Term Insurance
-
వార్షిక వేతనం రూ.5 లక్షలు.. రూ.కోటి పాలసీ ఇస్తారా?
నా వయసు 27 ఏళ్లు. నేను ఏటా రూ.5 లక్షలు సంపాదిస్తున్నాను. నాకు బీమా కంపెనీలు రూ.కోటి టర్మ్ పాలసీ ఇస్తాయా? రూ.5 లక్షల ఆరోగ్య బీమా కూడా తీసుకోవాలనుకుంటున్నాను సరిపోతుందా? - ఆకాశ్మీ వయసును పరిగణలోకి తీసుకుంటే బీమా సంస్థలు సాధారణంగా వార్షికాదాయానికి 20-25 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ వార్షికాదాయం రూ.5 లక్షలు కాబట్టి, మీకు రూ.కోటి పాలసీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఒకే కంపెనీ మీకు రూ.కోటి టర్మ్ పాలసీ జారీ చేయకపోతే మంచి చెల్లింపుల రికార్డున్న రెండు కంపెనీల నుంచి రూ.50 లక్షల చొప్పున పాలసీ తీసుకోవచ్చు. పాలసీ తీసుకునేప్పుడు ఎలాంటి దాపరికాలు లేకుండా మీ ఆరోగ్య వివరాలు కచ్చితంగా తెలియజేయాలి.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలో 1000 మందికి లేఆఫ్స్!ప్రస్తుత రోజుల్లో ఆసుపత్రి పాలైతే లక్షల రూపాయలు చెల్లించాల్సిందే. మీ వయసులోని వారికి తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ అందించే ఆరోగ్య బీమా కంపెనీలు మార్కెట్లో చాలా ఉన్నాయి. ఎలాంటి కో-పే(పాలసీదారులు కొంత, కంపెనీ కొంత చెల్లించే విధానం) లేకుండా, పూర్తిగా కంపెనీయే క్లెయిమ్ చెల్లించే పాలసీను ఎంచుకోవాలి. ప్రస్తుతం వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. రూ.5 లక్షలు ప్రస్తుతం సరిపోతాయని మీరు భావిస్తున్నా. భవిష్యత్తులో ఇబ్బంది పడవచ్చు. కాబట్టి, మీరు రూ.10 లక్షలకు తగ్గకుండా పాలసీ తీసుకోవడం ఉత్తమం. -
ప్రపంచంలోనే అత్యంత బలమైన బ్రాండ్
దేశీయ బీమా రంగంలో ఎన్ని కంపెనీలున్నా ప్రభుత్వ అధీనంలోని జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ)ది ప్రత్యేక స్థానం. ఈనెల ఒకటో తేదీన ప్రారంభమైన ఈ సంస్థ 68వ బీమా వారోత్సవాలు రేపటితో ముగియనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏటా సుమారు రూ.నాలుగు లక్షల కోట్ల వరకు పెట్టుబడులు సమకూరుస్తున్న ఈ సంస్థ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.ఎల్ఐసీ సుమారు 15 లక్షల మంది నిరుద్యోగులకు బీమా సలహాదారులుగా ఉపాధి కల్పిస్తోంది.దేశవ్యాప్తంగా 688 జిల్లాస్థాయి జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) కార్యాలయాలున్నాయి.ప్రైవేటు కంపెనీలకు గ్రామీణ ప్రాంతాల్లో 176 శాఖలుంటే, ఎల్ఐసీకి 1,224 బ్రాంచీలున్నాయి.ఎల్ఐసీ 1956 నుంచి ఇప్పటివరకు రూ.53లక్షల కోట్ల ఆస్తులను సంపాదించింది.దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.43లక్షల కోట్ల మేర పెట్టుబడులు అందించింది.సుమారు 27 కోట్ల మంది వ్యక్తిగత పాలసీదారులున్నారు.13 కోట్ల గ్రూప్ పాలసీదారులకు ఎల్ఐసీ సేవలందిస్తోంది.రూ.51.21 లక్షల కోట్ల ఆస్తుల నిర్వహణ(ఏయూఎమ్)తో దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలుస్తోంది.గడచిన ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.6,104 కోట్ల డివిడెండ్ అందించింది.బ్రాండ్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్ రిపోర్ట్-2024 ప్రకారం ఎల్ఐసీ ప్రపంచంలోనే ‘అత్యంత బలమైన బ్రాండ్’గా నిలిచింది.‘ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్’ నివేదిక ప్రకారం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ.గత సంవత్సరంలో రూ.2.30 లక్షల కోట్లను క్లెయిమ్‌ల రూపంలో పాలసీదారులకు చెల్లించింది.ఇటీవలి కేరళ తుపానులో మరణించిన 36 మంది పాలసీదారుల కుటుంబాలకు ఎలాంటి కాగితాలు అడగకుండానే రూ.11 కోట్ల మేర బీమా సొమ్మును అందజేసింది.ఇదీ చదవండి: సెబీ చీఫ్‌పై ఆరోపణలు.. పీఏసీ విచారణ?కేంద్ర ప్రభుత్వం 2022లో ఎల్ఐసీలోని మూడున్నర శాతం వాటాను ఐపీఓ ద్వారా స్టాక్మార్కెట్లో విక్రయించింది. ఇందులో భాగంగా సుమారు 40 లక్షల షేర్లు విక్రయించి రూ.21వేల కోట్లను సమకూర్చుకుంది. -
టర్మ్ ఇన్సూరెన్స్‌తో ఆర్థిక భద్రత
మన పరోక్షంలో మన కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు సమర్థమంతమైన మార్గాల్లో నిస్సందేహంగా టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఒకటి. ఇది పూర్తిగా ప్రొటెక్షన్‌పై మాత్రమే ఫోకస్ చేసే సరళతరమైన బీమా పథకం. పాలసీదారు మరణించినా కుటుంబ పరిస్థితి తల్లకిందులు కాకుండా ఆర్థికంగా భరోసా అందించే టర్మ్ ఇన్సూరెన్స్‌ను తీసుకునేందుకు పలు కారణాలు ఉన్నాయి. అవేమిటంటే.. → ఆదాయ నష్టం నుంచి రక్షణ: సంపాదించే కుటుంబ పెద్ద కన్నుమూస్తే ఆదాయం నిలి్చపోయి ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం కాకుండా టర్మ్ ఇన్సూరెన్స్ కాపాడుతుంది. ఉదాహరణకు నలుగురు సభ్యులున్న కుటుంబంలో ఏకైక సంపాదనపరుడైన పాలసీదారు ఇటు ఇంటిరుణం చెల్లిస్తూ అటు పిల్లల చదువులకూ కడుతున్నారనుకుందాం. దురదృష్టవశాత్తూ ఒకవేళ ఆయన మరణించిన పక్షంలో టర్మ్ ఇన్సూరెన్సు పిల్లల చదువు ఖర్చులు, రుణాల చెల్లింపు, జీవనం సాగించడానికి అవసరమయ్యే నిధులను సమకూర్చగలదు. → చౌకైనది: టర్మ్ ప్లాన్లతో తక్కువ ప్రీమియంలకే అత్యధిక కవరేజీ లభించగలదు. ముఖ్యంగా యుక్తవయస్సులో ఉన్నప్పుడు తీసుకుంటే రిసు్కలు తక్కువ కాబట్టి కాబట్టి ప్రీమియంలు మరింత తక్కువగా ఉంటాయి. కనుక 20లలో లేదా 30లలో ఉన్నప్పుడు టర్మ్ పాలసీని తీసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి. → రుణాలకు కవరేజీ: పాలసీదారు ఏవైనా రుణాలు తీసుకున్నా వాటిని తీర్చేందుకు కూడా టర్మ్ ఇన్సూరెన్స్‌తో కవరేజీ లభించగలదు. ఎంత కవరేజీ ఉండాలి.. → ఇది మీ ఆర్థిక పరిస్థితులు, మీపై ఆధారపడిన వారి అవసరాలు, లైఫ్‌స్టయిల్, భవిష్యత్ లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. బండగుర్తు ఏమిటంటే వార్షిక ఆదాయానికి 10 రెట్లు అధికంగా లైఫ్ కవరేజీ ఉండాలి. అదనంగా ద్రవ్యోల్బణం, నిర్దిష్ట ఆర్థిక లక్ష్యాల్లాంటివి కూడా పరిగణనలోకి తీసుకుంటే ఎంత కవరేజీ అవసరమవుతుందనేది ఒక అవగాహనకు రావచ్చు. → చివరగా చెప్పాలంటే.. మీ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాల్సిన అవసరం గురించి అర్థం చేసుకునేందుకు, మీకేదైనా అయితే మీ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవగలిగే వారు ఎవరైనా ఒక అయిదుగురు ఉన్నారేమో ఆలోచించి చూడండి. నా మిత్రులను అడిగితే ఏదో ఒకటో రెండో పేర్లు చెప్పారు. కొందరైతే అదీ లేదు. కాబట్టి ఏదైనా జరిగితే మానసికంగా భరోసానిచ్చేవారు చాలా మందే ఉన్నా ఆర్థికంగా వెన్నంటి ఉండేవారు అంతగా ఉండరనేది ఇది తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో కుటుంబానికి ఆర్థిక భద్రత కలి్పంచడానికి టర్మ్ ఇన్సూరెన్స్ ఎంతగానో తోడ్పడగలదు.సమీర్ జోషి, చీఫ్ ఏజెన్సీ ఆఫీసర్, బజాజ్ అలయంజ్ లైఫ్ -
ఇన్సూరెన్స్ సేవల్లోకి ప్రముఖ సంస్థ
ప్రముఖ ఆన్లైన్ స్టాక్ బ్రోకింగ్ సంస్థ అప్‌స్టాక్స్ ఇన్సూరెన్స్ వ్యాపారంలోకి ప్రవేశించినట్లు తెలిపింది. తమ కొత్త బిజినెస్‌ను టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో ప్రారంభిస్తున్నామని కంపెనీ వర్గాలు చెప్పాయి. త్వరలో హెల్త్, మోటార్, ట్రావెల్ సెగ్మెంట్లలో బీమా ఉత్పత్తులు మొదలుపెడుతామని కంపెనీ తెలిపింది.అప్‌స్టాక్స్‌తో మొదటి భాగస్వామిగా హెచ్డీఎఫ్సీ లైఫ్ జతైనట్లు అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా అప్‌స్టాక్స్ కోఫౌండర్ కవితా సుబ్రమణియన్ మాట్లాడుతూ..‘మా కంపెనీను వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తున్నాం. ఈ ప్లాట్‌ఫామ్ సురక్షితంగా, వేగంగా పనిచేస్తోంది. వినియోగదారుల సంపదను సమర్థంగా నిర్వహించడంలో భాగంగా బీమా సేవలు ప్రారంభించాం. కొత్త బిజినెస్ మోడల్ వల్ల సంస్థకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది’ అని అన్నారు.అప్‌స్టాక్స్ ఇప్పటికే స్టాక్ క్రయవిక్రయాలు, ఐపీఓలు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లు, కమోడిటీలు, కరెన్సీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, పీర్-టు-పీర్ లెండింగ్, ప్రభుత్వ బాండ్లు, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు సహా అనేక రకాల సేవలందిస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.1,000 కోట్లకు చేరినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో కస్టమర్లకు సంబంధించి పది రెట్లు వృద్ధి నమోదు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది.ఫోన్‌పే వంటి ఫిన్‌టెక్ కంపెనీలు సైతం బీమా కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్‌స్టాక్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో మార్కెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది. 2023, ఏప్రిల్ 24న వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫోన్‌పే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్‌లో రూ.426 కోట్లు పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిందే. -
బీమా పాలసీ.. అత్యవసర నిధి!
ఉన్నట్టుండి నిధుల అవసరం ఏర్పడిందా..? వ్యక్తిగత రుణానికి తక్కువ క్రెడిట్ స్కోర్ అడ్డు పడుతోందా? లేదంటే వ్యక్తిగత రుణంపై అధిక వడ్డీ రేటు చూసి వెనుకాడుతున్నారా..? ఇలాంటి సందర్భాల్లో బీమా పాలసీయే మిమ్మల్ని ఆదుకుంటుంది. అదెలా అంటారా? ఎండోమెంట్ బీమా ప్లాన్లపై బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు రుణ సదుపాయం కల్పిస్తున్నాయి. పైగా పర్సనల్ లోన్‌తో పోలిస్తే వడ్డీ రేటు తక్కువే.డబ్బులు అవసరం పడితే బీమా పాలసీని సరెండ్ చేసే వారూ ఉన్నారు. ఇలా ఇన్సూరెన్స్ పాలసీని సరెండర్ చేయడానికి బదులు, దానిపై రుణం తీసుకుని అవసరం గట్టెక్కడమే మంచి మార్గం అవుతుంది. దీనివల్ల బీమా రక్షణను ఎప్పటి మాదిరే కొనసాగించుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందన్నది తెలియజేసే కథనమే ఇది. రుణ సదుపాయం అన్ని రకాల బీమా పాలసీలపై వస్తుందనుకుంటే పొరపాటు. కేవలం కొన్ని రకాల పాలసీలకే ఇది పరిమితం. ‘‘పొదుపుతో కూడిన సంప్రదాయ బీమా పాలసీ (ఎండోమెంట్, మనీ బ్యాక్ ప్లాన్లు) కలిగి ఉన్నవారు వాటిపై పలు రకాల ఆర్థిక అవసరాల కోసం రుణాన్ని పొందొచ్చు’’అని ఏజెస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో విఘ్నేష్ సహానే తెలిపారు. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కేవలం మరణ పరిహారాన్నే అందిస్తాయని, ఎలాంటి రాబడి హామీ ఉండదు కనుక వాటిపై రుణం పొందలేరని స్పష్టం చేశారు. యూనిట్ లింక్డ్ ప్లాన్ల (యులిప్)లోనూ రాబడులు మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయి కనుక వాటిపైనా రుణ సదుపాయం ఉండదని తెలిపారు. ఎక్కడ తీసుకోవచ్చు? పాలసీ మంజూరు చేసిన జీవిత బీమా కంపెనీ నుంచే రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. నేడు చాలా బీమా సంస్థలు పాలసీలపై రుణాలను కూడా ఇస్తున్నాయి. అలాగే, బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు ఈ తరహా రుణాలను ఆఫర్ చేస్తుంటాయి. అయితే, బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల కంటే పాలసీ మంజూరు చేసిన బీమా సంస్థను సంప్రదించడమే మెరుగైన మార్గమని నిపుణులు అంటున్నారు. ‘‘ఇన్సూరెన్స్ కంపెనీతో పోలిస్తే బ్యాంక్‌లు బీమా ప్లాన్లపై తక్కువ రుణ మొత్తాన్ని ఆఫర్ చేస్తాయి. అదే మాదిరి బీమా సంస్థలతో పోలిస్తే బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు రుణాలపై కొంచెం అధిక రేటును వసూలు చేస్తుంటాయి’’అని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ‘ప్లాన్ ఆర్’ వ్యవస్థాపకుడు అజయ్ ప్రుతి తెలిపారు. బ్యాంక్‌లు సాధారణంగా బీమా పాలసీపై రుణాన్ని నేరుగా కాకుండా.. కరెంట్ అకౌంట్‌పై ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కింద అందిస్తుంటాయి. ‘‘తరచుగా నిధుల అవసరం ఏర్పడేవారు ఇలా కరెంట్ అకౌంట్‌పై (సెక్యూరిటీ కింద బీమా పాలసీ జమ చేసి) ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం తీసుకోవడాన్ని పరిశీలించొచ్చని పైసా బజార్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సహిల్ అరోరా సూచించారు. చౌక రుణం ‘‘బీమా పాలసీలపై రుణ రేటు చాలా తక్కువగా ఉండడాన్ని గమనించొచ్చు. సాధారణంగా వీటిపై 9–9.5 శాతం వార్షిక వడ్డీ రేటును వసూలు చేస్తుంటారు. అదే వ్యక్తిగత రుణాలు (పర్సనల్ లోన్) అయితే 12 శాతం అంతకంటే ఎక్కువే ఉంటుంది’’అని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజేష్ కృష్ణన్ తెలిపారు. ఇక బీమా పాలసీలపై రుణం ఎంతొస్తుందంటే.. రుణం తీసుకునే నాటికి ఉన్న స్వా«దీనపు విలువ (సరెండర్ వ్యాల్యూ)లో 90 శాతం వరకు. బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణం మంజూరునకు సాధారణంగా నాలుగు నుంచి ఏడు రోజులు పడుతుంది. అదే బీమా సంస్థల నుంచి రుణం మూడు రోజుల్లోనే పొందొచ్చు. కొన్ని బీమా సంస్థలు ఇంతకంటే వేగంగా ఆన్లైన్లోనే పాలసీలపై రుణాలను మంజూరు చేస్తున్నాయి. ‘‘జీవిత బీమా పాలసీలపై రుణం దరఖాస్తు మదింపు, రుణం మంజూరు చాలా వేగంగా ఉంటుంది. బీమా సంస్థ నుంచే రుణం తీసుకునేట్టు అయితే ఎలాంటి అదనపు తనిఖీలు, పరిశీలనలు అవసరం పడవు’’అని రాజేష్ కృష్ణన్ వివరించారు.బీమా పాలసీపై రుణం తీసుకోవడం ఎంతో సౌకర్యమైనదిగా పాలసీఎక్స్ సీఈవో నావల్ గోయల్ సైతం అంగీకరించారు. ‘‘దరఖాస్తు చేసుకోవడం ఎంతో సులభం. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వారు సైతం పాలసీపై రుణానికి అర్హులే. ఎందుకంటే పాలసీపై రుణం జారీకి క్రెడిట్ స్కోర్ తనిఖీలు అవసరం పడవు’’అని కృష్ణన్ తెలిపారు. ఈ రుణం తిరిగి చెల్లింపు నిబంధనలు కూడా సులభమే. ‘‘రుణం చెల్లించడం వీలు కానప్పుడు కేవలం రుణంపై వడ్డీ వరకే చెల్లించొచ్చు. అసలు రుణాన్ని ఎప్పుడైనా తిరిగి తీర్చివేయవచ్చు’’అని ప్రుతి వివరించారు. ఎంత వీలైతే అంత అసలు రుణంలో చెల్లించుకుంటూ వెళ్లడం కూడా మంచి ఆలోచనే. దీనివల్ల ప్రతి నెలా చెల్లించే వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. అత్యవసర నిధి బీమా పాలసీ అత్యవసర నిధిగానూ అక్కరకొస్తుంది. ప్రతి కుటుంబానికి విధిగా అత్యవసర నిధి ఉండాలి. అనుకోని పరిణామాలతో నెలవారీ వచ్చే ఆదాయం ఆగిపోతే? చేస్తున్న ఉద్యోగం ఊడిపోతే..? అక్కడి నుంచి తిరిగి ఉపాధి లభించేంత వరకు కుటుంబ అవసరాలను తీర్చేందుకు అత్యవసర నిధి ఉపయోగపడుతుంది. కనీసం ఆరు నెలల నుంచి ఏడాది అవసరాలను తీర్చేంత అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. అయితే, ప్రతి ఒక్కరికీ ఇంత మొత్తం అత్యవసర నిధి కింద ఏర్పాటుకు వెసులుబాటు ఉండకపోవచ్చు. ఇలాంటి వారు ఎండోమెంట్ లేదా మనీబ్యాక్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను అత్యవసర నిధి కింద ఉపయోగించుకోవచ్చు. తిరిగి ఉపాధి ఏర్పడి, ఆదాయం చేతికి అందేంత వరకు పాలసీపై రుణంతో అవసరాలను గట్టెక్కొచ్చు. ఆ తర్వాత క్రమంగా ఆరు నెలల్లోపు పాలసీపై రుణాన్ని తీర్చివేయడం మంచి ఆలోచన అవుతుంది. పాలసీ సరెండర్ అంటే? ఎండోమెంట్ లేదా మనీ బ్యాక్ బీమా ప్లాన్ వద్దనుకునే వారు దాన్ని సరెండర్ చేసుకోవచ్చు. అంటే గడువు ముగియకుండానే పాలసీని వెనక్కిచ్చేయడం. పాలసీ తీసుకున్న తర్వాత ఎంత కాలానికి సరెండర్ చేస్తున్నారనే దాని ఆధారంగా దానిపై ఎంతొస్తుందన్నది ఆధారపడి ఉంటుంది. ఈ సరెండర్ వ్యాల్యూ (స్వా«దీనపు విలువ) విషయంలో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) 2024 ఏప్రిల్ 1 నుంచి నూతన నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ప్రకారం బీమా పాలసీ తీసుకున్న మూడేళ్లలోపు సరెండర్ చేస్తే చేతికి చాలా తక్కువే వస్తుంది. అంటే అప్పటికి కట్టిన ప్రీమియంలో సగం కూడా రాదు. అదే పాలసీ తీసుకున్న తర్వాత నాలుగేళ్ల నుంచి ఏడేళ్లలోపు సరెండర్ చేస్తే అధిక విలువ పాలసీదారుకు దక్కుతుంది. నిజానికి ఎండోమెంట్, మనీబ్యాక్ పాలసీల్లో 20–30 ఏళ్లపాటు కొనసాగినప్పుడే ప్రతిఫలం కనిపిస్తుంది. ఇంతకంటే తక్కువ కాలవ్యవధిపై వచ్చే ప్రయోజనం అంతగా ఉండదు. అందుకని నిధుల అవసరం ఏర్పడితే బీమా ప్లాన్‌ను సరెండర్ చేయడానికి బదులు.. దానిపై రుణం పొందడమే మెరుగైనది అవుతుంది. మళ్లీ నిధుల వెసులుబాటు వచ్చిన వెంటనే తీసుకున్న రుణాన్ని తీర్చివేయాలి. ఆరంభంలో తక్కువే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న కొత్తలో దీనిపై వచ్చే రుణం చాలా స్వల్పం. ఇందులో ఉన్న ప్రతికూలత ఇదే. క్యాష్ వ్యాల్యూ లేదా సరెండర్ వ్యాల్యూ గణనీయంగా పెరిగేందుకు కొన్నేళ్లు పడుతుంది. అప్పుడే చెప్పుకోతగ్గ మేర రుణం దీనిపై వస్తుంది. ఇక ఎండోమెంట్ లేదా మనీ బ్యాంక్ పాలసీలపై దీర్ఘకాలంలో వచ్చే రాబడి 5–6 శాతం మేర ఉంటుంది. దీనిపై రుణం తీసుకుంటే, నికరంగా అందుకునే రాబడి ప్రయోజనం మరింత తగ్గిపోతుందని గుర్తు పెట్టుకోవాలి. తిరిగి చెల్లించలేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై ఉన్న మరో అనుకూలత ఏమిటంటే.. రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైనా అది క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేయబోదని కృష్ణన్ తెలిపారు. రుణంలో అసలు, వడ్డీ, చార్జీలు అన్నింటినీ పాలసీ సరెండర్ వ్యాల్యూ నుంచి బీమా సంస్థలు సర్దుబాటు చేసుకుంటాయని సహిల్ అరోరా తెలిపారు. రుణం చెల్లించకుండా పాలసీదారు మరణించిన సందర్భాల్లో.. పరిహారం నుంచి రుణం, వడ్డీ, చార్జీలను మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని బీమా సంస్థ నామినీ లేదా పాలసీదారు వారసులకు చెల్లిస్తుంది. రుణం తీర్చకుండానే పాలసీ గడువు ముగిసిపోయిందనుకుంటే.. అప్పుడు నికరంగా చెల్లించే మొత్తం నుంచి రుణాన్ని బీమా సంస్థ వసూలు చేసుకుంటుంది. ఒకవేళ రుణంపై వడ్డీ కూడా బకాయి పడితే.. అసలు, వడ్డీ మొత్తం సరెండర్ వ్యాల్యూని దాటిపోతుంటే అప్పుడు పాలసీని బీమా సంస్థ రద్దు చేస్తుంది. పాలసీపై రుణం తీసుకునే సమయంలోనే దానిపై బీమా సంస్థకు హక్కులు బదలాయిస్తున్నట్టు అంగీకారాన్ని తీసుకుంటాయి. రుణం సమంజసమేనా..? అసలు జీవిత బీమా ఎందుకు? ఆర్జించే వ్యక్తికి దురదృష్టవశాత్తూ ఏదైనా వాటిల్లితే అప్పుడు అతనిపై ఆధారపడిన కుటుంబం ఆర్థికంగా కష్టాలు పడకూడదనే. తాను లేకపోయినా, తన కుటుంబ అవసరాలను తీర్చే లక్ష్యంతోనే లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీని తీసుకుంటుంటారు. మరి అలాంటి సాధనంపై రుణం తీసుకుంటే, అసలు ప్రయోజనానికే భంగం కలగొచ్చని నిపుణుల భావన. అదెలా అంటే పాలసీపై రుణం తీసుకున్న తర్వాత సదరు పాలసీదారు అనుకోకుండా మరణం పాలైతే.. కుటుంబానికి దక్కే బీమా పరిహారం పెద్దగా ఉండకపోవచ్చు. దాంతో బీమా ఉద్దేశ్యం నెరవేరకుండా పోతుంది. అందుకని బంగారం, మ్యూచువల్ ఫండ్స్, ప్రాపర్టీ తదితర ఇతర సాధనాలపై రుణం తీసుకోవడాన్ని పరిశీలించొచ్చని చెబుతుంటారు. కానీ, ఇక్కడ వాస్తవ అంశం ఏమిటంటే.. బంగారంపై రుణం తీసుకున్న తర్వాత సదరు వ్యక్తి మరణించినా కానీ, ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత కుటుంబంపైనే పడుతుంది. అందుకని ఏ సాధనంపై రుణం తీసుకున్నా పరిణామం ఒక్కటిగానే ఉంటుంది. అందుకుని దీనికి పరిష్కారం ఒకటి ఉంది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ఏదైనా అవసరం కోసం రుణం తీసుకుంటుంటే, వెంటనే అంత విలువకు టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజీని పెంచుకోవడం లేదంటే అదనపు కవరేజీతో టర్మ్ ప్లాన్ కొనుగోలు చేయడం మంచిది. దీనివల్ల అనుకోనిది జరిగినా వచ్చే పరిహారంతో రుణాలను గట్టెక్కొచ్చు. ఇక దీర్ఘకాల అవసరాలకు కాకుండా స్వల్పకాల అవసరాలకే బీమాపై రుణానికి పరిమితం కావాలి. మూడు నుంచి ఆరు నెలలు మించకూడదు. ఎందుకంటే ఇంత తక్కువ కాలానికి చెల్లించాల్సిన వడ్డీ భారం కూడా చాలా తక్కువే ఉంటుంది. కనుక ఒకవేళ పాలసీదారు మరణించినా కుటుంబం పెద్దగా నష్టపోయేది ఉండదు. బీమా సంస్థ తనకు రావాల్సినంత మేర మినహాయించుకుని, మిగిలినది చెల్లించేస్తుంది. ఎండోమెంట్ ప్లాన్ ఉన్న వారు విధిగా మెరుగైన కవరేజీతో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పకుండా తీసుకోవాలి. అప్పుడు కుటుంబానికి మెరుగైన ఆర్థిక రక్షణ ఉంటుంది. -
ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులకు బిగ్ బొనాంజా.. వరాలు కురిపించిన కేంద్ర ప్రభుత్వం
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఏజెంట్లు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగుల ప్రయోజనాల కోసం సంక్షేమ చర్యలను కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించింది. ఎల్ఐసీ ఏజెంట్ల (LIC agents) గ్రాట్యుటీ పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. అలాగే ప్రస్తుతం రూ. 3,000 నుంచి రూ.10,000 స్థాయిలో ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ కవర్‌ను రూ. 25,000 నుంచి రూ.150,000 స్థాయికి పెంచేందుకు అంగీకరిచింది. (PM Vishwakarma Scheme: రూ.13,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. ప్రయోజనాలు ఇవే..) టర్మ్ ఇన్సూరెన్స్‌లో ఈ పెంపుదలతో మరణించిన ఏజెంట్ల కుటుంబాలకు గణనీయంగా ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. అలాగే ఎల్ఐసీ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం 30 శాతం చొప్పున కుటుంబ పింఛను ఇవ్వాలని నిర్ణయించారు. దేశంలో ఎల్ఐసీ వృద్ధి, బీమా విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్న 13 లక్షలకు పైగా ఏజెంట్లు, లక్ష మందికి పైగా ఉద్యోగులు ఈ సంక్షేమ చర్యల ద్వారా ప్రయోజనం పొందుతారని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. (EPFO:వేతన జీవులకు షాక్.. తగ్గనున్న పీఎఫ్ వడ్డీ!) -
జీవిత బీమా.. రాబడి చూడొద్దు
జీవిత బీమా అనగానే.. ప్రీమియం ఎంత.. రాబడి ఎంత..? అన్న ప్రశ్న వస్తుంది. ఇప్పటికీ జీవిత బీమా విషయంలో ఎక్కువ మంది ఎంపిక సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలే. ఇందుకోసం భారీగా ప్రీమియం చెల్లిస్తుంటారు. ఒకవైపు బీమా కవరేజీ. మరోవైపు రాబడి. ఇదే ఎక్కువ మందిని ఆకర్షించే అంశం. బ్యాంక్ డిపాజిట్లో మాదిరిగా, లేదంటే అంతకంటే ఎక్కువ రాబడి బీమా పాలసీలో వస్తుందని నమ్ముతుంటారు. దీనికి అదనంగా బీమా రక్షణ ఉంటుందన్న కారణంతో దీనివైపే మొగ్గు చూపిస్తుంటారు. రాబడి ఇవ్వని టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను అర్థం చేసుకుని తీసుకునే వారు మొత్తం మీద తక్కువ. కానీ, సంప్రదాయ బీమా పాలసీల్లో రాబడి విషయమై ఎక్కువ మందిలో ఉండే అంచనా తప్పు. రాబడి రేటు చాలా తక్కువ. సగటు ద్రవ్యోల్బణం కంటే కూడా తక్కువేనని గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తుంది. మార్కెటింగ్‌లో భాగంగా సంప్రదాయ బీమా పాలసీలను ఆకర్షణీయంగా చూపించే ప్రయత్నాన్ని బీమా సంస్థలు, ఏజెంట్లు చేస్తుంటారు. కానీ, ఇక్కడ స్పష్టంగా తేల్చుకోవాల్సింది ఏమిటంటే.. కావాల్సింది బీమా రక్షణా? లేక రాబడా? ఈ అంశాలను వివరించే కథనం ఇది... సంప్రదాయ బీమా పాలసీలు రెండు రకాల ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంటాయి. మరణించినప్పుడు పరిహారాన్ని చెల్లిస్తాయి. పాలసీ కాలం పూర్తయ్యే వరకు జీవించి ఉన్నా ప్రయోజనం లభిస్తుంది. పాలసీదారు ఏదైనా కారణంతో దురదృష్టవశాత్తూ పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే నామినీ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. పాలసీదారు జీవించి ఉంటే చివర్లో అన్ని ప్రయోజనాలనూ కలిపి బీమా సంస్థ చెల్లిస్తుంది. బీమా ప్లాన్ బ్రోచర్లో ఈ వివరాలు ఉంటాయి. ఉదాహరణకు ఎల్ఐసీ బీమా జ్యోతి ప్లాన్ పరిశీలిస్తే.. ఇది పొదుపు, బీమాతో కూడిన ప్లాన్. 15–20 ఏళ్ల కాలానికి తీసుకోవచ్చు. పాలసీ కాల వ్యవధి అంతటా ప్రీమియం చెల్లించక్కర్లేదు. 5 ఏళ్లు తగ్గించి మిగిలిన కాలానికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 20 ఏళ్ల టర్మ్ ప్లాన్ తీసుకుంటే 15 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించాలి. ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల కాలానికి బీమా జ్యోతి పాలసీని రూ.15 లక్షల సమ్ అష్యూరెన్స్పై (బీమా రక్షణ/కవరేజీ) తీసుకుంటే అప్పుడు ఏటా చెల్లించాల్సిన ప్రీమియం సుమారు రూ.80వేలు. ఇలా 15 ఏళ్లపాటు చెల్లించాల్సి ఉంటుంది. జీవించి ఉంటే రెండు రూపాల్లో ఈ ప్లాన్ ప్రయోజనాలను చెల్లిస్తుంది. 55 ఏళ్ల వరకు జీవించి ఉంటే అప్పుడు రూ.10 లక్షల సమ్ అష్యూరెన్స్తోపాటు గ్యారంటీడ్ అడిషన్స్ పొందొచ్చు. గ్యారంటీడ్ అడిషన్ అనేది ప్రతి రూ.1,000పై రూ.50 చొప్పున వస్తుంది. అంటే మొత్తం మీద 20 ఏళ్ల కాలంలో ప్రీమియం రూపేణా రూ.12 లక్షలు చెల్లిస్తారు. అంటే రూ.10 లక్షల కవరేజీ కోసం అంతకంటే ఎక్కువ చెల్లిస్తున్నారు. జీవించి ఉంటే 20 ఏళ్ల తర్వాత వచ్చే మొత్తం రూ.20 లక్షలు. అంటే రాబడి రూ.8 లక్షలే. అది కూడా 20 ఏళ్ల కాలానికి. ఇందులో ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (రాబడి రేటు) 4 శాతమే. ఇదనే కాదు. జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లు అన్నింటిలోనూ దాదాపు ఇదే స్థాయిలో రాబడి ఉంటుంది. ఒకవేళ 30–40 ఏళ్ల కాలానికి తీసుకుంటే ఈ రాబడి రేటు 4.5–5 శాతం మధ్య ఉంటుంది. కానీ, మన దేశంలో సగటు వార్షిక ద్రవ్యోల్బణం 6 శాతం స్థాయిలో ఉండడాన్ని గమనించొచ్చు. ద్రవ్యోల్బణం రేటు, అంతకంటే తక్కువ రాబడి రేటు ఏదైనా.. నికరంగా అది మనకు రాబడిని ఇచ్చినట్టు కాదని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ప్లాన్ కాల వ్యవధిలో పాలసీదారు మరణించినట్టయితే, సమ్ అష్యూరెన్స్తోపాటు అప్పటి వరకు సమకూరిన గ్యారంటీడ్ అడిషన్స్ చెల్లిస్తారు. బేసిక్ సమ్ అష్యూరెన్స్పై 125 శాతం, వార్షికంగా చెల్లించే ప్రీమియానికి ఏడు రెట్లు, లేదంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంకు 105 శాతం.. వీటిల్లో ఏది ఎక్కువ అయితే అది చెల్లిస్తారు. ఉదాహరణకు 35 ఏళ్ల వయసులో తీసుకుని 50 ఏళ్ల సమయంలో మరణం సంభవించినట్టయితే రూ.20 లక్షలు పరిహారంగా ముడుతుంది. ప్రత్యామ్నాయం... బీమా, పెట్టుబడి ఈ రెండింటినీ కలిపి చూడొద్దని నిపుణులు తరచూ చెబుతుంటారు. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల అటు సరైనా బీమా రక్షణ, ఇటు సరైన రాబడి పొందలేని పరిస్థితికి సంప్రదాయ బీమా పాలసీలు అచ్చమైన ఉదాహరణ. అలా కాకుండా అచ్చమైన జీవిత బీమా రక్షణను ఆఫర్ చేసే టర్మ్ ప్లాన్ తీసుకుని, మరోవైపు మెరుగైన రాబడినిచ్చే సాధనంలో పెట్టుబడి పెట్టుకోవడమే మంచి నిర్ణయం అవుతుంది. పై ఉదాహరణ ఆధారంగా బీమా, పెట్టుబడిని వేరు చేస్తే వచ్చే ప్రయోజనం ఏ మేరకు ఉంటుందో చూద్దాం. 35 ఏళ్ల వయసున్న వ్యక్తి 25 ఏళ్ల కాలానికి అంటే 60 ఏళ్లు వచ్చే వరకు (రిటైర్మెంట్ వయసు/బాధ్యతలు ముగిసే సగటు వయసు) రూ.50 లక్షల సమ్ అష్యూరెన్స్‌తో టర్మ్ ప్లాన్ తీసుకుంటే చెల్లించాల్సిన ప్రీమియం రూ.10వేల లోపే. ఎక్కువ కంపెనీల్లో ప్రీమియం రూ.7,400 నుంచి 9,800 మధ్య ఉంది. పొగతాగడం, మద్యపానం, అనారోగ్య సమస్యలు లేని వారికి ఈ ప్రీమియం అని అర్థం చేసుకోవాలి. బీమా జ్యోతి ప్లాన్‌లో ఏటా చెల్లించే ప్రీమియం రూ.80వేలు. కానీ బీమా రక్షణ రూ.10 లక్షలే. ఈ ప్రీమియంలో కేవలం 12 శాతం చెల్లించడం ద్వారా టర్మ్ ప్లాన్‌లో రూ.50 లక్షల బీమా కవరేజీని, అది కూడా 25 ఏళ్ల కాలానికి పొందొచ్చు. కేవలం 12 శాతం ప్రీమియానికే ఐదు రెట్లు అధిక బీమా రక్షణ తీసుకోవడం మెరుగైన నిర్ణయం అనిపించుకుంటుంది. అప్పుడు మిగిలిన రూ.70వేలను 15 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బీమా జ్యోతితో ప్రీమియం చెల్లింపు 15 ఏళ్లే కనుక దాన్నే పరిగణనలోకి తీసుకుని చూద్దాం. 12 శాతం రాబడి ఇచ్చే మ్యూచువల్ ఫండ్ పథకంలో ఏడాదికోసారి రూ.70వేల చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళితే 15 ఏళ్ల చివరికి రూ.29.22 లక్షలు సమకూరుతుంది. ఇందులో అసలు రూ.10.5 లక్షలు అయితే, రాబడి రూ.18.72 లక్షలు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో దీర్ఘకాలానికి వార్షిక రాబడి 12 శాతం ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒకవేళ 10 శాతం రాబడి ఆధారంగా అంచనా వేసుకున్నా.. 15 ఏళ్లలో రూ.24.46 లక్షలు సమకూరుతుంది. విడిగా బీమా ప్లాన్, పెట్టుబడి ప్లాన్ ఎంపిక చేసుకోవడం వల్ల మెరుగైన కవరేజీకితోడు, మెరుగైన సంపద సృష్టి సాధ్యపడుతుందని ఈ ఉదాహరణ తెలియజేస్తోంది. కాంపౌండింగ్ ఉండదు.. విడిగా ఇన్వెస్ట్ చేసుకుంటే కాంపౌండింగ్ ఉంటుంది. అంటే రాబడిపై రాబడి తోడవుతుంది. కానీ, సంప్రదాయ బీమా ప్లాన్లలో చెల్లించే గ్యారంటీడ్ అడిషన్స్, రివర్షనరీ బోనస్, సింపుల్ అడిషన్స్ మొత్తంపై కాంపౌండింగ్ ఉండదు. అదే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లేదా బాండ్లను తీసుకుంటే, మొదటి ఏడాది రాబడిపై తర్వాతి కాలంలో రాబడి జమ అవుతుంది. ఇలా కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది. పైకి కనిపించదు కానీ, సంపద సృష్టిలో కాంపౌండింగ్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. సంప్రదాయ పెట్టుబడి సాధనాల్లో రాబడి రేటు ముందే చెబుతారు. అదే, సంప్రదాయ ఎండోమెంట్ ప్లాన్లలో రాబడి రేటు ముందు చెప్పరు. సమ్ అష్యూరెన్స్తోపాటు ఇతర ప్రయోజనాలు చెల్లించే విధంగా ప్లాన్ ఉంటుంది. ఇందులో నికర రాబడి ఏ మేరకు అన్నది అర్థం చేసుకోవడం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. సమ్ అష్యూరెన్స్కే హామీ ఉంటుంది. ఇతర చెల్లింపులకు హామీ ఉండదు. బీమా సంస్థ పనితీరు (అది చేసే పెట్టుబడులపై రాబడులు)పైనే ఆధారపడి ఉంటాయని అర్థం చేసుకోవాలి. అందుకే అన్నింటికంటే కుటుంబానికి మెరుగైన జీవిత బీమా రక్షణ కల్పించుకోవడం ముందుగా చేయాలి. రాబడి కోసం దీర్ఘకాలంలో ఈక్విటీలే మెరుగైన సాధనమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత, ఇంకా ఆర్థిక వెసులుబాటు ఉంటే అప్పుడు మీకు నచ్చిన ప్లాన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. గ్యారంటీడ్/ పార్టిసిపేటింగ్ బీమా సంస్థలు సంప్రదాయ పాలసీలను ఆకర్షణీయంగా చూపించేందుకు బోనస్‌లను ప్రకటిస్తుంటాయి. బీమా సంస్థ పనితీరుపైనే ఇది ఆధారపడి ఉంటుంది. సంప్రదాయ బీమా ప్లాన్లు సింపుల్ రివర్షనరీ బోనస్, ఫైనల్ మెచ్యూరిటీ బోనస్, లాయల్టీ అడిషన్ను ఆఫర్ చేస్తుంటాయి. ఇవన్నీ బీమా సంస్థ వద్ద మిగులు నిల్వలపైనే ఆధారపడి ఉంటాయనే షరతు విధిస్తారు. మిగులు ఉంటే అప్పుడు సింపుల్ రివర్షనరీ బోనస్ ను చెల్లిస్తారు. కొన్ని ప్లాన్లలో సింపుల్ రివర్షనరీ బోనస్ అని కాకుండా, పాలసీ కాల వ్యవధి ముగింపు సమయంలో లాయల్టీ అడిషన్స్ పేరుతో చెల్లిస్తారు. ఇదే తరహా సంప్రదాయ ప్లాన్లు కొన్ని చివర్లో అడిషనల్ బోనస్ చెల్లింపునకు హామీ ఇస్తాయి. పార్టిసిపేటింగ్ బీమా ప్లాన్ తీసుకుంటున్నట్టు అయితే, కాల వ్యవధి ముగిసే వరకు జీవించి ఉన్న సందర్భంలో సమ్ అష్యూరెన్స్‌కు అదనంగా ఏదో ఒక రూపంలో చెల్లింపు ఉంటుంది. అదే నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ తీసుకుంటుంటే జీవించి ఉంటే చివర్లో ఏమీ రాదు. టర్మ్ ఇన్సూరెన్స్‌ను నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్‌గా పేర్కొంటారు. ఇప్పుడు ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్ ప్లాన్లు కూడా వస్తున్నాయి. కనుక ఇక్కడ పొరపాటు పడొద్దు. ప్రీమియం వెనక్కి రాని టర్మ్ ప్లాన్ ప్రీమి యంతో పోలిస్తే, చివర్లో ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్ ప్లాన్ ప్రీమియం చాలా అధికంగా ఉంటుంది. -
టర్మ్ ఇన్సూరెన్స్.. తక్కువ ప్రీమీయం ఎక్కువ లాభం
-
రూ.కోటి కవరేజీ చాలా..?
