Venus Aerospace Unveils Hypersonic Jet Flight Starrager Design - Sakshi
Sakshi News home page

నిజామా? భూమ్మీద ఎక్కడి నుంచి ఎక్కడికైనా గంటలోనే...

Published Sun, Jul 3 2022 5:03 PM | Last Updated on Sun, Jul 3 2022 5:44 PM

Venus Aerospace Unveils Hypersonic Jet Flight Starrager Design - Sakshi

ధ్వని వేగాన్ని మించిన వేగంతో ప్రయాణించే సూపర్‌సోనిక్‌ జెట్‌ విమానాలను తలదన్నే విమానాలేవీ ఇంతవరకు లేవు. అయితే, త్వరలోనే అలాంటి విమానం అందుబాటులోకి రానుందని అమెరికన్‌ ఏరోస్పేస్‌ స్టార్టప్‌ కంపెనీ ‘వీనస్‌ ఏరోస్పేస్‌’ సంస్థ చెబుతోంది. ఇటీవల ఈ సంస్థ ‘స్టార్‌ గేజర్‌’ పేరిట తన విమానం నమూనాను విడుదల చేసింది.

భూమ్మీద ఎక్కడి నుంచి ఎక్కడికైనా గంట లోగానే చేరుకోగల హైపర్‌ సోనిక్‌ విమానానికి రూపకల్పన చేస్తున్నట్లు ‘వీనస్‌ ఏరోస్పేస్‌’ ప్రకటించింది. దీనికోసం అమెరికా ప్రభుత్వం 1 మిలియన్‌ డాలర్లు ఇవ్వగా, ప్రైవేటు పెట్టుబడిదారుల నుంచి 33 మిలియన్‌ డాలర్ల నిధులు సేకరించనున్నట్లు తెలిపింది. పన్నెండు మంది ప్రయాణించే వీలున్న ఈ విమానం లాస్‌ ఏంజెలెస్‌ నుంచి టోక్యోకు గంట లోపే చేరుకోగలదని ఈ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

చదవండి👇
అత్యంత హాస్యభరితమైన జోక్‌ ఇది! అది ఏంటంటే?
ఆ పూలను తాకితే చాలు.. ఓ అద్భుతాన్ని చూసిన ఫీలింగ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement