ప్రొద్దుతిరుగుడు పంటను పరిశీలిస్తున్న డాక్టర్ విష్ణువర్దన్‌రెడ్డి
బెట్టను తట్టుకునే రకాలే అనుకూలం
Published Sun, Aug 21 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
– నూనెగింజల సాగుపై డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి
– ప్రాంతీయ పరిశోధన స్థానంలో సన్‌ఫ్లవర్ పంట పరిశీలన
నంద్యాలరూరల్: నూనెగింజల పంటల్లో బెట్టను తట్టుకునే రకాలైతే మన ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయని జాతీయ నూనెగింజల ఉత్పత్తి పరిశోధన స్థానం డైరెక్టర్ డాక్టర్ విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు. నూనెగింజల ఉత్పత్తిలో అమెరికా, చైనా, బ్రిజిల్ తర్వాతి స్థానం మనదేనన్నారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశో«దన స్థానంలో ప్రొద్దుతిరుగుడు పంటను ఆదివారం ఆయన పరిశీలించారు. బెట్టను తట్టుకోవడంతోపాటు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే రకాలను రూపొందించడంపై శాస్త్రవేత్తలు నిమగ్నమైనట్లు తెలిపారు. వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, ఆముదం, కుసుమ, నువ్వులు, ఆవాలు, సోయాచిక్కుడు తదితర నూనెగింజల పంటలపై ఆధునిక వ్యవసాయ పరిశోధన పద్ధతులు పాటించి ఉత్పత్తి చేస్తున్నామని వివరించారు. చీడపీలను విత్తన రకాలను రైతులకు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆయన వెంట ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలున్నారు.
Advertisement