Salaries for pensioners
-
వ్యాపారులు, వృత్తి నిపుణులకు.. ఫారం 3
ఒక్క మాటలో చెప్పాలంటే ఫారం 1,2 .. జీతం మీద ఆదాయం వచ్చిన వారే వేయాలి. మిగిలిన ఫారాలు ఏవి కూడా వేతన జీవులకు వర్తించవు. ఈ ఫారం–3, అలాగే ఇక నుంచి వచ్చే ఫారాలు వ్యాపారం లేదా వృత్తి మీద ఆదాయం ఉన్న వారికే వర్తిస్తాయి. ఫారం–3ని వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు వాడాలి.ఇది చాలా పెద్ద ఫారం అని చెప్పవచ్చు. నిడివిపరంగా అనడం లేదు.. ఇవ్వాల్సిన వివరాలు ఎక్కువ..సంఖ్య ఎక్కువ.వ్యక్తులు, హిందు ఉమ్మడి కుటుంబాలు వేయొచ్చు.ముఖ్యమైన రూలు ఏమిటంటే వ్యాపారం / లేదా వృత్తి మీద ఆదాయం ఉన్నవారు మాత్రమే ఫారం–3ని వేయాలి.ఆదాయపు పన్ను చట్టప్రకారం వ్యాపారానికొక రకమైన ఫారం, వృత్తి నిపుణులకొక రకమైన ఫారం లేదు. అందరికీ ఒకే ఫారం.‘వ్యాపారం’ అనే పదానికి నిర్వచనంలోనే ఎన్నో వాటితో పాటు ‘వృత్తి’ని కలిపారు.వ్యక్తులు/కుటుంబాలకు ట్యాక్స్ ఆడిట్ వర్తించినా, వర్తించకపోయినా ఈ ఫారం వేయాలి.ఈ రిటర్నులో ఇంటి మీద ఆదాయం, జీతం, పెన్షన్, వ్యాపారం/వృత్తి మీద ఆదాయం, ఇతర ఆదాయాలు, మూలధన లాభాలు.. అంటే చట్టంలో పొందుపర్చిన అన్నీ.. అంటే ఐదు శీర్షికల్లో ఏర్పడ్డ ఆదాయం ఉన్నవారు వేయొచ్చు.భాగస్వామ్యం నుంచి పారితోíÙకం వచ్చే వారు వేయొచ్చు.దీన్ని ‘మాస్టర్ ఫారం’ అని అనొచ్చు. ఎందుకంటే, వ్యక్తి లేదా ఉమ్మడి కుటుంబం ప్రతి ఆదాయం.. ఇండియాలో వచ్చినది కావొచ్చు విదేశాల నుంచి వచ్చినది కావొచ్చు.. ‘సర్వం’ ఇందులో కవర్ అవుతుంది.అంతే కాకుండా, ఆదాయం కానివి.. ఉదాహరణకు, అడ్వాన్సులకు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వాలి.ఆ ఆర్థిక సంవత్సరంలో జరిగిన పెద్ద లావాదేవీలు, ఇండియాలో గానీ విదేశాల్లో గానీ జరిగినవి ఇవ్వాలి.అలాగే, మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ల వివరాలు ఇవ్వాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ల వల్ల ఆదాయం ఏర్పడకపోయినా వివరాలు ఇవ్వాలి. ఉదాహరణగా ఒక ఇంటి కోసం భారీ మొత్తాన్ని అడ్వాన్సుగా ఇచ్చారు. ఇలాంటి వ్యవహారాలన్నింటిని కూడా పొందుపర్చాలి.కొంత నిర్దేశించిన టర్నోవరు దాటిన వారే అకౌంట్స్ బుక్స్ రాయాలి. కానీ మా సలహా ఏమిటంటే.. వ్యాపారం/వృత్తి ఉన్నవారు అకౌంట్స్ రాయండి. వ్యవహారం జరిగినప్పుడు స్పష్టంగా సమగ్రంగా అన్నీ ఒక చోట పర్మనెంట్ బుక్‌లో రాసుకోండి. వివరణ రాయండి.ఇలా రాసి ఉంచడం మీకు కాస్తంత శ్రమ కావచ్చు కానీ, తర్వాత రోజుల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఫారం నింపడానికి / దాఖలు చేయడానికి అవసరమైతే వృత్తి నిపుణుల సర్వీసులు తీసుకోండి.- కె.సీహెచ్, ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, - కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులుఇవి చదవండి: రూ. 27 లక్షల కోట్లకు గృహ రుణాలు.. -
ఈ నెల నుంచే ‘హెల్త్’ ప్రీమియం
రూ. 90, రూ. 120.. రెండు శ్లాబుల్లో వసూలు దంపతులిద్దరూ ఉద్యోగులైతే.. ప్రీమియం ఒక్కరు చెల్లిస్తే చాలు సస్పెన్షన్‌లో ఉన్న ఉద్యోగులూ హెల్త్‌కార్డుకు అర్హులే సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి ఉద్దేశించిన హెల్త్‌కార్డుల పథకం ప్రీమియాన్ని(చందాను) ఈ నెల జీతం, పెన్షన్ నుంచే వసూలు చేయనున్నారు. డిసెంబర్ 1న చెల్లించనున్న నవంబర్ జీతం నుంచి ప్రీమియం వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల జీతపు శ్రేణిని బట్టి రెండు శ్లాబుల్లో ప్రీమియం వసూలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి వీలుగా హెల్త్‌కార్డుల పథకం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. డిసెంబర్ 1 నుంచి మెడికల్ రీయింబర్స్మెంట్ రద్దు కానుంది. జీవోలోని ముఖ్యాంశాలు ఇవీ.. హాడిసెంబర్ 1న ఉద్యోగులకు/పెన్షనర్లకు అందనున్న నవంబర్ జీతం/పెన్షన్ నుంచి ప్రీమియం వసూలు చేయడం ప్రారంభమవుతుంది. 1 నుంచి 4 వరకు ఉన్న జీతపు శ్రేణిలో ఉన్న ఉద్యోగులను శ్లాబ్-ఎ, 5 నుంచి 17 వరకు జీతపు శ్రేణిలో ఉన్న ఉద్యోగులను శ్లాబ్-బి కింద విభజించారు. శ్లాబ్-ఎ, బి కింద చేర్చిన ఉద్యోగుల నుంచి నెలకు రూ. 90, శ్లాబ్-సి కింద ఉన్న ఉద్యోగుల నుంచి రూ. 120 వసూలు చేయనున్నారు. పెన్షనర్లు పదవీ విరమణ చేసిన నెల్లో పొందిన జీతపు శ్రేణి ఆధారంగా శ్లాబ్ నిర్ణయిస్తారు. ఆ మేరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. శ్లాబ్ ఎ, శ్లాబ్ బి కింద రూ.6,700 నుంచి రూ.15,280 వరకు జీతపు శ్రేణి ఉన్న ఉద్యోగులున్నారు. శ్లాబ్ సి కింద రూ.16,150 నుంచి రూ.44,740 వరకు జీతపు శ్రేణి ఉన్న ఉద్యోగులుంటారు. హాహెల్త్కార్డుల పథకానికి ఏటా రూ. 220 కోట్లు ఖర్చవుతుందని అంచనా. అందులో ఉద్యోగులు ప్రీమియం ద్వారా 40 శాతం సమకూర్చుకోనున్నారు. మిగతా 60 శాతం నిధులను ప్రభుత్వం సమకూర్చనుంది. శ్లాబ్-ఎ, బి కింద చేర్చిన ఉద్యోగులకు ప్రభుత్వం నెలకు రూ. 135, శ్లాబ్-సి ఉద్యోగులకు రూ. 180 చెల్లించనుంది. - దంపతులు ఇద్దరూ ఉద్యోగులు/పెన్షనర్లు అయితే.. ఎవరైనా ఒకరు ప్రీమియం చెల్లిస్తే చాలు. అయితే ఈమేరకు ఒకరు ప్రీమియం చెల్లిస్తున్నట్లు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. - దీర్ఘకాలపు సెలవులో ఉన్న ఉద్యోగుల ‘లీవ్ శాలరీ’ నుంచి ప్రీమియం వసూలు చేస్తారు. జీతం లేని సెలవులో ఉన్న ఉద్యోగులు ప్రతినెలా తొలివారంలో ‘ఉద్యోగుల ఆరోగ్య పథకం నిధి’కి చలాన్ ద్వారా ప్రీమియం చెల్లించాలి. - సెస్పెన్షన్‌లో ఉండి జీతం లేని ఉద్యోగులు కూడా చలాన్ ద్వారా ప్రతినెలా తొలివారంలో ప్రీమియం చెల్లించాలి. - డిసెంబర్ 1 నుంచి మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను తీసుకోవద్దని డ్రాయింగ్ ఆఫీసర్లకు ప్రభుత్వం సూచించింది.