
వివాహ వార్షికోత్సవ సమయాన జీవిత భాగస్వాములు పరస్పరం బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. వీటి విలువ ఎంత ఉన్నా అవి వారికి అపురూపమైనవిగానే కనిపిస్తాయి. కాగా ఇటీవల ఒక వ్యక్తి తమ 50 వివాహవార్షికోత్సవం సందర్భంగా తన భార్యపై తనకు ఉన్న అమితమైన ప్రేమను వినూత్న రీతిలో వ్యక్తం చేశాడు.
80 ఎకరాల్లో 12 లక్షలకుపైగా సన్‌ఫ్లవర్లు
అమెరికాకు చెందిన రైతు లీ విల్సన్ తన భార్య రెనీకి అసాధారణమైన కానుకను అందించాడు. డబ్ల్యుఎఫ్‌ఎక్స్‌జీ టీవీ తెలిపిన వివరాల ప్రకారం లీ విల్సన్ తమ వివాహం జరిగి 50 ఏళ్ల పూర్తయిన సందర్భంగా తన భార్య రెనీకి కానుకగా అందించేందుకు లెక్కకుమించిన సన్‌ఫ్లవర్స్ పూయించారు. ఇది విన్న వెంటనే ఎవరైనా దీనిలో గొప్పదనం ఏముందని అనుకంటారు. అయితే అతనికి ఉన్న 80 ఎకరాల్లో 12 లక్షలకుపైగా సన్‌ఫ్లవర్లను పూయించారు.
తన భార్యకు సన్‌ఫ్లవర్ అంటే ఎంతో ఇష్టమని తెలుసుకున్న ఆయన భార్య కోసం ఈ విధంగా చేశారు. తన భార్యకు పెళ్లి రోజు సన్‌ఫ్లవర్ బొకే ఇచ్చే బదులు ఏకంగా 80 ఎకరాల సన్‌ఫ్లవర్ తోటనే కానుకగా అందించారు. లీ తన కుమారుని సాయంతో మే నెలలో విధంగా సన్‌ఫ్లవర్స్ పూయించడం మొదలుపెట్టారు. ఈ విషయం పెళ్లిరోజు వరకూ భార్యకు తెలియకుండా ఉండేందుకు లీ ఎంతో జాగ్రత్తపడ్డాడు.
స్కూల్ రోజుల్లోనే చిగురించిన ప్రేమ
ప్రస్తుతం ఈ సన్‌ఫ్లవర్స్ అన్నీ పూర్తిగా విచ్చుకున్నాయి. సరిగ్గా పెళ్లి రోజున ఆమను సర్‌ప్రైజ్ చేస్తూ ఈ సన్‌ఫ్లవర్ పూలతోట సుందర దృశ్యాన్ని చూసేందుకు ఆమెను ఆహ్వానించాడు. ఈ పూల తోటను చూసిన ఆమె ఎంతగానో మురిసిపోతూ వివాహ వార్షికోత్సవ వేళ తనకు ఇంతకుమంచిన పెద్ద బహుమతి మరొకటి ఉండబోదని తెలిపింది. లీ, రెనీల ప్రేమకథ వారి స్కూలు రోజులలోనే ప్రారంభమయ్యింది. అప్పట్లో వారి వయసు 16 ఏళ్లు. నాటి నుంచి వారు అన్యోన్యంగానే ఉంటున్నారు.
ఇది కూడా చదవండి: బాల భీములు పెద్దోళ్లయిపోయారు.. ఇప్పుడు ఉన్నారిలా..
Comments
Please login to add a commentAdd a comment