కోటి రూపాయలకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న ఓ బ్రహ్మచారి ఆ తర్వాత కాలంలో వివాహం చేసుకున్నాడనుకోండి. ఆ మొత్తం అతడి కుటుంబ అవసరాలు, జీవిత లక్ష్యాల కోసం సరిపోకపోవచ్చు. చాలామంది తమకు ప్రాణ ప్రమాదం వాటిల్లితే రూ.కోటి మొత్తం సరిపోతుందని అనుకుంటుంటారు. రూ.కోటి ఈ రోజు పెద్ద మొత్తంగానే కనిపించొచ్చు. ‘‘చాలా మంది తమకు సౌకర్యవంతమైన మొత్తానికి కవరేజీ తీసుకుంటుంటారు. అలా చూస్తే రూ.కోటి ఎక్కువగా ప్రచారంలో ఉన్న నంబర్. కానీ సరిపోతుందా? తమ అవసరాలకు సంబంధించి ఏ విధమైన లెక్కలు వేసుకోకుండా రూ.కోటి మొత్తానికి పాలసీ తీసుకుంటారు’’ అని కవర్‌ఫాక్స్ డైరెక్టర్ మహావీర్ చోప్రా పేర్కొన్నారు. ఇలా తోచిన మొత్తం కాకుండా అసలు ఎంత మేరకు బీమా తీసుకోవాలన్నది నిపుణుల సూచన... రూ.కోటిని తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేస్తే... 7 శాతం వడ్డీ రేటుపై ప్రతీ నెలా రూ.58,333 ఆదాయం లభిస్తుంది. సాధారణ మధ్యతరగతి కుటుంబం నేటి జీవన అవసరాలకు ఇది సరిపోతుంది. కానీ, అప్పటికే ఏవైనా రుణాలు తీసుకుని ఉంటే వాటిని తీర్చాల్సిన బాధ్యత ఉంటుంది. వీటిని పరిగణనలోకి తీసుకుని, ద్రవ్యోల్బణ ప్రభావం, ఆదాయపన్ను ప్రభావాలను కూడా చూస్తే రూ.కోటి పెద్ద మొత్తం కాదన్నది నిపుణుల అభిప్రాయం. పిల్లల విద్య, వివాహం, జీవిత భాగస్వామి పదవీ విరమణ అనంతర జీవిత అవసరాలకు ఏక మొత్తంలో నిధిని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి ఇంటి రుణం తీసుకుని, ఇద్దరు పిల్లలు కూడా కలిగి ఉంటే, అకాల మరణంతో వచ్చే రూ.కోటి పరిహారం అతని కుటుంబ అవసరాలను 12–13 ఏళ్లకు మించి తీర్చలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలా మంది ఇప్పటికీ సరిపడా బీమా కవరేజీ లేనివారే. 2014లో స్విస్ ఆర్ఈ నిర్వహించిన సర్వే ప్రకారం మన దేశంలో 92 శాతం మందికి జీవిత బీమా రక్షణ కొరత ఉంది. రూ.కోటి బీమా అవసరమైన చోట సగటున రూ.8 లక్షల బీమా కవరేజీయే ఉంది. బీమా రక్షణపై తగినంత అవగాహన లేకపోవడం, పెట్టుబడి ఆధారిత బీమా పథకాలకు పరిమితం కావడం ఇందుకు కారణంగా తెలిసింది. అన్నీ చూడాలి... వార్షిక ఆదాయానికి తక్కువలో తక్కువ కనీసం 10 రెట్ల మొత్తం అయినా బీమా ఉండాలన్నది సాధారణ సూత్రం. కానీ, ఇది అందరికీ సరిపోయే పరిపూర్ణ సూత్రం కాదు. ఇది ఓ వ్యక్తి రుణ బాధ్యతలను, పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుని చెప్పే సంఖ్య కాదు. వాస్తవంగా చూస్తే ప్రతీ వ్యక్తి ఆర్థిక పరిస్థితి, అవసరాలు భిన్నంగా ఉంటాయి. అందరికీ ఒకటే మూల సూత్రం పనికిరాదు. అందరూ ఇదే సూత్రాన్ని పాటిస్తే వారి ఆశించిన లక్ష్యం నెరవేరకపోవచ్చు. తనకు ప్రాణ ప్రమాదం వాటిల్లితే తనపై ఆధారపడి ఉన్న వారికి ప్రతీ నెలా ఎంత మొత్తం కావాలి? అలా ఎన్నేళ్ల పాటు అవసరం అన్న స్పష్టత ఉండాలి. ‘‘రూ.50 లక్షల గృహ రుణం తీసుకుని ఉంటే, దాన్ని రూ.కోటి బీమా పరిహారం మొత్తం నుంచి మినహాయించి చూడాలి. మిగిలిన రూ.50 లక్షలను ఎంత తెలివిగా ఇన్వెస్ట్ చేసినా గానీ దీర్ఘకాలం పాటు ఆ వ్యక్తి కుటుంబ అవసరాలకు సరిపోదు’’ అని ఆప్టిమా మనీ మేనేజర్స్ సీఈవో పంకజ్ మంత్పాల్ తెలిపారు. గృహ రుణం ఇచ్చిన బ్యాంకులు అది తీసుకున్న వ్యక్తి మరణించిన సందర్భాల్లో, అతని కుటుంబ సభ్యులు తిరిగి బకాయిలు చెల్లించేందుకు అదనపు కాలాన్ని ఇచ్చేందుకూ అంగీకరించే పరిస్థితి లేదు. కనుక బీమా మొత్తాన్ని నిర్ణయించే ముందు ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. జీవిత భాగస్వామికి చివరి వరకూ... జీవిత భాగస్వామి జీవించి ఉండేంత వరకు అవసరాలను తీర్చే విధంగానూ బీమా మొత్తం ఉండాలి. ముఖ్యంగా అతను లేదా ఆమె ఎటువంటి ఆర్జనా పరులు కాకపోయి ఉంటే, వృద్ధాప్యంలో వారు ఎటువంటి ఇబ్బంది పడకుండా, హాయిగా జీవించేలా, ఆ అవసరాలను బీమా పరిహారం తీర్చే విధంగా ఉండాలి. వైద్య చికిత్సలు, జీవిత అవసరాలకు అయ్యే ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలని కెనరా హెచ్ఎస్బీసీ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ హెడ్ రిషి మాథుర్ సూచించారు. ప్రతీ వ్యక్తి, అతని కుటుంబ అవసరాలు భిన్నంగా ఉంటాయన్నారు. జీవిత విలువ మదింపు బీమా కవరేజీ నిర్ణయించుకునే ముందు వ్యక్తి ‘జీవిత విలువ’ను కూడా అంచనా వేసుకోవాలంటారు నిపుణులు. అంటే ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తి తన మిగిలిన జీవితంలో ఎంత మేర సంపాదించుకోగలరన్నది. ఈ మొత్తం నుంచి సగటు ద్రవ్యోల్బణ అంచనాను తీసివేయాలి. అంటే, నేటి అవసరాలను భవిష్యత్తులోనూ కొనుగోలు చేసే సామర్థ్యం ఉండేలా చూడాలి. ఈ జీవిత విలువ నుంచి బీమా తీసుకునే వ్యక్తి వ్యక్తిగత ఖర్చులను తీసేయాలి. దీంతో తన కుటుంబానికి ఎంత మేర అవసరం అవుతుందన్నది లెక్క వస్తుంది. ద్రవ్యోల్బణం అంచనా భవిష్యత్తు ఖర్చులను అంచనా వేసే సమయంలో కచ్చితంగా ద్రవ్యోల్బణాన్ని మర్చిపోకూడదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగానే కుటుంబ అవసరాలు కూడా పెరుగుతుంటాయి. 2018లో నెలకు రూ.50,000 అవసరం ఉంటే, 7 శాతం ద్రవ్యోల్బణం అంచనా మేరకు చూస్తే... ఐదేళ్ల తర్వాత అదే కుటుంబం అవసరాలకు రూ.70,000 కావాల్సి ఉంటుంది. ఇక పదేళ్ల తర్వాత 2028లో ఇదే ద్రవ్యోల్బణం అంచనా ప్రకారం చూస్తే ప్రతీ నెలా అవసరాల కోసం రూ.లక్ష అవసరం అవుతుంది. బీమా రక్షణ అన్నది ఈ మేరకు అవసరాలను తీర్చేదై ఉండాలి. అందుకే నిపుణులు బీమా పాలసీ తీసుకోవడంతోపాటు ప్రతీ ఐదేళ్లకొకసారి అది ఏ మేరకు సరిపోతుందన్నది సమీక్షించుకోవాలని సూచిస్తుంటారు. ముఖ్యంగా వివాహమై పిల్లలు కలిగితే వ్యయాలు పెరిగిపోతాయి. కొన్ని పాలసీల్లో ప్రతీ ఐదేళ్ల కొకసారి బీమా కవరేజీ మొత్తం పెరిగే ఆప్షన్ కూడా ఉంది. దీన్నే లైఫ్ స్టేజ్ ఎన్హాన్స్మెంట్ అంటారు. ఇటువంటి పాలసీ తీసుకుంటే బీమా కవరేజీని ప్రత్యేకంగా పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడదు. ఇలా పాలసీలోనే ఇన్‌బిల్ట్ ఫీచర్ ఉంటే ఎంతో సౌకర్యం. ఎందుకంటే మధ్యలో స్వయంగా పెంచుకోవాలంటే వైద్య పరీక్షలు అవసరం అవుతాయి. అలా అని అందరికీ పెద్ద మొత్తంలో టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం పడకపోవచ్చు. ‘‘తమపై ఆధారపడిన వారి ఆర్థిక అవసరాలకు రక్షణనిచ్చేదిగా ఉంటే చాలు. ఒకవేళ తమపై ఆధారపడిన వారు ఎవరూ లేకపోతే, టర్మ్ ప్లాన్‌కు దూరంగాను ఉండొచ్చు’’ అని ఫైనాన్షియల్ ప్లానర్ ప్రేరణ సలాస్కర్ సూచించారు. -
టర్మ్ పాలసీ ఉండి తీరాల్సిందే!
♦ తక్కువ ప్రీమియంతో అధిక కవరేజీ ♦ఆర్థిక ప్రణాళికలో బీమా కూడా కీలకం ఒకవేళ తమకేదైనా జరగరానిది జరిగినా ఆయా ఆర్థిక లక్ష్యాల సాధనకు ఎలాంటి అవరోధాలు ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఇందుకు దోహదపడేదే టర్మ్ ఇన్సూరెన్స్. అయితే ఈ పాలసీలపైనా సందేహాలు చాలానే ఉన్నాయి. వాటిని నివృత్తి చేసే ప్రయత్నమే ఇది. పొదుపు ద్వారా అవసరమైన నిధిని సమకూర్చుకోవాలన్నది నా ప్రణాళిక. బీమా ఉండాలా? పొదుపు లేదా భద్రత.. ఈ రెండింటిలో ఏదో ఒకటే ముఖ్యమైనదనే మాట ఉండదు. రెండూ అవసరమే. ఆర్థికంగా తగినంత కవరేజీ ఇచ్చే పాలసీని ఎంచుకోవడం ప్రతి ఒక్కరి ఆర్థిక ప్రణాళికలో భాగం కావాలి. దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగితే ఆదుకునేది ఇదే. నిధిని కూడబెట్టడం దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యం. అనుకోనిది ఏదైనా జరిగినా ఆ లక్ష్యానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా తోడ్పాటునిచ్చేది బీమా. పాలసీ వ్యవధి ముగిశాక రాబడులెలా ఉంటాయి? టర్మ్ ఇన్సూరెన్స్ అనేది పూర్తిగా ఆర్థికపరమైన భద్రత కల్పించేదే. దురదృష్టవశాత్తూ పాలసీదారుకేదైనా జరగరానిది జరిగితే.. వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా కాస్త పెద్ద మొత్తం అందేలా చూసేందుకు ఇది ఉపయోగపడుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ఖరీదెంత? దాదాపు రూ. 1 కోటి లైఫ్ కవరేజి ఇచ్చే టర్మ్ పాలసీ రూ. 8,000– 10,000 ప్రీమియం ఉంటుంది. అంటే రోజుకి అత్యంత తక్కువగా సుమారు రూ. 22 మాత్రమే కట్టినట్లవుతుంది. ఇక ప్యూర్ టర్మ్ పాలసీలు కాకుండా మిగతా పాలసీల విషయానికొస్తే.. ఇవి కొంత పొదుపు చేసేందుకు, కొంత పెద్ద మొత్తం కూడబెట్టేందుకు ఉపయోగపడతాయి. ఒకవైపు రూ. 1 కోటి మేర లైఫ్ కవరేజీ ఇస్తూ.. మరోవైపు పొదుపు ప్రయోజనాలు కూడా కల్పించే పాలసీకి ప్రీమియం సుమారు రూ. 10,00,000 మేర ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది కదా టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత చౌకైనదో. ఎంత కవరేజీ తీసుకోవాల్సి ఉంటుంది? బీమా కవరేజీ లెక్కించేటప్పుడు మీ ప్రస్తుత ఆదాయం, వ్యయాలు, రిటైర్మెంట్కి ఇంకా ఎన్నేళ్ల వ్యవధి ఉంది, రుణాలెంత ఉన్నాయి.. (ఉదా.. గృహ రుణం, పిల్లల విద్యా రుణం మొదలైనవి) తదితర అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు.. ప్రస్తుత ఆదాయం రూ. 65,000 మేర ఉందనుకుందాం. పాలసీదారుకు ఏదైనా జరిగినా తదనంతరం కుటుంబం ఆర్థికంగా ఇబ్బందిపడకుండా ఇంతే మొత్తం అందుకోవాలంటే రూ. 1 కోటికి ఇన్సూరెన్స్ తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. మధ్యలో కవరేజీ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందా? సాధారణంగా ఆదాయాలు, వ్యయాలు, బాధ్యతలు పెరిగే కొద్దీ కవరేజీ అవసరాలను మధ్యమధ్యలో సమీక్షించుకోవడం మంచిది. దీనివల్ల కుటుంబానికి తగిన భద్రత ఏర్పడుతుంది. వయస్సు పెరిగే కొద్దీ పాలసీ ప్రీమియం కూడా పెరుగుతుందా? టర్మ్ పాలసీని ఒక్కసారి కొనుగోలు చేశాక.. ప్రీమియంలు మారడమనేది ఉండదు. ఒకవేళ ఆ తర్వాతెప్పుడైనా కొత్తగా మరో పాలసీ తీసుకోవాలనుకున్న పక్షంలో అప్పటికి మీ వయస్సు, ఆరోగ్యం తదితర అంశాలపై ప్రీమియం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ముప్ఫై ఏళ్ల వయస్సున్న వ్యక్తి రూ. 1 కోటి లైఫ్ కవరేజీ తీసుకోవాలంటే సుమారు రూ. 8,000– రూ. 10,000 ప్రీమియం ఉంటుంది. అదే 40 ఏళ్ల వయస్సున్న వ్యక్తి అంతే కవరేజీకి పాలసీ తీసుకోవాలంటే ప్రీమియం ఏకంగా రూ. 18,000 – రూ. 20,000 దాకా ఉంటుంది. కాబట్టి టర్మ్ పాలసీని ఎంత ముందుగా తీసుకుంటే అంత మంచిది. క్లెయిమ్స్ తిరస్కరణకు గురికాకుండా ఏమి చేయాలి..? సాధారణంగా సిసలైన క్లెయిమ్స్ రిజెక్ట్ కాకుండా చూసేలా పటిష్టమైన నిబంధనలున్నాయి. అయితే, పాలసీ తీసుకునేటప్పుడు మన వంతుగా వాస్తవమైన వివరాలివ్వాలి. కీలకమైన వివరాలు తెలియజేయకపోయినా, తప్పుడు సమాచారం ఇచ్చినా.. క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ సరైన కాంటాక్ట్ వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండేలా చూసుకుంటే.. క్లెయిమ్ సెటిల్మెంట్ సులభతరమవుతుంది. ఇక, జీవిత బీమా పాలసీ గురించిన వివరాలు మీ కుటుంబానికి.. లబ్ధిదారులకు తెలియజేసి ఉంచాలి. -
టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్కడ తీసుకుంటే బెటర్..?
నా ప్రజా భవిష్యనిధి ఖాతా(పీపీఎఫ్-పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్)ను రెండు సార్లు పొడిగించాను. ఇప్పుడు ఈ పీపీఎఫ్ ఖాతా నుంచి సొమ్ములు విత్‌డ్రా చేసుకుంటే నేను ఏమైనా పన్నులు చెల్లించాలా ? - సీతారామ్, వైజాగ్ పొడిగించిన తర్వాత కూడా పీపీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకుంటే ఎలాంటి పన్నులు చెల్లించక్కర లేదు. పన్నుల పరంగా చూస్తే పీపీఎఫ్ ఖాతాను ‘మూడు మినహాయింపులు’(ఎగ్జెంప్ట్-ఎగ్జెంప్ట్-ఎగ్జెంప్ట్-ఈఈఈ)గా పరిగణిస్తారు. అంటే పీపీఎఫ్ ఖాతాకు మూడు దశల్లో మినహాయింపు లభిస్తుందని అర్థం. పెట్టుబడులు పెట్టేటప్పుడు. వడ్డీ విలువలపై, పెట్టుబడులను ఉపసంహరించుకునేటప్పుడు.. ఇలా ఈ మూడు దశల్లో పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్ ఖాతాలో పెట్టుబడులకు రూ. లక్షన్నర వరకూ పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఈ పెట్టుబడుల వడ్డీపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పనిలేదు. ఇక పీపీఎఫ్ సొమ్ములను ఉపసంహరించుకున్నప్పుడు కూడా ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఈ ఖాతాను పొడిగించినా కూడా విత్‌డ్రాయల్ అప్పుడు ఎలాంటి పన్ను పోటు ఉండదు. డెట్ ఫండ్ అంటే ఏమిటి ? - ప్రసన్న, విజయవాడ బాండ్లు, ట్రెజరీ బిల్లులు వంటి ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్‌ను డెట్ ఫండ్స్‌గా వ్యవహరిస్తారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చితే డెట్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు రిస్క్ తక్కువ. రాబడులు కూడా తక్కువగానే ఉంటాయి. పెట్టుబడి వ్యూహాలు, ఇన్వెస్ట్ చేసే బాండ్ల రకాలను బట్టి డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో రకాలు ఉన్నాయి. మీడియమ్, లాంగ్ టర్మ్ ఫండ్స్, షార్ట్ టర్మ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్, గిల్ట్ ఫండ్స్, ఫిక్స్డ్ మెచ్యురిటీ ఫ్లాన్లు.. ఇలా రకరకాల డెట్ ఫండ్లు ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నుంచి 3, 4 ఏళ్ల క్రితం కొన్ని బీమా పాలసీలు తీసుకున్నాను. అవి సంతృప్తికరమైన రాబడులివ్వడం లేదు. వీటిలో కొనసాగమంటారా? వైదొలగమంటారా? - కమలాకర్, గుంటూరు పెట్టుబడులు లక్ష్యంగా జీవిత బీమా పాలసీలు ఎప్పుడూ తీసుకోకూడదు. బీమాకు, మదుపునకు వేర్వేరుగా పెట్టుబడులు పెట్టాలి. రెండింటిని కలగలపకూడదు. మీకేదైనా జరిగితే ఆర్థిక భరోసా కల్పించడమే బీమా పాలసీల లక్ష్యంగా ఉండాలి. జీవిత బీమాపాలసీల విషయానికొస్తే, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడమే సరైనది. రాబడులనిచ్చే యులిప్‌లు, మనీ-బ్యాక్, ఎండోమెంట్ వంటి బీమాపాలసీలు ఇన్వెస్ట్మెంట్ పరంగా, బీమాపరంగా మంచి ప్రయోజనాలనిస్తాయని ఏజెంట్లు ఊరిస్తారు. కానీ అవి మీకు తగిన జీవిత బీమాను, అలాగే తగినంత రాబడులను ఇవ్వలేవు. పైగా అధిక ప్రీమియమ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. అందుకని ఇలాంటి హైబ్రిడ్ ఇన్సూరెన్స్-కమ్-ఇన్వెస్ట్మెంట్ పాలసీల నుంచి వైదొలగడం మంచిది. తగినంత బీమా ఉన్న టర్మ్ ప్లాన్‌ను తీసుకోండి. మీ మదుపు అవసరాల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎలా తీసుకోవాలి? పాలసీబజార్, కోవర్ఫాక్స్ వంటి అగ్రిగేటర్ల ద్వారా తీసుకోవాలా లేక కంపెనీ వెబ్సైట్ నుంచి నేరుగా తీసుకోవాలా? - నందిని, హైదరాబాద్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడానికి పలు మార్గాలు ఉన్నాయి. బీమా సంస్థ వెబ్సైట్ నుంచే నేరుగా పాలసీ తీసుకోవచ్చు. లేదా ఆ బీమా సంస్థ ఏజెంట్ ద్వారా కూడా పాలసీ తీసుకోవచ్చు. లేదంటే పాలసీబజార్డాట్కామ్, కోవర్ ఫాక్స్ వంటి అగ్రిగేటర్ల ద్వారా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా ఈ పాలసీలు తీసుకోవడం ఇప్పుడు అత్యంత సులభం, పైగా రెండు కీలకమైన ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మొదటిది వివిధ కంపెనీలు ఆఫర్ చేసే వివిధ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను పోల్చి చూసే వెసులుబాటు ఉంటుంది. ఇలా పోల్చి చూసి, ఏది మంచి ప్లాన్ అది ఎంచుకోవచ్చు. ఆన్లైన్ పాలసీలు చౌకగా లభిస్తాయి. ఈ ఆన్లైన్ పాలసీలు పూర్తిగా పారదర్శకంగా ఉంటాయి. అగ్రిగేటర్ వెబ్సైట్లో పాలసీలను పోల్చిచూసుకుని, మీ అవసరాలకు సరిపడే పాలసీని ఎంచుకోండి. తర్వాత ఆ బీమా కంపెనీ వెబ్సైట్లోకి వెళ్లి ఆ పాలసీని తీసుకోండి. చెల్లించాల్సిన ప్రీమియమ్, క్లెయిమ్స్ రేషియో వంటి అంశాల ఆధారంగా పాలసీని ఎంచుకోవాలి. పాలసీ తీసుకునేముందు పాలసీ ఫీచర్లను, షరతులను,తప్పనిసరిగా చదవాలి. పన్ను ఆదా కోసం యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టాను. గత కొన్నేళ్లుగా ఈ ఫండ్ మంచి రాబడులను ఇచ్చింది. పన్ను ఆదా కోసం కాకుండా మంచి రాబడుల కోసం 3-5 ఏళ్ల కాలానికి ఈ ఫండ్‌లో మరింతగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను. నా నిర్ణయం సరైనదేనా? - క్రాంతి, కరీంనగర్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)లు పన్ను ప్రయోజనాలనే కాకుండా దీర్ఘకాలంలో మంచి రాబడులను కూడా ఇస్తాయి. డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ మాదిరిగా వీటి పనితీరు ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్లకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఫలితంగా వీటిల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయగలిగే క్రమశిక్షణ ఇన్వెస్టర్లకు అలవడుతుంది. ఈ ఫండ్‌లోనే మరింతగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ కోసం మరో ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌ను పరిశీలించండి. మీ పోర్ట్‌ఫోలియోలో ఒకటికి మించి ఫండ్స్ ఉండడం ఎప్పుడూ మంచిదే. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
గృహ రుణానికి బీమా ధీమా
అనుకోని ఉపద్రవం ముంచుకొస్తే... కొండంత భరోసా! గతంతో పోలిస్తే ప్రస్తుతం గృహ రుణాల లభ్యత మెరుగయింది. దీంతో ఇళ్ల కొనుగోళ్లూ పెరుగుతున్నాయి. పన్ను ప్రయోజనాలు కూడా ఉండటంతో రుణం తీసుకుని ఇల్లు కొనుక్కోవడం సాధారణమైపోయింది. అయితే సజావుగా సాగినంత కాలం అంతా బాగానే ఉంటుంది. కానీ ఊహించని ఉపద్రవం వచ్చి పడితే? చెల్లించాల్సిన ఇంటి రుణం భారంగా మారితే? ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబం కుంగిపోకుండా కాస్త భరోసా కల్పించే బీమా పథకాలు కొన్ని ఉన్నాయి. వాటి తీరుతెన్నులు వివరించేదే ఈ కథనం. - అనిల్ రెగో ఫైనాన్షియల్ ప్లానర్ సీఈఓ, రైట్ హొరైజన్స్ మూడు రకాల పాలసీలు.. అనుకోని ఉపద్రవం ముంచుకొస్తే మిగతా మొత్తాన్ని కట్టే భారం కుటుంబం మీద పడకుండా బీమాపరమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మూడు రకాల పాలసీలను ఇందుకోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. వ్యక్తిగత ప్రమాద బీమా, టర్మ్ ఇన్సూరెన్స్, హోమ్ లోన్ ఇన్సూరెన్సు. దురదృష్టవశాత్తూ రుణగ్రహీత కన్నుమూసిన పక్షంలో గృహ రుణ బాకీ మొత్తం చెల్లింపు ఆటోమేటిక్‌గా జరిగేలా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు కొన్ని పాలసీలు అందిస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగం కోల్పోయిన పక్షంలో 3 నెలల పాటు ఈఎంఐల భారాన్ని కవర్ చేసే విధంగా మరికొన్ని ప్యాకేజీలున్నాయి. గృహ రుణ బీమా పాలసీలో ప్రీమియాన్ని ముందస్తుగా సింగిల్ పేమెంటులో చెల్లించేయాల్సి ఉంటుంది. రుణాలిచ్చే సంస్థలు చాలా మటుకు ఈ ప్రీమియాన్ని కూడా రుణ మొత్తంలోనే కలిపేసి, తదనుగుణంగా ఈఎంఐలను లెక్కిస్తాయి. ఇలాంటప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియంపై పడే వడ్డీ భారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్‌లు... మొత్తం గృహ రుణానికి కవరేజీ పొందడంతో పాటు కట్టిన ప్రీమియం నుంచి గరిష్ట ప్రయోజనం దక్కించుకునేందుకు టర్మ్ ఇన్సూరెన్స్ మెరుగైనదిగా చెప్పొచ్చు. హోమ్ లోన్ ఇన్సూరెన్స్‌కి భిన్నంగా ఈ తరహా పాలసీల్లో కవరేజీ స్థిరంగా ఉంటుంది. గృహ రుణ బీమా పాలసీ విషయంలో ఈఎంఐలు కట్టే కొద్దీ బాకీ మొత్తం తగ్గుతూ ఉంటుంది కనుక.. దానికి తగ్గట్లే కవరేజీ కూడా తగ్గుతూ వస్తుంది. అయితే టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో ఇలాంటి సమస్య ఉండదు. పెపైచ్చు వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ తర్వాత ఇది అత్యంత చౌకైన జీవిత బీమా పాలసీ. దీనికి పర్సనల్ యాక్సిడెంట్ పాలసీల్లాగా గరిష్ట కవరేజీ రూ. 25 లక్షలే ఉండాలన్న నిబంధనా లేదు. స్థూలంగా చెప్పాలంటే వ్యక్తిగత ప్రమాద బీమా, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు .. శరీరానికి, జీవితానికి బీమా రక్షణ కల్పించే సరళమైన పథకాలు. తీవ్ర గాయాల పాలైనా, మరణం సంభవించినా మొదటిది బీమా రక్షణ కల్పిస్తుంది. రుణ భారం ఉన్నా, లేకున్నా ఎవరైనా తీసుకోతగిన పాలసీ ఇది. ఇక టర్మ్ ఇన్సూరెన్స్ విషయానికొస్తే.. గృహ రుణంతో పాటు కుటుంబానికి కూడా కవరేజీ అందించగలిగేది ఇది. వ్యక్తిగత ప్రమాద బీమా అనుకోని విధంగా ఏవైనా ప్రమాదాల్లో తీవ్ర గాయాలపాలైతే ఈఎంఐలు సమస్యగా మారకుండా చూసుకునేలా ముందు జాగ్రత్తగా వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ తీసుకోవచ్చు. అంగవైకల్యం, పక్షవాతం మొదలైన వాటికి కూడా దీని ద్వారా కవరేజీ లభిస్తుంది. అయితే, ఈ పాలసీల గరిష్ట కవరేజీ రూ. 25 లక్షలు మాత్రమే ఉంది. కానీ ఒకవేళ ప్రమాదం కారణంగా మరణం సంభవించిన పక్షంలో సందర్భాన్ని బట్టి సమ్ అష్యూర్డ్ కన్నా కూడా కొంత అధిక మొత్తమే లభించే పాలసీలూ ఇందులో ఉన్నాయి. గరిష్ట కవరేజీకి పరిమితులున్నప్పటికీ... తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు అందించగలిగే పాలసీలు ఇవి. ఏ రుణాలు ఉన్నా లేకున్నా.. వ్యక్తిగత ప్రమాద బీమా అన్ని విధాలుగా ఉపయోగకరమైనదే. -
కట్టేది తక్కువ... పొందేది ఎక్కువ
టర్మ్ ఇన్సూరెన్స్ ఉమన్ ఫైనాన్స్ ఈ రోజుల్లో ఆలుమగలు ఇద్దరూ సంపాదిస్తే గానీ కుటుంబం సజావుగా సాగదు. కనుక చాలామంది మహిళలు తప్పనిసరిగా ఉద్యోగమో, వ్యాపారమో ఏదో ఒకటి చేస్తూ తమ కుటుంబ ఖర్చులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఆదాయంలో తమ మిగులుకు తగ్గట్లుగా పొదుపు చేసి వాటిని సరైన మార్గాలలో పెట్టుబడి పెడుతున్నారు. మరి ఏ కారణం చేతనైనా ఆలూమగలలో ఒకరి ఆ సంపాదన ఆగిపోతే? ఈ ప్రశ్నకు సరైన సమాధానం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక నిర్ణీత కాలానికి లభ్యమయ్యేది. ఆ నిర్ణీత కాలంలో మరణం సంభవిస్తే, ఎంత మొత్తానికి ఇన్సూరెన్స్ తీసుకొంటామో అంత మొత్తం నామినీకి అందజేస్తారు. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే:కనీసం 18 సంవత్సరాల వయస్సు కలవారై ఉండాలి. చాలావరకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ టర్మ్ పాలసీలను గరిష్టంగా 60 సంవత్సరాల వయస్సు గలవారి వరకు అందజేస్తున్నారు. చాలా తక్కువ (1/2) కంపెనీలు మాత్రమే 70 ఏళ్ల వారికి కూడా అందజేస్తున్నారు. ఈ పాలసీని కనీసం 5 నుండి 40 ఏళ్ల కాలపరిమితి వరకు ఇస్తున్నారు.ఎంత మొత్తం భీమాకి అనుమతిస్తారో పాలసీదారుకి వయస్సు, సంపాదన, తదితర విషయాల మీద ఆధారపడి ఇన్సూరెన్స్ కంపెనీలు నిర్థారిస్తాయి. {పీమియం ఎంతైతే చెల్లిస్తారో ఆ మొత్తం ఇన్‌కమ్‌ట్యాక్స్ యాక్ట్ 1961, సెక్షన్ 80సి కింద పన్ను రాయితీ లభిస్తుంది. ఈ టర్మ్ పాలసీ ప్రీమియం సాంప్రదాయక పథకాలైన ఎండోమెంట్, హోల్ లైఫ్ మొదలైన వాటితో పోల్చినప్పుడు చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం పాలసీదారు చనిపోతేనే నామినీకి ఈ కవరేజీ అందుతుంది. పాలసీ గడువు ముగిసిన తరువాత కూడా పాలసీదారు జీవించి ఉన్నట్లయితే, ఎటువంటి కవరేజీ రాదు. ఎందుకంటే టర్మ్ పాలసీ అనేది పూర్తిగా రిస్క్‌ని అధిగమించడానికి ఉపయోగపడేదిగా ఉంటుంది. పాలసీ తీసుకొనేటప్పుడు గమనించదగ్గ విషయాలు: పాలసీ ప్రపోజల్ ఫామ్‌లో అన్ని విషయాలు (మీ ఫ్యామిలీ హిస్టరీ, సంపాదన, ఆరోగ్య సమస్యలు మొదలైనవి) పొందుపరచండి. ఒకవేళ మీరు దాచిన విషయం ఏదైనా పాలసీ ఇచ్చే విషయంలో ప్రభావం చూపేదైతే, క్లైమ్ సెటిల్మెంట్ చేయరు. నామినీని తప్పనిసరిగా నమోదు చేయండి.పాలసీ నియమ నిబంధనలని తప్పనిసరిగా చదివి ఏ పాలసీ కావాలో నిర్ణయించుకోండి. మీ వయస్సు, సంపాదించడానికి మీకున్న కాలం, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక బరువు బాధ్యతలు, భవిష్యత్తులో మీరు సంపాదించే మొత్తం, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు... ఇలా పలు విషయాలను పరిగణనలోకి తీసుకొని మీ జీవితానికి ఉండే విలువను లెక్కలోకి తీసుకోవాలి. దానికి అనుగుణంగా జీవిత భీమాని ఈ టర్మ్ పాలసీ ద్వారా తీసుకోవచ్చు లేదా మీ వార్షిక ఆదాయానికి 10 నుండి 12 రెట్ల కవరేజీని తీసుకోవచ్చు. మనిషి చనిపోతేనే కవరేజీ వస్తుంది, బతికి ఉన్నట్లయితే మనం కట్టిన ప్రీమియం మొత్తం పోతుంది కదా అనే ఒక అపోహతో ఈ పాలసీని కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. సంపాదించే వ్యక్తి అనుకోని సంఘటన వల్లో, జబ్బునపడో, మరే ఇతర కారణం చేతనైనా మరణిస్తే అతను/ ఆమె లేని లోటు ఎవరూ పూడ్చలేరు. ఆ కుటుంబం, వారికుండే ఆర్థిక అవసరాలు, లక్ష్యాలు ముందుకు వెళ్లాలి కాబట్టి అందుకు ఆర్థిక చేయూత ఎంతైనా అవసరం. ఆ చేయూతను సరైన భీమా పాలసీ మాత్రమే తీరుస్తుందని గుర్తించాలి. -
సంపాదన ఉంటేనే టర్మ్ ఇన్సూరెన్స్
నేను రూ.10-15 లక్షల వరకూ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేశాను. అయితే ఇవన్నీ కాగిత రూపంలోనే ఉన్నాయి. వీటిని డీమ్యాట్ రూపంలోకి మార్చుకోవాలా? అలాచేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ప్రస్తుతం నా దగ్గర రూ.5 లక్షల వరకూ డబ్బులున్నాయి. దీనిని ఏదైనా డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి, ఆ తర్వాత వాటిని ఏదైనా ఈక్విటీ ఫండ్‌లోకి బదిలీ చేయాలనుకుంటున్నాను. సరైన డెట్ ఫండ్‌ను సూచించండి. -ఉమశ్, వరంగల్ ప్రత్యేకమైన ప్రయోజనాలు లేకపోయినప్పటికీ కాగిత రూపంలోని మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను డీమ్యాట్ అకౌంట్లోకి మార్చుకుంటే మంచిదే. ఇక మీ రెండో ప్రశ్నకు వస్తే..., మీరు వివిధ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి వాటి వివరాలు తెలియకుండా ఏదో ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమని సలహా ఇవ్వలేను. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న మొత్తాన్ని ముందుగా ఏదైనా షార్ట్-టర్మ్ బాండ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఆ తర్వాత సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా ఏదైనా ఈక్విటీ ఫండ్‌లోకి బదిలీ చేయండి. కాకుంటే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న షార్ట్-టర్మ్ బాండ్ ఫండ్, బదిలీ చేసే ఈక్విటీ ఫండ్- ఈ రెండు ఒకే మ్యూచువల్ ఫండ్ కంపెనీకి చెందినవైతే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. నేను ఒక ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)కు చెందిన డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌లో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశాను. ఈ స్కీమ్ నుంచి డివిడెండ్ పే అవుట్ స్కీమ్‌కు మారాలనుకుంటున్నాను. ఎలా మారాలో వివరించండి? -అమరేశ్వరి, గుంటూరు మీరు ప్రస్తుతం డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఫండ్ నుంచి డివిడెండ్ పేఅవుట్(చెల్లించే) ఆప్షన్‌కు మారాలనుకుంటున్నట్లు ఒక రిక్వెస్ట్ లెటర్‌ను గానీ, చేంజ్ ఆప్షన్ స్లిప్‌ను గానీ ఆ మ్యూచువల్ ఫండ్ సంస్థకు పంపించాలి. మీ స్కీమ్‌కు లాక్-ఇన్ పీరియడ్ ఉన్నా ఇలా మార్చుకోవచ్చు. అయితే గ్రోత్ ఆప్షన్ స్కీమ్లైతే లాకిన్ పీరియడ్ తర్వాతనే మార్చుకోవడానికి వీలవుతుంది. మీ పెట్టుబడులను 3 ఏళ్ల లాకిన్ పీరియడ్ పూర్తయిన తర్వాత రిడీమ్ చేసుకోవచ్చు. ఇటీవలనే మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌కు సంబంధించి డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్‌ను ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. నేను కొటక్ గోల్డ్ ఫండ్ యూనిట్లను విక్రయించాలనుకుంటున్నాను. నేనేమన్నా లాంగ్‌టెర్మ్, షార్ట్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాలా? ఎన్ని సంవత్సరాల పెట్టుబడి తర్వాత లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది? -సరళ, హైదరాబాద్ ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, దేశీయ ఈక్విటీల్లో 65 శాతం వరకూ ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్‌గా పరిగణిస్తారు, ఇలా కాని వాటిని నాన్-ఈక్విటీ ఫండ్స్‌గా పరిగణిస్తారు. కొటక్ వరల్డ్ గోల్డ్ ఫండ్‌ను విదేశీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి దీనిని నాన్-ఈక్విటీ ఫండ్‌గా పరిగణిస్తారు.ఈ ఫండ్ నుంచి మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మూడేళ్లలోపే ఉపసంహరించుకుంటే మీరు షార్ట్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీ ట్యాక్స్ శ్లాబులననుసరించి ఈ పన్ను విధిస్తారు. మూడేళ్ల త ర్వాత ఉపసంహరించుకుంటే దీర్ఘకాల క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇండెక్సేషన్‌తో కలుపుకొని ఇది 20 శాతంగా ఉంటుంది. నా కొడుకు వయస్సు 20 సంవత్సరాలు. అతడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అతడిపేరు మీద ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుందామనుకున్నాను, రెండు మూడు జీవిత బీమా వెబ్సైట్లలో ఆన్లైన్ ద్వారా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ప్రయత్నాలు చేశాను. కానీ ఈ వెబ్సైట్లన్నీ ఆదాయ ధ్రువీకరణ అడుగుతున్నాయి. నా కొడుకు ఇంకా చదువుతున్నాడు. కాబట్టి అతడికి ఆదాయ ధ్రువీకరణ లేదు. నా కొడుక్కి వేరే మార్గాల్లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా? -ఆంజనేయ శాస్త్రి, కర్నూలు సాధారణంగా కుటుంబంలో సంపాదించే వ్యక్తులే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఈ సంపాదించే వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణిస్తే, అతడి పై ఆధారపడ్డ వారికి ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను తట్టుకోవడానికి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. సంపాదన లేని వ్యక్తికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం సరైనది కాదు. -
జీవన్ సరళ్ సరెండర్ చేయాలా?
