ఒక్క మాటలో చెప్పాలంటే ఫారం 1,2 .. జీతం మీద ఆదాయం వచ్చిన వారే వేయాలి. మిగిలిన ఫారాలు ఏవి కూడా వేతన జీవులకు వర్తించవు. ఈ ఫారం–3, అలాగే ఇక నుంచి వచ్చే ఫారాలు వ్యాపారం లేదా వృత్తి మీద ఆదాయం ఉన్న వారికే వర్తిస్తాయి. ఫారం–3ని వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు వాడాలి.
ఇది చాలా పెద్ద ఫారం అని చెప్పవచ్చు. నిడివిపరంగా అనడం లేదు.. ఇవ్వాల్సిన వివరాలు ఎక్కువ..సంఖ్య ఎక్కువ.
వ్యక్తులు, హిందు ఉమ్మడి కుటుంబాలు వేయొచ్చు.
ముఖ్యమైన రూలు ఏమిటంటే వ్యాపారం / లేదా వృత్తి మీద ఆదాయం ఉన్నవారు మాత్రమే ఫారం–3ని వేయాలి.
ఆదాయపు పన్ను చట్టప్రకారం వ్యాపారానికొక రకమైన ఫారం, వృత్తి నిపుణులకొక రకమైన ఫారం లేదు. అందరికీ ఒకే ఫారం.
‘వ్యాపారం’ అనే పదానికి నిర్వచనంలోనే ఎన్నో వాటితో పాటు ‘వృత్తి’ని కలిపారు.
వ్యక్తులు/కుటుంబాలకు ట్యాక్స్ ఆడిట్ వర్తించినా, వర్తించకపోయినా ఈ ఫారం వేయాలి.
ఈ రిటర్నులో ఇంటి మీద ఆదాయం, జీతం, పెన్షన్, వ్యాపారం/వృత్తి మీద ఆదాయం, ఇతర ఆదాయాలు, మూలధన లాభాలు.. అంటే చట్టంలో పొందుపర్చిన అన్నీ.. అంటే ఐదు శీర్షికల్లో ఏర్పడ్డ ఆదాయం ఉన్నవారు వేయొచ్చు.
భాగస్వామ్యం నుంచి పారితోíÙకం వచ్చే వారు వేయొచ్చు.
దీన్ని ‘మాస్టర్ ఫారం’ అని అనొచ్చు. ఎందుకంటే, వ్యక్తి లేదా ఉమ్మడి కుటుంబం ప్రతి ఆదాయం.. ఇండియాలో వచ్చినది కావొచ్చు విదేశాల నుంచి వచ్చినది కావొచ్చు.. ‘సర్వం’ ఇందులో కవర్ అవుతుంది.
అంతే కాకుండా, ఆదాయం కానివి.. ఉదాహరణకు, అడ్వాన్సులకు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వాలి.
ఆ ఆర్థిక సంవత్సరంలో జరిగిన పెద్ద లావాదేవీలు, ఇండియాలో గానీ విదేశాల్లో గానీ జరిగినవి ఇవ్వాలి.
అలాగే, మీరు చేసే ఇన్వెస్ట్‌మెంట్ల వివరాలు ఇవ్వాలి. ఈ ఇన్వెస్ట్‌మెంట్ల వల్ల ఆదాయం ఏర్పడకపోయినా వివరాలు ఇవ్వాలి. ఉదాహరణగా ఒక ఇంటి కోసం భారీ మొత్తాన్ని అడ్వాన్సుగా ఇచ్చారు. ఇలాంటి వ్యవహారాలన్నింటిని కూడా పొందుపర్చాలి.
కొంత నిర్దేశించిన టర్నోవరు దాటిన వారే అకౌంట్స్ బుక్స్ రాయాలి. కానీ మా సలహా ఏమిటంటే.. వ్యాపారం/వృత్తి ఉన్నవారు అకౌంట్స్ రాయండి. వ్యవహారం జరిగినప్పుడు స్పష్టంగా సమగ్రంగా అన్నీ ఒక చోట పర్మనెంట్ బుక్‌లో రాసుకోండి. వివరణ రాయండి.
ఇలా రాసి ఉంచడం మీకు కాస్తంత శ్రమ కావచ్చు కానీ, తర్వాత రోజుల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఫారం నింపడానికి / దాఖలు చేయడానికి అవసరమైతే వృత్తి నిపుణుల సర్వీసులు తీసుకోండి.
- కె.సీహెచ్, ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, - కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులుఇవి చదవండి: రూ. 27 లక్షల కోట్లకు గృహ రుణాలు..
Comments
Please login to add a commentAdd a comment