సియోల్: ఓ పక్క అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ఉత్తర కొరియా చర్యలపట్ల తీవ్ర ఆగ్రహం చేస్తుండగా ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ వున్ మాత్రం ఆ మాటలేమి పట్టించుకోకుండా జలాంతర్గాముల ద్వారా తమ దేశం జరిపిన అణు పరీక్షలు 'చాలా గొప్ప విజయం' అంటూ అభివర్ణించారు.
ఆ దేశం అణ్వాయుధాలు పెంచుకోవడాన్ని ఐక్యరాజ్య సమితి సైతం ఖండిస్తుండగా వాటి విషయంలో ఆయన కనీసం ఒక్క ప్రకటన కూడా చేయడం లేదు. బుధవారం ఉత్తర కొరియా జలాంతర్గాముల ద్వారా క్షిపణి పరీక్షలు నిర్వహించింది. ఈ క్షిపణి జపాన్ మీదుగా 500 కిలో మీటర్లు ప్రయాణించింది. దీనిపై జపాన్ తీవ్రంగా హెచ్చరికలు చేయగా ఐక్యరాజ్య సమితికి చెందిన కొందరు అధికారులు రెండుగంటలపాటు సమావేశమై ఉత్తర కొరియా చేస్తున్న రెచ్చగొట్టే చర్యలపై చర్చించారు.
'మా మిసైల్ టెస్ట్ ఓ గొప్ప విజయం'
Published Thu, Aug 25 2016 1:37 PM | Last Updated on Mon, Jul 29 2019 5:39 PM
Advertisement
Advertisement