నా కొడుకు వయస్సు 24 సంవత్సరాలు. ఇటీవలనే ఉద్యోగంలో చేరాడు. అతనికి సంబంధించిన పీపీఎఫ్, టర్మ్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ సంబంధిత ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ నేను చూస్తున్నాను. తన పొదుపు సొమ్ములను మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. క్వాంటమ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ స్మాల్-క్యాప్ ఫండ్లను ఎంపిక చేశాను. మూడో ఫండ్‌గా ఐడీఎఫ్సీ ప్రీమియర్ ఈక్విటీని పరిశీలిస్తున్నాను. కానీ ఈ ఫండ్ రేటింగ్ ఇటీవల పడిపోయింది. మీరేమంటారు? - మహ్మద్ ఇజాజ్, హైదరాబాద్ ఐడీఎఫ్సీ ప్రీమియర్ ఈక్విటీ... మంచి రాబడులనిస్తున్న ఫండ్ అనే చెప్పవచ్చు. మీ అబ్బాయి కెరీర్ పొదుపులు, ఇన్వెస్ట్‌మెంట్స్‌తో ప్రారంభం కావడం సంతోషించదగ్గ విషయం. మీ అబ్బాయి కోసం మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ బావుంది. అయితే ఒక పెద్ద మార్పు సూచిస్తాను. మీ అబ్బాయి వయస్సు చిన్నది. పీపీఎఫ్ అకౌంట్లో 20-30 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయడం కంటే, ఒక మంచి ఫండ్‌ను ఎంచుకొని దాంట్లో క్రమం తప్పకుండా 15-20 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఇలా చేస్తే పీపీఎఫ్‌లో కన్నా అధిక రాబడులు పొందవచ్చు. మరొక మార్పు ఏమిటంటే, ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టే వాళ్లు, మొదటగా ట్యాక్స్-సేవింగ్స్ ఫండ్‌తో ప్రారంభించాలి. ఇది మీ అబ్బాయి అనుసరిస్తే తన ఆదాయంపై పన్ను ప్రయోజనాలు పొందే అవకాశం అతడికి లభిస్తుంది. అందుకని పీపీఎఫ్ అకౌంట్లో తక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తూ, కొద్ది మొత్తాన్ని కొన్ని ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. మూడేళ్ల క్రితం ఎల్ఐసీ జీవన్ సరళ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నాను. ఇప్పటివరకూ రూ.54,000 ప్రీమియమ్గా చెల్లించాను. ఈ ప్లాన్ ప్రస్తుత సరెండర్ వేల్యూ రూ.30,000గా ఉంది. ఇన్సూరెన్స్‌కు ఇది సరైనదేనా? దీనిని కొనసాగించమంటారా ? లేదా మరొక దాంట్లో ఇన్వెస్ట్ చేయమంటారా? కల్పన, తిరుపతి ఎల్ఐసీ జీవన్ సరళ్ అనేది ఎండోమెంట్ పాలసీ. అన్ని ఎండోమెంట్ పాలసీల్లాగే ఇది కూడా వ్యయాల విషయమై పారదర్శకంగా వ్యవహరించడం లేదు. ఇలాంటి ప్లాన్లతో ఉండే ప్రధానమైన సమస్యే ఇది. ఈ పాలసీ పదవ సంవత్సరం తర్వాత నుంచి లాయల్టీ ఆడిషన్స్ లభిస్తాయి. మీరు ఇప్పటివరకూ రూ.54,000 ప్రీమియంగా చెల్లించారు. ఈ ప్లాన్ సరెండర్ వేల్యూ రూ.30,000గా ఉంది. మీ నష్టాలను కనిష్టం చేసుకోవాలంటే మీరు ఈ ప్లాన్‌ను సరెండర్ చేయడమే ఉత్తమం. ఈ పాలసీ నుంచి వైదొలగి మంచి రాబడుల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. మీరు ఈ ప్లాన్ నుంచి వైదొలిగితే మీకు బీమా రక్షణ ఉండదు. అందుకని ఏదైనా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. మిగిలిన మొత్తాన్ని మంచి రేటింగ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. మీ ఆర్థిక లక్ష్యాలు, అవసరాలు, వనరులు ఆధారంగా, మీరు భరించగలిగే రిస్క్‌ను బట్టి తగిన మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకొని ఇన్వెస్ట్ చేయండి. నా వయస్సు 60 సంవత్సరాలు. త్వరలో నా నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) అకౌంట్ మెచ్యూర్ కాబోతోంది. 40% మొత్తాన్ని ఎల్ఐసీ నుంచి పెన్షన్ కోసం(జీవన్ ఆక్షయ్ సిక్స్త్) ఎంచుకున్నాను. 60% మొత్తం నా బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ అయ్యేలా ఎంపిక చేసుకున్నాను. ఈ 60% మొత్తంపై ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుందా? ఇండెక్సేషన్ ప్రయోజనాలు లభిస్తాయా?- మురళీ వైజాగ్ నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్) మెచ్యూర్ అయితే ఆ మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం ఎన్పీఎస్ మొత్తంలో 60 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. కనీసం 40 శాతం మొత్తాన్ని యాన్యూటీ కొనుగోలు కోసం వెచ్చించాల్సి ఉంటుంది. మీరు విత్‌డ్రా చేసుకునే 60 శాతం మొత్తంపై మీ ఆదాయపు పన్ను స్లాబుననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇండెక్సేషన్ ప్రయోజనాలు వర్తించవు. అంతేకాకుండా మాన్యుటీ ప్లాన్ ద్వారా నెలవారీ మీరు పొందే మొత్తాలపై కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. -
బీమాలో ‘టర్మ్’ ఉండాల్సిందే
ఆధునిక కాలంలో చిన్న కుటుంబాల సంఖ్య వేగంగా విస్తరిస్తోంది. అలాగే యువత ఆహారపు అలవాట్లు, లైఫ్స్టైల్లో మార్పులు కనపడుతున్నాయి. పెళ్లి చేసుకున్న వెంటనే సొంతంగా జీవితం ప్రారంభించడమే కాకుండా అత్యుత్తమమైన జీవన విధానాన్ని కోరుకుంటున్నారు. ఇంటి భద్రత, కుటుంబ సభ్యుల కోసం అనేక చర్యలు తీసుకునే వీరు వారి ఆర్థిక రక్షణ విషయానికి వచ్చే సరికి మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతీ ఒక్కరికి అనేక ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, రిటైర్మెంట్లతో పాటు మరికొంత మంది తల్లిదండ్రుల బాగోగులను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ లక్ష్య సాధన కోసం సంపాదన మొదలు పెట్టినప్పటి నుంచే పొదుపు ప్రణాళికలను మొదలు పెడతారు. కానీ ఇంటిలో సంపాదిస్తున్న వ్యక్తికి ఊహించడానికే వీలులేని సంఘటన జరిగితే.. ఈ ఆర్థిక లక్ష్యాలు, సేవింగ్స్ సంగతి ఏంటి? ఇవన్నీ ఆగిపోవాల్సిందేనా? ఈ ప్రశ్నలకు టర్మ్ ఇన్సూరెన్స్ చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది. కుటుంబ పెద్ద లేకపోయినా అతని లక్ష్యాలు ఆగిపోకుండా, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టర్మ్ ఇన్సూరెన్స్ భరోసాను అందిస్తుంది. జీవిత బీమాలో ప్రతీ ఒక్కరు కలిగి ఉండాల్సిన పాలసీల్లో టర్మ్ పాలసీ ఒకటి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించడమే కాకుండా, ఇతర పాలసీలతో పోల్చుకుంటే తీసుకునే విధానం కూడా సులభం. పాలసీ కాలపరిమితి మధ్యలో పాలసీదారునికి ఏదైనా జరిగితే ముందుగా నిర్దేశించిన బీమా మొత్తాన్ని నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కేవలం క్లెయిమ్‌లు తప్ప మెచ్యూర్టీలు ఉండకపోవడంతో ప్రీమియంలు తక్కువగా ఉంటాయి. వయస్సు పెరిగే కొద్ది ప్రీమియం పెరుగుతుంది కాబట్టి చిన్న వయస్సులోనే దీర్ఘకాలానికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ కాలం ప్రయోజనం పొందొచ్చు. 60 ఏళ్లు దాటిన వారికి ప్రీమియంలు అధికంగా ఉంటాయి కాబట్టి వారికి టర్మ్ ఇన్సూరెన్స్ సూచించలేము. జీవితంలో ఆర్థిక బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ టర్మ్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని కూడా పెంచుకుంటూ ఉండండి. ఎంతుండాలి? బీమా మొత్తం ఎంచుకునేటప్పుడు రెండు అంశాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఆర్థిక లక్ష్యాలకు కావల్సిన మొత్తంతో పాటు గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు ఏమైనా ఉంటే ఆ మొత్తానికి సరిపడా బీమాను తీసుకోవాలి. సాధారణంగా 20 నుంచి 40 ఏళ్ల లోపు వాళ్లు వార్షిక జీతానికి 20 నుంచి 30 రెట్లు అధిక మొత్తానికి కనీస బీమా రక్షణ కలిగి ఉండాలి. అదే 40-50 ఏళ్ల లోపు వారికి 10 నుంచి 20 రెట్లు, 50 ఏళ్లు దాటిన వారు 5 నుంచి 10 రెట్లు బీమా కలిగి ఉంటే సరిపోతుంది. -
ఆర్థిక ప్రణాళిక.. 30కి ముందే
ఏది చేసినా.. ముప్పయ్‌ల ముందే. ఎందుకంటే చాలామందికి అసలైన బరువు, బాధ్యతలు ముప్పయ్‌ల తర్వాతే మొదలవుతాయి. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, సొంత ఇల్లూ, కారు వగైరా కలల సాకారానికి కూడబెట్టుకోవడం ఇలా ఒకదాని తర్వాత మరొకటి వచ్చి పడిపోతుంటాయి. ఈ చట్రంలో చిక్కుకున్న తర్వాత కీలకమైన బీమా మొదలైన ఆర్థికపరమైన జాగ్రత్తలపై దృష్టి పోదు. ఒకవేళ వెళ్లినా.. ఇప్పుడెక్కడ కుదురుతుంది.. తర్వాత చూద్దాంలే అని వాయిదా వేసేస్తుంటారు. కాబట్టి, ముప్పయ్‌ల ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, క్రమశిక్షణ అలవర్చుకుంటే ఆ తర్వాత ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు పడనక్కర్లేదు. అలాంటి వాటిల్లో కొన్నింటి గురించి ఈ కథనం.. టర్మ్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా .. కుటుంబానికి ఆర్థికపరమైన భరోసా కల్పించేందుకు ఉపయోగపడే అచ్చమైన జీవిత బీమా పాలసీలు.. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు. తక్కువ ప్రీమియంలతో ఎక్కువ కవరేజీ ఇస్తుంటాయి. అయితే, వయస్సుతో పాటు తీసుకునే కవరేజీని బట్టి కట్టాల్సిన ప్రీమియంలూ పెరుగుతుంటాయి. కనుక, లేటు వయస్సులో కాకుండా కాస్త ముందుగానే టర్మ్ పాలసీ తీసుకుంటే తక్కువ ప్రీమియాలతో సరిపోతుంది. అదే ఆన్‌లైన్‌లోనైతే పాలసీ మరింత చౌకగా లభిస్తుంది. ఉదాహరణకు 28 ఏళ్ల వ్యక్తి ముప్పై ఏళ్ల వ్యవధి కోసం 50 లక్షల బీమా పాలసీ ఆన్లైన్లో తీసుకుంటే ఏడాదికి సుమారు రూ. 5,550 కడితే సరిపోతుంది. అదే ముప్పై అయిదేళ్ల వ్యక్తి పాతికేళ్ల వ్యవధికి అదే పాలసీ తీసుకోవాలంటే ఏటా రూ. 7,150 కట్టాల్సి వస్తుంది. అలాగే, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా. వైద్య ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యుల కోసం ఆరోగ్య బీమా పాలసీలు తప్పనిసరిగా మారుతున్నాయి. కాస్త ముందుచూపుతో అవసరానికి అనుగుణమైన కవరేజీని ఎంచుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. వీటి వల్ల ఆదాయ పన్నుపరమైన ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ క్రమశిక్షణ.. ఇన్వెస్ట్మెంట్ సాధనాల గురించి తెలుసుకోవడం, క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే అలవాటును అలవర్చుకోవడం.. ఇరవైలలో నేర్చుకోవాల్సిన ఆర్థిక క్రమశిక్షణ పాఠాల్లో కొన్ని. ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎంత ముందుగా మొదలుపెడితే లక్ష్యం సాధించడం అంత సులువవుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్లు, షేర్లు, ఫండ్లు, బంగారం, రియల్ ఎస్టేట్ వంటి అనేక సాధనాలు అందుబాటులో ఉన్నాయి. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు, రిస్కు సామర్ధ్యాలను బట్టి అనువైనవి ఎంచుకోవచ్చు. రిస్కులు పెద్దగా ఇష్టపడని వారు ఎఫ్డీలు, పీఎఫ్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. రిస్కులు లేకుండా నిలకడైన రాబడి అందించే సాధనాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంటు కూడా ఒకటి. అత్యంత తక్కువగా రూ. 500 నుంచి ఇన్వెస్ట్ చేసేందుకు ఇందులో వీలుంటుంది. కాబట్టి ఏ ఆదాయవర్గానికి చెందిన వారైనా ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. ఆదాయం పెరిగే కొద్దీ పన్నుల పరిధిలోకి వచ్చినా.. పీపీఎఫ్ ఇన్వెస్ట్మెంట్లపై కొన్ని మినహాయింపులూ పొందడానికి వీలుంటుంది. అదే, కాస్త రిస్కు తీసుకోగలిగిన వారు దీర్ఘకాలికంగా ఎక్కువ రాబడులు ఇవ్వగలిగే సత్తా ఉన్న స్టాక్మార్కెట్లవైపు చూడొచ్చన్నది నిపుణుల సలహా. ఖర్చులపై అదుపు.. వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి దశలోనూ బడ్జెట్ చాలా కీలకమైనది. కానీ, అప్పుడప్పుడే ఆదాయాలు కళ్లకి కనిపించే ఇరవైలలో నచ్చినది కొనడం తప్ప పొదుపు, బడ్జెట్ మొదలైనవి పెద్దగా పట్టవు. అయితే, ఏది అవసరం ఏది అనవసరం అన్నది తెలుసుకోవడం, ఖర్చులను అదుపు చేసుకోవడం ఎంత ముందుగా నేర్చుకుంటే అంత మంచిది. బడ్జెట్ ప్రాధాన్యాన్ని గుర్తెరగడం ముఖ్యం. బడ్జెటింగ్ కోసం, ఖర్చులను ట్రాక్ చేసేందుకు స్మార్ట్ఫోన్లలో ప్రస్తుతం ప్రత్యేకమైన యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మనీవైజ్, మైయూనివర్స్, మనీలవర్ తదితర యాప్స్ ఇందుకు ఉపయోగపడతాయి. అత్యవసర నిధి.. ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి ఎప్పుడు ఏ అవసరం ముంచుకు వస్తుందో చెప్పలేం. సంక్షోభం తలెత్తకుండా ఆపడం మన చేతుల్లో ఎలాగూ ఉండదు కాబట్టి వచ్చినప్పుడు కనీసం ఎదుర్కొనడానికి సరిపడా డబ్బయినా చేతిలో ఉంచుకోగలగాలి. అందుకే అత్యవసర నిధి అంటూ ఒకటి ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. కనీసం, ఆరు నుంచి ఎనిమిది నెలల ఖర్చులకు సరిపడేంత మొత్తం అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. -
ఈ మూడూ తప్పనిసరండోయ్..
ఏ నిమిషానికి ఏమవుతుందో ఎవరూ ఊహించలేరు కాబట్టి బీమా పాలసీలు తప్పనిసరి అవసరాలుగా మారుతున్నాయి. బీమా అనగానే ట్యాక్స్ సేవింగ్ పాలసీలని, మనీ బ్యాక్ పాలసీలని.. మరొకటని రకరకాల పాలసీల సమాచారంతో గందరగోళం నెలకొంటుంది. ఏది తీసుకోవాలో అర్థం కాక బుర్ర హీటెక్కిపోతుంటుంది. బీమా ప్రధానోద్దేశం .. మనకేదైనా అనుకోనిది జరిగితే.. కుటుంబసభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా చూడటమే. మిగతా వాటిని పక్కన పెట్టి ఈ కోణంలో చూస్తే ముచ్చటగా మూడు రకాల పాలసీలు ఉంటే మంచిది. అవే.. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్.. ఆదాయానికి ఆధారం అయిన కుటుంబ పెద్ద హఠాత్తుగా కన్నుమూస్తే.. కుటుంబ సభ్యుల ఆర్థిక అవసరాలకు అక్కరకొస్తుంది ఈ పాలసీ. కుటుంబానికి ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అందజే స్తుంది. తక్కువ ప్రీమియానికి అత్యధిక కవరేజి ఇవ్వగలగడం ఈ పాలసీల ప్రత్యేకత. అయితే, ఒకవేళ పాలసీ వ్యవధి పూర్తయ్యే దాకా పాలసీదారు జీవించే ఉంటే మాత్రం ఎలాంటి డబ్బూ రాదు. ఒకవేళ కట్టిన ప్రీమియాలు కూడా వెనక్కి రావాలనుకుంటే యులిప్‌లు, ఎండోమెంట్ లాంటి వేరే పాలసీలను ఎంచుకోవాలి. వైద్య బీమా పాలసీలు.. వైద్యానికయ్యే ఖర్చులు ఏయేటికాయేడు భారీగా పెరిగిపోతున్నాయి. చిన్న అనారోగ్యానికి చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినా వేలకు వేలు వదిలిపోతున్నాయి. కనుక ప్రస్తుతం వైద్య బీమా పాలసీ అనివార్యంగా మారింది. మీరు పనిచేసే కంపెనీ వైద్య బీమా సదుపాయం కల్పించినా.. ఆ కంపెనీలో ఉద్యోగం మానేస్తే కవరేజి ఉండదు కాబట్టి సొంతానికంటూ ఒక పాలసీ ఉండటం మంచిది. ఈ పాలసీలు రకరకాల ప్రయోజనాలు కల్పిస్తాయి. ప్రమాద బీమా.. ప్రమాదాల వల్ల అంగవైకల్యం వచ్చినా, మరణం సంభవించినా.. ఈ తరహా పాలసీలు ఉపయోగపడతాయి. వైద్య బీమా అనేది చికిత్స ఖర్చుల దాకా మాత్రమే పరిమితం అయితే.. ప్రమాద బీమా పాలసీలు అంతకుమించి మరికాస్త ప్రయోజనం ఇస్తాయి. ప్రమాదం కారణంగా మంచానికే పరిమితమై.. ఉద్యోగం చేయలేని పరిస్థితి ఏర్పడి, ఆదాయం ఉండకపోతే రోజులు గడవడం కష్టంగా మారుతుంది కదా. ఇలాంటప్పుడు ప్రమాదం, వైకల్యం వంటి అంశాలను బట్టి ప్రమాద బీమా పాలసీ ద్వారా నిర్దిష్ట మొత్తం లభిస్తుంది. ఏ పాలసీ తీసుకున్నా.. అవసరాలను దృష్టిలో పెట్టుకుని, కొంతైనా పరిశోధన చేసి మరీ తీసుకుంటే తర్వాత రోజుల్లో ఇబ్బందులు పడనక్కర్లేదు. -
ఈ మూడూ తప్పనిసరండోయ్..
ఏ నిమిషానికి ఏమవుతుందో ఎవరూ ఊహించలేరు కాబట్టి బీమా పాలసీలు తప్పనిసరి అవసరాలుగా మారుతున్నాయి. బీమా అనగానే ట్యాక్స్ సేవింగ్ పాలసీలని, మనీ బ్యాక్ పాలసీలని.. మరొకటని రకరకాల పాలసీల సమాచారంతో గందరగోళం నెలకొంటుంది. ఏది తీసుకోవాలో అర్థం కాక బుర్ర హీటెక్కిపోతుంటుంది. బీమా ప్రధానోద్దేశం .. మనకేదైనా అనుకోనిది జరిగితే.. కుటుంబసభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా చూడటమే. మిగతా వాటిని పక్కన పెట్టి ఈ కోణంలో చూస్తే ముచ్చటగా మూడు రకాల పాలసీలు ఉంటే మంచిది. అవే.. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్.. ఆదాయానికి ఆధారం అయిన కుటుంబ పెద్ద హఠాత్తుగా కన్నుమూస్తే.. కుటుంబ సభ్యుల ఆర్థిక అవసరాలకు అక్కరకొస్తుంది ఈ పాలసీ. కుటుంబానికి ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అందజే స్తుంది. తక్కువ ప్రీమియానికి అత్యధిక కవరేజి ఇవ్వగలగడం ఈ పాలసీల ప్రత్యేకత. అయితే, ఒకవేళ పాలసీ వ్యవధి పూర్తయ్యే దాకా పాలసీదారు జీవించే ఉంటే మాత్రం ఎలాంటి డబ్బూ రాదు. ఒకవేళ కట్టిన ప్రీమియాలు కూడా వెనక్కి రావాలనుకుంటే యులిప్‌లు, ఎండోమెంట్ లాంటి వేరే పాలసీలను ఎంచుకోవాలి. వైద్య బీమా పాలసీలు.. వైద్యానికయ్యే ఖర్చులు ఏయేటికాయేడు భారీగా పెరిగిపోతున్నాయి. చిన్న అనారోగ్యానికి చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినా వేలకు వేలు వదిలిపోతున్నాయి. కనుక ప్రస్తుతం వైద్య బీమా పాలసీ అనివార్యంగా మారింది. మీరు పనిచేసే కంపెనీ వైద్య బీమా సదుపాయం కల్పించినా.. ఆ కంపెనీలో ఉద్యోగం మానేస్తే కవరేజి ఉండదు కాబట్టి సొంతానికంటూ ఒక పాలసీ ఉండటం మంచిది. ఈ పాలసీలు రకరకాల ప్రయోజనాలు కల్పిస్తాయి. ప్రమాద బీమా.. ప్రమాదాల వల్ల అంగవైకల్యం వచ్చినా, మరణం సంభవించినా.. ఈ తరహా పాలసీలు ఉపయోగపడతాయి. వైద్య బీమా అనేది చికిత్స ఖర్చుల దాకా మాత్రమే పరిమితం అయితే.. ప్రమాద బీమా పాలసీలు అంతకుమించి మరికాస్త ప్రయోజనం ఇస్తాయి. ప్రమాదం కారణంగా మంచానికే పరిమితమై.. ఉద్యోగం చేయలేని పరిస్థితి ఏర్పడి, ఆదాయం ఉండకపోతే రోజులు గడవడం కష్టంగా మారుతుంది కదా. ఇలాంటప్పుడు ప్రమాదం, వైకల్యం వంటి అంశాలను బట్టి ప్రమాద బీమా పాలసీ ద్వారా నిర్దిష్ట మొత్తం లభిస్తుంది. ఏ పాలసీ తీసుకున్నా.. అవసరాలను దృష్టిలో పెట్టుకుని, కొంతైనా పరిశోధన చేసి మరీ తీసుకుంటే తర్వాత రోజుల్లో ఇబ్బందులు పడనక్కర్లేదు. -
భారతీ ఆక్సా సెక్యూర్ ఇన్కమ్
భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పరిమితకాల ప్రీమియం చెల్లించే మనీబ్యాక్ పాలసీని ప్రవేశపెట్టింది. ‘సెక్యూర్ ఇన్కమ్’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకంలో ప్రీమియం 10 ఏళ్లపాటు చెల్లిస్తే ఆ మరుసటి ఏడాది నుంచి పాలసీ కాలపరిమితి తీరే వరకు హామీతో కూడిన ఆదాయాన్ని పొందుతారు. మెచ్యూర్టీ సమయంలో పాలసీ మొత్తంతోపాటు గ్యారంటీ అడిషన్ను పొందుతారు. బీమా రక్షణ అనేది మనం చెల్లించే ప్రీమియం ఆధారంగా నిర్ణయిస్తారు. హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ పేరుతో ప్రత్యేక రైడర్లను కూడా ఈ పథకం అందిస్తోంది. ఐఆర్డీఏ కొత్త నిబంధనలకు అనుగుణంగా ప్రవేశపెట్టిన ఈ పాలసీ ద్వారా ప్రతీ సంవత్సరం అందుకునే మొత్తంపై ఎలాంటి పన్నుభారం ఉండదు.