
కోల్‌కతా: భారత్‌లో సూక్ష్మ రుణ సంస్థలను (ఎంఎఫ్‌ఐలు) ప్రజల నుంచి డిపాజిట్ల స్వీకరణకు అనుమతించాలని నోబెల్ పురస్కార గ్రహీత, బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంకు వ్యవస్థాపకుడు మహమ్మద్ యూనస్ అన్నారు. ప్యాన్‌ఐఐటీ గ్లోబల్ ఈ కాంక్లేవ్‌లో భాగంగా ఆయన మాట్లాడారు. భారత్‌లో ఎంఎఫ్‌ఐలు నిధుల కోసం బ్యాంకుల దగ్గరకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఆర్‌బీఐ చిన్న ఫైనాన్స్ బ్యాంకులను అనుమతించిందంటూ, అవి డిపాజిట్లను స్వీకరించే అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘ప్రజలకు రుణం అన్నది ఆరి్థకపరమైన ఆక్సిజన్. బ్యాంకులకు ప్రత్యా మ్నాయ బ్యాంకింగ్ చానల్ (నిధుల కోసం) ఏర్పా టు చేయకుంటే, పేదలకు రుణాలు ఇచ్చేందుకు అవి ఆసక్తి చూపవు’’ అని యూనస్ పేర్కొన్నారు.