భారతీయ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తున్నారు. ఆర్థికాంశాల్లో నిర్ణయాత్మక శక్తిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి కూడా టర్మ్ ఇన్సూరెన్స్(Term life insurance) ఆవశ్యకత పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బీమా సాధనం గురించి తెలుసుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది నిర్దిష్ట ప్రీమియం చెల్లిస్తే, నిర్దిష్ట జీవిత బీమా కవరేజీని అందించే ప్యూర్ ప్రొటెక్షన్ పథకం. దురదృష్టవశాత్తు పాలసీదారు కన్నుమూసిన పక్షంలో సమ్ అష్యూర్డ్ మొత్తాన్ని వారి నామినీకి బీమా సంస్థ చెల్లిస్తుంది. మిగతా సాధనాలతో పోలిస్తే తక్కువ ప్రీమియంకే ఎక్కువ కవరేజీని అందించడం టర్మ్ ప్లాన్ల ప్రత్యేకత.
ఉదాహరణకు 30 ఏళ్ల నేహా వార్షికంగా రూ.9,646 ప్రీమియంతో 30 ఏళ్ల వ్యవధికి రూ.1 కోటి సమ్ అష్యూర్డ్(Sum Assured)కి పాలసీ తీసుకున్నారనుకుందాం. ఒకవేళ దురదృష్టవశాత్తు నేహా మరణించిన పక్షంలో ఆమె నామినీకి రూ.1 కోటి బీమా మొత్తం లభిస్తుంది. ఇలా నేహా తీసుకున్న టర్మ్ పాలసీ అనేది ఆమె కుటుంబసభ్యులకు ఆర్థికంగా తోడ్పాటునిస్తుంది. అయితే, ఈ టర్మ్ పాలసీని ఎంత ముందుగా తీసుకుంటే అంత మంచిది. ఉదాహరణకు నేహా గనుక టర్మ్ పాలసీని తీసుకోవడం ఒక పదేళ్లు వాయిదా వేశారనుకోండి .. అప్పుడు అదే లైఫ్ కవరేజీకి ఆమె ఏకంగా రూ.15,900 వార్షిక ప్రీమియం కట్టాల్సి వస్తుంది. పైగా పాలసీ వ్యవధి కూడా 20 ఏళ్లకే పరిమితమవుతుంది. మొత్తం మీద ఆమె తక్కువ కాలవ్యవధికి వర్తించే పాలసీకి ఏటా రూ.6,000 చొప్పున కట్టాల్సి వస్తుంది. అదే ముందుగా తీసుకుని ఉంటే, ఈ అదనపు మొత్తాన్ని మరో చోట ఇన్వెస్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. యాడ్–ఆన్‌తో అదనపు ప్రయోజనాలు ఉంటాయి. వ్యక్తిగత జీవిత పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా మరికాస్త ప్రీమియం చెల్లించడం ద్వారా మరిన్ని అదనపు ప్రయోజనాలను అందించేందుకు యాడ్–ఆన్ రైడర్లు ఉపయోగపడగలవు.
క్రిటికల్ ఇల్‌నెస్ బెనిఫిట్
ఇది ఇటు ఆరోగ్యం అటు జీవిత బీమా ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కొన్ని జీవిత బీమా కంపెనీలు 32 తీవ్ర అనారోగ్యాలకు కూడా కవరేజీని అందిస్తున్నాయి. మహిళలకు ప్రత్యేకమైన బ్రెస్ట్, సరి్వకల్, ఒవేరియన్ క్యాన్సర్లు, గుండె.. మెదడు.. కిడ్నీ సంబంధ సమస్యలు మొదలైనవి ఈ జాబితాలో ఉంటున్నాయి. 30 ఏళ్ల వయస్సు గల మహిళ, 30 ఏళ్ల కాలవ్యవధికి కేవలం నెలకు రూ. 977 చెల్లించడం ద్వారా రూ. 50 లక్షల వరకు ప్రయోజనాలను పొందేందుకు ఈ యాడ్–ఆన్‌ను తీసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా అనారోగ్యం ఉన్నట్లు తేలిందంటే, చికిత్స కోసం నిధుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా, బీమా సంస్థ ఏకమొత్తంగా చెల్లిస్తుంది. ప్రస్తుతం కీమోథెరపీ వ్యయం దాదాపు రూ. 25 లక్షల వరకు ఉంటోంది. ఇలా వైద్య చికిత్స వ్యయాలు గణనీయంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ యాడ్–ఆన్ ఎంతో ఉపయోగకరంగా ఉండగలదు.
ప్రీమియం వెయివర్
ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేని విధంగా జీవితం ఉంటుంది. కాబట్టి పాలసీదారు ప్రమాదవశాత్తూ శాశ్వత వైకల్యానికి గురై ఆదాయాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ యాడ్–ఆన్ బెనిఫిట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చాలా మటుకు బీమా సంస్థలు అదనంగా తీసుకోకుండా, పాలసీ అంతర్గతంగానే ఈ ఫీచరును అందిస్తున్నాయి. ఒకవేళ మీరు తీసుకున్న పాలసీలో ఇది లేకపోతే, కొంత అదనపు ప్రీమియం చెల్లించైనా తీసుకోవడం శ్రేయస్కరం.
యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల సంస్థ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2023లో దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు 11.9 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ యాడ్–ఆన్ ప్రయోజకరంగా ఉండగలదు. నెలకు కేవలం రూ.302 మేర అదనంగా ప్రీమియం చెల్లించడం ద్వారా రూ.50 లక్షల లైఫ్ కవరేజీకి నేహాలాంటి వారు ఈ యాడ్–ఆన్ బెనిఫిట్‌ను తీసుకోవచ్చు. ఉదాహరణకు, రూ.1 కోటి కవరేజీ గల బేస్ పాలసీని, రూ.50 లక్షల యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్‌ను తీసుకుంటే, ప్రమాదవశాత్తు మరణించిన పక్షంలో మొత్తం రూ.1.50 కోట్ల క్లెయిమ్ లభిస్తుంది.
కుటుంబానికి ఆర్థికంగా దన్నుగా నిలుస్తున్న వారికి దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగి, ఆదాయానికి అంతరాయం ఏర్పడినా, కుటుంబానికి ఆర్థిక భరోసాను కల్పిస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్. క్లెయిమ్‌ల విషయంలో మెరుగైన ట్రాక్ రికార్డు ఉన్న బీమా సంస్థ నుంచి దీన్ని కొనుగోలు చేయడం మంచిది. ఉదాహరణకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ 2024 ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ మధ్య కాలంలో మొత్తం పరిశ్రమలో అత్యుత్తమంగా 99.3 శాతం క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని నమోదు చేసింది. అలాగే, నాన్–ఇన్వెస్టిగేటెడ్ డెత్ క్లెయిమ్‌లను సగటున 1.2 రోజుల వ్యవధిలోనే సెటిల్ చేసింది.
– ఎలిజబెత్ రాయ్, హెడ్ (ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్),
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
Comments
Please login to add a commentAdd a comment