Kimjong Un
-
మన ఉపగ్రహం మీద ఎవరో నిఘా పెట్టి ఇలా చేస్తున్నారేమోననిపిస్తోంది సార్!
మన ఉపగ్రహం మీద ఎవరో నిఘా పెట్టి ఇలా చేస్తున్నారేమోననిపిస్తోంది సార్! -
విద్యార్థులకు ఉరి...మరోసారి వెలుగులోకి కిమ్ నిరంకుశపాలన
ఉత్తర కొరియాలో అద్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్ నిరంకుశ పాలన గురించి తెలియంది కాదు. ఆయన పాలనలో ప్రజలు తనకు నచ్చినప్పుడూ నవ్వాలి, ఏడవాలి అన్నట్లుంటుంది. ప్రతిదీ తన అదుపు ఆజ్క్షలో ఉండాలనే మనస్తత్వంతో... ప్రజలపై పలురకాల అర్థం కానీ ఆంక్షలు పెట్లి ఇబ్బందులకు గురిచేస్తాడు. ఇప్పుడూ అదీ కాస్తా మరోస్థాయికి చేరిందనేలా ఒక దారుణమై ఘటన వెలుగులోకి వచ్చింది. పసివాళ్లని జాలి కూడా లేకుండా ఇద్దరు హైస్కూల్ విద్యార్థులకు ఉరిశిక్ష విధించి మరోసారి ప్రపంచానికి తన కర్కశత్వ పాలనను చూపించాడు. అక్టోబర్ ప్రాంతంలో ఆ ఇద్దరు విద్యార్థులు చైనా సరిహద్దుగా ఉన్న ఉత్తరకొరియాలోని ర్యాంగ్‌గాంగ్ ప్రావిన్స్‌లోని ఒక ఉన్నత పాఠశాలలోని కొంతమంది విద్యార్థులను కలుసుకున్నారు. అక్కడ వారు దక్షిణ కొరియా సినిమాలు, అమెరికన్ నాటక ప్రదర్శనలను వీక్షించారని సమాచారం. దీంతో ఉత్తరకొరియా అధికారులు ఆ మైనర్లను ప్రజల ముందే మరణశిక్ష విధించి.. కాల్చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఉత్తర కొరియా సాంస్కృతిక సాధనాలను నియంత్రించే సైద్ధాంతిక చట్టాన్ని రూపొందించింది. ఈ మేరకు ఉత్తర కొరియాలో డ్రామాలు, సంగీతం పట్ల పెరుగుతున్న ప్రజాదరణను లక్ష్యంగా చేసుకుని విదేశీ ప్రభావం ఉండకూదని అణిచివేతలో భాగంగా నిషేధించింది. వాస్తవానికి ఉత్తరకొరియాలోకి దక్షిణ కొరియా సినిమాలను అక్రమంగా రవాణా అవ్వటమే గాక ప్రజలు ఎవరికంట పడకుండా అతి రహస్యంగా వీక్షిస్తుండటం గమనార్హం. (చదవండి: ప్రయాణికుడి బ్యాగ్‌లో అనుమానాస్పద వస్తువు...దెబ్బకు ఎయిర్పోర్ట్ క్లోజ్) -
కిమ్ రూటే సెపరేట్: క్షిపణి ప్రయోగం చేసిన స్థావరంలోనే..
