దేశీయ బీమా రంగంలో ఎన్ని కంపెనీలున్నా ప్రభుత్వ అధీనంలోని జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ)ది ప్రత్యేక స్థానం. ఈనెల ఒకటో తేదీన ప్రారంభమైన ఈ సంస్థ 68వ బీమా వారోత్సవాలు రేపటితో ముగియనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏటా సుమారు రూ.నాలుగు లక్షల కోట్ల వరకు పెట్టుబడులు సమకూరుస్తున్న ఈ సంస్థ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
ఎల్‌ఐసీ సుమారు 15 లక్షల మంది నిరుద్యోగులకు బీమా సలహాదారులుగా ఉపాధి కల్పిస్తోంది.
దేశవ్యాప్తంగా 688 జిల్లాస్థాయి జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) కార్యాలయాలున్నాయి.
ప్రైవేటు కంపెనీలకు గ్రామీణ ప్రాంతాల్లో 176 శాఖలుంటే, ఎల్‌ఐసీకి 1,224 బ్రాంచీలున్నాయి.
ఎల్‌ఐసీ 1956 నుంచి ఇప్పటివరకు రూ.53లక్షల కోట్ల ఆస్తులను సంపాదించింది.
దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.43లక్షల కోట్ల మేర పెట్టుబడులు అందించింది.
సుమారు 27 కోట్ల మంది వ్యక్తిగత పాలసీదారులున్నారు.
13 కోట్ల గ్రూప్ పాలసీదారులకు ఎల్‌ఐసీ సేవలందిస్తోంది.
రూ.51.21 లక్షల కోట్ల ఆస్తుల నిర్వహణ(ఏయూఎమ్)తో దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలుస్తోంది.
గడచిన ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.6,104 కోట్ల డివిడెండ్ అందించింది.
బ్రాండ్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్ రిపోర్ట్-2024 ప్రకారం ఎల్‌ఐసీ ప్రపంచంలోనే ‘అత్యంత బలమైన బ్రాండ్’గా నిలిచింది.
‘ఎస్‌అండ్‌పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్’ నివేదిక ప్రకారం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీ.
గత సంవత్సరంలో రూ.2.30 లక్షల కోట్లను క్లెయిమ్‌ల రూపంలో పాలసీదారులకు చెల్లించింది.
ఇటీవలి కేరళ తుపానులో మరణించిన 36 మంది పాలసీదారుల కుటుంబాలకు ఎలాంటి కాగితాలు అడగకుండానే రూ.11 కోట్ల మేర బీమా సొమ్మును అందజేసింది.
ఇదీ చదవండి: సెబీ చీఫ్‌పై ఆరోపణలు.. పీఏసీ విచారణ?
కేంద్ర ప్రభుత్వం 2022లో ఎల్‌ఐసీలోని మూడున్నర శాతం వాటాను ఐపీఓ ద్వారా స్టాక్‌మార్కెట్‌లో విక్రయించింది. ఇందులో భాగంగా సుమారు 40 లక్షల షేర్లు విక్రయించి రూ.21వేల కోట్లను సమకూర్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment