ఈ విషయం పెళ్లిరోజు వరకూ భార్యకు తెలియకుండా ఉండేందుకు లీ ఎంతో జాగ్రత్తపడ్డాడు. స్కూల్ రోజుల్లోనే చిగురించిన ప్రేమ ప్రస్తుతం ఈ సన్‌ఫ్లవర్స్ అన్నీ పూర్తిగా విచ్చుకున్నాయి. సరిగ్గా పెళ్లి రోజున ఆమను సర్ప్రైజ్ చేస్తూ ఈ సన్‌ఫ్లవర్ పూలతోట సుందర దృశ్యాన్ని చూసేందుకు ఆమెను ఆహ్వానించాడు. ఈ పూల తోటను చూసిన ఆమె ఎంతగానో మురిసిపోతూ వివాహ వార్షికోత్సవ వేళ తనకు ఇంతకుమంచిన పెద్ద బహుమతి మరొకటి ఉండబోదని తెలిపింది. లీ, రెనీల ప్రేమకథ వారి స్కూలు రోజులలోనే ప్రారంభమయ్యింది. అప్పట్లో వారి వయసు 16 ఏళ్లు. నాటి నుంచి వారు అన్యోన్యంగానే ఉంటున్నారు. ఇది కూడా చదవండి: బాల భీములు పెద్దోళ్లయిపోయారు.. ఇప్పుడు ఉన్నారిలా.. -
దుబాయ్ సిగలో 'రూఫ్‌టాప్ సేద్యం'
ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని ఏడు నగరాల్లోకెల్లా అత్యధిక జనసాంద్రత గల నగరం దుబాయ్. అద్భుతమైన నిర్మాణ కౌశలానికి ఇది మారుపేరు. దుబాయ్ అంటే చప్పున గుర్తొచ్చేది బుర్జ్ ఖలీఫా (భమ్మీద అత్యంత ఎత్తయిన 830 మీటర్ల భవనం) వంటి ఆకాశ హర్మ్యాలు, విలాసవంతమైన జీవనశైలే తప్ప.. వ్యవసాయం అసలు కాదు. అయితే, అది పాత సంగతి. ఇప్పుడు దుబాయ్ సిగలో ‘రూఫ్‌టాప్ సేద్యం’ తళుక్కుమంటోంది. పచ్చదనం, పర్యావరణ హితమైన జీవనం వైపు ఈ ప్రత్యేక ఉద్యమం దుబాయ్ పట్టణ వాతావరణాన్ని క్రమంగా పునర్నిర్మిస్తోంది. కాంక్రీటు అరణ్యానికి ఆకుపచ్చని సొబగులు అద్దుతోంది. ఆకుకూరలు, కూరగాయలు, ఔషధ మొక్కలను భవనాల పైకప్పులపైనే నగరవాసులు పండించుకుంటున్నారు. అర్బన్ అగ్రికల్చర్ భావన అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ఆకుపచ్చని పంటలతో నిండిన సుస్థిరమైన జీవనాకాంక్షను నెరవేర్చటం, వీలైనంత వరకు ఆహార భద్రతకు తోడ్పడడంతో పాటు.. నగరపు రొద మధ్యలో మనోల్లాస వాతావరణాన్ని కల్పిస్తోంది. రఫ్‌టాప్ కిచెన్ గార్డెనింగ్ ఎంత పాపులర్ అయ్యిందంటే.. ఇంటిపైన ఆహారాన్ని పండించుకునే సదుపాయాన్ని కల్పించే భవన నిర్మాణ ప్రాజెక్టుల కోసమే వెతుకుతున్నారంటే ఆశ్చర్యం లేదు! తీవ్రమైన ఎడారి వాతావరణం కారణంగా యూఏఈ.. ఆహారం మొత్తాన్నీ విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తామరతంపరగా విస్తరిస్తున్న మిద్దె తోటల వల్ల ఆహార దిగుమతి కొంతమేరకైనా తగ్గే అవకాశం కనపడుతోంది. ఈ ట్రెండ్ వెనుక.. పర్యావరణానికి మేలు చేసే పనులను ప్రభుత్వం ఇతోధికంగా ప్రోత్సహిస్త విధాన నిర్ణయాలు తీసుకుంటున్నది. 2050 నాటికి సుస్థిర జీవనం విషయంలో ప్రపంచానికే ఆదర్శంగా మారాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యంతో యూఏఈ ముందడుగేస్తోంది. ఆహారాన్ని స్థానికంగా పండించుకోవటం, కాంక్రీటు భవనాల ద్వారా విడుదలయ్యే వేడిని తగ్గించుకోవడం వంటి పనులకు లభిస్తున్న ప్రభుత్వ తోడ్పాటుతో దుబాయ్ వాసుల్లో మిద్దె తోటలపై అవగాహన, ఆసక్తి నానాటికీ ఇనుమడిస్తోంది. రఫ్‌టాప్ సేద్యం అంటే కేవలం పరిసరాలను పచ్చగా వర్చడం లేదా పంటలు పండించడం మాత్రమే కాదు. నలుగురూ కలసికట్టుగా పనిచేసే సంస్కృతికి నారు పొయ్యటం కూడా. నగరవాసులు విశ్రాంతి తీసుకోవడానికి, ప్రకృతితో మమేకం కావడానికి మిద్దె తోటలు నిర్మలమైన వాతావరణాన్ని అందిస్తున్నాయని దుబాయ్ వాసులు సంతోషపడుతున్నారు. ఎడారిలో సాధ్యమేనా? ఎడారి పరిస్థితులు ఉన్నప్పటికీ మిద్దెపైన ప్రత్యేక నిర్మాణాల ద్వారా కూరగాయలు, ఔషధ మొక్కలు సాగు చేసుకునేందుకు హైడ్రోపోనిక్స్, ఏరోపోనిక్స్ వంటి అత్యాధునిక వ్యవసాయ సాంకేతికతలు దోహదం చేస్తున్నాయి. తులసి, కలబంద వంటి ఔషధ మొక్కలు.. పాలకూర, చార్డ్, లెట్యూస్ వంటి పంటలను సులభంగా పండిస్తున్నారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల కంటే ఈ పద్ధతులతో పోల్చితే అతి తక్కువ నీరే ఖర్చవుతోంది. నీటి కొరత పెద్ద సమస్యగా ఉన్న దుబాయ్ వంటి ప్రాంతంలో ఈ సాగు పద్ధతులు ఉపయోగకరం. నివాస భవనాలపై ప్రత్యేక శ్రద్ధతో రఫ్గార్డెన్లు నిర్మిస్తున్నందు వల్ల ‘అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్’ను తగ్గించడంలో తోడ్పడుతోంది. శీతలీకరణ అవసరాలు తగ్గుతున్నాయని భవన నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. సొంత రఫ్‌టాప్ ఫామ్‌ను ఏర్పాటు చేసుకునే ఆసక్తి ఉన్నవారికి వర్గనిర్దేశం చేయడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రోత్సాహకాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ‘రియల్’ ఆకర్షణ... నూతన సాంకేతిక ఆవిష్కరణలు, భవన నిర్మాణంలో జరుగుతున్న మార్పులు, ప్రభుత్వ మద్దతు, వాతావరణ మార్పుల నేపథ్యంలో సుస్థిర జీవనశైలిపై పెరుగుతున్న సామాజిక అవగాహన.. దుబాయ్‌లో రఫ్‌టాప్ ఫార్మింగ్ విస్తరణకు దోహదపడుతున్నాయి. దీని వల్ల పట్టణ జీవవైవిధ్యం మెరుగుపడుతుంది. కాలుష్య కారకాలను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేయడంతో గాలి నాణ్యత మెరుగవుతోంది. రఫ్‌టాప్ ఫార్మింగ్ సదుపాయాన్ని జోడించే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు పర్యావరణ స్పృహతో ఉన్న కొనుగోలుదారులను, ఆరోగ్యకరమైన జీవనానికి విలువనిచ్చే అద్దెదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ ట్రెండ్ కేవలం రెసిడెన్షియల్ భవనాలకే పరిమితం కాలేదు. వాణిజ్య భవనాలపై కప్పులపై కూడా పంటల సాగు ఏర్పాట్లు నిర్మించటం సామాజిక బాధ్యతగా బిల్డర్లు భావిస్తున్నారు. ఇది సానుకల ప్రభావాన్ని కలిగిస్తోంది. స్మార్ట్ ఇరిగేషన్, సెన్సర్లు, డేటా అనలిటిక్స్ ద్వారా రఫ్‌టాప్ ఫార్మింగ్ మెరుగైన ఫలితాలను ఇవ్వడమే కాక, నేర్చుకునే వారికి ఆకర్షణీయంగా వరింది. విలాసాలను త్యాగం చేయకుండా నగరాలు ఆహార స్వావలంబన, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఎలా స్వీకరించవచ్చో చెప్పడానికి దుబాయ్‌లో పెరుగుతున్న మిద్దె తోటల ధోరణి నిదర్శనంగా నిలుస్తుందని చెప్పొచ్చు. (చదవండి: 14 పందులతో మొదలు నేడు 150కి సంఖ్య.. కిలోకు 280 చొప్పున అమ్మకం) -
బ్యాంకు డిపాజిట్ ఫారంలో.. ‘ఇదేందయ్యా ఇది..’
