Hyper Sonic aircraft
-
నిజామా? భూమ్మీద ఎక్కడి నుంచి ఎక్కడికైనా గంటలోనే...
ధ్వని వేగాన్ని మించిన వేగంతో ప్రయాణించే సూపర్సోనిక్ జెట్ విమానాలను తలదన్నే విమానాలేవీ ఇంతవరకు లేవు. అయితే, త్వరలోనే అలాంటి విమానం అందుబాటులోకి రానుందని అమెరికన్ ఏరోస్పేస్ స్టార్టప్ కంపెనీ ‘వీనస్ ఏరోస్పేస్’ సంస్థ చెబుతోంది. ఇటీవల ఈ సంస్థ ‘స్టార్ గేజర్’ పేరిట తన విమానం నమూనాను విడుదల చేసింది. భూమ్మీద ఎక్కడి నుంచి ఎక్కడికైనా గంట లోగానే చేరుకోగల హైపర్ సోనిక్ విమానానికి రూపకల్పన చేస్తున్నట్లు ‘వీనస్ ఏరోస్పేస్’ ప్రకటించింది. దీనికోసం అమెరికా ప్రభుత్వం 1 మిలియన్ డాలర్లు ఇవ్వగా, ప్రైవేటు పెట్టుబడిదారుల నుంచి 33 మిలియన్ డాలర్ల నిధులు సేకరించనున్నట్లు తెలిపింది. పన్నెండు మంది ప్రయాణించే వీలున్న ఈ విమానం లాస్ ఏంజెలెస్ నుంచి టోక్యోకు గంట లోపే చేరుకోగలదని ఈ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. చదవండి👇 అత్యంత హాస్యభరితమైన జోక్ ఇది! అది ఏంటంటే? ఆ పూలను తాకితే చాలు.. ఓ అద్భుతాన్ని చూసిన ఫీలింగ్! -
ప్రత్యర్థుల గుండెల్లో ‘పిడిబాకు’.. కింజల్ ప్రత్యేకతలివే!
ఉక్రెయిన్‌పై యుద్ధంలో తొలిసారిగా కింజల్ హైపర్సోనిక్ ఏరో బాలిస్టిక్ మిస్సైళ్లు ప్రయోగించినట్లు రష్యా రక్షణ శాఖ శనివారం అధికారికంగా ప్రకటించింది. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తాయంటున్న ఈ మిస్సైళ్లపై ఇప్పుడు అందరి దృష్టీ పడింది... ► కింజల్ అంటే రష్యన్ భాషలో పిడిబాకు. ‘కేహెచ్–47ఎం2 కింజల్’గా పిలిచే ఈ అత్యాధునిక క్షిపణులను రష్యా అధ్యక్షుడు పుతిన్ 2018 మార్చి నెలలో ఆవిష్కరించారు. వీటిని ఐడియల్ వెపన్ (ఆదర్శ ఆయుధం)గా అభివర్ణించారు. ఇతర ఆధునిక క్షిపణులతో పోలిస్తే కింజల్ వేగం, కచ్చితత్వం చాలా ఎక్కువ. ► కింజల్ మిస్సైళ్లను గగనతలం నుంచి భూమిపైకి ప్రయోగిస్తారు. ధ్వనివేగం కంటే 10 రెట్లు అధిక వేగంతో దూసుకెళ్లగలవు. ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థల నుంచి సులువుగా తప్పించుకునే సామర్థ్యం వీటి సొంతం. అడ్డొచ్చే క్షిపణులను, ఆయుధాలను నిర్వీర్యం చేస్తూ దూసుకెళ్తాయి. ► గంటలో ఏకంగా 12,350 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. భూమి లోతుల్లోకీ చొచ్చుకెళ్లగలవు. ► 1,500 కిలోమీటర్ల నుంచి 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయి. 480 కిలోల బరువైన సంప్రదాయ లేదా అణు పేలోడ్లను మోసుకెళ్తాయి. ఇది రెండో ప్రపంచయుద్ధ సమయంలో జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన ఫ్యాట్‌మ్యాన్ బాంబు బరువు కంటే 33 రెట్లు ఎక్కువ! ► టూ–22ఎం3 లేదా మిగ్–31కే ఇంటర్సెప్టర్ల నుంచి వీటిని ప్రయోగిస్తారు. ► ఇస్కాండర్–ఎం షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్లను అభివృద్ధి చేసి కింజల్ క్షిపణులను రూపొందించిందని రక్షణ నిపుణుల అంచనా. -
ఉక్రెయిన్‌పైకి హైపర్ సోనిక్ క్షిపణితో దాడి
కీవ్: యుద్ధానికి తెర తీసి మూడున్నర వారాలైనా విజయం అందని ద్రాక్షే కావడంతో రష్యా చిర్రెత్తిపోతోంది. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించే అత్యాధునిక హైపర్ సోనిక్ క్షిపణి ‘కింజల్’తో ఉక్రెయిన్ సైనిక ఆయుధాగారంపై శుక్రవారం అర్ధరాత్రి విరుచుకుపడింది. పశ్చిమ ఉక్రెయిన్‌లో రొమేనియా సరిహద్దు సమీపంలోని ఇవనో–ఫ్రాంకివ్స్క్ ప్రాంతంలో క్షిపణులు, వైమానిక ఆయుధాలను నిల్వ చేసే భారీ భూగర్భ ఆయుధాగారాన్ని కింజల్ పూర్తిగా ధ్వంసం చేసిందని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ ప్రకటించారు. రేవు పుట్టణం ఒడెసా సమీపంలోని ఉక్రెయిన్ సైనిక స్థావరాలను కూడా యాంటీ షిప్ మిసైల్ సిస్టం సాయంతో క్షిపణి ప్రయోగాలతో నేలమట్టం చేసినట్టు చెప్పారు. అణ్వాయుధాలనూ మోసుకుపోగల కింజల్‌ను రష్యా యుద్ధంలో ప్రయోగించడం ఇదే తొలిసారి. అయితే శుక్రవారం నాటి దాడిలో సాంప్రదాయిక వార్ హెడ్నే వాడారు. మిగ్–31 ఫైటర్ జెట్ ద్వారా క్షిపణిని ప్రయోగించారు. డెలియాటిన్ సెటిల్మెంట్లోని తమ ఆయుధాగారంపై క్షిపణి దాడి నిజమేనని ఉక్రెయిన్ చెప్పింది. మారియుపోల్‌లో ఉన్న యూరప్‌లోని అతి పెద్ద స్టీల్ ప్లాంట్ అజోవ్‌స్టాల్ కూడా రష్యా సైన్యం దాడిలో దాదాపుగా నేలమట్టమైందని ప్రకటించింది. దేశవ్యాప్తంగా భూ, గగన తలాల గుండా రష్యా భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని కీవ్‌తో పాటు ఖర్కీవ్, మారియుపోల్, అవ్డివ్కా, క్రమటోర్స్క్, పొక్రోవ్స్క్, నొవొసెలిదివ్కా, వెర్కోనొటొరెస్కే, క్రిమ్కా, స్టెప్నే, లివివ్ తదితర నగరాలు బాంబుల దాడితో వణికిపోతున్నాయి. నివాస ప్రాంతాలపై కూడా రష్యా సైన్యం విచక్షణారహితంగా దాడులకు తెగబడుతోందని ఉక్రెయిన్ దుయ్యబట్టింది. స్కూళ్లు, ఆస్పత్రులు, మ్యూజియాలు, షాపింగ్ సెంటర్లు వేటినీ వదలడం లేదని ఆరోపించింది. మారియుపోల్ దాదాపుగా రష్యా చేతుల్లోకి వెళ్లిన నేపథ్యంలో అజోవ్ సముద్రంతో ఉక్రెయిన్‌కు సంబంధం తెగిపోయిందంటున్నారు. దక్షిణ ఉక్రెయిన్‌లోని మైకోలైవ్‌లో ఓ సైనిక స్థావరంపై రష్యా జరిపిన దాడుల్లో 100 మందికి పైగా మరణించినట్టు సమాచారం. 50కి పైగా మృతదేహాలను వెలికితీశారు. దాడి సమయంలో రెజిమెంట్‌లో 200 మంది దాకా ఉన్నట్టు తెలుస్తోంది. పాపం పిల్లలు! ఉక్రెయిన్ నుంచి వలసల సంఖ్య 40 లక్షలు దాటినట్టు సమాచారం. దేశ జనాభాలో ఇది దాదాపు 10 శాతం! 75 లక్షల ఉక్రెయిన్ బాలల్లో సెకనుకు ఒకరి చొప్పున శరణార్థిగా మారుతున్నారు. మరో 10 కారిడార్లు కీవ్, మారియుపోల్, లుహాన్స్క్, రష్యా అధీనంలోని ఖెర్సన్ సహా పలు నగరాల్లో 10 హుమానిటేరియన్ కారిడార్లకు రష్యాతో అంగీకారం కుదిరినట్టు ఉక్రెయిన్ తెలిపింది. నిత్యావసరాల సరఫరాను రష్యా సైన్యం అడ్డుకుంటోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు. ఇప్పటికైనా తనతో నేరుగా చర్చలకు రావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సూచించారు. తటస్థ హోదాకు ఉక్రెయిన్ ఓకే: రష్యా నాటో సభ్యత్వ డిమాండ్‌ను వదులుకునేందుకు, తటస్థ దశంగా కొనసాగేందుకు ఉక్రెయిన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు చర్చల్లో రష్యా బృందానికి నేతృత్వం వహించిన వ్లాదిమిర్ మెడిన్స్కీ శుక్రవారం చెప్పారు. కానీ తమ వైఖరిలో మార్పూ లేదని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. ఉక్రెయిన్ దుస్తుల్లో రష్యా వ్యోమగాములు? శుక్రవారం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు వెళ్లిన ముగ్గురు రష్యా వ్యోమగాములు ఉక్రెయిన్ జెండాతో సరిపోలే నీలి, పసుపు రంగు స్పేస్ సూట్లు ధరించి కన్పించారు! ‘‘ఏ రంగు సూట్లు ఎంచుకోవాలన్నది మా ఇష్టం. పసుపు రంగు సూట్లు మా దగ్గర చాలా పోగుపడ్డాయి. దాంతో అవే వేసుకోవాల్సి వచ్చింది’’ అని వాళ్లు చెప్పారు. ఉక్రెయిన్‌కు నైతిక మద్దతుగానే ఈ పని చేశారా అన్నది తెలియరాలేదు. -
Russia-Ukraine war: ఉక్రెయిన్‌పై ‘అణు’ ఖడ్గం!
ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగి 25 రోజులు గడుస్తున్నా రష్యా పెద్దగా సాధించిందేమీ కన్పించడం లేదు. అమ్ములపొదిలో ఆయుధాలు ఖాళీ అయిపోతున్నాయి. రష్యా సైనికుల్లో నైరాశ్యం పెరిగిపోతోంది. అంతర్జాతీయ ఆంక్షల చట్రంలో ఇరుక్కొని దేశం నలిగిపోతోంది. అధ్యక్షుడు పుతిన్ యుద్ధోన్మాదంపై స్వదేశంలోనే తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో ఆయన ఓవైపు రాజీమార్గాలను అన్వేషిస్తూనే మరోవైపు దాడులను తీవ్రతరం చేస్తున్నారు. ఈ క్రమంలో తొలిసారిగా హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగించిన రష్యా, మున్ముందు అణు దాడులకూ పాల్పడుతుందేమోనన్న అనుమానాలు బలపడుతున్నాయి... రష్యా అణు బాంబు ప్రయోగించే సాహసం చేస్తుందా అన్న అంశంపై రకరకాల విశ్లేషణలు విన్పిస్తున్నాయి. ఎటూ పాలుపోకపోవడంతో పుతిన్ అసహనంతో రగిలిపోతున్న మాట నిజమేనని స్లేట్ ఆన్లైన్ మ్యాగజైన్ జాతీయ భద్రతా వ్యవహారాల ప్రతినిధి ఫ్రెడ్ కప్లన్ అన్నారు. ‘‘ది బాంబ్: ప్రెసిడెంట్స్, జనరల్స్, అండ్ ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ న్యూక్లియర్ వార్’’ రచయిత అయిన ఆయన రష్యా అణు యుద్ధ భయాలపై లోతైన విశ్లేషణ చేశారు. ‘ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా ఓటమి అంచుల్లో ఉంది. అంతమాత్రాన పుతిన్ అణ్వాయుధాలు ప్రయోగిస్తారని అనుకోలేం. ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించడానికి నాటో నిరాకరించింది గనుక రష్యా ఆ సాహసం చేయకపోవచ్చు. అమెరికా, నాటో దేశాలు యుద్ధంలోకి నేరుగా ప్రవేశిస్తే అది వేరే సంగతి. వాటిని అడ్డుకోవడానికి రష్యా ఎంతకైనా తెగించవచ్చు. రష్యా, అమెరికా దగ్గర పరస్పరం నామరూపాల్లేకుండా చేసుకోగలిగినన్ని అణ్వాయుధాలు పోగుపడి ఉన్నాయి. కానీ వాటిని ప్రయోగించే అవకాశాలు లేవనే చెప్పాలి. రష్యా చిన్న అణు బాంబుల్ని ప్రయోగించినా కనీసం 8 వేల టన్నుల రేడియేషన్ వెలువడి ఊహాతీతమైన విధ్వంసం జరుగుతుంది. అదీగాక అణ్వాయుధాలను వాడే దేశంపై అంతర్జాతీయంగా ఆంక్షలు మరింతగా పెరుగుతాయి. అందుకే 1945 తర్వాత ఏ దేశమూ ఆ సాహసం చేయలేదు. అయినా ఏ దేశం యుద్ధ వ్యూహం ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా ప్రత్యక్షంగా యుద్ధానికి దిగనంత వరకూ అణు ముప్పుండకపోవచ్చు. అందుకే ఉక్రెయిన్ ఎంత ప్రాధేయపడ్డా నో ఫ్లై జోన్ ప్రకటించకుండా అ మెరికా ఆచితూచి వ్యవహరిస్తోంది. పరోక్ష సాయానికే పరిమితమవుతోంది’’ అని అన్నారాయన. చైనా సహకారం లేకుండా... రష్యా