deposite
-
ఢిల్లీలో 162 మంది పోటీ.. 148 మంది డిపాజిట్లు గల్లంతు
ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. ఇక్కడి నుంచి పోటీ చేసిన మొత్తం 162 మంది అభ్యర్థుల్లో 14 మందిని మాత్రమే ప్రజలు ఆమోదించారు. మిగిలిన 148 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఢిల్లీలో అత్యధిక ఓటింగ్ శాతం తూర్పు ఢిల్లీ స్థానంలో 62.89గా నమోదయ్యింది. న్యూ ఢిల్లీ స్థానంలో అత్యల్పంగా 55.43 శాతం ఓటింగ్ నమోదైంది.న్యూఢిల్లీ లోక్‌సభ స్థానంలో ఎవరైనా అభ్యర్థి డిపాజిట్‌ను కాపాడుకోవాలంటే వారికి 1,40,891 ఓట్లు అవసరం. అదే తూర్పు ఢిల్లీ స్థానంలో అయితే 2,58,180 ఓట్లు అవసరం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ డిపాజిట్‌ను కాపాడుకునేందుకు మొత్తం ఓట్లలో 1/6 ఓట్లు పొందాలి. పోలింగ్ రోజున ఢిల్లీలోని 1,52,01,936 మంది ఓటర్లలో 58.69శాతం అంటే 89,23,536 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఏడు స్థానాల్లో న్యూఢిల్లీలో అత్యల్పంగా 8.45 లక్షల మంది ఓటర్లున్నారు. ఇక్కడ నిబంధనల ప్రకారం డిపాజిట్ కాపాడుకోవడానికి అభ్యర్థికి 1,40,891 లక్షల ఓట్లు అవసరం. న్యూఢిల్లీ లోక్‌సభ స్థానానికి 17 మంది అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. వీరిలో బన్సూరి స్వరాజ్, సోమనాథ్ భారతికి 1.4 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. మిగిలిన 15 మంది అభ్యర్థుల సెక్యూరిటీ డిపాజిట్ గల్లంతయ్యింది.అత్యధిక ఓట్లు పొందిన ఈశాన్య ఢిల్లీ స్థానంలోని 24,63,159 మంది ఓటర్లలో 15,49,80 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ స్థానంపై అభ్యర్థులు తమ డిపాజిట్ కాపాడుకోవడానికి 2,58,180 ఓట్లు అవసరం. ఈశాన్య ఢిల్లీ స్థానానికి 28 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. వారిలో మనోజ్ తివారీ, కన్హయ్య కుమార్ మినహా 26 మంది అభ్యర్థుల సెక్యూరిటీ డిపాజిట్ గల్లంతయ్యింది. మిగిలిన ఐదు స్థానాల్లో బీజేపీ, మహాకూటమి అభ్యర్థులు మినహా మిగిలిన వారందరినీ ప్రజలు తిరస్కరించారు.ఢిల్లీ మాజీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఆయన బహుజన సమాజ్ పార్టీ టిక్కెట్‌పై న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 5,629 ఓట్లు వచ్చాయి. మొత్తం పోలైన ఓట్లలో ఇది 0.66 శాతం మాత్రమే. రాజ్‌కుమార్ ఆనంద్‌కు పోస్టల్ ఓటు ద్వారా 28 ఓట్లు రాగా, ఈవీఎంల ద్వారా 5,601 ఓట్లు వచ్చాయి. గతంలో ఢిల్లీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆనంద్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన న్యూఢిల్లీ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. -
బ్యాంకు డిపాజిట్ ఫారంలో.. ‘ఇదేందయ్యా ఇది..’