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది చూడాల్సి వస్తుందో ఎవరికీ తెలియదు. దీనిలో షేర్ అయ్యే వీడియోలు, ఫొటోలు ప్రత్యేకంగా ఉన్నప్పుడు అవి మన మనసుకు హత్తుకుపోతాయి. కొన్ని వీడియోలు, ఫొటోలు మనల్ని తెగ నవ్విస్తాయి. తాజాగా వైరల్ అవుతున్న ఒక ఇమేజ్‌లో ఒక బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్ స్లిప్ కనిపిస్తోంది. దీనిలో ఒక వినియోగదారుడు.. రాశి(అమౌంట్) కాలమ్‌లో ఏమి నింపాడో తెలిస్తే ఎవరికైనా తెగ నవ్వు వస్తుంది. దీనిని చూసిన కొందరు తమ తలలు పట్టుకుంటున్నారు. మరికొందరు తమ పొట్టపట్టుకుని పడీపడీ నవ్వుతున్నారు. వైరల్ అవుతున్న ఈ ఫొటో పాతదే అయినప్పటికీ, సోషల్ మీడియాలో తరచూ పోస్ట్ అవుతూ, తెగ వైరల్ అవుతోంది.సోషల్ మీడియా ప్లాట్ఫారం ట్విట్టర్లో @NationFirst78 అనే ఖాతా కలిగిన యూజర్ తొలుత దీనిని షేర్ చేశారు. దీనిలో ఒక బ్యాంకు డిపాజిట్ స్లిప్ కనిపిస్తోంది. వినియోగదారుడు ఆ ఫారంలోని అన్ని కాలమ్‌లను సరిగానే పూరించాడు. అయితే ‘రాశి’(అమౌంట్) కాలమ్‌లో తులారాశి అని రాశాడు. ఈ ఫారం హిందీ, ఇంగ్లీషు రెండు భాషలలో ఉంది. హిందీలో ‘రాశి’ అంటే ఇంగ్లీషులో అమౌంట్ అని అర్థం. అయితే ఆ మహాశయుడు రాశి అనగానే తన జన్మరాశి అనుకుని దానిని ఆ కాలమ్‌లో నింపాడు. దీనిని చూసిన వారంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ ఫారాన్ని పరిశీలించి చూస్తే, ఇది ఉత్తరప్రదేశ్‌లోని మురాదాబాద్‌కు చెందిన ఒక బ్యాంకుదని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: పాపం పసివాడు:16 రోజులు కోమాలో ఉండి.. -
కిమ్ రూటే సెపరేట్: క్షిపణి ప్రయోగం చేసిన స్థావరంలోనే..
ఇటీవల కాలంలో ఉత్తర కొరియా మిసైల్ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడూ తాజాగా మిసైల్ ప్రయోగ స్థావరంలోనే గ్రీన్ హౌస్ ఫామ్‌కి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పూర్వ రియోనిఫో వైమానికి స్థావరంలో ఈ గ్రీన్హౌస్ ఫాంని ప్రారంభించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ప్రారంభోత్సవానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హాజరయ్యారు. ఇది ఉత్తర కొరియాలో అతిపెద్ద కూరగాయాల ఫాంలో ఒకటిగా పేరుగాంచనుంది. దీన్ని ఉత్తర కొరియాలో ప్రభలంగా ఉన్న ఆహార కొరత సమస్యలను పరిష్కరించడానికి ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ఫామ్ హౌస్ నిర్మించిన ప్రాంతంలోనే 2019, 2021 వరసగా కెఎన్ 25, కెఎన్ 23 వంటి స్వల్స బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను నిర్వహించింది. ఈ ఫాం హౌస్‌ని ఉత్తర కొరియాలో ప్రధాన సెలవు దినమైన పాలకుల వర్కర్స్ పార్టీ స్థాపన వార్షికోత్సవం రోజున ప్రారంభించింది. ఉత్తరకొరియా ప్రజల కోసం గత డిసెంబర్లోనే ఈ ఫామ్‌ను ఆటోమెటెడ్‌గా మార్చే ప్రాజెక్టుని ప్రారంభించింది. ఈ వ్యవసాయ క్షేత్రంలో సుమారు 280 హెక్టారుల విస్తీర్ణంలో 850కి పైగా గ్రీన్హౌస్ ఫామ్‌లు ఉన్నాయి. అంతేగాదు ఈ ఫాం హౌస్‌ని కొద్దినెలల్లోనే పూర్తి చేసినందుకు కార్మికులను, సైనికులను కిమ్ ప్రశంసించారు. అంతేగాదు ఇలాంటి మరిన్ని ఫామ్ హౌస్‌లను అభివృద్ధి చేయాలని శాస్త్రీయ పద్ధతుల్లో కూరగాయలను ఉత్పత్తి చేయాలని ఆదేశించారు. ఒకపక్క దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా నౌకదళ విన్యాసాలు చేశాయన్న అక్కసుతో మిసైల్ దూకుడుతో కవ్వింపు చర్యలకు దిగింది. మరోవైపు దేశ ప్రజల ఆహార కొరత సమస్యను పరిష్కరించే దిశగా వైమానిక ప్రయోగా స్థావరాల్లోనే ఫామ్ హౌస్‌లను ఏర్పాటు చేసి ఆశ్చర్యపరించింది. ఏదైనా కిమ్కే చెల్లింది. (చదవండి: ఐరాసలో రష్యాకు భారత్ షాక్.. కీలక ఓటింగ్‌లోనూ భారీ షాక్ ఇస్తుందా?) -
ఉడేగోళంలో విషాదం... అన్నదమ్ములని బలిగిన్న కరెంట్
కణేకల్లు: ఇద్దరు అన్నదమ్ములను కరెంట్ బలిగొంది. ఈ ఘటనతో కణేకల్లు మండలం 43 ఉడేగోళం గ్రామం విషాదంలో మునిగిపోయింది. మాజీ సర్పంచ్ కురుబ యల్లప్ప (లేట్)ది రైతు కుటుంబం. ఈయనకు ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయమే వీరికి ప్రధాన జీవనాధారం. హెచ్చెల్సీకి నీరు విడుదల చేయడంతో బోర్లున్న రైతులు ముందుగానే వరినారు పోసుకోవడం ఆనవాయితీ. యల్లప్ప కుమారులు రమేష్ (34), దేవేంద్ర (28), వన్నూరుస్వామి తమ పొలంలో మూడ్రోజుల కిందట వరి నారు పోశారు. ఆదివారం నారు మడికి నీరు పెట్టి పొలంలో చిన్నాచితక పనులు చేసుకొద్దామని ఈ ముగ్గురూ పొలానికి వెళ్లారు. రమేష్ స్టార్టర్ ఆన్ చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్‌షాక్‌కు గురై కుప్పకూలిపోయాడు. అన్నను లేపేందుకు వెళ్లిన దేవేంద్ర కూడా షాక్‌కు గురయ్యాడు. వీరిని కాపాడేందుకు వెళ్లిన వన్నూరుస్వామి షాక్ కొట్టగానే ఎగిరి పడ్డాడు. వెంటనే పక్కపొలం రైతులు, స్థానికులకు, కుటుంబ సభ్యులకు సమాచారమందించాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన చేరుకుని వారిని కణేకల్లు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే రమేష్, దేవేంద్ర మృతి చెందారు. వీరిని కాపాడే క్రమంలో గాయపడ్డ మరో సోదరుడు వన్నూరుస్వామి బళ్లారిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల్లో రమేష్‌కు భార్య జ్యోతి, ఇద్దరు కూతుళ్లు, దేవేంద్రకు భార్య కస్తూరి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. విద్యుత్ షాక్‌తో ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాత పడటంతో కుటుంబంతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దేవుడా ఎంత పనిచేశావయ్యా.. పొలానికి వెళ్లి తొందరగా వస్తామని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతిరా.. మీరు లేని జీవితం ఎలా గడపాలి.. పిల్లలకు ఏమని సమాధానం చెప్పాలి’ అంటూ మృతుడు రమేష్ భార్య జ్యోతి, దేవేంద్ర భార్య కస్తూరి గుండెలవిసేలా రోదించారు. ‘అక్కా... అని ప్రేమగా పలకరించే చిన్నోడి (దేవేంద్ర)ని తీసుకెళ్లి ఎందుకింత అన్యాయం చేశావు దేవుడా’ అంటూ విలపించిన అక్క జయమ్మను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. ఆ దేవుడు నన్నైనా తీసుకుపోయి ఉంటే బాగుండేదంటూ కన్నీరు మున్నీరయ్యారు. ‘దేవురే ఒబ్బరల్లా... ఇబ్బుర్ని (దేవుడా ఒకరిని కాదు ఇద్దరిని) ఎంగే తకొండు హోగిదియప్పా(ఎలా తీసుకెళ్లావు?)’ అంటూ అక్కాచెల్లెళ్లు విలపించడం అందర్నీ కలచి వేసింది. (చదవండి: పార్థుడి పనైపోయిందా!.. చంద్రబాబు 'బాది'పోయాడా?) -
చారిత్రక సంపదకు రక్షణ కరువు... పొలంగా మారిన దంతపురి కోటగట్టు
సరుబుజ్జిలి: పురావస్తుశాఖ పరిధిలోని చారిత్రక సంపదకు రక్షణ లేకుండాపోతోంది. సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామ దంతపురి కోటగట్టుపై అక్రమ తవ్వకాలు యథేచ్ఛ సాగుతున్నాయి. కోటకు రక్షణగా నలుదిశలా విస్తరించి ఉన్న గట్టును ఇష్టారాజ్యంగా తవ్వేస్తూ ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఏకంగా యంత్రాలు పెట్టి గట్టును తవ్వకం చేసి మట్టిని తరలించుకుపోతున్నారని చెబుతున్నారు. మరికొంతమంది గట్టును తవ్వేసి పొలాలుగా మార్చి వాటిపై పంటలు పండిస్తున్నారు. వీటిని నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘన చరిత్ర.. శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ నుంచి సుమారు 8 కిలోమీటర్లు దూరంలో రొట్టవలస, కొండవలస, పెద్దపాలెం, పాలవలస, రావివలస గ్రామాల మధ్య విస్తరించిన చారిత్రక స్థలం దంతపురి. క్రీ.పూ 261లో అశోకచక్రవర్తి జరిపిన కళింగ యుద్ధ తర్వాత ఈ క్షేత్రం ప్రాచుర్యంలోకి వచ్చింది. చేది వంశానికి రాజైన కళింగ ఖారవేలుని కాలంలో ప్రాముఖ్యత సంతరించుకుంది. కళింగరాజుల రాజధానిగా దంతపురికి విశిష్ట స్థానం ఉంది. శ్రీలంకకు చెందిన మహావంశం అనే బౌద్ధ గ్రంధంలో జంబూద్వీపానికి సప్తనగరాల్లో దంతపురి ప్రముఖమైనదిగా పేర్కొన్నారు. సింహబాహు అనే రాజు సింహపురం పట్టణాన్ని నిర్మించి బుద్ధుని జ్ఞానదంతంపై స్థూపాన్ని నిర్మించడం వల్ల దంతపురిగా వెలసినట్లు ఆధారాలు చెబుతున్నాయి. చారిత్రక ఆనవాళ్లు.. రాష్ట్ర పురావస్తు శాఖవ ఆధ్వర్యంలో 30 ఏళ్ల క్రితం చేపట్టిన తవ్వకాల్లో దంతపురి ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇక్కడి కోటలో 30 అడుగుల ఎత్తయిన ప్రాకారాలు, కోటకు నలుదిక్కులా ద్వారాలు ఉండేవని గుర్తించారు. అప్పట్లో మూడు స్థూపాలు, గుర్తుపట్టలేని పాతతరం విగ్రహాలు, స్నానపు గదులు, నీటిని నిల్వ చేసే జార్లు, ఫ్లవర్ వాజులు, వంటపాత్రలు, దీపాలు, భోజనపు గిన్నెలు, రాతిరుబ్బురోలు, ఎముకతో చేసిన దువ్వెనలు, టెర్రకోట వస్తువులు బయటపడ్డాయి. ఇంతటి చారిత్రక నేపథ్యమున్న ఇక్కడి బౌద్ధస్ఫూపాలు ఇతర ఆనవాళ్లకు రక్షణ కరువైనా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇప్పటికే బుద్ధుడి విగ్రహం ప్లాట్‌ఫాం శిథిలావస్థకు చేరుకుంది. ఎటువంటి ప్రహరీ సౌకర్యం లేకపోవడంతో ఆవరణలోనే మందుబాబులు హల్చల్ చేస్తుంటారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దంతపురి కోటగట్టు ప్రదేశాన్ని రీసర్వే చేసి రక్షణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం.. ప్రాచీన సంపదగా విరాజిల్లుతున్న దంతపురి క్షేత్రంలో ఎటువంటి తవ్వకాలు చేయరాదు. ఇటువంటి కార్యకలాపాలు చట్టరీత్యా నేరం. కోటగట్టుపై తవ్వకాలు జరిపిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం. – సనపల కిరణ్‌కుమార్, తహసీల్దార్, సరుబుజ్జిలి (చదవండి: ఢిల్లీ హైకోర్టు జడ్జిగా వీరఘట్టం వాసి) -
పొలం అమ్మడం కోసం ...ఏకంగా కలెక్టర్, జేసీ సంతకాలనే ఫోర్జరీ....
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: ఏకంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంతకాలనే ఫోర్జరీ చేశారు. వాటి ఆధారంగా నకిలీ నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) సృష్టించారు. దానిపై ఓ ప్రజాప్రతినిధికి అనుమానం రావడం, ఆయన కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో అసలు బాగోతం వెలుగు చూసింది. అధికార వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూడేరు మండలం కమ్మూరు గ్రామ సర్వే నంబర్ 525, 526లో బోయ నారాయణప్ప పేరిట 34.86 ఎకరాల పొలముంది. దీనికి 1954వ సంవత్సరంలోనే డి.పట్టా మంజూరైంది. ఈ భూమిని ఇటీవల అనంతపురం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొని.. అగ్రిమెంట్ చేసుకున్నాడు. అతను వేరే వ్యక్తికి అమ్మాలనుకుని.. ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేశాడు. దానిపై తహసీల్దార్, ఆర్డీఓ సంతకాలు పూర్తయ్యాయి. జేసీ, కలెక్టర్ సంతకాలు చేయాల్సి ఉంది. కానీ అంతలోనే సదరు వ్యక్తి ఓ రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్‌ను ఆశ్రయించి పని త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరాడు. దీంతో కంప్యూటర్ ఆపరేటర్ కలెక్టర్, జేసీ సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఎన్ఓసీ సృష్టించి అతనికి అందజేశాడు. ప్రజాప్రతినిధికి అనుమానం రావడంతో.. సదరు ఎన్ఓసీ ఓ ప్రజాప్రతినిధి చేతికి వెళ్లింది. అంత త్వరగా ఎన్ఓసీ రావడంపై ఆయనకు అనుమానం వచ్చింది. ఇదే విషయాన్ని కలెక్టర్ నాగలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ పరిశీలించి నకిలీదిగా నిర్ధారించారు. దీని సృష్టికర్తలెవరో తేల్చాలంటూ అనంతపురం ఆర్డీఓ మధుసూదన్‌ను ఆదేశించారు. దీంతో ఆయన విచారణ చేపడుతున్నారు. కలెక్టర్, జేసీ సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఎన్ఓసీ సృష్టించారని ఆర్డీఓ కూడా నిర్ధారించారు. కంప్యూటర్ ఆపరేటర్ పనేనా? అనంతపురంలో పనిచేస్తున్న పుట్టపర్తి ప్రాంతానికి చెందిన కంప్యూటర్ ఆపరేటర్ నకిలీ ఎన్ఓసీని తయారు చేసినట్లు తెలుస్తోంది. అతనితో పాటు మరొక వ్యక్తి పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. వారిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. సదరు కంప్యూటర్ ఆపరేటర్ టీడీపీ హయాంలోనూ ఇలాంటి పని చేసి అప్పటి జేసీ చేతికి చిక్కినట్లు సమాచారం. అప్పట్లో జిల్లా ఉన్నతాధికారులకు రాజకీయ ఒత్తిళ్లు రావడంతో విషయం బయటకు రాలేదు. (చదవండి: సవతి తల్లి కర్కశం...మేడపై నుంచి తోసి..గొంతు నులిమి) -
మోసం..బలి తీసుకుంది!