అణ్వాయుధాలు ప్రయోగిస్తుందా లేదా అన్నదాన్ని చైనాతో ముడిపెట్టి చూడాలని బ్లూమ్‌బర్గ్ యూరప్ రిపోర్టర్ మారియో టాడియో అన్నారు. ‘‘చైనా నుంచి రష్యాకు ఆశించిన సైనిక తదితర సహకారం అందడం లేదు. పుతిన్ దౌత్య పరిష్కారం కోరుకుంటున్నారు. అణ్వాయుధ ప్రయోగానికి దిగకపోవచ్చు’’ అని అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగించిన ఆయుధాలు ► కల్బీర్ క్రూయిజ్ క్షిపణులు: పౌర ప్రాంతాలపై వీటిని విరివిగా ప్రయోగించింది. 2015లో సిరియాలో జరిపిన దాడుల్లోనూ వీటిని వాడింది. ► ఇస్కాండర్ క్షిపణులు: 500 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించే వీటిని భారీ భవనాలను నాశనం చేయడానికి ప్రయోగించింది. ► రాకెట్ దాడులు: కీవ్‌తో పాటు ఖర్కీవ్, ఒడెశా, చెర్నిహివ్, ఇర్పిన్‌లపై వీటిని భారీగా ప్రయోగిస్తోంది. స్మెర్క్, గ్రాడ్, ఉరకాన్ రాకెట్ లాంఛర్ల ద్వారా వీటిని ప్రయోగించి ధ్వంసరచన చేస్తోంది. ► శతఘ్నులు: అత్యంత శక్తిమంతమైన 203ఎం ఎం పియోని, 152–ఎంఎం హైసింథ్, అకాకియా హొవిట్జర్ శతఘ్నులను ప్రయోగిస్తోంది. ► క్లస్టర్, వాక్యూమ్ బాంబులు: అత్యంత ప్రమాదకరమైన వీటిని జనసమ్మర్ధ ప్రాంతాలపై విస్తృతంగా ప్రయోగించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్క్రామ్‌జెట్ పరీక్ష సక్సెస్
బాలాసోర్: హైపర్సోనిక్ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్ వెహికల్(హెచ్ఎస్టీడీవీ) అనే మానవరహిత విమానాన్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ స్క్రామ్‌జెట్ విమానాన్ని ఒడిశాలోని కలామ్ ద్వీపం నుంచి బుధవారం ఉదయం డీఆర్డీవో శాస్త్రవేత్తలు ప్రయోగించారు. హెచ్ఎస్టీడీవీ ఓ పునర్వినియోగ వాహనమనీ, దీంతో ఉపగ్రహాలను చవకగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టవచ్చని రక్షణరంగ నిపుణుడొకరు చెప్పారు. దీంతో శత్రుదేశాలపై క్రూయిజ్ క్షిపణులనూ ప్రయోగించవచ్చన్నారు. హెచ్ఎస్టీడీవీ 20 సెకన్లలో 32.5 కి.మీ ఎత్తుకు చేరుకోగలదనీ, గంటకు 7,408 కి.మీ(6 మ్యాక్‌ల) వేగంతో దూసుకుపోగలదన్నారు. తాజాగా ప్రయోగంతో ఇలాంటి సాంకేతికత ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ చేరిందన్నారు. హెచ్‌ఎస్‌టీడీ తొలుత ఘనఇంధన మోటార్‌తో నిర్ణీత ఎత్తులోకి చేరుకుంటుంది. సరైన వేగం అందుకున్నాక హెచ్‌ఎస్‌టీడీలోని క్రూయిజ్ వాహనం విడిపోతుందనీ, స్క్రామ్‌జెట్ ఇంజిన్‌ను మండించడం ద్వారా ఇది లక్ష్యం దిశగా దూసుకెళుతుందని పేర్కొన్నారు. -
మూడు గంటల్లో ప్రపంచ యాత్ర.!
