investment attraction
-
వ్యాపారులు, వృత్తి నిపుణులకు.. ఫారం 3
ఒక్క మాటలో చెప్పాలంటే ఫారం 1,2 .. జీతం మీద ఆదాయం వచ్చిన వారే వేయాలి. మిగిలిన ఫారాలు ఏవి కూడా వేతన జీవులకు వర్తించవు. ఈ ఫారం–3, అలాగే ఇక నుంచి వచ్చే ఫారాలు వ్యాపారం లేదా వృత్తి మీద ఆదాయం ఉన్న వారికే వర్తిస్తాయి. ఫారం–3ని వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు వాడాలి.ఇది చాలా పెద్ద ఫారం అని చెప్పవచ్చు. నిడివిపరంగా అనడం లేదు.. ఇవ్వాల్సిన వివరాలు ఎక్కువ..సంఖ్య ఎక్కువ.వ్యక్తులు, హిందు ఉమ్మడి కుటుంబాలు వేయొచ్చు.ముఖ్యమైన రూలు ఏమిటంటే వ్యాపారం / లేదా వృత్తి మీద ఆదాయం ఉన్నవారు మాత్రమే ఫారం–3ని వేయాలి.ఆదాయపు పన్ను చట్టప్రకారం వ్యాపారానికొక రకమైన ఫారం, వృత్తి నిపుణులకొక రకమైన ఫారం లేదు. అందరికీ ఒకే ఫారం.‘వ్యాపారం’ అనే పదానికి నిర్వచనంలోనే ఎన్నో వాటితో పాటు ‘వృత్తి’ని కలిపారు.వ్యక్తులు/కుటుంబాలకు ట్యాక్స్ ఆడిట్ వర్తించినా, వర్తించకపోయినా ఈ ఫారం వేయాలి.ఈ రిటర్నులో ఇంటి మీద ఆదాయం, జీతం, పెన్షన్, వ్యాపారం/వృత్తి మీద ఆదాయం, ఇతర ఆదాయాలు, మూలధన లాభాలు.. అంటే చట్టంలో పొందుపర్చిన అన్నీ.. అంటే ఐదు శీర్షికల్లో ఏర్పడ్డ ఆదాయం ఉన్నవారు వేయొచ్చు.భాగస్వామ్యం నుంచి పారితోíÙకం వచ్చే వారు వేయొచ్చు.దీన్ని ‘మాస్టర్ ఫారం’ అని అనొచ్చు. ఎందుకంటే, వ్యక్తి లేదా ఉమ్మడి కుటుంబం ప్రతి ఆదాయం.. ఇండియాలో వచ్చినది కావొచ్చు విదేశాల నుంచి వచ్చినది కావొచ్చు.. ‘సర్వం’ ఇందులో కవర్ అవుతుంది.అంతే కాకుండా, ఆదాయం కానివి.. ఉదాహరణకు, అడ్వాన్సులకు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వాలి.ఆ ఆర్థిక సంవత్సరంలో జరిగిన పెద్ద లావాదేవీలు, ఇండియాలో గానీ విదేశాల్లో గానీ జరిగినవి ఇవ్వాలి.అలాగే, మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ల వివరాలు ఇవ్వాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ల వల్ల ఆదాయం ఏర్పడకపోయినా వివరాలు ఇవ్వాలి. ఉదాహరణగా ఒక ఇంటి కోసం భారీ మొత్తాన్ని అడ్వాన్సుగా ఇచ్చారు. ఇలాంటి వ్యవహారాలన్నింటిని కూడా పొందుపర్చాలి.కొంత నిర్దేశించిన టర్నోవరు దాటిన వారే అకౌంట్స్ బుక్స్ రాయాలి. కానీ మా సలహా ఏమిటంటే.. వ్యాపారం/వృత్తి ఉన్నవారు అకౌంట్స్ రాయండి. వ్యవహారం జరిగినప్పుడు స్పష్టంగా సమగ్రంగా అన్నీ ఒక చోట పర్మనెంట్ బుక్‌లో రాసుకోండి. వివరణ రాయండి.ఇలా రాసి ఉంచడం మీకు కాస్తంత శ్రమ కావచ్చు కానీ, తర్వాత రోజుల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఫారం నింపడానికి / దాఖలు చేయడానికి అవసరమైతే వృత్తి నిపుణుల సర్వీసులు తీసుకోండి.- కె.సీహెచ్, ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, - కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులుఇవి చదవండి: రూ. 27 లక్షల కోట్లకు గృహ రుణాలు.. -
India-US Relations: అంకురాలకు దన్ను
న్యూఢిల్లీ: అంకుర సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించే దిశగా భారత్, అమెరికా ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. నవకల్పనలకు ఊతమిచ్చేందుకు, నిధుల సమీకరణలో ఎంట్రప్రెన్యూర్లు పాటించే విధానాలను పరస్పరం పంచుకునేందుకు, నియంత్రణపరమైన సమస్యల పరిష్కార మార్గాలను కనుగొనేందుకు ఇది తోడ్పడనుంది. ఇరు దేశాల పరిశ్రమవర్గాల రౌండ్‌టేబుల్ సమావేశం సందర్భంగా ఎంవోయూ కుదిరినట్లు కేంద్ర వాణిజ్య, పరిశమ్రల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే, ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనపై ఇది సానుకూల ప్రభావం చూపగలదని వివరించింది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, అమెరికా వాణిజ్య మంత్రి జినా రైమండో నేతృత్వం వహించిన ఈ సమావేశంలో పలువురు భారతీయ వ్యాపారవేత్తలు, టెక్నాలజీ దిగ్గజాల సీఈవోలు, వెంచర్ క్యాపిటల్ సంస్థల ప్రతినిధులు, స్టార్టప్‌ల వ్యవస్థాపకులు పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య సాంకేతిక సహకారాన్ని పెంపొందించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. భారత్–అమెరికా వాణిజ్య చర్చల కింద రూపొందించిన ఇండియా–యూఎస్ ఇన్నోవేషన్ హ్యాండ్õÙక్ కాన్సెప్టును ఈ సందర్భంగా గోయల్, రైమండో ఆవిష్కరించారు. డీప్ టెక్నాలజీ, క్రిటికల్ టెక్నాలజీ వంటి విభాగాల్లో సహకారాన్ని పటిష్టం చేసుకునేందుకు రెండు దేశాల నిబద్ధతకు ఎంవోయూ నిదర్శనంగా నిలుస్తుందని గోయల్ పేర్కొన్నారు. దీని కింద వచ్చే ఏడాది తొలినాళ్లలో భారత్, అమెరికాలో ఇన్నోవేషన్ హ్యాండ్õÙక్ ఈవెంట్లను నిర్వహించనున్నారు. -
అరుదైన రికార్డ్.. ఆ విషయంలో దేశంలోనే ఏపీ నంబర్ వన్
సాక్షి, అమరావతి: సంక్షేమంలో ఇప్పటికే అనేక రికార్డుల్ని నెలకొల్పిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం.. మరో వైపు పారిశ్రామిక వృద్ధిలోనూ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్.. డీపీఐఐటీ రూపొందించిన నివేదిక ఏపీ సత్తా ఏంటో దేశానికి చాటి చెప్పింది. దేశంలో గడిచిన ఏడు నెలల్లో ఏ రాష్ట్రం సాధించనన్ని పెట్టుబడులను ఏపీ సాధించినట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానంలో ఒడిశా రాష్ట్రం నిలిచింది. దేశం మొత్తం మీద గత ఏడు నెలల్లో వచ్చిన పెట్టుబడుల్లో 45 శాతం పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలే సాధించాయి. చదవండి: వైద్యం, ఆరోగ్యం.. సీఎం జగన్ కీలక ఆదేశాలు అందులో ఆంధ్రప్రదేశ్ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా 40 వేల 361 కోట్ల పెట్టుబడుల్ని సాధించి నంబర్ వన్ గా నిలిచింది. ఈ ఏడు నెలల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కలిసి లక్షా 71 వేల 285 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అందులో ఏపీ, ఒడిశాలో 45 శాతం వచ్చాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పారదర్శకమైన పారిశ్రామిక విధానాలను అమలుచేయడంతో ప్రతిష్టాత్మకమైన పారిశ్రామిక సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. దీంతో ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ లో అగ్రగామిగా నిలిచింది. ఎంఓయూలను వాస్తవిక పెట్టుబడులుగా మలచడంలోనూ దేశంలో మొదటి స్థానంలో ఏపీ ఉంది. ఎగుమతుల్లోనూ ఏడో స్థానం నుండి నాలుగో స్థానానికి రాష్ట్రం ఎదిగింది. ఇవన్నీ కేవలం సీఎం జగన్ గత మూడేళ్ల పాలనా సంస్కరణలు, నిర్ణయాల వల్లనే సాధ్యమైంది. ఇప్పుడు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఏపీ పెట్టుబడుల ఆకర్షణలో గత ఏడు నెలల్లో అగ్రస్థానంలో నిలిచిందని ప్రకటించింది. కొద్ది రోజుల కిందట జరిగిన కేబినెట్ సమావేశంలోనూ ఏపీ ప్రభుత్వం లక్షా 26 వేల 748 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పరిశ్రమలు, ఎనర్జీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా రాబోయే ఏడేళ్లలో 40 వేల 330 ఉద్యోగాలు రానున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు, పరిశ్రమలు ఏపీకి వస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
పెట్టుబడులకు ‘పీఎల్ఐ’ ఆకర్షణ
న్యూఢిల్లీ: భారత్‌కు అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకం కీలకంగా ఉందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దేశానికి పెట్టుబడులను భారీగా తీసుకురావడానికి, భారత్ తయారీ సామర్థ్యాన్ని పటిష్టంగా పెంపొందించడానికి ఈ పథకం ఎంతో దోహపదడుతున్నట్లు ఆమె వివరించారు. జౌళి, స్టీల్, టెలికం, ఆటోమొబైల్, ఔషధ పరిశ్రమ వంటి 13 కీలక రంగాలకు ప్రయోజనాలు సమకూర్చుతూ 2021–22 వార్షిక బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పీఎల్ఐ స్కీమ్‌ను ఆవిష్కరించారు. ఈ పథకం కోసం రూ.1.97 లక్షల కోట్లు కేటాయించారు. ఎంవీ కామత్ శతజయంతి స్మారక ఉపన్యాసం సందర్భంగా ఆర్థికమంత్రి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► మహమ్మారి సవాళ్ల నేపథ్యంలో అంతర్జాతీయంగా భారీగా పెట్టుబడుల ఆకర్షణకు కేంద్రం తగిన ప్రణాళికను రూపొందిస్తోంది. కేవలం ఒకే అంశంపై ఆధారపడకుండా విస్తృత స్థాయిలో పెట్టుబడుల ఆకర్షణకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోంది. ఆయా స్కీమ్‌ల పట్ల మంచి స్పందన కూడా లభిస్తోంది. పీఎల్ఐ స్కీమ్ కూడా ఈ తరహాదే. ► ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విధానం స్థిరమైన స్వల్పకాలిక, మధ్యకాలిక విధానంపై ఆధారపడి దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఉద్దేశించినదై ఉంటుంది. 2021 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ స్పష్టంగా మార్గాన్ని నిర్దేశించింది. రానున్న 20 నుంచి 25 సంవత్సరాల్లో ప టిష్ట పురోగతిని సాధించాలని కేంద్రం భావిస్తోంది. ► దేశ పటిష్ట పురోగతికి ప్రభుత్వం ఆరు ప్రధాన, వ్యూహాత్మక రంగాలను గుర్తించింది. ► దేశంలో స్టార్ట్అప్స్ గణనీయంగా పురోగమిస్తున్నాయి. భారతదేశం దాదాపు 38 యూనికార్న్‌లతో (బిలియన్ డాలర్ల విలువపైబడిన కంపెనీ) 2020ని ముగించింది, కానీ 2021లో అందుకు సమాన సంఖ్యలో యూనికార్న్ రావడానికి మేము తగిన ప్రోత్సాహకాలు ఇచ్చాము. భారతదేశంలో ప్రతి నెలా కనీసం మూడు యునికార్న్‌లు ఉద్భవిస్తున్నాయి. వినూత్నమైన, ఔత్సాహిక వ్యాపారవేత్తలు వినూత్నమైన వ్యా పార మార్గాలు, విధానాలతో ముందుకు వస్తున్నారు. స్వయం ఉపాధి పొందాలనుకునేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ► కంపెనీల నిధుల సమీకరణ అంత సులభమేమీ కాదు. అయితే భారతదేశం ఒక క్యాలెండర్ ఇయర్లో 63 విజయవంతమైన ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్లను (ఐపీఓ) చూసింది. అధిక మొత్తం లో కంపెనీలు నిధులను సమీకరించగలిగాయి. ► ఐపీఓల పట్ల కూడా ప్రజా ఆసక్తి పెరిగింది. ప్రజలు ఇప్పుడు బ్యాంకులో పొదుపు లేదా బ్యాంకులో చిన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆధారపడటం లేదు. మధ్యతరగతి కూడా బ్యాంక్ లేదా పోస్టాఫీసులలో సురక్షితమైన ఎంపికల నుంచి కొంచెం రిస్క్ ఉన్న అసెట్స్‌కు మారుతున్నారు. స్టాక్ మార్కెట్లలో వారి పెట్టుబడులు పెరుగుతున్నాయి. రిఫండ్స్ @ రూ.1.49 లక్షల కోట్లు న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ రూ.1.49 లక్షల కోట్లకుపైగారిఫండ్స్ జరిపినట్లు ఆదాయపు గురువారం ఒక అధికారిక ప్రకటన తెలిపింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ 27 వరకూ 4.67 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలయినట్లు కూడా ప్రకటన పేర్కొంది. 1.42 కోట్ల ఎంటిటీల విషయంలో రూ.50,793 కోట్లు, 2.19 లక్షలకు పైగా ఎంటిటీల విషయంలో రూ.98,504 కోట్ల కార్పొరేట్ రిఫండ్స్ జరిగినట్లు ప్రకటన వివరించింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుకు చివరితేదీ 2021 డిసెంబర్ 31. నిజానికి ఈ గడువు జూలై 31తో ముగిసిపోగా, డిసెంబర్ 31 వరకూ ప్రభుత్వం పొడిగించింది. -
పెట్టుబడుల కోసమే...ఆస్ట్రేలియా పర్యటనకు జైట్లీ
మెల్బోర్న్: భారత ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈ నెల 28 నుంచీ ప్రారంభించనున్న ఆస్ట్రేలియా పర్యటన... పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన ధ్యేయంగా సాగనున్నదని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అధికార, వాణిజ్య ప్రతినిధి బృందంతో అరుణ్ జైట్లీ వచ్చే వారంలో నాలుగు రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ధనిక సావరిన్ ఫండ్ పెట్టుబడుల ఆకర్షించడానికి భారత్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియా నాయకులు, పెట్టుబడిదారులతో జైట్లీ సమావేశం కానున్నారు. పర్యటన లక్ష్యం పూర్తిగా ఫలప్రదం అవుతుందని భావిస్తున్నట్లు ఇండియన్ హై కమిషనర్ నవ్‌దీప్ సూరీ తెలిపారు. తయారీ, సాంకేతికత, సేవలు, ఆర్థికం, వివిధ ఫండ్స్ ప్రతినిధులతో జైట్లీ సమావేశం కానున్నట్లు వెల్లడించారు. -
పెట్టుబడులకు అత్యుత్తమం.. భారత్