అద్దంకి రూరల్: పొలం కొనుగోలు విషయంలో మధ్యవర్తులు తనను మోసం చేశారని ఆవేదన చెందిన ఓ వ్యక్తి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం మండలంలోని వేలమూరిపాడు గ్రామంలో పొలాల్లో వెలుగు చూసింది. పోలీసులు, మృతుని వద్ద లభించిన లేఖ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేడగం బ్రహ్మానందరెడ్డి (51) ముండ్లమూరు మండలలోని సుంకరవారి పాలెం గ్రామంలో 2011లో 15 ఎకరాల పొలాన్ని రూ. 30 లక్షలకు నలుగురు వద్ద కొనుగోలు చేశాడు. ఆ భూమిని తన పేరపై రిజిస్ట్రేషన్ చేయాలని పలుమార్లు కోరినా, వారు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన బ్రహ్మానందరెడ్డి కోర్డులో కేసు వేశాడు. కోర్టులో సమస్యల త్వరగా తేలకపోవడం, భూమి కొనుగోలు కోసం తెచ్చిన సొమ్ముకు వడ్డీ పెరిగిపోవడం.. అప్పు ఇచ్చిన వారు బాకీ తీర్చాలని ఒత్తిడి చేయడం వంటి కారణాలతో మనోవదేనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో వెలమూరిపాడు గ్రామంలో అతను కొనుగోలు చేసిన పొలంలోకి వెళ్లి, పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం పొలాల్లోని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి అధికారులకు విషయం తెలియపరచారు. ఎస్సై సుబ్బరాజు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని జేబులో ఉన్న లేఖను స్వాధీనం చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. -
తమిళనాట మరో కొత్త పార్టీ!
-
యువకుని అనుమానాస్పద మృతి
అనంతపురం: అనంతపురం జిల్లాలోని సోమనదేపల్లి మండలం రేణుకానగర్ ప్రాంతానికి చెందిన చంద్రమౌళి అనే యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. వివరాలు...శుక్రవారం ఉదయం పొలంలోని విశ్రాంతి గదిలో చంద్రమౌళి నిర్జీవంగా పడి ఉండడాన్ని ఆయన తండ్రి గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, చంద్రమౌళి పాము కాటు వల్ల మృతి చెందాడా లేక మరేదైనా కారణమా అన్నది తెలియాల్సి ఉంది. -
హస్నా జరూరీ హై
కనబడుట లేదు రూపం: తెల్లగా అందంగా ఉంటుంది వయసు: తగ్గిస్తుంది బరువు: దించుతుంది వెడల్పు: కనీసం మూడు అంగుళా తత్వం: తియ్యగా చల్లగా ఉంటుంది పేరు: చిరునవ్వు పై లక్షణాలున్న చిరునవ్వు హైదరాబాద్ నగరంలో కనబడుట లేదు. నగరంలోని ఒత్తిళ్లను తట్టుకోలేక మాయం అయిపోయింది. కనిపించిన వారు వెంటనే పెదాలపైకి చేర్చుకోగలరు. నవ్వు అందంగా ఉంటుంది. కావాలంటే అద్దంలోకి నవ్వి చూడండి. నవ్వు తెల్లగా ఉంటుంది- నవ్వితే అది తేటతెల్లం అవుతుంది. నవ్వు తియ్యగా ఉంటుంది- రుచి చూడాలంటే నవ్వాల్సిందే. ఆ నవ్వుకి ఎవరైనా సరే తియ్యగా మాట్లాడాల్సిందే. నవ్వు చల్లగానూ, వెచ్చగానూ ఉంటుంది ఆశ్చర్యంగా..! కోపంలో చల్లగా, కష్టాల్లో వెచ్చగా ఉంటుంది. ఇది రాస్తూ నేనూ నవ్వుతున్నా, చదువుతూ మీరు ఓ చిరునవ్వేసుకోండి. దరహాస దాతా ! సుఖీభవ.. స్మైల్ ప్లీజ్.. మన మహానగరంలో ఉన్న లక్షలాది బైకుల్లో ఒకానొక బైక్‌పై కనిపించిన క్యాప్షన్ ఇది. ఆ సమయానికి యధాలాపంగా డ్రైవ్ చేస్తున్న నన్ను ఆ వ్యక్తి ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది. వెంటనే నా ముఖంపై ఏ ఎక్స్ప్రెషన్ ఉందో గమనించాను. కనుబొమ్మలు ముడిపడి, పెదాలు ముడుచుకుని, బుగ్గలు ఒకింత బిగుసుకుని.. సీరియస్‌గా ఉన్నానేమో అనిపించింది. ఇలా ఉన్నానేంటబ్బా అనుకున్న మరు క్షణంలో ఎక్స్ప్రెషన్ మారిపోయింది. మనసున తొణికిన చిరునవ్వు పెదాలపైకి వచ్చేసింది. ముఖం విచ్చుకుంది. ఆ అజ్ఞాత బైకు వీరుడికి నా థ్యాంక్స్. ఇలా రోజులో కొంత మందికైనా చిరునవ్వు పంచి పెడుతున్నందుకు. నవ్వుదాతా సుఖీభవ. ఏడ తానున్నాదో నవ్వు.. నేను రేడియో జాకీగా పని చేసిన కొద్ది కాలంలో రోజూ ఉదయాన్నే చిరునవ్వుతో ఆఫీస్ చేరేదాన్ని. ఆ నవ్వు ఆ రోజంతా నన్ను ఫ్రెష్‌గా ఉంచేది. ఓ రోజు షోలో పంచుకున్న ఈ విషయానికి ఎందరో కనక్ట్ అయ్యారు. ప్రస్తుతం.. బస్‌స్టాప్‌లో అలసిన ముఖాలు, ఫుట్‌పాత్‌పై బరువైన పేదరికం, ట్రాఫిక్‌లో చిరాగ్గా చోదకులు.. చిరునవ్వు జాడ కనిపించడం లేదు. ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉన్న చోట చిరునవ్వు చిందేయడం తేలికే. కానీ ఒక్కరే ఉన్న చోట చిరునవ్వు చిరునామా లేదు. పోనీ ఒక్కరే తమలో తాము నవ్వుకుంటే సచ్చిదానందం అనుకోరు సరికదా.. మెంటల్ కేస్ అని ఫిక్స్ అవుతారు. మనలో మనం అటుంచండి, పక్క వ్యక్తిని చూసి కూడా నవ్వకపోతే ఏమనాలి. నవ్వులు రువ్వే నవ్వమ్మా.. తెలియని వారిని చూసి నవ్వితే ఏమనుకుంటారో అని నవ్వం. తెలిసిన వారిని చూసి నవ్వితే ఏం అడిగేస్తారో అని భయం. ఇలా నవ్వును దాచేస్తే ఏలా. నవ్వితే తిరిగి నవ్వే సమాధానంగా వస్తుంది. చిరునవ్వులో మ్యాజిక్ ఉంది. నవ్వితే మీరు అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారని రీసెర్చ్‌లు ఘోషిస్తున్నాయి. నేను మా అమ్మగారు కొన్నేళ్ల కిందట ఓ ఎక్స్పరిమెంట్ చేశాం. పర్సనల్ ఇష్యూస్‌లో కోర్టుకు వెళ్లినప్పుడు అక్కడి వాతావరణం అంతా బరువుగా ఉండేది. దీనికి చెక్ పెడుతూ మా అమ్మగారు నవ్వులు పంచే ఏంజిల్ అవతారం ఎత్తారు. నేనూ ఓ నవ్వు కలిపాను. ఎవరిని చూసినా కళ్లలో మెరుపుతో, చిరునవ్వుతో పలకరించేవాళ్లం. ఆ రకంగా కోర్టు వాతావరణాన్ని మార్చేశాం. నవ్వే మంత్రమూ.. ‘రానీ రానీ కష్టాల్ కోపాల్ తాపాల్’ అన్న మహాకవి ‘హాసం లాసం’ కూడా రానీ అన్నాడు. ఎంతటి బరువైన సమస్యకైనా ఎంతటి డిప్రెషన్‌కు అయినా చిరునవ్వే మంత్రం అని సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు. ఒక చిరునవ్వు మెదడులోని సెరొటోనిన్ అనే కెమికల్ని విడుదల చేస్తుందట. దాని వల్ల రిలాక్స్ అవుతామట. పెద్దగా హాయిగా మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల ఎండోర్ఫిన్స్ విడుదలై ఉత్తేజపరుస్తాయట. మరింక ఆలస్యం దేనికి.. ఖర్చు పెట్టక్కర్లేకుండా రిఫ్రెష్ అవ్వడానికి చిరునవ్వే వరం. పాశ్యాత్య దేశాల్లో ఎవరైనా ఎదురుపడితే చాలు తెలిసినా, తెలియకపోయినా పలకరింపుగా ఓ చిరునవ్వు విసురుతూ వెళ్లిపోతుంటారు. వాళ్లు మన నగరానికి వస్తే అయోమయానికి గురి కావడం ఖాయం. నగరం నవ్వుల వనం.. ఉరుకుల పరుగుల మన నగరానికి నవ్వడం నేర్పించాలి. అందుకు పెద్ద ప్రణాళిక ఏమీ అక్కర్లేదు. జస్ట్ మీరొక్కరు నవ్వండి చాలు అంతే చిరునవ్వు పాకిపోతుంది. బ్రెజిల్‌లోని నిటెరోయ్ అనే నగరాన్ని ‘ద స్మైలింగ్ సిటీ’ అని ముద్దుగా పిలుస్తారు. ఆ నగరాన్ని ఎప్పటికైనా చూడాలని నాకు కోరిక. ఆ సిటీ తిరిగి నవ్వుతుందట అంటే, అక్కడి జనాభా అంతా సంతోషంగా ఉన్నట్టే కదా. మన హైదరాబాద్‌ను కూడా భారతదేశానికి స్మైల్ క్యాపిటల్‌గా మారుద్దాం. కష్టంలో ఉంటే చిరునవ్వు కష్టం అంటారా, ఒక్కసారి నవ్వి చూడండి మీ కష్టం తేలికైపోతుంది. కష్టాల్, నష్టాల్, ఉరుకుల్, పరుగుల్ ఎన్ని ఉన్నా కూడా మనం పూయిద్దాం నవ్వుల్ పువ్వుల్. మిషన్ ‘హైదరాబాద్ స్మైల్’ మీరు నవ్వండి పక్క వ్యక్తినీ నవ్వించండి. స్మైల్ ప్లీజ్. facebook.com/anchorjhansi -
దేవుడిచ్చిన రూపం
ఒక అడవిలో ఒక గుర్రం ఉండేది. ఆ అడవిలో పుష్కలంగా దొరికే పచ్చగడ్డిని తిని ఎత్తుగా, బలంగా తయారయ్యింది. దానితో అది తన ఆకారాన్ని చూసుకుని విర్ర వీగి పోయేది. ఒకరోజు గుర్రానికి నీటి కాలువ దగ్గర ఒక ఒంటె కనబడింది. ఒంటె ఆకారాన్ని చూడగానే దానికి నవ్వొచ్చింది. పడీ పడీ నవ్వసాగింది. ‘‘ఎందుకలా నవ్వుతున్నావు?’’ అని అయోమయంగా అడిగింది ఒంటె. ‘‘నువ్వెలా ఉంటావో నీకు తెలుసా? ఒంకర్లు తిరిగిన పెద్ద మెడ, వీపు మీద ఇంత మూట, సన్నటి పొడవైన కాళ్ళు... మొత్తానికి నీ రూపు భలేగా ఉంటుందోయ్’’ అని సకిలించుకుంటూ నవ్వింది గుర్రం. గుర్రం మాటలకు ఒంటె బాధ పడింది. జవాబు చెప్పకుండా మౌనంగా అక్కడినుండి వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజు గుర్రానికి ఒంటె అక్కడే తారసపడింది. ‘‘ఏమిటోయ్ మిత్రమా! ఎలా ఉన్నావు?’’ ఒంటెను పలకరించింది గుర్రం. ‘‘నీ కోసమే వచ్చాను మిత్రమా! నీ అందమైన రూపం గురించి నిన్న నా స్నేహితులతో చెప్పాను. కానీ వాళ్ళు ‘అసలు అంత అందమనేది ఉంటుందా?’ అని ఆశ్చర్యపోయారు. నేను కోతలు కోస్తున్నానని వెక్కిరించారు. నాకు చాలా అవమానంగా అనిపించింది. నిన్ను వాళ్ళకు చూపించి వాళ్ళ నోళ్ళు మూయించాలని ఉంది. నువ్వు నాతో వస్తావా?’’ అంది ఒంటె. అది విని గుర్రం తన అందాన్ని ప్రదర్శించే అవకాశం వచ్చిందని సంతోషించింది. వెంటనే ఒంటె వెంట బయలుదేరింది. కొద్దిసేపు అడవిలో ప్రయాణించాక ఒంటె గుర్రాన్ని తీసుకుని అడవిని దాటి ఎడారి వైపు ప్రయాణం కొనసాగింది. ఇసుకలో చకాచకా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్న ఒంటెను అనుసరించడానికి ఇబ్బంది పడింది గుర్రం. దాని కాళ్లు ఇసుకలో కూరుకుపోయి అడుగుపడటం కష్టమైపోయింది. ‘‘త్వరగా నడువు మిత్రమా! నా స్నేహితులంతా నీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు’’ అంటూ ఒంటె నడక వేగం పెంచింది. మిట్ట మధ్యాహ్నం. ఎండ తీవ్రంగా ఉంది. వేడిగాలులు వీస్తున్నాయి. అప్పుడప్పుడు వీచే బలమైన గాలికి ఇసుకరేణువులు గుర్రం ముక్కులోకి, కళ్ళలోకి దూరిపోతున్నాయి. దాహంతో కాలుక పిడచ కట్టుకుపోగా ‘‘ఇంకెంత దూరం నడవాలి?’’ అని గుర్రం భయంగా అడిగింది. ‘‘ఇంకో గంట నడవాలి’’ అని చెప్పింది ఒంటె. మరికొంత దూరం వెళ్ళగానే ఇక గుర్రం అడుగులు ముందుకు వేయలేక పోయింది. ‘‘నేనింక నడవలేను.’’ అంటూ ఇసుకలో చతికిలపడిపోయింది గుర్రం. ‘‘చూసావా మిత్రమా! ఎవరికి ఏ రూపం అవసరమో వారికి అలాంటి రూపమే ఇస్తాడు దేవుడు. నేను అందంగా లేనని గేలి చేసావు. ఎంతో అందంగా, బలంగా ఉన్నానని విర్రవీగావు. ఇప్పుడు ఏమైంది? ఎడారిలో నివసించడానికి వీలుగా నా రూపం ఇలా ఉంది. అది అర్థం చేసుకో’’ అని చెప్పింది ఒంటె. తన తప్పు తెలిసివచ్చిన గుర్రం సిగ్గుతో తల వంచుకుంది. నీతి: దేవుడు ఎవరి అవసరానికి తగిన ఆకారాన్ని, రూపాన్ని వారికి ఇస్తాడు. దాన్ని చూసుకుని పొంగిపోవటమూ, కుంగిపోవటమూ కూడా తప్పే! దానివల్ల ముప్పే! -
ఏపీకి కొత్త విద్యుత్ నియంత్రణ మండలి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు కొత్త విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటు చేయనున్నారు. చైర్మన్, ఇద్దరు సభ్యులను నియమించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.