యువకుని అనుమానాస్పద మృతి
అనంతపురం: అనంతపురం జిల్లాలోని సోమనదేపల్లి మండలం రేణుకానగర్ ప్రాంతానికి చెందిన చంద్రమౌళి అనే యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. వివరాలు...శుక్రవారం ఉదయం పొలంలోని విశ్రాంతి గదిలో చంద్రమౌళి నిర్జీవంగా పడి ఉండడాన్ని ఆయన తండ్రి గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, చంద్రమౌళి పాము కాటు వల్ల మృతి చెందాడా లేక మరేదైనా కారణమా అన్నది తెలియాల్సి ఉంది.