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది చూడాల్సి వస్తుందో ఎవరికీ తెలియదు. దీనిలో షేర్ అయ్యే వీడియోలు, ఫొటోలు ప్రత్యేకంగా ఉన్నప్పుడు అవి మన మనసుకు హత్తుకుపోతాయి. కొన్ని వీడియోలు, ఫొటోలు మనల్ని తెగ నవ్విస్తాయి. తాజాగా వైరల్ అవుతున్న ఒక ఇమేజ్‌లో ఒక బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్ స్లిప్ కనిపిస్తోంది. దీనిలో ఒక వినియోగదారుడు.. రాశి(అమౌంట్) కాలమ్‌లో ఏమి నింపాడో తెలిస్తే ఎవరికైనా తెగ నవ్వు వస్తుంది. దీనిని చూసిన కొందరు తమ తలలు పట్టుకుంటున్నారు. మరికొందరు తమ పొట్టపట్టుకుని పడీపడీ నవ్వుతున్నారు. వైరల్ అవుతున్న ఈ ఫొటో పాతదే అయినప్పటికీ, సోషల్ మీడియాలో తరచూ పోస్ట్ అవుతూ, తెగ వైరల్ అవుతోంది.సోషల్ మీడియా ప్లాట్ఫారం ట్విట్టర్లో @NationFirst78 అనే ఖాతా కలిగిన యూజర్ తొలుత దీనిని షేర్ చేశారు. దీనిలో ఒక బ్యాంకు డిపాజిట్ స్లిప్ కనిపిస్తోంది. వినియోగదారుడు ఆ ఫారంలోని అన్ని కాలమ్‌లను సరిగానే పూరించాడు. అయితే ‘రాశి’(అమౌంట్) కాలమ్‌లో తులారాశి అని రాశాడు. ఈ ఫారం హిందీ, ఇంగ్లీషు రెండు భాషలలో ఉంది. హిందీలో ‘రాశి’ అంటే ఇంగ్లీషులో అమౌంట్ అని అర్థం. అయితే ఆ మహాశయుడు రాశి అనగానే తన జన్మరాశి అనుకుని దానిని ఆ కాలమ్‌లో నింపాడు. దీనిని చూసిన వారంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ ఫారాన్ని పరిశీలించి చూస్తే, ఇది ఉత్తరప్రదేశ్‌లోని మురాదాబాద్‌కు చెందిన ఒక బ్యాంకుదని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: పాపం పసివాడు:16 రోజులు కోమాలో ఉండి.. -
స్విస్ బ్యాంకులో తగ్గిన భారతీయుల డిపాజిట్లు
-
రూ.100 తిరిగి ఇవ్వని బ్యాంకు.. షాకిచ్చిన కోర్టు.. ఏకంగా రూ. 65 వేలు
సాక్షి, చెన్నై: వినియోగదారుడికి రూ.100 తిరిగి ఇవ్వని బ్యాంకు నష్టపరిహారంగా రూ. 65 వేలు అందజేయాలని వినియోగదారుల ఫోరంను కోర్టు ఆదేశించింది. చెంగల్పట్టు జిల్లా మధురాంతకంకు చెందిన నిర్మల్ కుమార్ చెన్నై సౌకార్‌పేట గోవిందప్పనాయకన్ వీధిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2018 జూలై 24న స్నేహితుడు అకౌంట్లో నగదు డిపాజిట్ చేశాడు. ఆ సమయంలో రూ. 900కు గాను రెండు 500 రూపాయల నోటును బ్యాంకు సిబ్బందికి ఇచ్చాడు. చలానాలో రెండు 500 నోట్లు ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. బ్యాంక్ క్యాషియర్ రూ.900 లకు బదులుగా నిర్మల్ కుమార్ స్నేహితుడి ఎకౌంట్‌కు వెయ్యి రూపాయలు పంపించేశాడు. దీంతో నిర్మల్ కుమారు బ్యాంకు క్యాషియర్ వద్ద మిగిలిన రూ. 100 ఇవ్వమని కోరాడు. ఈ వ్యవహారాన్ని నిర్మల్ కుమార్ బ్యాంకు మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాడు. అతను ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీని తరువాత ముంబైలో ఉన్న ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వారు కూడా చర్యలు తీసుకోలేదు. చివరిగా చెంగల్పట్టు వినియోగదారుల ఫోరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును పరిశీలించిన వినియోగదారుల ఫోరం కోర్టు న్యాయమూర్తి బాధితుడికి నష్టపరిహారంగా రూ. 50 వేలు, కేసు దాఖలు చేయడానికి అయిన ఖర్చు రూ. 15 వేలు కలిపి మొత్తం రూ. 65 వేలు అందజేయాలని సంబంధిత అధికారికి ఆదేశాలు జారీ చేశారు. -
వికారాబాద్ జిల్లాలో HDFC ఖాతాలోకి భారీగా డబ్బు జమ
-
డిపాజిట్ల స్వీకరణకు ఎంఎఫ్‌ఐలను అనుమతించాలి
కోల్‌కతా: భారత్‌లో సూక్ష్మ రుణ సంస్థలను (ఎంఎఫ్ఐలు) ప్రజల నుంచి డిపాజిట్ల స్వీకరణకు అనుమతించాలని నోబెల్ పురస్కార గ్రహీత, బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంకు వ్యవస్థాపకుడు మహమ్మద్ యూనస్ అన్నారు. ప్యాన్‌ఐఐటీ గ్లోబల్ ఈ కాంక్లేవ్‌లో భాగంగా ఆయన మాట్లాడారు. భారత్‌లో ఎంఎఫ్ఐలు నిధుల కోసం బ్యాంకుల దగ్గరకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఆర్బీఐ చిన్న ఫైనాన్స్ బ్యాంకులను అనుమతించిందంటూ, అవి డిపాజిట్లను స్వీకరించే అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘ప్రజలకు రుణం అన్నది ఆరి్థకపరమైన ఆక్సిజన్. బ్యాంకులకు ప్రత్యా మ్నాయ బ్యాంకింగ్ చానల్ (నిధుల కోసం) ఏర్పా టు చేయకుంటే, పేదలకు రుణాలు ఇచ్చేందుకు అవి ఆసక్తి చూపవు’’ అని యూనస్ పేర్కొన్నారు. -
సుకన్య సమృద్ధి పథకంలో మార్పులు
న్యూఢిల్లీ: ఆడ పిల్లల పేరిట పొదుపునకు ఉపకరించే సుకన్య సమృద్ధి యోజన పథకంలో కేంద్రం వార్షిక కనీస డిపాజిట్‌ను రూ.250కు తగ్గించింది. గతంలో ఇది రూ.1,000గా ఉండేది. ఖాతా ప్రారంభంలో కనీస డిపాజిట్‌ను రూ.250 చేయడమే కాకుండా, ఆ తర్వాత నుంచి వార్షికంగా రూ.250 కనీస డిపాజిట్‌గా నిర్ణయిస్తూ కేంద్రం పథకంలో మార్పులు చేసింది. 2017 నవంబర్ నాటికి 1.26 కోట్ల ఖాతాలు ఈ పథకం కింద ప్రారంభమయ్యాయని, రూ.19,183 కోట్ల మొత్తం ఆయా ఖాతాల్లో డిపాజిట్ చేయడం జరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ 2018 బడ్జెట్ సందర్భంగా ప్రకటించిన విషయం గమనార్హం. జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి ఈ పథకం డిపాజిట్లపై వడ్డీ రేటు 8.1%గా ఉంది. పదేళ్ల లోపు ఆడపిల్లల పేరిట తల్లిదండ్రులు, గార్డియన్ ఈ ఖాతాను పోస్టాఫీసు లేదా ఎంపికచేసిన బ్యాంకుల్లోనూ తెరవవచ్చు. చిన్న మొత్తాల పొదుపు, పీపీఎఫ్ స్కీముల్లానే ఈ డిపాజిట్‌పై వడ్డీ రేటును ప్రతీ త్రైమాసికానికి ఒకమారు సవరిస్తారు. ప్రస్తుతం ఈ డిపాజిట్‌పై వడ్డీ రేటు 8.1% ఉంది. ఈ ఖాతాలో చేసే డిపాజిట్‌కు, డిపాజిట్ కాలం పూర్తయిన తర్వాత పొందే మొత్తానికి ఆదాయపు పన్ను చట్టం 80సీసీ కింద పూర్తి మినహాయింపు లభిస్తుంది. -
డిపాజిట్ చేస్తుండగా దోచేశారు
ఆచంట : పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు ఓ పక్క బ్యాంకుల వద్ద క్యూలు కడుతుంటే.. ఇదే అదనుగా దొంగలు చెలరేగిపోతున్నారు. ఆచంట ఆంధ్రాబ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్లిన ఓ వృద్ధురాలి నుంచి రూ.49 వేలు అపహరించిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఆచంట పంచాయతీ పరిధి బాలంవారిపాలెంకు చెందిన ముంగండ వీరరాఘవులు అనే వృద్ధురాలు డ్వాక్రా గ్రూపులో సభ్యురాలు. ఈ గ్రూపునకు ఇటీవల ఆంధ్రాబ్యాంకు రూ.5 లక్షలు రుణం మంజూరు చేయగా ఒక్కో సభ్యురాలికి రూ.40 వేలు అందింది. ఈ క్రమంలో వీరరాఘవులకు రూ.500 నోట్లు వచ్చాయి. కొన్నిరోజుల పాటు సొమ్ములు ఇంటి వద్దనే ఆమె భద్రపర్చుకుంది. ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేస్తామని ప్రకటించడంతో ఈ రూ.40 వేలతోపాటు తాను దాచుకున్న మరో రూ.9 వేలు కలిపి రూ.49 వేలు తీసుకుని శనివారం ఆంధ్రాబ్యాంకుకు వెళ్లింది. బ్యాంకు మిత్రతో వోచర్ పూర్తిచేయించుకుని కౌంటర్ వద్దకు వెళితే వోచరుతోపాటు ఆధార్ కార్డు నకలుపై సంతకం చేసి ఇవ్వాలని సిబ్బంది కోరారు. దీంతో ఆమె సంతకాలు చేస్తున్న సమయంలో ఆమె సొమ్ములు ఉంచిన సజ్జలోని రూ.49 వేలను గుర్తుతెలియని వ్యక్తి అపహరించాడు. నగదు జమ చేసే క్రమంలో సొమ్ములు కనిపించకపోవడంతో లబోదిబోమంటూ ఆమె బ్యాంకు అధికారులకు విషయాన్ని తెలి యజేసింది. బ్రాంచ్ మేనేజర్ ఆర్.రాంబాబు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీ సులు బ్యాంకుకు వెళ్లి వృద్ధురాలితోపాటు ఖాతాదారులను విచారించారు. బ్యాంకులో ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా సంచరించారని, వృద్ధురాలిని అ నుసరించినట్టు స్థానికులు చెబుతున్నారు. కార్యాలయంలో ఎనిమిది సీసీ కెమెరాలు ఉండగా ఐదు మాత్రమే పనిచేస్తున్నాయి. పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కనిపించని పోలీసు బందోబస్తు బ్యాంకుల వద్ద భద్రత పెంచామని ప్రభుత్వం ప్రకటించినా స్థానిక పోలీసులు ఆ దిశగా తీసుకున్న చర్యలు తీసుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో ఏడు జాతీయ బ్యాంకులు, నాలుగు సబ్‌పోస్టాఫీసులు ఉన్నాయి. రోజు ఆయా కార్యాలయాలు నోట్ల మార్పిడితో కిటకిటలాడుతున్నాయి. అడపాదడపా వ చ్చి వెళ్లిపోవడం తప్ప ఎక్కడా పోలీసు సిబ్బందిని ఏర్పాటుచేయలేదని ఖాతాదారులు అంటున్నారు. జిరాక్స్ నోటుతో మోసం మట్టపర్రు (పోడూరు) : ఇద్దరు యువకులు రూ.2 వేల నోటు జిరాక్స్‌ను కిరాణా దుకాణంలో ఇచ్చి సరుకులు తీసుకుని మోసం చేసిన సంఘటన పోడూరు మండలం మట్టపర్రులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నా యి.. మట్టపర్రు గ్రామ సర్పంచ్ తంగెళ్ల వెంకటలక్ష్మి గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఆమె దుకాణంలో ఉండగా ఆ గ్రామానికే చెందిన ఇద్దరు యువకులు వచ్చి రూ.2 వేల నోటు జిరాక్స్ కాపీని ఇచ్చి సరుకులు కొన్నారు. ఆమె దానిని అసలైన నోటుగా భావించి సరుకుల సొమ్ములు పోను మిగిలిన చిల్లర ఇచ్చారు. దుకాణం మూసేముందు సొమ్ములు లెక్కిస్తుండగా మిగతా రూ.2 వేల నోట్లకు జిరాక్స్ నోటుకు సైజులో తేడా ఉండటంతో విషయం బయటపడింది. అనుమానం వచ్చిన వెంకటలక్ష్మి దీనిని ఇంట్లో వారికి చూపగా తన అది జిరాక్స్ కాపీ అని గుర్తించారు.విషయం ఎస్సై పి.రవీంద్రబాబుకు తెలియడంతో శనివారం వివరాలు సేకరించారు. జిరాక్స్ నోటు ఇచ్చిన యువకులను, జిరాక్స్ తీసిన పోడూరుకు చెందిన ఫొటోగ్రాఫర్‌ను విచారించినట్టు తెలిసింది. జిరాక్స్ మెషీ¯ŒSను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
నగదు పంపాలా? ఫేస్బుక్ చాలు!!
నగదు బదిలీకి అవకాశమిస్తున్న బ్యాంకులు ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకుల ఆరంభం ఇతర బ్యాంకుల్లోని ఖాతాలకూ పంపించుకునే వీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు... ఉచితంగానే రాకేష్ తన స్నేహితుడికిడబ్బు పంపాలి. జేబులో, ఖాతాలో రెండింట్లోనూ డబ్బుంది. కానీ, బ్యాంకుకెళ్లి డిపాజిట్ చేయాలంటే చిరాకు. అక్కడి క్యూను తలచుకుంటేనే భయం. ఒక్క రాకేష్‌దే కాదు. చాలామందిది ఇలాంటి పరిస్థితే. ఇదంతా చూశాకే ఫేస్బుక్లో చాటింగ్ చేస్తూ నగదును బదిలీ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి బ్యాంకులు. ఫ్రీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫేస్బుక్ నుంచే నగదును బదిలీ చేయొచ్చు మరి. పరీక్షల ఫలితాల దగ్గర్నుంచి.. కొత్తగా కొన్ని చేతి గడియారం వరకూ.. ప్రతి దాన్నీ ఫేస్బుక్లో పోస్ట్ చేయందే నిద్రపట్టదు యువతకు. వాటికొచ్చే లైక్‌లు, కామెంట్లు చూసి తీరాల్సిందే. ఇప్పుడీ ఫేస్బుక్ బ్యాంకులకూ పాకింది. దీనికోసం ‘కేపే’లో (జ్చుడఞ్చడ) రిజిస్టర్ చేసుకుంటే చాలు. జేబులో రూపాయి లేకున్నా.. పంపాల్సిన వ్యక్తి బ్యాంకు ఖా తా వివరాలు తెలియకున్నా.. ఫేస్బుక్ ఉంటే క్షణాల్లో డబ్బు పంపించొచ్చు. ప్రస్తుతం కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంకులు ఈ సేవలందిస్తున్నాయి. ఫ్రెంచ్ బ్యాంక్ గ్రూప్ అయిన బీపీసీఈ ట్వీట్టర్ ద్వారా ఈ సేవలను అందిస్తోంది. కేపేలో రిజిస్ట్రేషన్.. మన బ్యాంకు ఖాతాను కేపేలో రిజిస్ట్రేషన్ చేసుకోవటమెలాగో ఓసారి చూద్దాం. ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అయ్యాక.. కేపే అని టైప్ చేస్తే ఓ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే.. లాగిన్ విత్ ఫేస్బుక్ అనే పేజీ వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఫేస్బుక్ పాస్‌వర్డ్‌ను అడుగుతుంది. ఆ తర్వాత మన ఫేస్బుక్ ప్రొఫైల్‌లోని పేరు, ప్రొఫైల్ పిక్చర్, ఫ్రెండ్స్ లిస్ట్, పుట్టిన తేదీ, నగరం వంటి వివరాలను ఓకే చేయాలి. ఆ తర్వాత బ్యాంకు ఖాతా వివరాలివ్వాలి. నగదు బదిలీ.. కేపేలో రిజిస్టరయ్యాక ఎవరికి నగదు పంపాలనుకుంటున్నామో ఎంచుకోవాలి. ఒకరికంటే ఎక్కువ మంది స్నేహితులకు ఒకే సమయంలో డబ్బు పంపాలనుకుంటే అకౌంట్ నంబర్ ముందు మీ ఫ్రెండ్స్ జాబితా ఉంటుంది. అందులో నుంచి ఎంతమందినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎంత నగదును బదిలీ చేస్తున్నామో నమోదు చేయాలి.కావాలనుకుంటే నగదుతో పాటు ఏదైనా సందేశాన్ని కూడా పంపించవచ్చు.వెంటనే రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్‌కు వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. దీన్ని ఎంటర్ చేస్తే చాలు. నగదు బదిలీ అయిపోయినట్టే. ఎదుటి వ్యక్తి కేపేలో రిజిస్టర్ కాకపోతే.. డబ్బును పంపే వ్యక్తే కాదు... తీసుకునే వ్యక్తీ కేపేలో రిజిస్టరై ఉంటేనే నగదు నేరుగా అతని బ్యాంకు ఖాతాకు క్రెడిట్ అవుతుంది. ఒకవేళ రిజిస్టర్ కాకపోతే... ఆ వ్యక్తి ఖాతాకు మీరు నగదు బదిలీ చేసినట్లు అతని మొబైల్ నంబర్‌కు సందేశం వెళ్తుంది. 