Man fills 'Tula Rashi' on amount column of bank's deposit slip - Sakshi
Sakshi News home page

బ్యాంకు డిపాజిట్‌ ఫారంలో.. ‘ఇదేందయ్యా ఇది..’

Published Tue, Jun 27 2023 12:15 PM | Last Updated on Tue, Jun 27 2023 12:33 PM

Man Went to the Bank to Deposit Money Wrote Tula Rashi of Amount on Slip - Sakshi

సోషల్‌ మీడియాలో ఎప్పుడు ఏది చూడాల్సి వస్తుందో ఎవరికీ తెలియదు. దీనిలో షేర్‌ అయ్యే వీడియోలు, ఫొటోలు ప్రత్యేకంగా ఉన్నప్పుడు అవి మన మనసుకు హత్తుకుపోతాయి. కొన్ని వీడియోలు, ఫొటోలు మనల్ని తెగ నవ్విస్తాయి. 

తాజాగా వైరల్‌ అవుతున్న ఒక ఇమేజ్‌లో ఒక బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్‌ స్లిప్‌ కనిపిస్తోంది. దీనిలో ఒక వినియోగదారుడు.. రాశి(అమౌంట్‌) కాలమ్‌లో ఏమి నింపాడో తెలిస్తే ఎవరికైనా తెగ నవ్వు వస్తుంది. దీనిని చూసిన కొందరు తమ తలలు పట్టుకుంటున్నారు. మరికొందరు తమ పొట్టపట్టుకుని పడీపడీ నవ్వుతున్నారు. 

వైరల్‌ అవుతున్న ఈ ఫొటో పాతదే అయినప్పటికీ, సోషల్‌ మీడియాలో తరచూ పోస్ట్‌ అవుతూ, తెగ వైరల్‌ అవుతోంది.సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ట్విట్టర్‌లో @NationFirst78 అనే ఖాతా కలిగిన యూజర్‌ తొలుత దీనిని షేర్‌ చేశారు. దీనిలో ఒక బ్యాంకు డిపాజిట్‌ స్లిప్‌ కనిపిస్తోంది. 

వినియోగదారుడు ఆ ఫారంలోని అన్ని కాలమ్‌లను సరిగానే పూరించాడు. అయితే ‘రాశి’(అమౌంట్‌) కాలమ్‌లో తులారాశి అని రాశాడు. ఈ ఫారం హిందీ, ఇంగ్లీషు రెండు భాషలలో ఉంది. హిందీలో ‘రాశి’ అంటే ఇంగ్లీషులో అమౌంట్‌ అని అర్థం. అయితే ఆ మహాశయుడు రాశి అనగానే తన జన్మరాశి అనుకుని దానిని ఆ కాలమ్‌లో నింపాడు. దీనిని చూసిన వారంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ ఫారాన్ని పరిశీలించి చూస్తే, ఇది ఉ‍త్తరప్రదేశ్‌లోని మురాదాబాద్‌కు చెందిన ఒక బ్యాంకుదని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: పాపం పసివాడు:16 రోజులు కోమాలో ఉండి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement