sunflower
-
‘సన్‌ఫ్లవర్’ సలసలా
తాడేపల్లిగూడెం: సన్‌ఫ్లవర్ నూనెకు ధరల స్ట్రోక్ తగిలింది. ఇటీవలి కాలంలో పామాయిల్ కంటే తక్కువ రేటుకు పడిపోయిన ఈ నూనె ధరలు ఇప్పుడు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. పామాయిల్, పామ్ క్రూడ్, రిఫైన్డ్ పామాయిల్ మలేసియా, ఇండోనేíÙయా దేశాల నుంచి దిగుమతి అవుతాయి. మలేసియాలో పంట దిగుబడులు, కూలీల లభ్యత, వాతావరణ పరిస్థితుల ఆధారంగా, అంతర్జాతీయ విపణి సూత్రం ఆధారంగా డాలర్ల ధరల్లో వ్యత్యాసాలతో పామాయిల్ ధరలు ప్రభావితమయ్యేవి. రిఫైన్డ్ పామాయిల్ దిగుమతి ఖర్చుతో కూడుకునే వ్యవహారం కావడంతో, పామ్ క్రూడ్‌ను మాత్రమే రాష్ట్రంలోని కాకినాడ, కృష్ణపట్నం వంటి పోర్టుల ద్వారా దిగుమతి చేసుకునేవారు.ఈ పోర్టుల సమీపంలో ఉండే నూనె శుద్ధి కర్మాగారాలు (రిఫైనరీలు) పామ్ క్రూడ్‌ను శుద్ధిచేసి మార్కెట్లకు పంపించేవి. ఒకప్పుడు ఆకాశాన్నంటిన పామాయిల్ ధరలు ఇటీవల దాదాపుగా దిగొచ్చాయి. పామాయిల్‌తో పోల్చుకుంటే సన్‌ఫ్లవర్ నూనె ధర ఎక్కువగా ఉండేది. దీనికి భిన్నంగా పామాయిల్ ధర కంటే దిగువకు సన్‌ఫ్లవర్ నూనె దిగింది. అంతర్జాతీయ విపణిలో మార్పుల నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా సన్‌ఫ్లవర్ నూనె ధర పెరిగింది. ఉక్రెయిన్ ప్రభావం సన్‌ఫ్లవర్ ఎక్కువగా మన ప్రాంతానికి ఉక్రెయిన్ నుంచి దిగుమతి అవుతుంది. అక్కడ ఉత్పత్తులు పడిపోయిన కారణంగా రష్యా నుంచి ఈ నూనెను దిగుమతి చేసుకుంటున్నారు. ఉక్రెయిన్ కంటే భారతదేశానికి రష్యా మీదుగా నూనెను రవాణా చేయడంతో ఖర్చు అధికం అవుతోంది. ప్రీమియంగా పేర్కొనే ధర టన్నుకు వంద డాలర్లు పెరుగుతోంది. దీంతో గుత్త మార్కెట్లో టన్నుకు రూ.200కు పైబడి ధర పెరుగుతోంది. ఈ ధర ఇటీవల పెరుగుతూ వెళ్తోంది. రష్యా నుంచి సన్‌ఫ్లవర్ నూనెను దిగుమతి చేసుకోవాల్సిందే. ఈ పరిస్థితి సెపె్టంబరు వరకు ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నిర్ణిత కొలతలు లేవు గతంలో మాదిరిగా నూనెలకు నిర్ణీత కొలతలు లేవు. కిలో, అరకిలో, లీటరు వంటి ప్యాకింగ్‌లకు కాలం చెల్లింది. ఫుడ్ అండ్ వెయిట్ అండ్ మెజర్స్ నిబంధనల్లో ఇటీవల కేంద్రం మార్పులతో చట్టం చేసింది. దీంతో ప్యాకింగ్ ఎంతైనా చేసుకోవచ్చు. ప్యాకెట్‌పై మాత్రం కొలత, గ్రాము ధర ఎంతనే వివరాలు కచ్చితంగా ఉండాలి. ఈ కారణంగా మార్కెట్లో లీటర్ పౌచ్‌లు లేవు. 850 గ్రాముల నూనె ప్యాకెట్లు మాత్రమే దొరుకుతున్నాయి. సన్‌ఫ్లవర్ ప్యాకెట్ రూ.110 ప్రస్తుతం మార్కెట్లో సన్‌ఫ్లవర్ ప్యాకెట్ ధర రూ.110లు ఉంది. గతంలో ఈ ధర రూ.86కు పడిపోయింది. పామాయిల్ 850 గ్రాముల ధర రూ.86లు ఉంది. రైస్‌బ్రాన్ ఆయిల్ ప్యాకెట్ రూ.115లు, వేరుశనగ నూనె ప్యాకెట్ రూ.160లు ఉంది. ఈ ధరలు సెపె్టంబరు వరకు ఇదే రకంగా ఉండే అవకాశాలున్నాయి. రష్యా నుంచి దిగుమతి వల్లే ధర పెరుగుదల మార్కెట్లో సన్‌ఫ్లవర్ నూనెల ధరలు సెప్టెంబరు వరకు ఇదే విధంగా ఉండే అవకాశాలున్నాయి. ఉక్రెయిన్ నుంచి కాకుండా రష్యా నుంచి సన్‌ఫ్లవర్ నూనె దిగుమతి అవుతున్నందున మార్కెట్లో ఈ నూనె ధర పెరిగింది. – పవన్, వ్యాపారి, తాడేపల్లిగూడెం -
భార్యకు సన్‌ఫ్లవర్ అంటే ఇష్టమని.. దిమ్మతిరిగే గిఫ్ట్ ఇచ్చిన భర్త!
వివాహ వార్షికోత్సవ సమయాన జీవిత భాగస్వాములు పరస్పరం బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. వీటి విలువ ఎంత ఉన్నా అవి వారికి అపురూపమైనవిగానే కనిపిస్తాయి. కాగా ఇటీవల ఒక వ్యక్తి తమ 50 వివాహవార్షికోత్సవం సందర్భంగా తన భార్యపై తనకు ఉన్న అమితమైన ప్రేమను వినూత్న రీతిలో వ్యక్తం చేశాడు. 80 ఎకరాల్లో 12 లక్షలకుపైగా సన్ఫ్లవర్లు అమెరికాకు చెందిన రైతు లీ విల్సన్ తన భార్య రెనీకి అసాధారణమైన కానుకను అందించాడు. డబ్ల్యుఎఫ్ఎక్స్జీ టీవీ తెలిపిన వివరాల ప్రకారం లీ విల్సన్ తమ వివాహం జరిగి 50 ఏళ్ల పూర్తయిన సందర్భంగా తన భార్య రెనీకి కానుకగా అందించేందుకు లెక్కకుమించిన సన్‌ఫ్లవర్స్ పూయించారు. ఇది విన్న వెంటనే ఎవరైనా దీనిలో గొప్పదనం ఏముందని అనుకంటారు. అయితే అతనికి ఉన్న 80 ఎకరాల్లో 12 లక్షలకుపైగా సన్ఫ్లవర్లను పూయించారు. తన భార్యకు సన్‌ఫ్లవర్ అంటే ఎంతో ఇష్టమని తెలుసుకున్న ఆయన భార్య కోసం ఈ విధంగా చేశారు. తన భార్యకు పెళ్లి రోజు సన్‌ఫ్లవర్ బొకే ఇచ్చే బదులు ఏకంగా 80 ఎకరాల సన్‌ఫ్లవర్ తోటనే కానుకగా అందించారు. లీ తన కుమారుని సాయంతో మే నెలలో విధంగా సన్‌ఫ్లవర్స్ పూయించడం మొదలుపెట్టారు. ఈ విషయం పెళ్లిరోజు వరకూ భార్యకు తెలియకుండా ఉండేందుకు లీ ఎంతో జాగ్రత్తపడ్డాడు. స్కూల్ రోజుల్లోనే చిగురించిన ప్రేమ ప్రస్తుతం ఈ సన్‌ఫ్లవర్స్ అన్నీ పూర్తిగా విచ్చుకున్నాయి. సరిగ్గా పెళ్లి రోజున ఆమను సర్ప్రైజ్ చేస్తూ ఈ సన్‌ఫ్లవర్ పూలతోట సుందర దృశ్యాన్ని చూసేందుకు ఆమెను ఆహ్వానించాడు. ఈ పూల తోటను చూసిన ఆమె ఎంతగానో మురిసిపోతూ వివాహ వార్షికోత్సవ వేళ తనకు ఇంతకుమంచిన పెద్ద బహుమతి మరొకటి ఉండబోదని తెలిపింది. లీ, రెనీల ప్రేమకథ వారి స్కూలు రోజులలోనే ప్రారంభమయ్యింది. అప్పట్లో వారి వయసు 16 ఏళ్లు. నాటి నుంచి వారు అన్యోన్యంగానే ఉంటున్నారు. ఇది కూడా చదవండి: బాల భీములు పెద్దోళ్లయిపోయారు.. ఇప్పుడు ఉన్నారిలా.. -
పొద్దుతిరుగుడు పంట లాభాలు రావాలంటే పాటించాల్సిన మెళకువలు
-
షాకింగ్ ఘటన.. రూ.690 కోట్ల పెయింటింగ్‌పై..
లండన్: డచ్ కళాకారుడు వాన్ వోగ్ వేసిన పొద్దుతిరుగుడు పెయింటింగ్ ప్రపంచ మేటి కళాకండాల్లో ఒకటి. 1888 నాటి ఈ పెయింటింగ్ విలువ 84 మిలియన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా 690 కోట్ల రూపాయలు. అందుకే దీన్ని లండన్‌లోని జాతీయ గ్యాలరీలో 43వ గదిలో అత్యంత భద్రంగా ఉంచారు. అయితే ఇంతటి చారిత్రక పెయింటింగ్‌పై ఇద్దరు ఆందోళనకారులు టమాటో సూప్ విసిరారు. దీంతో అక్కడున్న వారంతా 'ఓ మై గాడ్' అంటూ షాక్‌లో నోరెళ్లబెట్టారు. ప్రస్తుతం బ్రిటన్‌లో 'జస్ట్ స్టాప్ ఆయిల్' ప్రచారంతో ఉద్ధృత ఆందోళనలు కొనసాగుతున్నాయి. అకాశాన్నంటిన చమురు, గ్యాస్ ధరలను నిరసిస్తూ అనేక మంది నిరసన బాట పట్టారు. ఇందులో భాగంగానే ఇద్దరు నిరసనకారులు నేషనల్ గ్యాలరీ ఉన్న వాన్ వోగ్ పెయింటింగ్‌పైకి టమాటో సూప్ విసిరారు. Activists vandalise Vincent van Gogh’s Sunflowers at the National Gallery. The vandalism or destruction of art is always an authoritarian act. But more than that - it represents a repudiation of civilisation and the achievements of humanity.pic.twitter.com/8gLTjekvIt — Andrew Doyle (@andrewdoyle_com) October 14, 2022 కళ విలువైందా? ప్రాణం విలువైందా? ఆహారం కంటే ఇది అంత ముఖ్యమైందా? ప్రపంచం, మనుషుల కంటే పెయింటింగ్‌కు రక్షణ కల్పించడమే ముఖ్యమా? అని ఇద్దరు ఆందోళనకారుల్లో ఒకరు ప్రశ్నించారు. అయితే టామాటో సూప్ విసిరినప్పటికీ పెయింటింగ్‌కు ఏమీ కాలేదని నేషనల్ గ్యాలరీ నిర్వాహకులు తెలిపారు. కానీ పెయింటింగ్‌కు రక్షణ కల్పించే గాజు ప్రేమ్ కొంచెం దెబ్బతిన్నట్లు వెల్లడించారు. చారిత్రక పెయింటింగ్‌పైకి టమాటో సూప్ విసిరినందుకు ఇద్దరు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: భారీ పేలుడు.. 11 మంది దుర్మరణం -
తగ్గిన ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర
ముంబై: దిగుమతి సుంకాలు తగ్గించడంతో ఫ్రీడమ్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ అయిల్ ధర తగ్గిందని కంపెనీ పేర్కొంది. లీటరు ఫ్రీడమ్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ అయిల్ను గరిష్టంగా రూ.140లు, అంతకంటే తక్కువ ధరకే విక్రయిస్తున్నామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర రెడ్డి ఈ ప్రకటనలో పేర్కొన్నారు. సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై కేంద్రం దిగుమతి సుంకాలను తగ్గించిన నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ కారణాలతో ఈ ఏడాది ప్రారంభంలో లీటరు వంట నూనె ధర దాదాపు రూ.180 స్థాయికి చేరింది. నాటి నుంచి ధరల అదుపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం పరిస్థితులకు తగ్గట్లు సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై దిగుమతి సుంకాలు తగ్గిస్తూ వచ్చింది. దీంతో మార్కెట్లో సరఫరా పెరిగి ధరలు దిగివచ్చాయి. -
సోలార్ చికెన్
మీరు ఇంతవరకు సోలార్ లైట్లు, సోలార్ పంపుసెట్లు, సోలార్ వాహనాల గురించి వినే ఉంటారు కానీ సోలార్ చికెన్ గురించి ఎప్పుడైనా విన్నారా. దాని గురించి తెలుసుకోవాలంటే థాయిలాండ్ వెళ్లాల్సిందే. ఎందుకంటే ఎవరైనా చికెన్‌ను అగ్గి మీద కాలుస్తారు లేదా స్టవ్ మీద రెడీ చేస్తారు కానీ థాయిలాండ్‌లోని సిలా సుతారట్ అనే వీధి దుకాణాదారుడు మాత్రం ఈ రెండింటికీ విరుద్ధంగా చికెన్‌ను తయారు చేస్తాడు. ఓవెన్ లేదా చార్కోల్ బార్బెక్యూ వాడేందుకు బదులుగా 1000 మొబైల్ మిర్రర్లను ఉపయోగిస్తాడు. సూర్యుని నుంచి వచ్చే బలమైన కాంతిని ఆ అద్దాలపై పడేలా చేసి దాని ద్వారా వచ్చే వేడితో చికెన్‌ను తయారు చేస్తాడు. 300 డిగ్రీల సెల్సియస్ సహజ సూర్య కాంతి ద్వారా మాంసాన్ని వండుతాడు. అందరిలాగే సిలా తొలుత చార్కోల్పై చికెన్‌ను వండేవాడు. కానీ 1997లో ఒకసారి కదులుతున్న బస్సు అద్దాలపై సూర్య కాంతి పడి అది కాస్తా రిఫ్లెకై్ట సిలా ముఖంపై పడింది. అప్పుడు ముఖంపై వేడి తగిలి చివుక్కుమనింది. దీంతో అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఈ సూర్యకాంతిని ఎందుకు శక్తిగా వినియోగించుకోకూడదు అని .. అలా వచ్చిన ఐడియాతో సూర్యకాంతిని ఉపయోగించి చికెన్‌ను తయారు చేసే స్థితికి నేడు చేరుకున్నాడు. తొలుత అతని ఐడియాను చుట్టుపక్కల వారు ఎగతాళి చేశారు. నవ్విన నాప చేనే పండుతుంది అన్న తీరుగా ఇప్పుడు నవ్విన వారే సిలాను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. కేవలం 1.5 కేజీల చికెన్‌ను 10–15 నిమిషాల్లో వండేస్తున్నాడు. తాను రూపొందించిన లోహయుతమైన అద్దాలు సూర్యకాంతిని శోషించుకుని సుమారు 312 డిగ్రీ సెల్సియస్ వేడిని ఉత్పత్తి చేయగలవని సిలా తెలిపారు. ఆ వేడిని తట్టుకునేందుకు ముఖానికి వెల్డింగ్ మాస్క్‌ను ధరిస్తాడు. -
బెట్టను తట్టుకునే రకాలే అనుకూలం
– నూనెగింజల సాగుపై డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి – ప్రాంతీయ పరిశోధన స్థానంలో సన్‌ఫ్లవర్ పంట పరిశీలన నంద్యాలరూరల్: నూనెగింజల పంటల్లో బెట్టను తట్టుకునే రకాలైతే మన ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయని జాతీయ నూనెగింజల ఉత్పత్తి పరిశోధన స్థానం డైరెక్టర్ డాక్టర్ విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు. నూనెగింజల ఉత్పత్తిలో అమెరికా, చైనా, బ్రిజిల్ తర్వాతి స్థానం మనదేనన్నారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశో«దన స్థానంలో ప్రొద్దుతిరుగుడు పంటను ఆదివారం ఆయన పరిశీలించారు. బెట్టను తట్టుకోవడంతోపాటు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే రకాలను రూపొందించడంపై శాస్త్రవేత్తలు నిమగ్నమైనట్లు తెలిపారు. వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, ఆముదం, కుసుమ, నువ్వులు, ఆవాలు, సోయాచిక్కుడు తదితర నూనెగింజల పంటలపై ఆధునిక వ్యవసాయ పరిశోధన పద్ధతులు పాటించి ఉత్పత్తి చేస్తున్నామని వివరించారు. చీడపీలను విత్తన రకాలను రైతులకు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆయన వెంట ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలున్నారు. -
పొద్దు తిరుగుడు గుట్టు దొరికింది!
న్యూఢిల్లీ: పొద్దు తిరుగుడు పువ్వు సూర్యుడివైపు తిరుగడంలోని(హీలియోట్రోపిజం) గుట్టును కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తల బృందం కనిపెట్టింది. పువ్వు కాడల్లోని మూలకణాల (స్టెమ్‌సెల్స్) ప్రత్యేక ఎదుగుదల విధానమే దీనికి కారణమని వారు చెప్పారు. ‘కాడల్లో పగటిపూట ఒకవైపు ఉన్న మూలకణాలు పెరగడంతో పువ్వు ఒకవైపు నుంచి మెల్లగా పైకి లేచి, అవతలివైపు వంగుతుంది. రాత్రిపూట మరోవైపున్న మూలకణాలు పెరగడంతో పువ్వు తిరిగి ఇటువైపునకు వంగుతుంది. పువ్వులు ఉష్ణోగ్రతను గ్రహించడం ద్వారా.. ఈ మార్పులు కచ్చితంగా తూర్పు, పడమరలవైపు ఉంటాయి’ అని తెలిపారు. ఉదయం సూర్యుడి లేత కిరణాలు సోకగానే.. ఉష్ణోగ్రత మార్పును పసిగట్టి, పువ్వు తల ఆవైపునకు ఉండేలా మూల కణాలు పెరుగుతాయన్నారు. సూర్యుడి నుంచి ఎక్కువ శక్తిని గ్రహించేందుకే ఈ ఏర్పాటని పేర్కొన్నారు. -
భూమికి బలం.. పోషకాల యాజమాన్యం
జొన్న పశువుల ఎరువు ఎకరానికి 4 టన్నులు వేసి ఆఖరి దుక్కిలో కలయదున్నాలి. రబీలో సాగు చేసే జొన్నకు ఎకరానికి 32-40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ నిచ్చే ఎరువుల్ని వేయాలి. నత్రజని ఎరువును రెండు సమభాగాలుగా అంటే విత్తేటప్పుడు , మోకాలు ఎత్తు పైరు దశలో వేయాలి. సిఫారసు చేసిన భాస్వరపు , పొటాష్ పూర్తి మోతాదును విత్తే సమయంలో వేయాలి. మొక్కజొన్న నీటి పారుదల కింద సాగు చేసి మొక్కజొన్నకు ఎకరానికి 80-100 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం, 32 కిలోల పొటాష్ నిచ్చే ఎరువుల్ని వేయాలి. నత్రజనిని 4 సమ దఫాలుగా విభజించి వేయాలి. మొదటి దఫాను విత్తేటప్పుడు, రెండవ దఫాను విత్తిన 25-30 రోజులకు, మూడవ దఫాను 45-50 రోజులకు, నాలుగవ దఫాను 60-65 రోజుల మధ్య వేయాలి. సిఫారసు చేసిన భాస్వరపు పూర్తి మోతాదును విత్తే సమయంలోనే వేయాలి. సిఫారసు చేసిన పొటాష్ ఎరువును రెండు దఫాలుగా వేసుకోవాలి. సగభాగం విత్తే సమయంలోను, మిగిలిన సగభాగాన్ని విత్తిన నెలరోజులకు వేయాలి. భూమిలో జింక్ లోపముంటే ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేటును మూడు పంటలకు ఒకసారి వేయాలి. అదే జింకు లోప లక్షణాలు పంటపై కనిపించినట్లయితే 0.2 శాతం జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని(లీటరు నీటికి 2 గ్రా జింక్ సల్ఫేట్ ) వారానికి ఒకసారి చొప్పున 2,3 సార్లు పంటపై పిచికారి చేయాలి. శనగ శనగ సాగులో ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం , 16 కిలోల గంథకాన్ని ఇచ్చే ఎరువులను చివరి దుక్కిలో వేసుకోవాలి. పెసర పెసర సాగులో ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువు వేసి దుక్కిలో బాగా కలియదున్నాలి. తర్వాత విత్తనం వేసే ముందు దుక్కిలో ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువుల్ని వేసుకోవాలి. వరి మాగాణుల్లో పెసర సాగు చేసేటప్పుడు ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. మినుము మినుము సాగులో ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువు దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి. విత్తటానికి ముందు ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు వేసి గొల్లతో కలియదున్నాలి. వరి మాగాణుల్లో మినుము సాగు చేసేటప్పుడు ఎరువులు వాడనవసరం లేదు. పొద్దుతిరుగుడు పొద్దుతిరుగుడు సాగులో ఎకరానికి 3 టన్నుల పశువుల ఎరువును విత్తటానికి 2-3 వారాల ముందు వేసుకోవాలి నీటి పారుదల కింద హైబ్రిడ్లను సాగు చేసినట్లయితే ఎకరానికి నల్లరేగడి నేలల్లో 30 కిలోల నత్రజని, 36 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్లను ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజనిని 3 దఫాలుగా విభజించి వేయాలి. వేయాల్సిన నత్రజని మోతాదులో సగభాగాన్ని మొదటి దఫా గా విత్తేటప్పుడు, నాలుగో వంతును రెండవ దఫాగా విత్తిన 30 రోజుల తరువాత మొగ్గ తొడిగే దశలో.. మిగి లిన నాలుగో వంతును మూడవ దఫాగా విత్తిన 50 రోజుల తర్వాత పువ్వు వికసించే దశలో వేసుకోవాలి. సిఫారసు చేసిన భాస్వరపు, పొటాష్ పూర్తి మోతాదులను ఆఖరి దుక్కిలోనే వేసుకోవాలి. సూక్ష్మ పోషకాలలో పొద్దుతిరుగుడు సాగుకు బొరాన్ అత్యంత ఆవశ్యకమైనది. పైరు పూత దశలో ఆకర్షక పత్రాలు తెరుచుకొన్నప్పుడు 0.2 శాతం బొరాక్స్( లీటరు నీటికి 2 గ్రా బొరాక్స్) మందు ద్రావణాన్ని ఎకరానికి 200 లీటర్ల చొప్పున పిచికారి చేసినట్లయితే గింజలు ఎక్కువగా తయారై, దిగుబడి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. లేదా ఆఖరి దుక్కలో ఎకరానికి 8 కిలోల బొరెక్ ఆమ్లాన్ని వేసుకోవాలి. గంధకం లోపించిన నేలల్లో ఎకరానికి 10 కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో వేస్తే గింజలో నూనె శాతం పెరగడమే కాక అధిక దిగుబడులను సాధించవచ్చు( ఎకరానికి 55 కిలోల జిప్సం) -
పొద్దుతిరుగుడు మేలు
అనువైన నేలలు, విత్తన రకాలు డీఆర్ ఎస్‌హెచ్-1, ఏపీఎస్‌హెచ్-66తో పాటు ప్రముఖ ప్రైవేట్ కంపెనీల సంకరాలను ఎంచుకోవచ్చు.ఎకరాకు రెండు కిలోల విత్తనం సరిపోతుంది. నీరు నిల్వ ఉండని తటస్థ భూ ములు, ఎర్ర, ఇసుక, రేగడి, నల్ల ఒండ్రుమట్టి నేలలు పొద్దుతిరుగుడు సాగుకు అనుకూలంగా ఉంటాయి. విత్తనశుద్ధి మొలకశాతం పెంపొందించేందుకుగాను విత్తనాన్ని 12 గంటలు నానబెట్టి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. విత్తుకునే ముందు ఆకుమచ్చ తెగులు నివారణకు ఇప్రొడియాన్+కార్బండిజం అనే మందు 2 గ్రాములను కిలో విత్తనాలకు కలిపి శుద్ధి చేయాలి. విత్తేదూరం తేలిక నేలల్లో వరుసల మధ్య 45 సెం.మీ మొక్కల మధ్య 20-25 సెం.మీ ఉంచాలి. బరువు నేలల్లో వరుసల మధ్య 60 సెం.మీ, మొక్కల మధ్య 30 సెం.మీ ఉండేలా చూసుకోవాలి. కుదురుకు 2-3 విత్తనాలు వేయాలి. విత్తనం మొలకెత్తిన 15 రోజుల తర్వాత కుదురుకు ఒక ఆరోగ్యవంతమైన మొక్కను ఉంచి మిగిలిన మొక్కలను తొలగించాలి. ఎరువులు ఎకరాకు 3-4 టన్నుల చివికిన పశువుల ఎరువు వేయాలి. నత్రజని ఎరువును విత్తనాలు వేసేటప్పుడు 26 కిలోలు, మొగ్గ తొడిగే దశలో 13 కిలోలు, 50 రోజుల తర్వాత పువ్వు వికసించే దశలో 13 కిలోలు వేసుకోవాలి. ఆఖరి దుక్కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 20 కిలోలు, మొత్తం భాస్వరం 150 కిలోలు వేసుకోవాలి. పూత దశలో 2.0 గ్రాముల బోరాక్స్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే విత్తనాలు అధికంగా ఏర్పడతాయి. నీటి యాజమాన్యం తేలిక నేలల్లో పది రోజులకు ఒకసారి, బరువు నేలల్లో 15 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. మొగ్గ దశ, పూత దశ, గింజ కట్టే దశ, గింజ నిండే దశలో నీటి తడులు ఇవ్వాలి. చీడపీడల నివారణ ఇలా.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పొద్దుతిరుగుడు 30-40 రోజుల పంటగా ఉంది. ఈ దశలో పంటలను ఆశించే చీడపీడలు, వాటి నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం. ఆకుమచ్చ తెగులు ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకుల మీద గోధుమ రంగు లేదా నల్లటి వలయకారపు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత దశల్లో మచ్చలన్నీ కలిసిపోయి, ఆకులు ఎండి పెరుగుదల ఆగిపోతుంది. ఈ తెగులు లక్షణాలు కనిపించి న వెంటనే కార్బండిజం+మాంకోజబ్ మందు 2.0 గ్రాములు లేదా ప్రొఫికొనజోల్ 1.9 మి.లీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పువ్వు కుళ్లు లేదా తల కుళ్లు ఈ తెగులు పూత దశలో ఎక్కువగా వర్షాలు పడినప్పుడు ఆశిస్తుంది. ప్రథమ దశలో మొక్క చివరి భాగం, పువ్వు కింద ఉన్న ఆకులు ఎండిపోతాయి. తర్వాత దశల్లో పువ్వు తొడిమ దగ్గర కుళ్లిపోయి ఎండిపోతుంది. నివారణకు ఫెన్థియాన్ ఒక మిల్లీలీటరు+నీటిలో కరిగే గంధకం 3.0 గ్రాములను లీటరు నీటికి కలిపి పూత దశలో 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగులు పచ్చదీపపు పురుగులు, తెల్లదోమలు, తామర పురుగులు, ఆకుల్లో రసం పీల్చి నష్టం కలుగజేస్తాయి. దీనివల్ల ఆకులన్నీ పసుపు పచ్చగా మారిపోయి, ఆ తర్వాత ఎర్రబడి ఎండిపోతాయి. వీటి నివారణకు థయోమిథాక్సమ్ 0.5 గ్రాములు లేదా ట్రైకోఫాస్ 2.0 మి.లీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. శనగపచ్చ పురుగు పొద్దు తిరుగుడు పండించే ప్రాంతాల్లో ఈ పురుగు కనిపిస్తుంది. ఈ పురుగు లార్వాలు.. పువ్వులు, గింజల మధ్య చేరి వాటిని తింటూ అధిక నష్టాన్ని కలుగజేస్తాయి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఒక గ్రాము థయోడికార్బ్+నోవాల్యురాన్ ఒక మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
పంటమార్పిడితో ప్రయోజనం
నిజామాబాద్ వ్యవసాయం : ఎప్పుడూ ఒకేరకమైన పంటలు వేస్తూ ఉంటే దిగుబడులు తగ్గుతూ ఉంటాయి. చాలామంది రైతులు నేటికీ ఒకేరకమై పంటలను పండిస్తూ సరైన దిగుబడులు రాక ఆర్థికంగా చితికిపోతున్నారు. ఏటేటా పంట మార్పిడి చేస్తే నాణ్యమైన ఉత్పత్తులు వచ్చి దిగుబడులు రెట్టింపయ్యే వీలుంటుందని జేడీఏ నర్సింహా తెలిపారు. రబీలో ఆలస్యంగా సాగుచేస్తున్న రైతులకు ‘పంటమార్పిడి విధానం’పై పలు సూచనలు చేశారు. అవగాహన అవసరం పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తే తెగుళ్ల బెడద తగ్గుతుంది. దీనిపై చాలా మంది రైతులకు అవగాహన లేదు. ఒకరిని చూసి మరొకరు వేసిన పంటేనే వేస్తూ నష్టాలపాలవుతున్నారు. పంట మార్పు మూలంగా నేల భౌతిక స్థితి మెరుగుపడుతుంది. భూమిలో నీరు నిల్వ ఉండే శక్తి కలిగి భూసారం వృద్ధి చెందుతుంది. దీని వల్ల చీడపీడల బెడద అస్పలుండదు. ఫలితంగా సస్యరక్షణకు వినియోగించే మందుల ఖర్చు తగ్గించవచ్చు. శిలీంధ్ర తెగుళ్లను దూరం చేయవచ్చు. బీజాలు వాటి అవశేషాలు, వానపాముల అభివృద్ధి ఎక్కువవుతుంది. కీటకాల గుడ్లు వృద్ధి చెందవు. పంటలో నాణ్యత పెరిగి గిట్టుబాటు ఎక్కువగా పొందే అవకాశం ఉంది. రైతులు గమనించాల్సినవి భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ చేసే శక్తి ఉన్నప్పుడు పంట తర్వాత వేరే పంటను వేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి. తేలికపాటి నేలలు, ఎర్ర ఇసుక నేలల్లో మిశ్రమ పంటలు వేసుకోవాలి. వర్షాకాలం రోజులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పంటకాలం కలిగిన కంది, నువ్వు, వేరుశనగ వంటి పంటలు వేసుకోవాలి. బంకమన్ను శాతం ఎక్కువగా ఉంటే ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు, పల్లపు ప్రాంతాల్లో పంట మార్పిడి చేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి. జాగ్రత్తలు పంట మార్పిడిలో నేల ఉపరితలాన్ని పూర్తిగా కప్పే పంటలను ఎంపిక చేసుకోవాలి. ఇందులో శనగ, బబ్బెర, మినుము, ఉలువలు, పెసర పంటలను వేయడం వల్ల నేలను పూర్తిగా కప్పి ఉంచుతాయి. దీని వల్ల కలుపు మొక్కలను నివారించవచ్చు. పత్తి పైరు సాగు చేసిన నేలలో మినుము, పెసర వంటి పం టలతో మార్పు చేయడం వల్ల తెల్లదోమ ఉధృతి తగ్గించవచ్చు. వేరుశనగ తర్వాత జొన్న, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు వంటి ఆరుతడి పంటలను పండించాలి. దీని వల్ల వేరుశనగ పంటలను ఆశించే ఆకుముడత ఉధృతిని నివారించవచ్చు. పసుపు తర్వాత వరి, జొన్న వంటి పైర్లను సాగు చేసుకోవాలి. దీని వల్ల నేలలో నెమటోడ్ల సంఖ్య తగ్గుతుంది. వరి పైరు తర్వాత పప్పు ధాన్యాల పంటలు గానీ నూనె గింజల పైర్లనుగాని పండించడం వల్ల వరి పంటను ఆశించే టంగ్రో వైరస్, దోమ పోటులను సమర్ధంగా నివారించవచ్చు. పెసర గాని పశుగ్రాసంగా జొన్నగాని సాగు చేస్తే తర్వాత వేరుశనగ పంటలు వేసుకోవాలి. సూచనలు జొన్న సాగు తర్వాత మళ్లీ అదే పంట వేయొద్దు. దీని వల్ల ఎర్ర గొంగళి పురుగు, శనగపచ్చ పురుగు ఆశించవచ్చు. వేరుశనగ తర్వాత ఆముదంతో పంట మార్పిడి చేసుకోవచ్చు. నులిపురుగులు ఉన్న ప్రాంతాల్లో వంగ, బెండ, టమాట, మినుము, పెసర పంటలు వస్తే అవి వాటిని మరింత అభివృద్ధి చేస్తాయి. -
వర్షాభావ పరిస్థితుల్లో పొద్దు తిరుగుడే ముద్దు
తాళ్లూరు : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ పొద్దు తిరుగుడు పంట సాగు ఉత్తమం. ఈ మేరకు రైతులు సాగుకు సన్నద్ధం అవుతున్నారు. పంట సాగులో మెళకువలు, యాజమాన్య పద్ధతులను అద్దంకి ఏడీఏ కుప్పయ్య ‘సాక్షి’కి వివరించారు. వాతావరణంలో తేమ తక్కువగా ఉంటే ఏడాది పొడవునా ఈ పంటను పండించుకోవచ్చని చెప్పారు. ఖరీఫ్‌లో అయితే సెప్టెంబర్ చివరి వరకు ఈ పంటను వేసుకోవచ్చన్నారు. అనుకూలమైన నేలలు నీరు నిల్వ ఉండని తటస్థ నేలలైన ఎర్ర, రేగడి, ఒండ్రు నెలలు పొద్దుతిరుగుడు పంటకు అనుకూలం. ఆమ్ల లక్షణాలు కలిగిన నేల కంటే క్షార లక్షణాలు కలిగిన నేలల్లో దిగుబడి ఎక్కువగా వస్తుంది. భూమిలో ఆమ్ల లక్షణాలు ఉంటే విత్తనం మొలకెత్తే స్వభావం కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ లక్షణం మొక్కలో పటుత్వాన్ని తగ్గిస్తుంది. పొద్దు తిరుగుడు మొక్కలు అధిక తేమ శాతాన్ని తట్టుకోలేవు. అందువల్ల లోతట్టు ప్రాంతాల్లో ఈ పంటను సాగు చేయవద్దు. సాగు నేల తయారీ భూమిని నాలుగైదు సార్లు బాగా దున్ని మెత్తటి దుక్కిని తయారు చేసుకోవాలి. మధ్యస్థ బరువు నేలల్లో బ్లేడుతో ఒకటి రెండు సార్లు కలియదున్నాలి. చదును చేసిన అనంతరం బోదెలు చేసి విత్తనం నాటాలి. విత్తనశుద్ధి... ఎకరాకు రెండు కిలోల విత్తనం అవసరం. విత్తనాలను ముందు 14 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత నీడలో ఆరబెట్టి విత్తే ముందు కిలో విత్తనాలకు మూడు గ్రాముల కాంప్లాన్, థైరమ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఆ తర్వాతే విత్తాలి. నీటి యాజమాన్యం ఎర్ర రేగడి నేలల్లో ఉష్ణోగ్రతను బట్టి 6 నుంచి 10 రోజుల వ్యవధిలో, నల్లరేగ డి భూముల్లో 15 నుంచి 20 రోజుల కొకసారి నీటిని అందించవచ్చు. శీతాకాలంలో తేలిక నేలలకు 4 నుంచి 6 సార్లు, మధ్యస్థ నేలలకు మూడు నుంచి 4 సార్లు, బరువు నేలలకు రెండు నుంచి మూడు సార్లు నీటిని పారించాలి. ఎరువుల వాడకం విత్తనం విత్తే మూడు వారాల ముందు ఎకరాకు మూడు టన్నుల పశువుల పేడ వేసి దున్నాలి. ఇది భూమిని సారవంతం చేస్తుంది. భాస్వరం, పొటాష్ ఎరువులను దుక్కిలో వేయాలి. నత్రజనిని విత్తనం నాటే దశలో, మొగ్గ తొడిగే దశలో, పువ్వు వికసించే దశలో వేసుకోవాలి. పూత దశలో, ఆకర్షక పత్రాలు వికసించే దశలో ఎకరాకు 200 లీటర్ల బోరాక్స్ మందు(లీటరు నీటికి రెండు గ్రామాల బొరాక్స్ కలపాలి)ను పిచికారీ చేయాలి. దీనివల్ల గింజలు ఎక్కువగా, బలంగా తయారవుతాయి. గంధకం తక్కువగా ఉన్న నేలల్లో ఎకరాకు 10కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో వేస్తే నూనె శాతం పెరిగి అధిక దిగుబడులు వస్తాయి. సస్యరక్షణ చర్యలు పొద్దు తిరుగుడు పంటను రసం పీల్చే పురుగులు, లద్దె, గొంగళి, పచ్చ, శనగపచ్చ, తలను తొలిచే పురుగులు లాంటివి ఆశిస్తాయి. ఆకుమచ్చ, పువ్వుకుళ్లు, బూజు లాంటి తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి తగిన తగిన నివారణ చర్యలు చేపట్టాలి. పక్షులు, అడవి పందుల బెడద పొద్దు తిరుగుడు పంటకు అడవి పందుల బెడద ఎక్కువగా ఉంటుంది. రామచిలుకలు ఎక్కువగా పంటపైన వాలి నష్టాన్ని కలిగిస్తాయి. పక్షులను బెదరగొట్టేందుకు మెరుపు రిబ్బన్లు చేను పైభాగంలో(వీటిపై సూర్యరశ్మి పడే ఎత్తులో) కట్టాలి. శబ్ధాలు చేయడం, దిష్టిబొమ్మలను ఏర్పాటు చేయడం ద్వారా పక్షుల బెడదను తగ్గించుకోవచ్చు. విత్తనం పట్టాక అడవి పందులు కూడా దాడి చేసే అవకాశం ఉంది. వాటి నివారణకు పంట చుట్టూ గుంజలు పాతి పట్టలు చుట్టి కాపాడుకోవాలి. -
‘పొద్దు’ తిరుగుతోంది
జిల్లాలో గతంలో సుమారు 30 వేల హెక్టార్లలో పొద్దు తిరుగుడు సాగయ్యేది. కానీ రైతులు ఇటీవలి కాలంలో ఈ పంట సాగును తగ్గించారు. గతేడాది ఖరీఫ్‌లో ఎనిమిది వేల హెక్టార్లలోనే సన్‌ఫ్లవర్ సాగయ్యింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు మొగ్గు చూపుతుండడంతో ఈసారి సుమారు 15 వేల హెక్టార్లలో ఈ పంట సాగు కావచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నేలలు అనుకూలం నీరు నిల్వ ఉండని తటస్థ నేలలైన ఎర్ర, చెలక, రేగడి, ఒండ్రు నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. ఆమ్ల లక్షణాలు కలిగిన నేలల కంటే కొంచెం క్షార లక్షణాలు కలిగిన నేలల్లో పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది. భూమిలో ఆమ్ల లక్షణాలు ఉంటే విత్తనం మొలకెత్తే స్వభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ లక్షణం మొక్కలో పటుత్వాన్ని తగ్గిస్తుంది. నూనె శాతం కూడా తగ్గుతుంది. పొద్దు తిరుగుడు మొక్కలు అధిక తేమ శాతాన్ని తట్టుకోలేవు. అందువల్ల లోతట్టు ప్రాంతాల్లో ఈ పంటను సాగు చేయవద్దు. సాగునేల తయారీ భూమిని నాలుగైదుసార్లు దున్ని మెత్తటి దుక్కిని తయారు చేసుకోవాలి. మధ్యస్థ, బరువు నేలల్లోనైతే బ్లేడ్‌తో ఒకటిరెండు సార్లు కలియదున్నాలి. చదను చేసిన అనంతరం బోదేలు చేసి విత్తనం నాటాలి. విత్తన శుద్ధి ఎకరానికి రెండు కిలోల విత్తనం అవసరం. విత్తనాలను ముందు 14 గంటలు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత నీడలో ఆరబెట్టి, విత్తే ముందు కిలో విత్తనానికి మూడు గ్రాముల థైరమ్ లేదా కాప్లాన్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఆ తర్వాత విత్తాలి. నీటి యాజమాన్యం ఎర్ర నేలల్లో ఉష్ణోగ్రతను బట్టి 6 నుంచి 10 రోజుల వ్యవధిలో, నల్లరేగడి భూముల్లో అయితే 15 నుంచి 20 రోజులకొకసారి నీటిని అందించవచ్చు. శీతకాలంలో తేలిక నేలలకు 4 నుంచి 6 సార్లు, మధ్యస్థ నేలలకు మూడు నుంచి నాలుగుసార్లు, బరువు నెలలకు రెండు నుంచి మూడుసార్లు నీటిని పారించాలి. ఎరువుల వాడకం విత్తనం వేసే మూడు వారాల ముందు ఎకరాకు 3 టన్నుల పశువుల పేడను వేసి దున్నాలి. ఇది భూమిని సారవంతం చేస్తుంది. భాస్వరం, పోటాష్ ఎరువులను దుక్కిలోనే వేయాలి. నత్రజనిని విత్తనం నాటే సమయంలో, మొగ్గ తొడిగే దశలో, పువ్వు వికసించే దశలో వేసుకోవాలి. పూత దశలో ఆకర్షక పత్రాలు వికసించే దశలో ఎకరాకు 200 లీటర్ల బొరాక్స్ మందును(లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్స్ చొప్పున కలపాలి) పిచికారి చేయాలి. దీని వల్ల గింజలు ఎక్కువగా తయారవుతాయి. గంధకం తక్కువగా ఉన్న నేలల్లో ఎకరాకు 10 కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో వేస్తే నూనె శాతం పెరిగి అధిక దిగుబడులు వస్తాయి. సస్యరక్షణ చర్యలు పొద్దుతిరుగుడు పంటను రసం పీల్చే పురుగులు, లద్దె పురుగు, గొంగళి పురుగు, పచ్చపురుగు, శనగపచ్చ పురుగు, తలను తొలిచే పురుగు లాంటివి ఆశిస్తాయి. ఆకుమచ్చ తెగులు, తప్పు తెగులు, పువ్వుకుళ్లు, బూ జు తెగులులాంటివి సోకే అవకాశాలుంటాయి. వీటి నివారణకు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తీసుకొని క్రిమి సంహారక మందులను పిచికారీ చేయాలి. పక్షులు, అడవి పందుల బెడద పొద్దుతిరుగుడు పంటకు పక్షుల బెడద ఎక్కువగా ఉంటుంది. రామచిలకలు ఎక్కువగా పంటలపై వాలి నష్టం కలిగిస్తాయి. పక్షులను బెదరగొట్టేందుకు మెరుపు రిబ్బన్లను చేను పైభాగంలో(సూర్యరశ్మి వీటిపై పడే ఎత్తులో) కట్టాలి. శబ్ధాలు చేయడం, దిష్టిబొమ్మలను ఏర్పాటు చేయడం ద్వారా పక్షుల బెడదను తగ్గించవచ్చు. విత్తనం పట్టాక అడవి పందులు కూడా పంటపై దాడి చేసే అవకాశం ఉంంది. పంట చుట్టూ గుంజలు పాతి ఇనప తీగను చుట్టడం ద్వారా అడవి పందులు రాకుండా చూసుకోవచ్చు. సాగు విస్తీర్ణం పెరుగుతుంది ఈ ఏడు వర్షాభావ పరిస్థితులుండడంతో పొద్దుతిరుగుడు పంట సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలున్నాయి. 15 వేల హెక్టార్లలో పొద్దుతిరుగుడు సాగవుతుందని భావిస్తున్నాం. మాక్లూర్ మండల పరిధిలోనే వేయి ఎకరాలకు పైగా భూమిలో ఈ పంట సాగయ్యే అవకా శం ఉంది. కోతులు అధికంగా తిరిగే గుట్ట ప్రాంతాల్లో ఈ పంట వేయడానికి రైతులు విముఖత చూపుతారే తప్ప మిగతా మండలాల్లో ఈ పంటసాగు చేసే అవకాశాలున్నాయి. సస్య రక్షణ చర్యలు తీసుకుంటే ఎకరాకు 12 క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తుంది. హరికృష్ణ, ఏవో, మాక్లూర్ మండలం ఫోన్ నంబర్ : 88866 13125 -
మెట్ట పంటలే మేలు
ఖమ్మం వ్యవసాయం: పత్తి జిల్లాలో పత్తి విస్తీర్ణం 1.62 లక్షల హెక్టార్లు, ఇప్పటి వరకు 1.33 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. మిగిలిన విస్తీర్ణంలో సాలు పత్తిని విత్తుకోవచ్చు. పత్తి గింజలు పెట్టిన ఒకటి, రెండు రోజుల్లో పెండి మిథాలిన్ ఎకరాకు 1.2 లీటర్లు పిచికారీ చేస్తే కలుపు తొలగుతుంది. బి.టి పత్తికి ఎకరాకు 60 కిలోల నత్రజని, 24-30 కిలోల భాస్వరం, 24-30 కిలోల పొటాషియం ఎరువులను వాడుకోవాలి. నత్రజని, పొటాష్ ఎరువులను నాలుగు దఫాలుగా వర్షాన్ని బట్టి 3, 4 సమభాగాలుగా 20 రోజుల వ్యవధిలో పత్తి విత్తిన 80 నుంచి 90 రోజులలోపు వేయాలి. బెట్ట పరిస్థితులు ఉంటే రెండు శాతం యూరియా, ఒకశాతం పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. పత్తిలో మెగ్నీషియం, బోరాన్ లోపం నివారణకు 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ విత్తిన 45, 75 రోజుల సమయంలో, 1.5 గ్రాముల బోరాన్‌ను విత్తిన 60 నుంచి 90 రోజుల వ్యవధిలో లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. బెట్ట పరిస్థితుల్లో రసం పీల్చు పురుగులు పచ్చదోమ, తామర, పేనుబంక ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా మోనోక్రోటోపాస్ 1.6 మి.లీ లేదా ఎసిటామాఫిడ్ 0.2 గ్రాములు థయోమథాక్సామ్ 0.2 గ్రాములు లేదా ఫెసోనిక్ 2 మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. - తెల్లదోమ ఉధృతి ఉంటే ట్రైజోపాస్ రెండు మి.లీ లేదా ప్రోఫైనోపాస్ రెండు మి.లీ లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి. పిండినల్లి ఉంటే ప్రొఫెనోపాస్ మూడు మి.లీ లీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కంది ఆగస్టు మొదటి వారం నుంచి పత్తికి బదులు కొందరు రైతులు కందిని విత్తుతున్నారు. సాళ్ల మధ్యలో 45-90 సెం.మీ. మొక్కల మధ్య దూరం 10 సెం.మీ ఉండేటట్లు విత్తుకోవాలి. కందిలో ఎంఆర్జీ-66, ఎల్‌ఆర్‌జీ-41, ఎంఆర్జీ-1004, ఎల్‌ఆర్‌జీ-30, 38, డబ్లూఆర్‌జీ-27, 55 వంటి రకాలు మేలు. ఎకరానికి 6-8 కిలోల విత్తనాలు నాటాలి. నేల స్వభావాన్నిబట్టి 10 సెం.మీ దూరంలో విత్తుకోవాలి. - విత్తిన మరుసటి రోజు 1.5 లీటర్ల పెండిమిథిలాన్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. రెండు కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఎరువులను పంట విత్తే సమయంలో వేయాలి. కంది పూత దశలో మరూక మచ్చలు ఆశించి నష్టపరిచే అవకాశం ఉన్నందున క్లోరీపైరిపాస్ 2.5 మి. లీ, డైక్లోరోపాస్ మి.లీ, లేదా స్పైనోసాడ్ 0.3 మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. జొన్న ఆగస్టు 15 తరువాత జొన్న సాగు చేసుకునే వీలుంది. మోతి, ఎన్టీజే-3, ఎం 35-1, సీఎస్హెచ్-5, 9, కిన్నెర, ఇతర ప్రైవేట్ హైబ్రిడ్ రకాలు అనుకూలం. జొన్న సాగుకు 3-4 కిలోల విత్తనం వాడాలి. సాళ్ల మధ్య దూరం 45 సెం.మీ, మొక్కల మధ్య దూరం 12-15 సె.మీ ఉండాలి. విత్తడానికి ముందు మూడు గ్రాముల థయోమిథాక్సిన్, మూడు గ్రాముల థైరామ్ లేదా కాస్టాన్తో విత్తన శుద్ధి చేయాలి. 24 నుంచి 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్ ఎరువులు అవసరం. నత్రజనిని పంట విత్తేటప్పుడు, విత్తిన 30-40 రోజుల్లో వేయాలి. భాస్వరం, పొటాష్లను ఆఖరి దుక్కిలో వేయాలి. పంట విత్తిన 48 గంటల్లో నాలుగు గ్రాముల అట్రాజిన్‌ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే కలుపు పోతుంది. మొక్క మొలిచిన 7, 14, 21 రోజుల వయసులో మువ్వ తొలిచే ఈగ వ్యాపిస్తుంది. దీని నివారణకు గ్రాము థమోడికార్బ్ లేదా 2 మి.లీ ల్యాంబ్డాసెహలోత్రిన్ను పిచికారీ చేయాలి. మొక్కలు పుష్పించు దశలో బంకగారు తెగులు, గింజబూజుల నివారణకు ప్రొఫికన్జోల్ 0.5 మి.లీ లీటరు నీటిని కలిపి పిచికారీ చేయాలి. నువ్వులు నువ్వులు ఆగస్టు 15 తేదీ వరకు విత్తుకోవచ్చు. శ్వేత, రాజేశ్వరి రకాలు శ్రేయస్కరం. కిలో విత్తనానికి మూడు గ్రాముల కాప్టాన్ లేదా మాంకోజెబ్‌ను కలిపి విత్తనశుద్ధి చేయాలి. ఎకరాకు రెండు కిలోల విత్తనాలను ఇసుకలో కలిపి 30 ఁ 15 సెం.మీ దూరంలో విత్తుకోవాలి. ఎరువుగా 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ వాడాలి. పూత, గింజ దశలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. నువ్వులో వెర్రి తెగులు (ఫిల్లోడి) ఆశిస్తే నివారణకు డైమిథోయేట్ మూడు మి.లీ లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పొద్దుతిరుగుడు మోర్డన్, డీఆర్‌ఎస్‌ఎఫ్-108, కేబీఎస్‌హెచ్-1, ఎన్‌డీఎస్‌హెచ్-1, డీఆర్‌ఎస్‌హెచ్-1 ఏపీఎస్‌హెచ్-66 రకాలను విత్తుకోవాలి. ఎకరాకు 3 నుంచి 4 కిలోలు, హైబ్రిడ్ రకాలు 2 నుంచి 2.5 కిలోల విత్తనం 60ఁ30 సెం.మీ దూరంలో విత్తుకోవాలి. నత్రజని 30 కిలోలు, భాస్వరం 36 కిలోలు, పొటాష్ 12 కిలోలు వాడాలి. నత్రజనిని మూడు దఫాలు వేయాలి. భాస్వరం, పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. పైరు పూత దశలో రెండు గ్రాముల బోరాక్స్‌ను లీటరు నీటిలో కలిపి ఎకరాకు 200 లీటర్లను పిచికారీ చేయాలి. మొగ్గ, పూత, గింజపోసుకునే దశలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. మొక్కజొన్న ఆగస్టు మొదటి వారం వరకు స్వల్పకాలిక హైబ్రిడ్ మొక్కజొన్నను సాగు చేసుకోవచ్చు. ఎకరాకు 7-8 కిలోల విత్తనాన్ని వాడి 60ఁ20 సెం.మీ దూరంలో విత్తాలి. మూడు గ్రాముల క్యాప్టాన్ లేదా డైథీన్ ఎం-45తో విత్తన శుద్ధి చేయవచ్చు. విత్తిన 48 గంటల లోపు అట్రజిన్-14ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే కలుపు నివారించుకోవచ్చు. మొక్కజొన్నకు ఎకరాకు 60-80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ వాడాలి. నత్రజనిని విత్తేటప్పుడు, మోకాలు ఎత్తు దశ, పూత దశలో మూడు సమభాగాల్లో వేయాలి. కాండం తొలిచే పురుగు సమస్య ఉంటే కార్బోఫిరాన్-34 గుళికలు ఎకరాకు మూడు కిలోలు వేయాలి. -
ఈ వారం వ్యవసాయ సూచనలు
అల్లం: నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఏప్రిల్ మొదటి వారం నుంచి మే నెలాఖరు వరకు అల్లం విత్తుకోవచ్చు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడటానికి ముందుగానే విత్తుకోవడం వల్ల మొక్కలు భూమిలో నిలదొక్కుకొని, తర్వాత పడే భారీ వర్షాలకు తట్టుకోగలవు. విత్తడం ఆలస్యమైతే వర్షాల వల్ల దుంపకుళ్లు వచ్చి మొలక శాతం తగ్గుతుంది. 1. ఎర్ర గరప, చల్కా నేలలు అనుకూలం. బరువైన బంకమట్టి నేలలు, నీరు నిలిచే నేలలు పనికిరావు. 2. వీ1ఎస్1-8, వీ2ఈ5-2, వీ3ఎస్1-8 అల్లం రకాలు అధిక దిగుబడినిస్తాయి. వీటిల్లో పీచు తక్కువగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతానికి మారన్, అను రకాలు అనువైనవి. 3. ఒక ఎకరానికి రకాన్ని బట్టి 600-1,000 కిలోల విత్తనం సరిపోతుంది. భాస్వరం ఎరువుల వాడకంపై రైతులకు సూచనలు: 4. మన రాష్ట్రంలోని అధిక జిల్లాల్లోని సాగు భూముల్లో భాస్వరం లభ్యత మధ్యస్థం నుంచి ఎక్కువ శాతం ఉన్నట్లు గుర్తించారు. 5. నేలలోని భాస్వరం లభ్యత అధికంగా ఉన్నప్పుడు.. భాస్వరం ఎరువుల వాడకాన్ని తగ్గించినా పంట దిగుబడుల్లో ఎటువంటి వ్యత్యాసం కనపడలేదని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. 6. వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ పంటలు సాగు చేసే నేలల్లో అధిక భాస్వరం ఉన్నట్లయితే భాస్వరం ఎరువుల వాడకాన్ని 25-50 శాతం వరకు తగ్గించవచ్చు. 7. నేలల్లో భాస్వరం మోతాదు పెరిగి ఎక్కువగా నిల్వ ఉన్నప్పుడు.. పైపాటుగా మరింత భాస్వరం అందించడం వల్ల ఖర్చు పెరగడమే కాకుండా, ఇతర ధాతువులు మొక్కలకు అందకుండా పోతాయి. 8. ఫాస్ఫో బ్యాక్టీరియా అనే జీవన ఎరువు వాడడం ద్వారా నేలలో నిల్వ ఉన్న భాస్వరాన్ని మొక్కలకు అందేలా చేయవచ్చు. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -
ఆదుకోని రబీ
సాక్షి, సంగారెడ్డి: అకాల వర్షాలతో రబీ పంటల భవితవ్యం దినదినగండంగా మారింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంట నష్టం రోజురోజుకు పెరిగిపోతోంది. పంటలు కోల్పోయి అన్నదాతలు దుఃఖంలో మునిగిపోయారు. గత నెల 27 నుంచి జిల్లా అంతటా భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వరి, గోధుమ, జొన్న, మినుము పంటలతో పాటు కూరగాయలు, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తాజాగా జిల్లాలో పంట నష్టం 3,632 హెక్టార్లకు ఎగబాకింది. దీంతో దిగుబడి రూపంలో రైతులు రూ.11.71 కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. పంట నష్టంపై సమగ్ర సర్వే జరిపి మరో వారం రోజుల్లో ప్రభుత్వానికి తుది అంచనా నివేదిక పంపించాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా..ప్రభుత్వం తక్షణమే పెట్టుబడి రాయితీని విడుదల చేసి ఆదుకోవాలని బాధిత రైతులు, రైతు సంఘాలు కోరుతున్నాయి. రబీపై ‘అకాల’ దెబ్బ రబీ సాధారణ విస్తీర్ణం 1.56 లక్షల హెక్టార్లని వ్యవసాయ శాఖ అంచనా వేయగా ఏకంగా 1.76 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. గతేడాది భారీ వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పెరగడంతో రబీ సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. నెల రోజులు గడిస్తే పంటలు చేతికందనుండగా అకాల వర్షాలు అనూహ్యంగా దెబ్బతీశాయి. వరి సాధారణ సాగు 44,407 హెక్టార్లయితే రైతులు 65,263 హెక్టార్లలో పంట వేశారు. అదే విధంగా 20,029 హెక్టార్లలో చెరకు సాగైంది. నెల రోజులుగా విద్యుత్ కోతలు తీవ్రం కావడంతో పంటలు క్రమంగా క్షీణిస్తున్న దశలో వర్షాలు ఆదుకుని కొంత వరకు ప్రాణం పోశాయి. అయితే, వడగళ్ల బీభత్సవానికి వందల ఎకరాల్లో వరి, చెరకు పంటలు సైతం ధ్వంసమయ్యాయి. 26,975 హెక్టార్లలో సాగైన మొక్కజొన్న, 10,149 హెక్టార్లలో సాగు చేసిన పొద్దుతిరుగుడు పంటలపై మాత్రం అకాల వర్షాలు దెబ్బతీస్తున్నాయి. మొక్కజొన్న పంట కంకు, పొద్దుతిరుగుడు పంటలు పువ్వూ ఏర్పడే దశలో ఉన్నాయి. పది రోజులుగా కురుస్తున్న వార్షిలకు వందల ఎకరాల్లో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగ పంటలు దెబ్బతిన్నాయి. పొంచి ఉన్న తెగుళ్లు ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో పంటలకు తెగుళ్లు సోకే ప్రమాదముంది. గాలిలో తేమతో పాటు తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు, వరి పంటలకు చీడపీడలు ఆశించే అవకాశాలున్నాయి. చేలల్లో వర్షపు నీళ్లు నిల్వ ఉండనీయకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సంగారెడ్డిలోని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తెగుళ్ల నివారణ కోసం ఈ రసాయన మందులను నీటిలో కలిపి పిచికారి చేయాలని పలు రకాల మందులను సిఫారసు చేస్తున్నారు. మొక్కజొన్న పంటలకు ఆకుమచ్చ, తలకుళ్లు తెగుళ్లు ఆశించే అవకాశముంది. ఆకుమచ్చ తెగుళ్ల నివారణ కోసం లీటర్ నీటిలో జినెట్ 2 గ్రాములు లేదా మంకోజిట్ 3 గ్రాములు కలిపి పిచికారి చేయాలి. అదే విధంగా తలకుళ్లు తెగుళ్ల నివారణ కోసం లీటర్ నీటిలో సెంథియాన్ ఒక మిల్లీలీటర్ లేదా నీటిలో కరిగే గందకం 3 గ్రామాలు కలిపి పిచికారి చేయాలి. జొన్న పంటకు సోకే తేనె బంక తెగుళ్లు నివారణకోసం లీటర్ నీటిలో గ్రాము భావిష్టిన్ లేదా 2.5 గ్రాముల మాంకోజెట్ కలిపి వారం రోజుల్లో రెండు సార్లు పిచికారి చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. -
అన్నదాతకు అకాల దెబ్బ
సాక్షి, సంగారెడ్డి: అకాల వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయి. మెట్ట పంటలను తుంచేస్తూ వర్షాధార పంటలకు ప్రాణం పోస్తున్నాయి. జిల్లాలో గత ఐదు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి కూడా జిల్లా అంతటా వర్షం కురిసింది. వర్షాలతో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగ, మిరప పంటలు నేలకొరిగాయి. మామిడి పిందెలు నేలరాలాయి. మరోవైపు విద్యుత్ కోతలతో క్షీణిస్తున్న వరి, చెరకు పంటలకు ఈ వర్షాలు మేలు చేస్తున్నాయి. ఆదివారం నాటికి జిల్లాలో 422.8 హెక్టార్లలో వ్యవసాయ, 280 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ఆయా శాఖలు తేల్చాయి. కాగా సోమవారం రాత్రి కూడా పలుచోట్ల వర్షాలు కురవడంతో ఈ నష్టం మరింత పెరిగింది. నర్సాపూర్ మండలంలో రెండు కోళ్లఫారాలు ధ్వంసమయ్యాయి. 500 కోళ్లు మృత్యువాత పడగా సుమారు రూ. 20 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు సమాచారం. కాగా సంగారెడ్డిలో భారీగా వడగళ్ల వర్షం కురిసింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇదిలా ఉండగా తాజా నష్టం వివరాలు మంగళవారం అధికారికంగా వెల్లడికానున్నాయి. పంట నష్టంపై సమగ్ర సర్వే జరిపి బుధవారం ప్రభుత్వానికి తుది నివేదిక పంపించాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ శాఖలను ఆదేశించారు. 420 హెక్టార్లలో వ్యవసాయానికి దెబ్బ.. కల్హేర్ మండలంలోని మూడు గ్రామాల పరిధిలో 320 హెక్టార్ల మొక్కజొన్న, 2.8 హెక్టార్లలో గోధుమ పంటలు ధ్వంసమైనట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. చేగుంట మండలంలోని ఐదు గ్రామాల పరిధిలో 20 హెక్టార్లలో మొక్కజొన్న, 4 హెక్టార్ల పొద్దుతిరుగుడు, 4 హెక్టార్ల శనగ పంటలు దెబ్బతిన్నాయి. దుబ్బాక మండలంలో 8 హెక్టార్ల పొద్దుతిరుగుడు, 6 హెక్టార్లలో మొక్కజొన్న.. సిద్దిపేట మండలంలో 2 గ్రామాల పరిధిలో 40 హెక్టార్ల పొద్దుతిరుగుడు, 8 హెక్టార్ల మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. 280 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం చిన్నకోడూరులో 250 హెక్టార్లలో మిరప, సిద్దిపేటలో 14.4 హెక్టార్లలో మామిడి, దుబ్బాకలో 10 హెక్టార్లలో మామిడి, 4 హెక్టార్లలో మిరప పంటలు దెబ్బతిన్నట్టు ఉద్యాన శాఖ అధికారులు గుర్తించారు.