48 గంటల్లో తను కేపేలో రిజిస్టర్ చేసుకుంటే సరి. లేకపోతే తిరిగి ఆ సొమ్ము ఎవరైతే డబ్బు పంపిస్తారో వారి ఖాతాకే తిరిగొస్తుంది. ఇలా ఫేస్బుక్ ద్వారా రోజుకు రూ.2,500... నెల మొత్తం మీద రూ.25 వేల వరకు బదిలీ చేసే అవకాశం ఉంది. 30 బ్యాంకుల్లో ఏ ఖాతాదారుడైనా.. నగదును పంపిచేవారు, తీసుకునేవారు ఇద్దరూ ఒకే బ్యాంకు ఖాతాదారులు కావాల్సిన అవసరం లేదు. ఎవరు ఎవరికైనా పంపించొచ్చు. ఇమీడియెట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీస్)లోని 30 బ్యాంకుల ఖాతాదారులు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఇవీ ఆ బ్యాంకులు... ఎస్బీఐ, ఎస్బీహెచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్, యూనియన్ బ్యాంక్, యునెటైడ్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, కోటాక్ మహీంద్రా, ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బేసిన్ క్యాథలిక్ బ్యాంక్, కెనరా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, కాస్మోస్ బ్యాంక్, డొంబివిలీ నాగరీ సహకారీ బ్యాంక్ (డీఎన్ఎస్), ఫెడరల్ బ్యాంక్, ఐసీఐసీఐ, ఇండస్ ఇండ్, జే అండ్కే బ్యాంకు, జనతా సహకారీ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, మెహసనా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ఓబీసీ, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆప్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్. సురక్షితమేనా.. 2009-10లో దేశంలోని బ్యాంకింగ్ రంగంలో రూ.2,038 కోట్ల మోసాలు జరిగితే... 2012-13లో వాటి సంఖ్య నాలుగు రెట్లకు పెరిగింది. అంటే అక్షరాలా రూ.8,646 కోట్లు మోసానికి గురైనట్లు అసోసియేషన్ ఆఫ్ సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్ అనే సంస్థ తేల్చింది. అయితే ఫేస్బుక్ ద్వారా నగదు బదిలీలో ఇలాంటి వాటికి ఆస్కారం లేదని సదరు సంస్థ పేర్కొంది. కానీ ఫేస్బుక్ ద్వారా నగదును బదిలీ చేసేటపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి... ఈ రకమైన నగదు బదిలీ సేవల్లో రెండు రకాల పిన్ నంబర్లుంటాయి. ఒకటి ఫేస్బుక్ యూజర్ నేమ్/ పాస్వర్డ్, మరొకటి వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ). నగదు బదిలీ కాగానే డబ్బు పంపినవారికి, తీసుకున్నవారికి ఇద్దరి మొబైళ్లకు మెసేజ్‌లు వస్తాయి. సొంత సెల్‌ఫోన్, ల్యాప్ ట్యాప్, కంప్యూటర్ల నుంచే నగదును బదిలీ చేయాలి. బయటి ఇంటర్నెట్లు, ఇతరుల మొబైల్‌ను వాడొద్దు.ఒకవేళ మీ ఫేస్‌బుక్‌ను ఎవరైనా హ్యాక్ చేసినా.. ఓటీపీ నంబర్ లేనిదే నగదు బదిలీ కాదు కాబట్టి ఒకింత సురక్షితమే.