వాషింగ్టన్లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వాషింగ్టన్ : పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా బుధవారం నుంచీ 10 రోజుల అమెరికా పర్యటన ప్రారంభించిన ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన న్యూయార్క్ పర్యటనను ముగించుకుని రాజధాని వాషింగ్టన్కు చేరుకున్నారు. రెండు నగరాల్లో అత్యున్నత స్థాయి అమెరికా వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఆర్థికంగా తీవ్ర మందగమనంలో నడుస్తున్న ప్రపంచంలో.. భారత్ పెట్టుబడులకు అత్యుత్తమ మార్గమని అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు పూర్తి కట్టడిలో ఉన్నాయని, వృద్ధి రేటు ప్రపంచదేశాల్లోనే వేగంగా పురోగమిస్తోందని వివరించారు. కేంద్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం సుస్థిర, విశ్వసనీయ, పారదర్శక విధానాల వ్యవస్థను అందిస్తోందని పేర్కొన్నారు. తద్వారా పెట్టుబడులకు ఆకర్షణీయ దేశంగా భారత్‌ను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ప్రతి పెట్టుబడిదారూ.. తమకు సుస్థిర విధాన వ్యవస్థ కావాలని కోరారని, ఇలాంటి వ్యవస్థ రూపకల్పనకు, ఈ ప్రక్రియను కొనసాగించడానికి భారత్ కట్టుబడి ఉందని, తద్వారా ఆర్థికాభివృద్ధి తమ లక్ష్యమని వివరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ► భారత్ పట్ల పెట్టుబడిదారుల వైఖరి ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకోడానికి ఈ పర్యటన ఎంతో దోహదపడింది. మరో మూడు రోజుల శాన్ఫ్రాన్సిస్కో పర్యటన ద్వారా పెట్టుబడిదారుల అభిప్రాయాలను తెలుసుకోడానికి మరింత ప్రాముఖ్యతను ఇస్తాను. ► {పత్యక్ష పన్ను రేట్లు 25 శాతానికి తగ్గించడం, వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) దిశగా దేశం మార్పునకు ముందడుగు, పాతలావాదేవీలపై కొత్త పన్ను (రెట్రాస్పెక్టివ్) భయాలు తొలగేలా చూడడం.. పన్నుల వ్యవస్థలో ప్రధాన సంస్కరణలకు సంబంధించి అంశాలు, రెట్రాస్పెక్టివ్ సమస్య ఇప్పటిదికాదు. మా ప్రభుత్వ ముందు నుంచీ వస్తున్న ఈ వివాద పరిష్కారానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. దీనిపై అంతర్జాతీయ పెట్టుబడిదారులు భయపడాల్సింది ఏదీ లేదు. అసాధారణ అంశం అయితే తప్పించి, పాత లావాదేవీలపై కొత్త పన్ను భారాలు సరికాదన్నది మా అభిప్రాయం. ► సబ్సిడీల హేతుబద్దీకరణ, బ్యాంకింగ్ వ్యవస్థ విస్తృతి, తద్వారా ప్రత్యక్ష ప్రయోజనాల బదలాయింపు (డీబీటీ) యంత్రాంగం వినియోగం, సహజవనరుల వినియోగం వంటి ముఖ్య అంశాల్లో హేతుబద్దీకరణ ప్రభుత్వ చొరవల్లో కీలకమైనవి. ► నైపుణ్య భారతంపై ప్రస్తుతం దృష్టి సారించాం. అలాగే దేశంలో మౌలిక రంగం పురోగతికి భారీ పెట్టుబడుల ప్రణాళికను కేంద్రం చేపట్టింది. ఇందుకు వీలుగా ఈ ఏడాదిపాటు ద్రవ్య స్థిరత్వం విషయంలో కొంత వెసులుబాటు తీసుకుంటున్నాం. తయారీ రంగం వృద్ధికి తగిన పన్ను విధాన రూపకల్పన జరుగుతోంది. త్వరలో ఈ రంగం మెరుగుపడుతుందన్న విశ్వాసముంది. ► నల్లధనం సమస్య పరిష్కారానికి అంతర్జాతీయంగా దేశాల మధ్య పరస్పర సహకారం పెరుగుతోంది. అంతర్జాతీయంగా పన్ను ఎగవేతల సమస్యలను అరికట్టడానికి ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కాంప్లియెన్స్ యాక్ట్ (ఎఫ్ఏటీసీఏ)లో భాగం పంచుకోడానికి భారత్ సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే ఈ ఒప్పందంపై సంతకాలు ఎప్పుడు జరిగేదీ ఇంకా నిర్ణయం కాలేదు. పన్నులకు సంబంధించి ఎప్పటికప్పుడు అంతర్జాతీయంగా సమాచార మార్పిడికి ఈ ఒప్పందం ఎంతగానో దోహదపడుతుంది. అంతర్జాతీయంగా లెక్కచూపని ఆస్తులను బయటకు తేవాలన్న ప్రభుత్వ సంకల్పం దీనితో నెరవేరుతుంది. ► ఒకవేళ వర్షాభావ పరిస్థితులు తలెత్తితే... ఎదుర్కొనడానికి తగిన అన్ని చర్యలనూ కేంద్రం తీసుకుంటోంది. ప్రధానంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం విస్తరించాలన్న యోచన ఉంది. ఈ పథకానికి తాజా బడ్జెట్లో దాదాపు రూ.54,000 కోట్లు కేటాయించాం. ► బ్యాంకులకు తగిన తాజా మూలధన కల్పన ప్రభుత్వ విధానం. ఇందుకు ఒక మార్గం బడ్జెటరీ మద్దతు. మరొకటి ప్రభుత్వ వాటాను 52 శాతానికి కుదించడం. ఇక ఆర్థిక వృద్ధి మెరుగుపడితే... క్రమంగా బ్యాంకులకు మొండిబకాయిల (ఎన్పీఏ) బెడదా తగ్గిపోతుందన్నది మా విశ్వాసం. కాగా ఆల్‌టైమ్ గరిష్టం ► 6 శాతానికి చేరిన ఎన్పీఏలు ఇప్పుడు 5.64 శాతానికి చేరడం చెప్పుకోదగిన మరో ముఖ్యాంశం. ద్వైపాక్షిక అంశాలపై చర్చ.. ఆర్థికమంత్రి వాషింగ్టన్ పర్యటన సందర్భంగా అమెరికా ఉన్నతస్థాయి అధికారులతో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ప్రతిపాదిత ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం ఇందులో ఒకటి. ఆర్థికమంత్రి సమావేశమయిన వారిలో అమెరికా ఆర్థికమంత్రి జాన్ లీ, వాణిజ్యమంత్రి పెన్నీ పిడ్జ్కర్ ఉన్నారు. ట్రేడ్ రిప్రజెంటేటివ్ మైక్ ఫ్రోమెన్తో కూడా జైట్లీ సమావేశం జరిపారు. పలు అంశాల్లో రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం ఉందని ఈ సందర్భంగా ఆర్థికమంత్రి తెలిపారు. ఎందుకు పెరిగాయంటే... వడ్డీరేట్లపై యథాతథ స్థితిని కొనసాగించాలని అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయించడంతో విదేశీ నిధులు వెళ్లిపోతాయనే ఆందోళనలు తగ్గుముఖం పట్టడం, వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో కరువు భయాలు తొలగడం వంటి కారణాలతో గత వారమంతా స్టాక్ మార్కెట్ లాభాల్లోనే నడిచింది. మారిషస్‌కు చెందిన ఎంవీ ఎస్సీఐఎఫ్ సంస్థ 0.5 శాతం వాటా కొనుగోలు చేయడంతో జేపీ అసోసియేట్స్, 4జీ సర్వీసులను డిసెంబర్‌కల్లా తెస్తామని ప్రకటించిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఎగిశాయి. ఎందుకు తగ్గాయంటే... కెయిర్న్, వేదాంత విలీనం ఆకర్షణీయంగా లేదని కెయిర్న్ ఇండియా మైనార్టీ వాటాదారుల్లో ఒకటైన ఎల్ఐసీ ఆందోళన వ్యక్తం చేయడంతో వేదాంత, అదానీ ఎంటర్ప్రైజెస్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో అదానీ పవర్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ షేర్లు తగ్గాయి. -
మంచి సంకేతాలే ఉన్నాయ్..!
సామాన్యుడి నుంచి పారిశ్రామిక వర్గాల వరకూ కేంద్ర బడ్జెట్‌పై ఎన్నో ఆశలు ఉంటాయి. అయితే బడ్జెట్ వెలువడేంతవరకూ దీనిపైన అందరికీ సస్పెన్సే. అయితే రానున్న బడ్జెట్‌పై ఆర్థిక, వాణిజ్యశాఖ మంత్రులు తదితర మంత్రిత్వశాఖల నుంచి వివిధ సందర్భాల్లో పలు కీలక సంకేతాలు వెలువడుతుండడం సహజం. 2015-16 బడ్జెట్‌కు సంబంధించి అలా వచ్చిన సంకేతాల్లో కొన్ని... ఉపాధి సృష్టి...పెట్టుబడుల ఆకర్షణ... దేశంలోని అన్ని వర్గాల వారికీ తగిన ప్రయోజనాలను అందించడానికి బడ్జెట్లో ప్రతిపాదనలు ఉంటాయి. ముఖ్యంగా భారత్ వృద్ధిలో యువత కీలకపాత్ర ఉంటుంది. వీరికి ప్రయోజనకరమైన ప్రతిపాదనలపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. అలాగే నైపుణ్యత పెంపు, ఉపాధి అవకాశాల సృష్టి ప్రధాన ధ్యేయం. అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణకు తగిన చర్యలు ఉంటాయి. ఆర్థిక క్రమశిక్షణకు, ఇన్ఫ్రాలో పెట్టుబడులకు.. తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు చర్యలు. ఆదాయం పెంచుకోవడం కోసం అధిక పన్నులు వడ్డించడానికి మేము వ్యతిరేకం. దానికి బదులుగా డిమాండ్, వృద్ధికి ఊతమిచ్చేలా కొనుగోలుదారుల చేతుల్లో మరింత డబ్బు ఆడేలా చూడాలన్నది మా అభిమతం. ఎటువంటి లొసుగులూ, లోపాలు లేని విధంగా క్రమంగా సబ్సిడీలను హేతుబద్ద్ధీకరించాల్సిన అవసరం ఉంది. ఎల్పీజీ సబ్సిడీ బ్యాంకుల ద్వారా అందేలా చర్యలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇదే తరహాలో సాధ్యమైనంత వరకూ సబ్సిడీల విధానం అమలుకు ప్రయత్నం ఉంటుంది. మౌలిక, రంగంపై ప్రభుత్వ వ్యయాలను పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. పీపీపీ విధానానికి చికిత్స. గ్రామీణ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు వల్ల భూముల ధరలు పెరుగుతాయి. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. విద్యుత్, ఇంధనం, రైల్వేలు, పోర్టుల విభాగాల్లో భారీ సంస్కరణలపై కేంద్రం దృష్టి పెడుతుంది. ఆయా రంగాల్లో ప్రభుత్వ వ్యయాలు మరింత పెంచుతాం. స్థూల దేశీయోత్పత్తిలో ద్రవ్యలోటు లక్ష్యం 4.1 శాతానికి కట్టుబడి ఉన్నాం. - అరుణ్ జైట్లీ, ఆర్థికమంత్రి డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం... 43,000 కోట్లు! పెట్టుబడుల ఉపసంహరణల (డిజిన్వెస్ట్‌మెంట్) లక్ష్యం వచ్చే ఆర్థిక సంవత్సరం (2015-16) కూడా ఇంచుమించు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) స్థాయిలోనే ఉండే అవకాశం ఉంది. 2014-15 బడ్జెట్ లక్ష్యం రూ.43,425 కోట్లుకాగా, 2015-16లో దాదాపు రూ.43,000 కోట్లుగా ఉండవచ్చు. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిర్దేశిస్తున్న విధంగా ప్రతి లిస్టెడ్ కంపెనీలో కనీసం 25 శాతం పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఉండాలి. ఈ నేపథ్యంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా భారీగా నిధుల సమీకరణకు కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది. 25 శాతంకంటే తక్కువ పబ్లిక్ హోల్డింగ్ ఉన్న లిస్టెడ్ ప్రభుత్వ రంగ కంపెనీలు దాదాపు 30 ఉన్నాయి. - అధికార వర్గాల కథనం పసిడి దిగుమతులపై సుంకాల కోత! కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పూర్తి అదుపులో ఉన్న నేపథ్యంలో పసిడిపై దిగుమతి సుంకాన్ని కేంద్రం రానున్న బడ్జెట్లో 2 నుంచి 4 శాతం వరకూ తగ్గించే అవకాశం ఉంది. ( దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్యం విలువ మధ్య నికర వ్యత్యాసమే క్యాడ్) దేశంలో రత్నాలు, ఆభరణాల తయారీ విభాగం వృద్ధికి, ఎగుమతులు పెరగడం లక్ష్యంగా కేంద్రం దిగుమతి సుంకాల తగ్గింపు నిర్ణయం తీసుకోనుంది. దాదాపు 35 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద అత్యంత ప్రాముఖ్యత కలిగిన రంగాలుగా గుర్తించిన 25 విభాగాల్లో రత్నాలు, ఆభరణాల రంగం కూడా ఒకటి. - వాణిజ్య శాఖ వర్గాలు జన్ ధన్ తరువాత... సాంప్రదాయేతర ఇంధనం... ప్రజలందరినీ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేయడానికి చేపట్టిన జన్ ధన్ యోజన విజయవంతం అయిన నేపథ్యంలో ఇకపై కేంద్రం సాంప్రదాయేతర ఇంధన వనరుల రంగం అభివృద్ధిపై దృష్టి సారించనుంది. ప్రతి ఇల్లు, పరిశ్రమ, వాణిజ్య సంస్థకు నిరంతర విద్యుత్ సరఫరా ప్రభుత్వ లక్ష్యం. ఈ విషయంలో సాంప్రదాయేతర ఇంధన వనరులపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టిపెడుతుంది. - పియూష్ గోయల్, విద్యుత్, బొగ్గు శాఖ మంత్రి పీపీఎఫ్ లాకిన్ ిపీరియడ్ పెంపు... పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అకౌంట్ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఉపసంహరణకు కనీస కాలపరిమితి (లాకిన్ ిపీరియడ్) పెంచాలన్న ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం ఈ కాలపరిమితి ఆరేళ్లు. దీనిని ఎనిమిదేళ్లకు పెంచే ప్రతిపాదన పరిశీలన లో ఉంది. పీపీఎఫ్ పెట్టుబడి మెచ్యూరిటీ కాల పరిమితిని ప్రస్తుత 15 ఏళ్ల నుంచి మరింత పెంచే ప్రతిపాదన కూడా ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రతిపాదనల్లో ఉంది. - ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాల సమాచారం చిన్న పరిశ్రమలకు రుణాలపై దృష్టి... చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ లభ్యతపై కేంద్రం మరింత దృష్టి సారిస్తుంది. 2015-16 బడ్జెట్ ఒక మంచి బడ్జెట్‌గా ఉండబోతోంది. - నిర్మలా సీతారామన్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి మ్యాట్ తగ్గింపు... ప్రస్తుతం 32.45 శాతం(సర్‌చార్జీలు, ఇతర సెస్సులు కలుపుకొని)గా ఉన్న కార్పొరేట్ ట్యాక్స్‌ను 25 శాతానికి, 18.5 శాతంగా ఉన్న కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్)ను 10 శాతానికి తగ్గించాలని డిమాండ్ ఉంది. ఈ దిశలో ఎంతో కొంత సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తున్న ప్రత్యేక ఆర్థిక జోన్లను ప్రోత్సహించడానికీ చర్యలు ఉండవచ్చు. ముఖ్యంగా పలు సంస్థలు తమ సెజ్‌లను సరెండర్ చేస్తున్న పరిస్థితులను కేంద్రం జాగ్రత్తగా పరిశీలిస్తోంది. మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ (ఎంఏటీ), డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) వంటి అంశాలు సెజ్‌లకు విఘాతంగా మారుతున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. - కార్పొరేట్ మంత్రిత్వశాఖ వర్గాలు