ఇటీవల కాలంలో ఉత్తర కొరియా మిసైల్ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడూ తాజాగా మిసైల్ ప్రయోగ స్థావరంలోనే గ్రీన్ హౌస్ ఫామ్‌కి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పూర్వ రియోనిఫో వైమానికి స్థావరంలో ఈ గ్రీన్హౌస్ ఫాంని ప్రారంభించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ప్రారంభోత్సవానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హాజరయ్యారు. ఇది ఉత్తర కొరియాలో అతిపెద్ద కూరగాయాల ఫాంలో ఒకటిగా పేరుగాంచనుంది. దీన్ని ఉత్తర కొరియాలో ప్రభలంగా ఉన్న ఆహార కొరత సమస్యలను పరిష్కరించడానికి ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ఫామ్ హౌస్ నిర్మించిన ప్రాంతంలోనే 2019, 2021 వరసగా కెఎన్ 25, కెఎన్ 23 వంటి స్వల్స బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను నిర్వహించింది. ఈ ఫాం హౌస్‌ని ఉత్తర కొరియాలో ప్రధాన సెలవు దినమైన పాలకుల వర్కర్స్ పార్టీ స్థాపన వార్షికోత్సవం రోజున ప్రారంభించింది. ఉత్తరకొరియా ప్రజల కోసం గత డిసెంబర్లోనే ఈ ఫామ్‌ను ఆటోమెటెడ్‌గా మార్చే ప్రాజెక్టుని ప్రారంభించింది. ఈ వ్యవసాయ క్షేత్రంలో సుమారు 280 హెక్టారుల విస్తీర్ణంలో 850కి పైగా గ్రీన్హౌస్ ఫామ్‌లు ఉన్నాయి. అంతేగాదు ఈ ఫాం హౌస్‌ని కొద్దినెలల్లోనే పూర్తి చేసినందుకు కార్మికులను, సైనికులను కిమ్ ప్రశంసించారు. అంతేగాదు ఇలాంటి మరిన్ని ఫామ్ హౌస్‌లను అభివృద్ధి చేయాలని శాస్త్రీయ పద్ధతుల్లో కూరగాయలను ఉత్పత్తి చేయాలని ఆదేశించారు. ఒకపక్క దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా నౌకదళ విన్యాసాలు చేశాయన్న అక్కసుతో మిసైల్ దూకుడుతో కవ్వింపు చర్యలకు దిగింది. మరోవైపు దేశ ప్రజల ఆహార కొరత సమస్యను పరిష్కరించే దిశగా వైమానిక ప్రయోగా స్థావరాల్లోనే ఫామ్ హౌస్‌లను ఏర్పాటు చేసి ఆశ్చర్యపరించింది. ఏదైనా కిమ్కే చెల్లింది. (చదవండి: ఐరాసలో రష్యాకు భారత్ షాక్.. కీలక ఓటింగ్‌లోనూ భారీ షాక్ ఇస్తుందా?) -
కొరియా కిమ్ సూక్తులు టీకా వేస్ట్.. ఉప్పు నీళ్లే బెస్ట్
North Korea Tells Citizens to Gargle Salt Water to Fight Covid: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఉప్పు నీళ్లే ఉత్తమమని ఉత్తరకొరియా సూచించింది. వైరస్ వేగంగా వ్యాపిస్తున్నా వంటింటి చిట్కాలను పాటిస్తే చాలని కిమ్ సర్కార్ సూక్తులు చెబుతోంది. మరోవైపు ఉత్తరకొరియాలో వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనా మహమ్మారి ఉద్భవించిన రెండేళ్ల వరకూ మా దేశంలో ఒక్కకేసు నమోదు కాలేదంటూ ఉత్తర కొరియా గొప్పగా చెప్పుకుంది. ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో కొవాక్స్ సహా ఇతర దేశాల నుంచి టీకాల సాయాన్ని తిరస్కరించింది. ఇప్పుడు ఆ దేశంలో కోవిడ్ పంజా విసురుతోంది. ఈ క్రమంలో వైరస్వ్యాప్తిని అరికట్టేందుకు కిమ్ జాంగ్ ప్రభుత్వం దేశ ప్రజలకు చేసిన సూచన చర్చనీయాంశంగా మారింది. కరోనాపై పోరాడేందుకు ఉప్పు నీళ్లు పుక్కిలించడం సహా ఇతర వంటింటి చిట్కాలను పాటించాలని సూచించింది. సాంప్రదాయ చికిత్సలే ఉత్తమమని ఓ మహిళ ఆ దేశమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నట్లు రాయిటర్స్ తెలిపింది. దాంతోపాటు విల్లో ఆకులు, అల్లం టీ తీసుకుంటే సరిపోతుందని ఆ మహిళ చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది. చదవండి: (ఉత్తరకొరియాలో ఒకే రోజు 2.7 లక్షల కరోనా కేసులు) ఉత్తర కొరియా అధికార మీడియా కేసీఎన్ఏ ప్రకారం దేశంలో 1.7 మిలియన్లకు పైగా ప్రజలు జ్వరం లక్షణాలతో బాధపడుతున్నారు. బుధవారం ఒక్కరోజే 2.32లక్షల మందికి జ్వరం లక్షణాలు బయటపడగా ఆరుగురు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 62కి పెరిగింది. ప్రస్తుతం 6,91,170మంది క్వారంటైనలో ఉన్నారు. అయితే జ్వరం లక్షణాలను కిమ్ సర్కార్ ఇప్పటివరకూ కరోనాగా గుర్తించలేదు. అధికారికంగా చెప్పిన సంఖ్య కంటే కేసులు పలురెట్లు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 10లక్షల మంది ప్రజలు అనుమానిత కోవిడ్ నుంచి కోలుకున్నట్లు ఉత్తర కొరియా వెల్లడించింది. పరీక్షలు చేసేందుకు సరైన వసతులు లేకపోవడం వల్ల చాలా మంది కేసులను కోవిడ్-19గా గుర్తించలేకపోతున్నట్లు అంతర్జాతీయ నిపుణలు అనుమానిస్తున్నారు. చదవండి: (కిమ్‌ను భయపెడుతున్న కరోనా.. ఫుల్ టెన్షన్లో నార్త్ కొరియన్లు) సరైన ఔషదాలు, సామాగ్రి, వైద్యపరికరాలు లేకపోయినప్పటికీ 10 లక్షల మంది ప్రజలు ఎలా కోలుకున్నారన్నది ప్రశ్నార్థకమని పేర్కొన్నారు. జ్వరం లక్షణాలు కాస్త తగ్గగానే క్వారంటైన్ నుంచి పంపించేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. కరోనా సమాచారం అందించాలని కోరినప్పటికీ ఉత్తర కొరియా స్పందించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉత్తర కొరియాలో చాలా మంది ప్రజలు కోవిడ్ బారినపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎలాంటి పరీక్షలు చేయకపోవడం వల్ల జరిగే వ్యాప్తి కొత్త వేరియంట్లు ఉద్భవించేందుకు దోహదం చేస్తుందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. దేశాలు తమ సాయాన్ని అంగీకరించేంతవరకు కోవిడ్ కట్టడికి డబ్ల్యూహెచ్‌వో ఏం చేయలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
చెల్లెలికి ప్రమోషన్ ఇచ్చిన కిమ్
సియోల్/వాషింగ్టన్: ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్.. పార్టీ కీలక పదవిలో తన సోదరిని నియమించారు. కిమ్ యో జోంగ్‌ను పార్టీ శక్తివంతమైన పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా నియమించినట్లు ప్రభుత్వ అధికార వార్తాసంస్థ కేసీఎన్ఏ స్పష్టం చేసింది. ఆదివారం కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్న ఉత్తరకొరియా అణ్వాయుధ కార్యక్రమంపైనా కిమ్ ప్రశంసలు కురిపించారు. ఆంక్షలు పెరుగుతున్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మెరుగుపడిందని కిమ్ పేర్కొన్నారు. సోదరికి కీలకమైన పార్టీ పదవి కట్టబెట్టడం ఆశ్చర్యం కలిగించింది. అణుపరీక్షల సమయంలో, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ కొంతకాలంగా కిమ్తోపాటుగా అతని సోదరి కనబడుతున్నారు. కాగా, ఉత్తరకొరియాతో దౌత్య ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ‘25 ఏళ్లుగా ఉత్తరకొరియాతో యూఎస్ అధ్యక్ష భవనం మాట్లాడుతూనే ఉంది. ప్రతిసారీ అమెరికన్ అధికారులు అవమానాల పాలవుతున్నారు. వారితో దౌత్య ప్రయత్నం సరికాదు. ప్రత్యామ్నాయం ఒక్కటే (పరోక్షంగా యుద్ధాన్ని ప్రస్తావిస్తూ) మిగిలింది’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. -
కిమ్ వేడుకలు: అమెరికాపై బాంబు వేస్తాం
టోక్యో: ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఇంటర్మీడియెట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు. ఈ సందర్భంగా రాజధాని ప్యోంగ్యాంగ్లో సంబరాలు అంబరాన్నంటాయి. త్వరలోనే అణు వార్‌హెడ్‌ను మోసుకుని అమెరికా భూభాగాన్ని చేరుకోగల సామర్ధ్యం కలిగిన క్షిపణిని తయారు చేస్తామని పేర్కొన్నారు. ఆదివారం ఉత్తరకొరియా ఇంటర్మీడియెట్ రేంజ్ క్షిపణిని పరీక్షించింది. 2 వేల కిలోమీటర్ల ఎత్తులో 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన క్షిపణి జపాన్ సముద్రజలాల్లో కూలి పోయింది. దక్షిణకొరియా అధ్యక్షుడిగా మూన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం చేపట్టడం ఇదే తొలిసారి. ఉత్తరకొరియా ప్రయోగించిన ఇంటర్మీడియెట్ రేంజ్ మిస్సైల్ క్రమంగా ఖండాంతర క్షిపణి తయారీకి బాటలు వేస్తుందని అమెరికా రాకెట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత ప్రయోగాల కంటే కొన్ని రెట్ల మెరుగైన ఫలితాలు ఈ క్షిపణి ప్రయోగంతో ఉత్తరకొరియా చూసిందని తెలిపారు. కేవలం ఒక ఏడాదిలోపే ఖండాతర క్షిపణి వ్యవస్ధను ఉత్తరకొరియా చేరుకోగలదని భావిస్తున్నట్లు చెప్పారు. ఉత్తరకొరియా క్షిపణి పరీక్షను అమెరికా, దక్షిణకొరియా, జపాన్‌లు ఖండించాయి. క్షిపణి ప్రయోగంపై ప్రకటన విడుదల చేసిన ప్యోంగ్యాంగ్ మీడియా.. దాని పేరును హ్వాసంగ్-12గా పేర్కొంది. అమెరికా మిలటరీ బలగాలతో తమను రెచ్చగొట్టేందుకు యత్నిస్తే గట్టిగా బదులిస్తామని ఆ దేశం హెచ్చరించింది. విపత్కర పరిణామాలు చూడాలనుకుంటే తమతో పెట్టుకోవాలని అంది. -
ఉత్తర కొరియా అత్యాధునిక రాకెట్ పరీక్ష
పరీక్షకు హాజరైన దేశాధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్ టోక్యో: ఉత్తర కొరియా సోహేలో శనివారం అత్యాధునిక రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షకు ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ అత్యాధునిక రాకెట్ పరీక్షతో దేశ అంతరిక్ష కార్యక్రమం విప్లవాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకుందన్నారు. ఈ రోజు ఉత్తర కొరియా సాధించిన విజయాన్ని ప్రపంచమంతా చూసిందని..స్వదేశీ రాకెట్ పరిశ్రమలో మార్చి 18 ని విప్లవాత్మకమైన రోజుగా అభివర్ణించారు. ఈ క్షిపణి పరీక్ష విజయం పట్ల ఆ దేశ మీడియా స్వదేశీ రాకెట్ పరిశ్రమను ఆకాశానికెత్తేసింది. గత రాకెట్ ఇంజిన్ల కంటే కచ్చితమైన, సురక్షితమైన నియంత్రణ వ్యవస్థను కలిగి ఉండటం ఈ రాకెట్ ప్రత్యేకతలు. పంచవర్ష ప్రణాళికలో భాగంగా భవిష్యత్తులో మరిన్ని ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు, వచ్చే పదేళ్లలో చంద్రుడి వద్దకు ఉపగ్రహాన్ని పంపించేందుకు ఇటువంటి అత్యాధు నిక రాకెట్లు అవసరమవుతాయని ఉత్తర కొరియా అధికారులు చెబుతున్నారు.