డబ్బు కోసం బ్యాంకుకు వెళ్లి మృత్యువాత
Published Wed, Feb 1 2017 1:09 AM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM
ఎమ్మిగనూరురూరల్: డబ్బు డ్రా చేసుకునేందుకు పట్టణంలో ఆంధ్రా బ్యాంక్‌కు వచ్చిన ఓ వ్యక్తి మంగళవారం సాయంత్రం తీవ్ర అస్వస్థకు గురై గుండెపోటుతో మృతి చెందాడు. సోమప్ప నగర్‌లో నివాసముంటున్న దస్తగిరి(45) పోస్టాఫీసు ఎదురుగా మున్సిపల్ బిల్డింగ్‌లో ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నాడు. ఉదయం కుమార్తె షకీలాతో కలసి ఆం«ద్రాబ్యాంక్‌కు డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లారు. జనం ఎక్కువగా ఉండటంతో బ్యాంకు అధికారులు టోకెన్లు ఇచ్చారు, క్యూలో చాలా సేపు నిల్చున్నాడు. నీళ్లు దప్పిక కావటంతో బ్యాంకు మెట్లు దిగి కిందకు వచ్చి హోటల్ దగ్గర నీళ్లు తాగి మళ్లీ బ్యాంకు లోపలికి వెళ్లేందుకు మొట్లు ఎక్కుతుండగా అస్వస్థతుకు గురై గుండె పోటు రావటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య షైనాబాను, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
Advertisement
Advertisement