చికాగో : పురాణాల్లో, పౌరాణిక చిత్రాల్లో ఒక చోట మాయమై, మరో చోట ప్రత్యక్షమవడం చూస్తూనే ఉంటాం. కానీ, నిజ జీవితంలో అది సాధ్యమా అంటే.. కాదని అందరికీ తెలుసు. కానీ, మూడు గంటల్లో ప్రపంచాన్ని చుట్టి రావచ్చు. అదెలాగంటే.. హైపర్సోనిక్ విమానంతో..! అవును దిగ్గజ విమాన తయారీ సంస్థ బోయింగ్ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ధ్వని కంటే అయిదు రెట్లు వేగంగా ప్రయాణించే హైపర్సోనిక్ విమానాన్ని తయారు చేసేందుకు ప్రణాళికలు రచించింది. గంటకు 3,800 మైళ్ల వేగంతో ప్రయాణించే విమానాన్ని తయారు చేసేందుకు పూనుకుంది. ఈ విమానంలో న్యూయార్క్ నుంచి లండన్‌కు 120 నిమిషాల్లో ప్రయాణించవచ్చు. అంటే ప్రపంచాన్ని మూడు గంటల్లో చుట్టి రావచ్చన్నమాట..! విమానం తయారీకి సంబంధించిన ప్రణాళికలు ప్రాథమిక దశలో ఉన్నాయనీ, కొన్ని సాంకేతిక చిక్కు ముడులను అధిగమించాల్సి ఉందని సంస్థ ప్రతినిధి బియానా జాక్సన్ తెలిపారు. బోయింగ్ సంస్థ ప్రయోగాలు ఫలించి హైపర్సోనిక్ విమానం గనుక అందుబాటులోకి వస్తే.. ధ్వని కంటే రెండు రెట్లు వేగంగా ప్రయాణించే ఆంగ్లో-ఫ్రెంచ్ విమానం ‘కాంకోర్డ్’ను తలదన్నినదవుతుంది. అయితే, ఈ అద్భుత విమాన సేవలు అందుబాటులోకి రావాలంటే మరో ఇరవై ఏళ్లకు పైగా సమయం పడుతుందట..! -
రెండు గంటల్లో బీజింగ్ టు న్యూయార్క్
బీజింగ్: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, బీజింగ్ నుంచి న్యూయార్క్‌కు రెండు గంటల్లోనే చేరుకోగల విమానాన్ని చైనా అభివృద్ధి చేస్తోంది. దీనిని పరీక్షించేందుకు ధ్వని వాయు సొరంగం (హైపర్సోనిక్ విండ్ టన్నెల్)ను చైనా నిర్మిస్తోందని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. వాహనాలు రోడ్డుపైన, విమానాలు ఆకాశంలో వెళ్తున్నప్పుడు గాలి బలంగా వీస్తుండటం తెలిసిందే. కొత్తగా తయారైన వాహనాలు, విమానాలు తదితరాలపై అలా వీచే గాలి ప్రభావం ఎలా ఉంటుందో పరీక్షించడానికి ఏరోడైనమిక్స్ పరిశోధనల్లో వాయు సొరంగాలను ఉపయోగిస్తారు. ఇప్పుడు చైనా అభివృద్ధి చేస్తున్న కొత్త విమానం ధ్వని వేగానికి 25 రెట్ల అధిక వేగం (మ్యాక్ 25)తో ప్రయాణించగలదు. సాధారణ లెక్కల్లో చెప్పాలంటే గంటకు ఏకంగా 30,625 కిలోమీటర్ల వేగంతో ఇది ఆకాశంలో దూసుకుపోగలదు. అంత వేగంతో వెళ్తున్నప్పుడు దీనిపై గాలి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆ పరిస్థితిని కృత్రిమంగా వాయుసొరంగంలో కల్పించి విమానాన్ని పరీక్షిస్తారు. అందుకోసమే చైనా ఈ 265 మీటర్ల పొడవైన సొరంగాన్ని నిర్మిస్తోందని అధికారిక మీడియా పేర్కొంది -
జెట్లకే జేజమ్మ
సునామీ కన్నా వేగం.. కళ్లు మిరిమిట్లుగొలిపే రూపం.. అంచనాలకు అందని ప్రత్యేకతలు ఈ హైపర్సోనిక్ విమానం సొంతం. స్టార్ వార్స్ అనే డిజైనర్ సంస్థకు చెందిన స్టీఫెన్ చాంగ్ ఈ విమానం డిజైన్ రూపొందించాడు. 250 నుంచి 300 మంది ప్రయాణికులు ప్రయాణించే వీలుండే దీనికి పైలట్ ఉండడట.. కింది నుంచే దిశానిర్దేశం చేస్తారట.. అంతేకాదు గాలి వేగం, అక్కడి ఉష్ణోగ్రతలను ఇట్టే పసిగట్టి ప్రమాదాల బారిన పడకుండా ముందే హెచ్చరించే వ్యవస్థ కూడా ఇందులో ఉంటుందట..