సోలార్‌ చికెన్‌ | Solar chicken | Sakshi
Sakshi News home page

సోలార్‌ చికెన్‌

Published Sun, Jun 18 2017 2:12 AM | Last Updated on Mon, Oct 22 2018 8:25 PM

సోలార్‌ చికెన్‌ - Sakshi

సోలార్‌ చికెన్‌

మీరు ఇంతవరకు సోలార్‌ లైట్లు, సోలార్‌ పంపుసెట్లు, సోలార్‌ వాహనాల గురించి వినే ఉంటారు కానీ సోలార్‌ చికెన్‌ గురించి ఎప్పుడైనా విన్నారా. దాని గురించి తెలుసుకోవాలంటే థాయిలాండ్‌ వెళ్లాల్సిందే. ఎందుకంటే ఎవరైనా చికెన్‌ను అగ్గి మీద కాలుస్తారు లేదా స్టవ్‌ మీద రెడీ చేస్తారు కానీ థాయిలాండ్‌లోని సిలా సుతారట్‌ అనే వీధి దుకాణాదారుడు మాత్రం ఈ రెండింటికీ విరుద్ధంగా చికెన్‌ను తయారు చేస్తాడు. ఓవెన్‌ లేదా చార్‌కోల్‌ బార్బెక్యూ వాడేందుకు బదులుగా 1000 మొబైల్‌ మిర్రర్లను ఉపయోగిస్తాడు. సూర్యుని నుంచి వచ్చే బలమైన కాంతిని ఆ అద్దాలపై పడేలా చేసి దాని ద్వారా వచ్చే వేడితో చికెన్‌ను తయారు చేస్తాడు.

300 డిగ్రీల సెల్సియస్‌ సహజ సూర్య కాంతి ద్వారా మాంసాన్ని వండుతాడు. అందరిలాగే సిలా తొలుత చార్‌కోల్‌పై చికెన్‌ను వండేవాడు. కానీ 1997లో ఒకసారి కదులుతున్న బస్సు అద్దాలపై సూర్య కాంతి పడి అది కాస్తా రిఫ్లెకై్ట సిలా ముఖంపై పడింది. అప్పుడు ముఖంపై వేడి తగిలి చివుక్కుమనింది. దీంతో అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఈ సూర్యకాంతిని ఎందుకు శక్తిగా వినియోగించుకోకూడదు అని .. అలా వచ్చిన ఐడియాతో సూర్యకాంతిని ఉపయోగించి చికెన్‌ను తయారు చేసే స్థితికి నేడు చేరుకున్నాడు. తొలుత అతని ఐడియాను చుట్టుపక్కల వారు ఎగతాళి చేశారు. నవ్విన నాప చేనే పండుతుంది అన్న తీరుగా ఇప్పుడు నవ్విన వారే సిలాను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. కేవలం 1.5 కేజీల చికెన్‌ను 10–15 నిమిషాల్లో వండేస్తున్నాడు. తాను రూపొందించిన లోహయుతమైన అద్దాలు సూర్యకాంతిని శోషించుకుని సుమారు 312 డిగ్రీ సెల్సియస్‌ వేడిని ఉత్పత్తి చేయగలవని సిలా తెలిపారు. ఆ వేడిని తట్టుకునేందుకు ముఖానికి వెల్డింగ్‌ మాస్క్‌ను ధరిస్తాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement