డిపాజిట్ చేస్తుండగా దోచేశారు
Published Sun, Nov 20 2016 12:57 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
ఆచంట : పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు ఓ పక్క బ్యాంకుల వద్ద క్యూలు కడుతుంటే.. ఇదే అదనుగా దొంగలు చెలరేగిపోతున్నారు. ఆచంట ఆంధ్రాబ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్లిన ఓ వృద్ధురాలి నుంచి రూ.49 వేలు అపహరించిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఆచంట పంచాయతీ పరిధి బాలంవారిపాలెంకు చెందిన ముంగండ వీరరాఘవులు అనే వృద్ధురాలు డ్వాక్రా గ్రూపులో సభ్యురాలు. ఈ గ్రూపునకు ఇటీవల ఆంధ్రాబ్యాంకు రూ.5 లక్షలు రుణం మంజూరు చేయగా ఒక్కో సభ్యురాలికి రూ.40 వేలు అందింది. ఈ క్రమంలో వీరరాఘవులకు రూ.500 నోట్లు వచ్చాయి. కొన్నిరోజుల పాటు సొమ్ములు ఇంటి వద్దనే ఆమె భద్రపర్చుకుంది. ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేస్తామని ప్రకటించడంతో ఈ రూ.40 వేలతోపాటు తాను దాచుకున్న మరో రూ.9 వేలు కలిపి రూ.49 వేలు తీసుకుని శనివారం ఆంధ్రాబ్యాంకుకు వెళ్లింది. బ్యాంకు మిత్రతో వోచర్ పూర్తిచేయించుకుని కౌంటర్ వద్దకు వెళితే వోచరుతోపాటు ఆధార్ కార్డు నకలుపై సంతకం చేసి ఇవ్వాలని సిబ్బంది కోరారు. దీంతో ఆమె సంతకాలు చేస్తున్న సమయంలో ఆమె సొమ్ములు ఉంచిన సజ్జలోని రూ.49 వేలను గుర్తుతెలియని వ్యక్తి అపహరించాడు. నగదు జమ చేసే క్రమంలో సొమ్ములు కనిపించకపోవడంతో లబోదిబోమంటూ ఆమె బ్యాంకు అధికారులకు విషయాన్ని తెలి యజేసింది. బ్రాంచ్ మేనేజర్ ఆర్.రాంబాబు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీ సులు బ్యాంకుకు వెళ్లి వృద్ధురాలితోపాటు ఖాతాదారులను విచారించారు. బ్యాంకులో ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా సంచరించారని, వృద్ధురాలిని అ నుసరించినట్టు స్థానికులు చెబుతున్నారు. కార్యాలయంలో ఎనిమిది సీసీ కెమెరాలు ఉండగా ఐదు మాత్రమే పనిచేస్తున్నాయి. పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కనిపించని పోలీసు బందోబస్తు
బ్యాంకుల వద్ద భద్రత పెంచామని ప్రభుత్వం ప్రకటించినా స్థానిక పోలీసులు ఆ దిశగా తీసుకున్న చర్యలు తీసుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో ఏడు జాతీయ బ్యాంకులు, నాలుగు సబ్‌పోస్టాఫీసులు ఉన్నాయి. రోజు ఆయా కార్యాలయాలు నోట్ల మార్పిడితో కిటకిటలాడుతున్నాయి. అడపాదడపా వ చ్చి వెళ్లిపోవడం తప్ప ఎక్కడా పోలీసు సిబ్బందిని ఏర్పాటుచేయలేదని ఖాతాదారులు అంటున్నారు.
జిరాక్స్ నోటుతో మోసం
మట్టపర్రు (పోడూరు) : ఇద్దరు యువకులు రూ.2 వేల నోటు జిరాక్స్‌ను కిరాణా దుకాణంలో ఇచ్చి సరుకులు తీసుకుని మోసం చేసిన సంఘటన పోడూరు మండలం మట్టపర్రులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నా యి.. మట్టపర్రు గ్రామ సర్పంచ్ తంగెళ్ల వెంకటలక్ష్మి గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఆమె దుకాణంలో ఉండగా ఆ గ్రామానికే చెందిన ఇద్దరు యువకులు వచ్చి రూ.2 వేల నోటు జిరాక్స్ కాపీని ఇచ్చి సరుకులు కొన్నారు. ఆమె దానిని అసలైన నోటుగా భావించి సరుకుల సొమ్ములు పోను మిగిలిన చిల్లర ఇచ్చారు. దుకాణం మూసేముందు సొమ్ములు లెక్కిస్తుండగా మిగతా రూ.2 వేల నోట్లకు జిరాక్స్ నోటుకు సైజులో తేడా ఉండటంతో విషయం బయటపడింది. అనుమానం వచ్చిన వెంకటలక్ష్మి దీనిని ఇంట్లో వారికి చూపగా తన అది జిరాక్స్ కాపీ అని గుర్తించారు.విషయం ఎస్సై పి.రవీంద్రబాబుకు తెలియడంతో శనివారం వివరాలు సేకరించారు.
జిరాక్స్ నోటు ఇచ్చిన యువకులను, జిరాక్స్ తీసిన పోడూరుకు చెందిన ఫొటోగ్రాఫర్‌ను విచారించినట్టు తెలిసింది. జిరాక్స్ మెషీ¯ŒSను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
Advertisement