పొద్దు తిరుగుడు గుట్టు దొరికింది!
న్యూఢిల్లీ: పొద్దు తిరుగుడు పువ్వు సూర్యుడివైపు తిరుగడంలోని(హీలియోట్రోపిజం) గుట్టును కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తల బృందం కనిపెట్టింది. పువ్వు కాడల్లోని మూలకణాల (స్టెమ్‌సెల్స్) ప్రత్యేక ఎదుగుదల విధానమే దీనికి కారణమని వారు చెప్పారు. ‘కాడల్లో పగటిపూట ఒకవైపు ఉన్న మూలకణాలు పెరగడంతో పువ్వు ఒకవైపు నుంచి మెల్లగా పైకి లేచి, అవతలివైపు వంగుతుంది. రాత్రిపూట మరోవైపున్న మూలకణాలు పెరగడంతో పువ్వు తిరిగి ఇటువైపునకు వంగుతుంది. పువ్వులు ఉష్ణోగ్రతను గ్రహించడం ద్వారా.. ఈ మార్పులు కచ్చితంగా తూర్పు, పడమరలవైపు ఉంటాయి’ అని తెలిపారు.
ఉదయం సూర్యుడి లేత కిరణాలు సోకగానే.. ఉష్ణోగ్రత మార్పును పసిగట్టి, పువ్వు తల ఆవైపునకు ఉండేలా మూల కణాలు పెరుగుతాయన్నారు. సూర్యుడి నుంచి ఎక్కువ శక్తిని గ్రహించేందుకే ఈ ఏర్పాటని పేర్కొన్నారు.